త్రయంబకేశ్వర్
(10వ జ్యోతిర్లింగం)
IPLTOURS
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం
గోదావరితీరపవిత్రదేశే
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం
ప్రయాతితం త్ర్యంబకమీశమీడే
(10వ జ్యోతిర్లింగం)
IPLTOURS
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం
గోదావరితీరపవిత్రదేశే
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం
ప్రయాతితం త్ర్యంబకమీశమీడే
కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
మహారాష్త్రనందు బ్రహ్మగిరిఅనుపర్వతము దగ్గరలో నాశిక్ పట్టణమునకు సుమారు 30 కి.మీ. దూరములో దక్షణభారతదేశమునకు ఆధారమైన గోదావరినది పుట్టుదలప్రాంతమునందు ద్వాదశజ్యోతిర్లింగములలో పదవ జ్యోతిర్లింగము త్రయంబకేశ్వర్ ఉన్నది. హిందువులు ఈ జ్యోతిర్లింగమును తమకోరికలు తీర్చునని భావిస్తారు.ప్రస్తుతముఉన్నఆలయము 1740 సంవత్సరములో పురాతనఆలయస్థలమందే నిర్మించబడినది. ఈ ఆలయమునకు తూర్పు, పడమర, ఉత్తర మరియు దక్షణమువైపు గేట్లుకలవు. ప్రతిక్షేత్రములో శివుడు మొదలుచివరలేని స్థంబలింగరూపములో ఉండును. అధికముగా జలాభిషేకము చేయుటవలన లింగము పైభాగము అరగిపోనారంభించినది. అందువలన ఈజ్యోతిర్లింగము ప్రత్యేకముగా త్రిమూర్తులతో (బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుడు) లతోకూడిన బంగారు కిరీటముతో కప్పివేయబడి యుంటుంది. కిరీటము వజ్రములు, వైడూర్యములు తదితర విలువైనజాతి రాళ్ళు పొదగబడిఉండి పాండవుల కాలమునాటినుండి ఉన్నది. ఈకిరీటము ప్రతిసోమవారము నాడు నిర్ణీతసమయమునందు ప్రదర్శించబడుతుంది.
గోదావరి మూడుపాయలుగా బ్రహ్మగిరిపర్వతమునుండి జనించినది. అదిఎట్లనగా వరుణ దేముడు గౌతమమహర్షి తపమునకుసంతసించి త్రయంబకేశ్వర్ నందుకల గౌతమమహర్షి ఆశ్రమ పరిసరములలో ప్రతిరోజూ వర్షమువచ్చునట్లు అనుగ్రహించినాడు. గౌతముడు ఆనీటితో ఆశ్రమ పరిసరభూములలో ఉదయము వరినాటి మధ్యాహ్నం పంటకోసి ఆఆహారము ఆశ్రమము నందుకల పెద్దసంఖ్యలో ఋషులకు భోజనము పెట్టేడివారు. ఋషులదీవనల వలనగౌతమునికి పుణ్యము పెరిగినది. అందువలన ఇంద్రుడు త్రయంబకేశ్వర్ అంతటా వర్షము కురియవలసినదిగా మబ్బులను ఆదేశించినాడు. అందువలన ఋషులు వెడలిపోయి గౌతమునికి పుణ్యము బలహీనపడునని భావించినాడు.
కానీ గౌతముడు తాను ఆహారము పెట్టెదనని ఋషులను కోరినాడు. ఆసమయములో ఒకగోవు తన పొలములోని పంటను నాశనముచేయుట గమనించి ధర్భలతో అదిలించినాడు. అందువలన గోవుమరణించినది. జయ పేరుకల ఆగోవు పార్వతి స్నేహితురాలు. ఋషులు గౌతమునికి గోహత్యాపాతకము సంభవించుటవలన ఆహారము తీసుకొనుటకు నిరాకరించినారు. గౌతముడు ఆపాపమునుండి విముక్తుడుఅయే మార్గముతెలుపమనగా శివునిధ్యానించి గంగనుతెచ్చి స్నానముచేయుట వలన ఆపాపమునుండి విముక్తుడు అగునని తెలిపినారు. అప్పుడు గౌతముడు బ్రహ్మగిరిపై వేయిసంవత్సరాలు తపముచేసినాడు. బ్రహ్మగిరిపైవెలసిన గంగగౌతమునిపై కోపముతో త్రయంబకతీర్ధము, గంగద్వార్, వరాహతీర్ధ, రామలక్ష్మణ్ తీర్ధ, గంగాసాగర్ తీర్ధలందు కనిపించి మాయమైపోయినది. గౌతముడు స్నానమాచరించుటకు వీలులేక మంత్రించినగడ్డితో గంగనుఆగమని ఆన పెట్టినాడు. అప్పుడు ఆధారఆగిపోయినది. ఆప్రదేశము కుశవార్తతీర్ధము. ఇచ్ఛటినుండే గోదావరిఉధ్బవించినది. గౌతమునికి గోహత్యాపాతకము ఇచ్చటనేతొలగినది. మీనరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈత్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగమును దర్శించి అర్చించిన దోషములు తొలగుననిచెప్పబడినది.
నాసిక్ త్రయంబకంపట్టణములో బ్రాహ్మణకుటుంభములు ఎక్కువ. వేదపాఠశాలలు, ఆశ్రమాలు, మఠములు ఉన్నాయి. నాశిక్ రోడ్డు రైల్వేస్టేషన్ నుండి స్థానికరవాణా సౌకర్యముతో ఆలయము చేరవచ్చును.
ఉదయం 5-30 నుండి రాత్రి 9-00 వరకు ఆలయమునందు దర్శనమునకు అనుమతింతురు. శ్రావణమాసము, కార్తీకమాసము మరియు శివరాత్రి ముఖ్యఉత్సవములు నిర్వహింతురు. శాస్త్రబద్ధమైనదుస్తులు మాత్రమే ధరించవలెను. అనగా మగవారు ధోవతి (పంచే) ఖండువా (ఆచ్ఛాధన లేని ఛాతీతో మాత్రమే ప్రవేశమునకు అనుమతి) మరియు ఆడవారు చీర, చూడేదార్, పరికీని ధరించవలసి ఉంటుంది
IPLTOURS – Indian Pilgrim Tours