వారణాశి

(IPLTOURS)

కాశీ, బెనారస్ అని పిలువబడు వారణాశి పురాతన నగరం మరియు శివుడు నివాస స్థలంగా చేసుకొన్న పుణ్యక్షేత్రమని భావిస్తారు. మరియు అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురంధన, బ్రహ్మ వర్ధ, సుదర్శన మరియు రమ్య పేర్లతో వారణాశి పిలువ బడింది. పూర్వం ఈనగరాన్ని కాశీ లేదా శివనగరి అని పిలిచేవారని ఋగ్వేదంలో పేర్కొనబడి వారణాశి శివునికి ఇష్టమైన క్షేత్రంగా భావిస్తారు. మహాభారతం నందు కురుక్షేత్ర సంగ్రామంలో తాముచేసిన సోదరహత్య మరియు బ్రాహ్మణహత్య పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి పాండవులు శివుడిని వెతుకుతూ కాశీకి వెళ్లారని చెప్పబడింది.

varanasii

వారణాశి నగరంలోని అసంఖ్యాక ఆలయాలలో జ్యోతిర్లింగమైన కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ, విశాలాక్షి, డూండీ వినాయక్,  సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం, మరియు నవదుర్గ ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. బనారస్ హిందూ యూనివర్శిటీ క్యాంపస్‌లో తులసి మానస్ మరియు విశ్వనాథదేవాలయం అనే ఆలయాలు ఉన్నాయి. ‘వరుణ’, మరియు ‘అసి’ నదుల పేర్లుకలిసి నగరానికి “వారణాసి” అనుపేరు వచ్చింది. వారణాశినందు ఇరవైమూడువేల దేవాలయాలు మరియు 81 స్నాన ఘట్టాలున్నాయి. మణికర్ణిక ఘాట్, అస్సీ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మరియు పంచగంగా ఘాట్‌లు భక్తులు పితృదేవతల ఆరాధనకు తరచుగా దర్శించు ముఖ్యమైన స్నానఘట్టములు. మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్‌ లందు  హిందువులు శవదహనం మరియు పిండ ప్రధాన కార్యక్రమములు చేస్తారు. వారణాశి క్షేత్రం గురించి పూర్తి కధనం మరియు దర్శనీయ స్థలములు, ఆలయముల వివరములు కాశీయాత్రనందు సంపూర్ణ తీర్ధయాత్రా నందు సవివరముగా ఫోటోలు మరియు వీడియోలతో తెలియాయచేసి యున్నాము.