ఆకాశలింగం

(IPLTOURS)

పంచభూతలింగములు అగ్ని (అరుణాచలేశ్వర్), జల (జంబుకేశ్వర్), పృద్వి (కాంచీపురం) మరియు ఆకాశ (చిదంబరం) తమిళనాడురాష్ట్రముయందు వాయులింగము మాత్రము ఆంద్రప్రదేశ్ నందు కాళహస్తినందు కలదు. పంచభూతలింగములు ఆయా పంచభూతముల తత్వమును కలిగి ఉంటాయి. ఆకాశలింగం తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. చిదంబరం అనునది వ్యావహారరికంగా పిలువబడు చిత్తంబలం అంటే జ్ఞానాన్ని ప్రసాదించే వాతావరణంకల ఆలయమే చిదంబర నటరాజ స్వామిఆలయం. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది మరియు శూన్యంగా కనిపిస్తుంది. లింగదర్శనముండదు. అందువల్లనే చిదంబరరహస్యం అనేపేరు వచ్చినది. ఈక్షేత్రంలో నటరాజస్వామి,శివకామసుందరి అమ్మవార్లుమాత్రమే ఉంటారు.

చిదంబరం తిల్లై నటరాజ ఆలయం

చిదంబరంలోని నటరాజస్వామి ఆలయము పట్టణము మధ్య అతిపెద్ద సుమారు 40 ఏకరముల విస్తీర్ణములో నిర్మించబడి శైవుల మరియు వైష్ణవుల దేవతామూర్తులు కొలువున్న ఆలయము. చిదంబర రహస్యం అంటే ఏమిటి?. పూజాకార్యక్రమంలో నటరాజస్వామి నేను/మేము అనే అహంఅనే మనస్థితితెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ. అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తననుతాను పరిపూర్ణంగా అర్పించు కున్నప్పుడు, భక్తుడు తన (భక్తుడి) అజ్ఞానాన్నితొలగించుకొని భగవంతుడిని దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు. అందుకే చిదంబర రహస్యం అని అంటారు అంతటి రహస్యమైన ఈఆకాశలింగాన్ని దర్శించాలి అంటే ఎంతో సాధనచేయాలి. ఈక్షేత్రంలో నటరాజస్వామి, శివకామసుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. దేవాలయంలో లింగం వెనుక ఒకపరదాకట్టి ఉంటుంది. ఆవెనుక అంతాఖాళీ. ఆకాశంవలెనే ఖాళీగా ఉంటుంది. పరదావెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే తెలియని రహస్యాన్ని, తెలియకుండా దాచిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటిఅయింది.

బ్రహ్మముని వచించిన భారతదేశ శాస్త్రీయనాట్యశాస్త్రమునందుకల 108 కరణములు ఈఆలయము గోడపై చేక్కడములుగా దర్శనం ఇస్తాయి. చోళరాజుల కాలములో నటరాజును యిలవేల్పుగాతలచి చిదంబరం ముఖ్యపట్టణముగా ఉన్నప్పుడు పదవ శతాబ్దములో ప్రస్తుతము ఉన్నఆలయము నిర్మించినారు. అటుపిమ్మట అనేకపర్యాయములు పునరుద్ధరించబడి, విశాలము చేయబడినది. శివరూపుడైన నటరాజు ప్రధాన దేవతామూర్తి అయిననూ హిందూమతములోని శక్తి, వైష్ణవ మరియు ఇతర సాంప్రదాయ నేపధ్యములు ప్రతిభింబిస్తాయి. చిదంబర ఆలయములో దేవి, రధము అధిరోహించిన సూర్యుడు, గణేశుడు, మురుగన్ మరియు విష్ణువు విగ్రహములు, శివగంగ అనుకోనేరు మరియు భక్తుల సౌకర్యార్ధము పెద్ద మండపములు ఆలయసముదాయములో ఉన్నవి. ఆలయమునందు చిట్ సభ, కనక సభ, దర్భార్, నృత్య సభ మరియు దేవ సభ అనబడు పెద్దమండపములు భక్తులు సేదతీరుటకు ఉన్నవి. 

Thillai Nataraja Temple gopuram, Chidambaram

శివుని వెనుకగోడపై చక్రాకారములో నమశ్శివాయ అనుపంచాక్షరీ మంత్రము లిఖించబడి ఉండును. పూరిఅంబలం అనబడు బంగారుమండపమునందు శివుడు నటరాజ రూపములో ఆనందతాండవము జరుపుచున్నభంగిమలో దర్శనము ఇస్తాడు. నటరాజరూపములో శివుడు చేయునృత్యమునందు సృష్టి, స్థితి, లయ, మాయ మరియు దీవెనలను ప్రతిభింభిస్తాయి. గోవిందరాజపెరుమాళ్ ఆలయము ఆలయసముదాయమునందు ఉన్నది. మహాశివరాత్రి రోజున నాట్యాంజలి పేరుతో ఉత్సవము నిర్వహిస్తారు.        

