ఉత్తరాక్షి
ఉత్తరాక్షి ఉత్తరాఖండ్ రాస్త్రములో ఉత్తరాక్షి జిల్లాకేంద్రమై ఋషీకేశ్ నకు 180 కి.మీ దూరములో సముద్రమట్టమునకు 1158 మీటర్ల ఎత్తున భాగమతీనదీ తీరమునందుగల పట్టణప్రాంతము. గంగోత్రి మరియు యమునొత్రి యాత్రచేయదలచిన యాత్రికులు ఈ ఉత్తరాక్షినందు విడిదిచేసి మరునాడు ఉదయము యాత్రప్రారంభించవల్సి ఉంటుంది. ఇచట యాత్రికుల వసతి సౌకర్యార్ధము అనేకములైన ఆశ్రమములు ధర్మశాలలు కలవు. అందులో గంగోత్రిమందిర ధర్మశాల, బిర్లాధర్మశాల, కైలాష్ ధర్మశాల మరియు శివానంద్ ధర్మశాల అనునవి ప్రధానమైనవి. ఉత్తరాక్షి నందు ఉదయము టిఫెన్ అభ్యమగును. ఉత్తరాక్షినందు కాశీ విశ్వనాథ్ ఆలయము కలదు.