వరాహస్వామి ఆలయం పుష్కర్

(IPLTOURS)

శ్రీమహావిష్ణువు వరాహావతారము దాల్చుటకు పురాణకధ ఉన్నది. జయవిజయులు వైకుంఠమునకు ద్వారపాలకులు. శ్రీమహావిష్ణుపై అమితభక్తికలవారై స్వామిదర్శనార్ధము వచ్చువారిని వైకుంతములోనికి పంపేదివారు. ఒకపర్యాయము బ్రహ్మకుమారులు మహాఋషులు అయిన సనకకుమార, శాంతనకుమార, సనందనకుమార మరియు సనాత్కుమార విశుమూర్తిదర్శనమునకు రాగా స్వామిఏకాంతములో నుండుటవలన జయవిజయులు వారిని లోనికివెళ్లకుండా ఆపారు. అందుకుఆగ్రహించిన బ్రహ్మకుమారులు వారిని మానవులుగాజన్మించమని శపించినారు. ఆప్పుడు విష్ణుమూర్తివచ్చి తనపై భక్తితోవారు నిలిపినారుకావున శాపము ఉపసంహరించగొరినాడు. బ్రహ్మకుమారులు ఉపసంహరించుట వీలుకాదనిచెప్పగా ఏడుజన్మలు మానవులుగా జనించిననూ లేదా మూడుజన్మలు రాక్షసులుగా జన్మించి తనచే సంహరింపబడినట్లు శాప ఫలితము అనుగ్రహించినాడు జయవిజయులు విష్ణువును వదలిఉండలేక మూడుజన్మలు రాక్షసులుగా జనించి విష్ణువుచే సంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతికోరినారు. ముందుగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా అటుపిమ్మట శిశుపాల దంతవక్తులుగా చివరిగా రావణ కుంభకర్ణులుగా జనించి శ్రీహరిచే సంహరించబడి వైకుంఠము చేరినారు.                                                 

హిరణ్యాక్షు హిరణ్యక్షిపులుగా జనించినప్పుడు హిరణ్యాక్షుని శ్రీహరి వరాహారూపములోనూ హిరణ్యకశిపుని నృసింహ రూపములోనూ సంహరించినాడు. హిరణ్యాక్షుడు బ్రహ్మనుగూర్చి తపముచేసి దేవతలచేతను, మనుషులచేత, రాక్షసులచేత జంతువులచేత మరియు దెయ్యములచేత మరణములేకుండా వరముపొందినాడు. కానీ అడవిపందిని మరచినాడు. హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకమునకు తీసుకొనిపోయినాడు. బ్రహ్మ విష్ణువును ప్రార్ధించగా విష్ణువు ముక్కురంద్రములనుండి ఒక ఆడవిపంది రూపములో ఉద్భవించి అంతకంతకూ పెరిగి సముద్రమునందున్న భూదేవిని తనకోరలపై పైకితీసుకొనివచ్చి హిరణ్యాక్షునితో అవిశ్రాంతముగా యుద్దముచేసి సంహరించినాడు.

పురాతనమైనవరహక్షేత్రము కలపుష్కర్ రాజస్థాన్ రాస్త్రములో ఆజ్మీర్ రైల్వేస్టేషనుకు సుమారు 15కి.మీ దూరములోనున్నది. పుష్కర్ క్షేత్రముచేరుటకు అన్నీపట్టణములనుండి రోడ్డురవాణా సౌకర్యముకలదు. ఈఆలయము విష్ణుమూర్తి ఎనిమిదిస్వయంభూః ఆలయములలో ఎనిమిదవదిగా భావించబడుచున్నది. వరాహఅనగా అడవిపంది మరియు విష్ణువు దశావతారములలో మూడవఅవతారము. ప్రసిద్ధమైనఈఆలయము పుష్కర్ క్షేత్రములోఅతిపురాతనమైనది మరియుఅతిపెద్ద దేవాలయము. ఆలయము సుమారు తొమ్మిదివందల సంవత్సరములకుపూర్వము నిర్మించబడిఆలయమునందు తలవరాహ రూపములోనూ మిగిలినశరీరము మానవశరీరముగాను దర్శనంఇస్తుంది. మహమ్మదీయ పాలకుడు ఔరంగజీబు పాలనలో విగ్రహము తలవరాహారూపములోఉన్ననూ మిగితాశరీరము మానవశరీరరూపములోనుండుటవలన హిందూమతవిద్వేషముతో ఆలయమును కూలగొట్టినాడు. సుమారు రెండువందలసంవత్సరములకు పూర్వము జయపూర్మ హారాజు ఆలయమును పునర్ నిర్మాణముచేసినాడు. 

Varaha Temple-India

ఆలయ ప్రాంగణము నిశ్శభ్దముగానుండి సామూహికధ్యానమునకుగాని చేసుకొనుటకు ఒక్కరు ప్రశాంతముగా ధ్యానము చేసుకొనుటకు అనువుగానుండును. శ్రీమహావిష్ణువు అవతారములలో వరాహావతారమునకు సంబంధించిన ఆలయమైననూ ఇందు బ్రహ్మ, విష్ణు మరియు శివవిగ్రహములు మూడునుకలవు. ఆలయమునకు అనేకమార్లు మరమ్మత్తులుజరిగి ఆలయమునకు పూర్వవైభవముతెచ్చుటకు కృషిచేయబడినది. చారిత్రకగుర్తులు చక్కగాకాపాడబడినవి. ఆలయముఎత్తు సుమారు 150 అడుగులు.  