శివుని వెనుకగోడపై చక్రాకారములో నమశ్శివాయ అనుపంచాక్షరీ మంత్రము లిఖించబడి ఉండును. పూరిఅంబలం అనబడు బంగారుమండపమునందు శివుడు నటరాజ రూపములో ఆనందతాండవము జరుపుచున్నభంగిమలో దర్శనము ఇస్తాడు. నటరాజరూపములో శివుడు చేయునృత్యమునందు సృష్టి, స్థితి, లయ, మాయ మరియు దీవెనలను ప్రతిభింభిస్తాయి. గోవిందరాజపెరుమాళ్ ఆలయము ఆలయసముదాయమునందు ఉన్నది. మహాశివరాత్రి రోజున నాట్యాంజలి పేరుతో ఉత్సవము నిర్వహిస్తారు.        

సుమారు ఎనిమిదివందల సంవత్సరములకు పూర్వము పురాణములందు లిఖించబడిన చిదంబర మహత్యముఅను కధనము ప్రకారము శివుడు నృత్యకారుడిగా అందమైనయువతిగా మొహిని రూపములోఉన్న విష్ణువుతో కలిసి పౌరాణిక ప్రాశశ్యముకల పైన్ అడవినందు ఋషులను కలసినాడు. మోహిని రూపములోనున్న విష్ణువు ఋషులలో కామఆశక్తిని ప్రేరేపించగా శివుడు ఋషుల భార్యలలో తన తాండవ నృత్యము ద్వారా వారిశరీరములందు ఆశక్తిని కలిగించినాడు. ఋషులు తాము శారీరకముగా ఎంత దుర్భలులో గ్రహించినారు. పతంజలి మరియు వ్యాఘ్రపాద అనుపేర్లుకల ఋషులు శివుని ఆనందతాండవ నృత్యము చిదంబరంలోని థైలాయ్ అడవినందు మరలా చూడవలెనని కోరినారు. వారు శివలింగమును స్థాపించి, ప్రార్ధించి, తపస్సు చేసినారు. వారి తపస్సునకు మెచ్చి శివుడు చిదంబరంలో వారిఎదుట దర్శనముయిచ్చి తాండవనృత్యము చేసినాడు. తమిళస్థలపురాణమునందు ఈప్రకారము ఆలయము ప్రారంభించబడినట్లు తెలియుచున్నది. 

మరియొక కధనము ప్రకారము తిల్లై వనములందు కొంతమంది ఋషులు మంత్రశాస్త్ర ప్రాముఖ్యతనునమ్మి క్రతువులు చేయుటద్వారా మంత్రములతో దైవమును నియంత్రించవచ్చునని భావించారు. శివుడు విచ్చదనార్ అనుభిక్షకునిగా మొహిని రూపములో ఉన్న విష్ణువుతో సంచరించుచుండగా ఋషులువారి భార్యలు వారి వర్చస్సునకు ముగ్ధులైనారు. ఋషులు తమభార్యలు ఆనందపడుట చూసిఆగ్రహించి శివుడు మరియు మొహినిపై పాములను మంత్రశక్తిచే సృష్టించి పంపినారు. శివుడు చిరునవ్వుతో సర్పములను తనమెడ మరియు నడుముకు చుట్టుకొనినాడు. అప్పుడువారు భయంకరమైన పులినిస్వృష్టించి పంపినారు. శివుడు పులినిచంపి దానిచర్మమును నడుముచుట్టూ ధరించినాడు. మరలా ఋషులు ఏనుగును పంపినారు. ఋషులు అప్పుడు వారితపస్సుయొక్కశక్తితో మంత్రించి మూయాలకన్అను రాక్షసుడిని పంపినారు. శివుడు చిరునవ్వుతో రాక్షసునినడుముపై కాలువేసినొక్కి కదలకుండా చేసి ఆనందతాండవము చేయుచూ నిజరూపము ప్రదర్శించినాడు. అప్పుడు ఋషులుశివుడు మంత్ర ట్రంత్రములకు అతీతుడని గ్రహించి వంగిపాదాభివందనము చేసినారు. ఆరూపమే ప్రస్తుత నటరాజరూపము. విశిష్టతకల చిదంబర నటరాజస్వామి ఆలయం అందరును తప్పనిసరిగా జీవితకాలంలో దర్శించవలసిన శైవక్షేత్రము.