శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుమల

(IPLTOURS)

భారతదేశంనందు మహావిష్ణువు భువిపై ఉద్భవించిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం, తిరుమల, కల్లహళ్లి, తిరునల్వేలి, నేపాల్, పుష్కర్, నైమిశారణ్యం మరియు బద్రినాధ్ అనిచెప్పబడింది. ఇందు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో భూమిపై ఉద్భవించగా శ్రీరంగం రంగనాధుడు, కల్లహళ్లి భూః వరాహస్వామి, తిరునల్వేలి వద్ద శ్రీతోతాద్రి నాథన్, గండకినదీతీరమున ముక్తినాధ్, పుష్కర్ నందు వరాహస్వామి, నైమిశారణ్యం నందు లక్ష్మీనారాయణుడు మరియు బద్రీనాధ్ నందు బదరీనారాయణుడు రూపములలో శ్రీమహావిష్ణువు కృత, త్రేతా మరియు ద్వాపర యుగములలో ఉద్భవించిన క్షేత్రములు. ఎనిమిది దివ్యక్షేత్రములందు తిరుమలకు విశిష్టస్థానం ఉంది. మనదేశంలో అత్యధికసంపద కలిగిన పన్నెండు ఆలయములందు తిరిమల శ్రీవేంకటేశ్వరుని ఆలయం మొదటిది. శ్రీనివాసునికి సుమారుగా ఎనిమిది వందల టన్నుల బంగారం మరియు వివిధ బ్యాంకులందు సుమారు 1092 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నవి. సుమారుగా ఎనిమిది వందల టన్నుల బంగారం మరియు వివిధ బ్యాంకులందు సుమారు 1092 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నవి. తిరుపతి తిరుమలలోని శ్రీవేంకటేశ్వర ఆలయం అనునిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకొని స్వామికి ముడుపులు, కానుకలు అందజేస్తారు. 

తిరుమలకు ప్రాచీన కాలంనుండి విశేషమైన కీర్తిఉంది. తిరుమల వెంకటేశ్వరుడు కలియుగంలో మానవుల పాపములు నశింపచేయుటకు అవతరించిన విష్ణుమూర్తి అవతారం. శ్రీనివాసుడు, గోవిందుడు, కల్లహళ్లి, అనంతుడు, ఆపదమొక్కులవాడు ఆదిగాకల ఏనామంతో పిలిచినా పలికే దైవం. ఉత్తరభారతీయులు బాలాజీ అనేపేరుతో కొలుస్తారు. తూర్పుకనుమలలో శేషాచలం కొండలు అని పిలువబడు తిరుమల కొండలపై సముద్ర మట్టమునకు 2800 అడుగుల ఎత్తున వెలసిన పురాణ పురుషుడు. ఆదిశేషుని శిరస్సులు ఏడుపేర్లతో  ఏడు శిఖరములపై విస్తరించిన శేషాచల కొండలపై కలియుగ వైకుంఠం తిరుమల యందు అవతరించాడు.శేషాచలం కొండలు వంపులు, ఎత్తులు మరియు జలపాతములతో మహావిష్ణువు పవళించు ఆదిశేషుని పోలిఉంటాయి. తిరుపతినుండి తిరుమల మార్గంలో కొండలు ఆదిశేషుని ఏడు శిరస్సులువలె అహోబలం ఆదిశేషుని కేంద్రంగా, శ్రీశైలం ఆదిశేషుని తోక చివరను సూచిస్తూ తిరుమల శేషాచలమని పిలువబడుతూంది. 

sri venkateswara swamy vaari temple12

పురాణకధనం ప్రకారం తిరుమల పవిత్ర స్థలం మరియు కృత, త్రేతా, ద్వాపరయుగములలో వరుసగా వృషభాచల, అంజనాచల, శేషాచల పేర్లతో పిలువబడి కలియుగంలో వేంకటాచలంగా పిలువబడుతూంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతార సమాప్తి పిమ్మట కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు శ్రీనివాసుని రూపంలో శేషాచల కొండలకువచ్చి స్థిరపడ్డాడు.

హృదయంపై లక్ష్మీదేవిని ప్రతిష్టించుకుని రాతివిగ్రహంగా మారి భూదేవి మరియు పద్మావతిదేవితో భక్తులను అనుగ్రహించు శ్రీనివాసుడు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రములందు ప్రసిద్ధ గౌడ సరస్వతి బ్రాహ్మణులు అనబడు హిందూ బ్రాహ్మణుల దైవం. స్వామిని వెంకటాచలపతి లేదా వెంకటరమణ లేదా తిరుమల్ దేవర్ లేదా వరదరాజు లేదా శ్రీనివాస లేదా బాలాజీ లేదా బితాళ అని పిలుస్తారు. నల్లనిరంగుతో నాలుగుచేతులలో పైచేతులందు చక్రం మరియు శంఖం ధరించి క్రింది రెండుచేతులతో భక్తులను తనరక్షణ కోరమని తెలుపుచున్నట్లు దర్శనమిస్తాడు. ప్రతి గౌడ సరస్వతి బ్రాహ్మణుడు జీవితంలో ఒకసారైనా శ్రీనివాసుని దర్శించుకోవడంపై ఆశక్తిచూపుతాడు. శ్రీనివాసుని సోదరుడు శ్రీగోవిందరాజ స్వామి కొలువున్న తిరుపతి పట్టణం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుజిల్లా చంద్రగిరి తాలూకాలో తిరుమలకొండల దిగువనఉంది. ఇతర విష్ణుఆలయాలలోవలె చిన్నచిన్న ఉపఆలయాలు, ఇతరవిగ్రహాలు ఆలయంలో కనిపించవు. వెంకటేశ్వరుని మూర్తితప్ప కనీసం అమ్మవారికికూడా వేరేఆలయం ఉండదు. 