ఆలయమందు ప్రధానదైవము వరాహస్వామి మరియు అమ్మవారిని పుండరీకవల్లిగా పిలిచేదరు. గరుఢ హిందూ దేవతల విగ్రహములు ఉన్నవి. రాజస్థాన్ మార్వాడీసంప్రదాయములో రాళ్ళతోనిర్మించిన ఆలయం అందముగా ఉంటుంది. అతిపెద్ద ప్రహారీగోడ రాళ్ళతోనిర్మించబడి ఆలయమునకు రక్షణగా ఉంటుంది. ఆలయగోడలపై కుడ్యస్థంబాలు, ప్రవేశద్వారములు మరియు వింజామరలు తదితరములు చెక్కబడిఅందముగా ఉంటాయి విశాలమైన మరియు అలంకరించబడిన గర్భాలయంలో రెండుఅడుగులఎత్తుతో ప్రధానదైవము వరాహస్వామివిగ్రహం దర్శనంఇస్తుంది. ఆలయములో సొగసైననిర్మాణమునందు ఆభరణములు అందముగామలచబడ్డవి. గోపురము, తెల్లనిగొడలు మరియు స్తంభములతో సహామొత్తం ఆలయం నిర్మాణంఅపురూపంగా ఉంటుంది. ఏడుకిలోమీటర్ల మార్గము ఆలయమును పుష్కరసరస్సు స్నానఘట్టములతో కలుపుతుంది.

పుష్కర సరస్సు 

హిందూపవిత్ర గ్రంధములలో పేర్కొనినఅన్ని తీర్ధములకంటే బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు ఉన్నటువంటి పుష్కరసరస్సు హిందువులు అతిపవిత్రమైనదిగా భావిస్తారు. ఈప్రదేశము భారతదేశమునందు బ్రహ్మ పూజించబడుఒకేఒక పుణ్యక్షేత్రము మరియు బ్రహ్మకుగల సృష్టించుశక్తులు తెలిపేడి దివ్యక్షేత్రము. ఈఅతిపెద్దసరస్సు చుట్టూ 52 స్నానఘట్టములుఉన్నవి. ఈఘట్టములందు స్నానము చేయుటవలన వారిపాపములన్నియు తొలగి పోవునని భక్తులవిశ్వాసము. సరస్సుకల ఈలోయఅందమైన ఆరావళిపర్వతశ్రేణులతో చుట్టబడిఉంటుండి. చుట్టూ పచ్చటి అడవులు, సన్నటిబాటలు మరియు అందమైనతోటలు ఉంటాయి. చిన్నరొడ్లతో చుట్టుప్రక్కలఆలయములు ప్రధానస్నానఘట్టముతో కలిపిఉంటాయి. అందరూ తప్పనిసరిగా దర్శించవలసినది పుష్కరసరస్సు.  

బ్రహ్మ దేవాలయం

ఈచటికి దగ్గరలోనే సుమారు పద్నాలుగువందల సంవత్సరములకుపూర్వము నిర్మించబడిన జగత్ పిత బ్రహ్మకుకల ఏకైక  దేవాలయము ఉన్నది. సృష్టిలో ఎవరుగొప్ప ఆను వాదులాటలో బ్రహ్మ మొగలిపువ్వుసహకారముతో శివునిచే మూడులోకములుకలుపుచూ సృష్టించబడిన స్తంభముచివరిభాగము తానుకనుగొనినట్లు అసత్యముచెప్పినందున అసత్యము చెప్పినందులకు బ్రహ్మకుశాశ్వతముగా పూజార్హతలేకుండా శివుడు శపించుటవలన బ్రహ్మకు ఎక్కడనూ ఆలయములులేవు. మొగలిపువ్వునకుకూడా తననుపూజించు అర్హతలేకుండా శివుడుశపించినాడు. వాస్తవముగా తానుచూడలేదని సత్యముపలికిన విష్ణువుకు శాశ్వతముగా పూజలుయందుకొను అర్హతప్రసాదించినాడు. 

రఘునాధ మందిరం

పుష్కర్ నందు అనేకదేవాలయములందు దక్షణభారతదేశపు రీతిలోనిర్మించి పర్యాటకులను ఆకర్షించుచున్న రఘునాధమందిరము తదితర ముఖ్యమైనదేవాలయములున్నవి. పూర్వకాలము రంగ్ జీఆలయం అనిసూచించబడినది. సుమారు రెండువందలసంవత్సరములకు పూర్వము ఈఆలయము విష్ణువునకు చెందినదిగా భావించబడేడిది. విష్ణుమూర్తి అవతారాములలో ఒకటిఅయిన రాముడుఇచ్చట రఘునాధమందిరమునందు ప్రధాన దైవముగానివసించినాడు. రామునివిగ్రహముతోపాటువేణుగోపాలుడు, లక్ష్మి మరియు విష్ణుమూర్తిఅవతారముల ఉపఆలయాలు ఈఆలయ ప్రాంగణమునందుకలవు