యమునొత్రి ఉత్తరాక్షికి 125 కి.మీ దూరములో సముద్ర మట్టమునకు 1250 మీటర్ల ఎత్తులో యమునొత్రి ఆలయము ఉన్నది. నల్లటిరాతిపైగల దేవతాప్రతిమతో యమునాదేవతపేరున ఈఆలయము ఉన్నది. హనుమాన్ చాటీ నుండి 13 కిలోమీటర్లు ట్రెక్కింగ్ పై ప్రయాణించి ఆచటినుండి 6 కి.మీ. నడకద్వారా ప్రయాణించి యమునొత్రి ప్రధాన ఆలయము చేరుకోనవచ్చు. గుర్రములు మరియు పల్లకీలు అద్దెకు లభించును. హనుమాన్ చట్టీనుండి యమునొత్రి ఆలయమునకుగల మార్గము జలపాతములతో మిక్కిలి రమ్యముగాను ఆనందదాయకముగాను ఉండును. యమునొత్రి ఆలయము అక్షయ తృతీయ నాడు తెరువబడి దీపావళి రెండవరోజున మూయబడును. యమునానది పుట్టుకస్థానము దగ్గరలో సముద్రమట్టమునకు 4421 అడుగుల ఎత్తులో ఉన్నది. మార్గాయాసము తీర్చుకొనుటకుగాను స్నానము చేయుటకు యమునొత్రి వద్ద రెండు వేడినీటిఊటలు కలవు.