శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం
(గబ్బూరు)
(IPLTOURS)
భారతదేశంలో శివకేశవుల అవతారములలో మహిమాన్విత దేవాలయాలాయతోపాటు అంతుచిక్కని రహస్యాలతో అనేక ఆలయాలు ఉన్నాయి. అటువంటి ఆలయములలో గబ్బూరు (మంత్రాలయ) శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం విశిష్టత మరియు స్వామిమహత్యం స్వయంగా చూస్తే అమితఆశ్చర్యం కలిగిస్తుంది. గబ్బూరు కర్ణాటకరాష్ట్రం రాయచూరుజిల్లా దేవదుర్గ తాలూకాలో ఉన్నది. రాయచూర్ జిల్లాలో గబ్బూరునకు ఆలయనగరం అనిప్రసిద్ధి. జిల్లాకేంద్రం రాయచూరు నుండి 30 కి.మీ తాలూకాకేంద్రమైన దేవదుర్గనుండి 28 కి.మీ దూరంలో ఉన్ననూ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలుజిల్లా మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామివారిమఠం బృందావనంనుండి కేవలం 500 మీ దూరంలో ఉన్నది. అందువల్ల ఈఆలయం గోబ్బూరు నందు ఊన్ననూ మంత్రాలయ వెంకటేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. గొబ్బూరు పట్టణంలో సుమారు ముప్పైఆలయాలు, రాతిశాసనాలు ఉన్నాయి. శ్రీశైలం యాత్రనందు మంత్రాలయం రాఘవేంద్రదర్శింనం పిమ్మట సమీపములో గబ్బూరు శ్రీవేంకటేశ్వస్వామిని దర్శించవచ్చును.
దేశవిదేశాలలో మహావిష్ణువు కలియుగఅవతారం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలు అనేకంఉన్నాయి. దివ్యశక్తితో దేశ,విదేశీ భక్తులను ఆకర్షించు తిరుమల, ద్వారకాతిరుమల తదితర ఆలయాలు, తూర్పుగోదావరిజిల్లాలో స్థానికులను ఆకర్శిస్తూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖమైనవిగా భావించబడు వాడపల్లి, అప్పనపల్లి తదితర స్వయంభూః క్షేత్రాలు అనేకం ఉన్నవి. ఈక్షేత్రములతోపాటు దక్షణభారత దేశంలో ఆదరణకు నోచుకోని అనేకప్రముఖ మరియు అద్భుతాలు నెలకొన్న శైవ మరియు వైష్ణవ నిగూఢ ఆలయాలుఉన్నాయి. మనదేశలో ఉత్తరభాగం ప్రముఖ శివాలయములకు దక్షణభాగం వైష్ణవ ఆలయయాలు ప్రముఖంగా కనపడతాయి. స్థలపురాణం ప్రకారం మంత్రాలయ సమీపంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరుని శ్రీరాఘవేంద్రస్వామివారు స్వయంగా పూజించారని తెలుస్తూంది. శ్రీవేంకటేశ్వరఆలయం మంత్రాలయ గ్రామంలో గృహాల మధ్యఉన్నది. ద్వారపాలకుల బొమ్మలతో కూడినగోపురం కలిగి,, గోపురం దాటినపిమ్మట పెద్దమండపం మరియు గర్భాలయం కలిగిఉంది. మండపం శ్రీవేంకటేశ్వరస్వామి మరియు వారిభార్యల బొమ్మలతో అలంకరించబడి ఉంది. గర్భగుడిలో నల్లటి అలంకారరహిత వెంకటేశ్వరుని రాతివిగ్రహం దర్శనం