గోపురంమీద వెండి మకరతోరణంతో అలంకరింపబడిన చిన్నమందిరంలో శ్రీవేంకటేశ్వరుని మూలమూర్తిని పోలిన చిన్నవిగ్రహం గరుత్మంతుడు, హనుమంతుడు సేవిస్తూ “విమాన వేంకటేశ్వరుడు” అని పిలువబడుచు దర్శనమిస్తుంది. విగ్రహం తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని “వేంకటాచలమాహాత్మ్యం” నందు తెలుపబడింది .ఈ విమాన వేంకటేశ్వరుని దర్శనం మూలవిరాట్ దర్శనంతో సమానమని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈయనను దర్శిస్తే యాత్రా ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. గతంలో గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు మూల విరాట్‌ను దర్శించుకునేవారు, అయితే ఇప్పుడు రద్దీ దృష్ట్యా భక్తులు ముందుగా మూలవిరాట్‌ని, ఆ తర్వాత విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. విమాన వేంకటేశ్వర దర్శనం అన్ని పాపాల నుండి విముక్తిని ఇస్తుంది మరియు ప్రకాశవంతమైన జీవితం అందిస్తుంది. ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లే ముందు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి విమాన వేంకటేశ్వరుని సన్నిధిలో నిలబడి హారతి తీసుకుంటారు. సంవత్సరానికొకసారి మూడురోజులపాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమాన వేంకటేశ్వరస్వామివారికి కూడా పవిత్ర మాలలు సమర్పింపబడతాయి. మూడుమార్లు మూలవిరాట్ నకునివేదన సమర్పించేతప్పుడు అర్చకులు ఆలయంబయట ఉన్నస్వామికి లోపలినుండే నివేదనలు సమర్పిస్తారు. రద్దీవల్ల గర్భాలయంలో స్వామిదర్శనానికే సమయం చాలదుకనుక విమాన వెంకటేశ్వరస్వామివద్ద నిలబడి కోరికలు తెలుపుకోవచ్చు.

తిరుమలలో వేంకటేశ్వర ఆలయం, స్వామి పుష్కరిణి, పాపవినాశం, వరాహస్వామి ఆలయం 10,000 సం.లకు పూర్వపు పురాతనం రాతినిర్మాణమైన శిలాతోరణం. మరియు ఆకాశగంగ జలపాతం చూడవలసినవి. యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానంవారు ఈప్రదేశములు దర్శించుటకు ఉచితబస్సు సదుపాయం ఏర్పాటుచేశారు. రామానుజాచార్యులవారు తిరుమలలో పూజానియమాలు రూపొందించి పర్యవేక్షణకు ఐదుగురు మఠాధిపతిలను ప్రతిపాదించారు. మొదట స్వామిభక్తులను ఆకర్షిస్తాడు అటుపిమ్మట భక్తులు పలుమార్లు ఆలయ సందర్శనానికి ఆకర్షింపబడతారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో తన భక్తులను రక్షించువాడని పురాణములందు తెలుపబడింది. భక్తులు ఎవరునూ అసంతృప్తితో వెనుతిరగరు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంచే నియమించ బడిన పరిపాలన బోర్డువారి నిర్వహణనందు ఉన్నది. దేవస్థానం వారు కొండ దిగువన తిరుపతినందు, కొండపై తిరుమలయందు నిర్వహించుచున్న అతిధిగృహములు, కాటేజీలు మరియు గదులు అనేకం ఉన్నవి. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా 60 రోజులముందుగా బుక్ చేసుకొనవచ్చును. తిరుపతి దేశములోని అన్నీ నగరములు పట్టణములనుండి రైలుద్వారా, బస్సుద్వారా మరియు విమాన సర్వేసుతో అనుసంధానింపబడి యున్నది. నిత్యం దేశములోని వివిధప్రాంతములనుండి టూరిస్టు బస్సులందు వెలకొద్దీ యాత్రికులు తిరుమల దర్శిస్తారు. దేవస్థానంవారు వెంకటేశ్వరుని దర్శనమునకు వచ్చు ప్రతిభక్తునికి ఉచితానదాన పధకమునందు ఆహారం అందజేస్తారు మరియు తిరుపతిలో అన్నీ కులములవారికి వేర్వేరుగా అన్నదాన సత్రములందు బస, భోజన ఏర్పాట్లు కలవు. తిరుమలలో కల వివిధ ప్రదేశములు ఉదయం 2-30 నుండి రాత్రి 12-00 వరకు వివిధ సేవలరూపంలో స్వామి దర్శణానికి అనుమతిస్తారు. క్షేత్ర కధనమునకు ipltours.in నందు  తిరుపతి యాత్రపేజీ దర్శించండి.