ఇస్తుంది. స్వామివారి విగ్రహం శిరస్సు పైనుండి వేడినీటితో అభిషేకం చేస్తే. ఆనీరు స్వామివారి పాదాలను చేరగానే చల్లబడిపోతుంది. వేడి నీటిని స్వామి నాభినుండి అభిషేకం చేస్తే ఆనీరు వేడిగానే పాదాలకు చేరుతుంది. శిరస్సుపైనుండి పోసిన వేడినీరు మాత్రమే చల్లగామారుతుంది. ఈఅద్భుతం వెనుకఉన్న రహస్యం నమ్మశక్యంకానిది మరియు శ్రీ వేంకటేశ్వరుడు మహిమాన్విత మహానుభావుడనడంలో అతిశయోక్తి లేదు. ప్రాచీనకాలంలో గబ్బూరును గర్భపుర, గోపురగ్రామం అని పిలిచేవారు. వీటిలో చాలాఆలయాలు కల్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించ బడ్డాయి. ఈఆలయాల్లో హనుమాన్, ఈశ్వరుడు, వేంకటేశ్వరుడు, నందీశ్వరుడు తదితరమైనవి ప్రముఖఆలయాలు. ఇంకనూ అనేక ఆలయ శిధీలములున్నవి. మంత్రాలయంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అతిపురాతన ఆలయం. శ్రీరాఘవేంద్రులు స్వయంగా ప్రతిష్టించి పూజించిన శ్రీవెంకటేశ్వరుని విగ్రహం మరియు ఆలయం రమ్యంగా ఉంటాయి. మఠంప్రాంగణంలో శ్రీలక్ష్మి వేంకటేశ్వర ఆలయం ఒక ప్రధాన ఆకర్షణ. స్వామివార్కి రోజువారీ పూజలు మరియు అన్ని ఉత్సవాలు నిర్వహించబడతాయి. భక్తులు ఆనందకరమైన అనుభూతిని పొందుతారు. ఆలయం ఉ 6-00 నుండి 12 వరకు తిరిగి 4-30నుండి 8-00 వరకు తెరచి ఉంటుంది.
సమీపంలో ప్రాంగణంనకు ఎడమప్రక్క మంచాలమ్మ ఆలయం ఉన్నది. మంచాలమ్మఅమ్మవారిని మంత్రాలయం గ్రామదేవతగా భావిస్తారు. నదికి సమీపంలోఉన్నఈఆలయం ఉన్నప్రదేశంన గురించి సమాచారం స్థానికులనుండి పొందవచ్చును. మంచాలమ్మ పార్వతీదేవి అవతారం మరియు ఈఆలయం మంత్రాలయంలో ముఖ్యమైన ఆలయం. రాఘవేంద్రస్వామి ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు మంచాలమ్మను ప్రార్థిస్తారు. ఆలయం గర్భగుడి మరియు హాలును కలిగిఉంది, మంచాలమ్మ 3 అడుగుల ఎత్తైనవిగ్రహం ఒక ఎత్తైన ఆసనంపై. స్థాపితమైనది. పార్వతిదేవి రంగులచిత్రాలు అనేకం గోపురంమీద కనిపిస్తాయి. మంత్రాలయం పట్టణాన్ని మంచాలమ్మ తన దైవికశక్తులతో కాపాడుతుందని నమ్ముతారు. పూర్వం మంత్రాలయాన్ని మాంచాలమ్మదేవి పేరుతో మాంచాలి అని పిలిచేవారని ప్రసిద్ధి. భక్తులు స్వయంగా హారతి ఇచ్చుటకు అనుమతించడం ఆలయపు ప్రత్యేకమైన ఆచారం. ఆలయం ఉ 6-30 నుండి మ 2-00వరకు తిరిగి 4-00 నుండి 9-00 వరకు తెరచి ఉంటుంది.
గబ్బూరుకు చేరువలోఉన్న పెద్దపట్టణం రాయచూర్ అనిచెప్పబడిననూ వాస్తవంగా మంత్రాలయం కర్నూలు జిల్లాలోనిది కావున కర్నూలునుండి 92 కి.మీ. దూరంలోఉన్న మంత్రాలయం తరచూ రాస్త్రరోడ్డు రవాణాబస్సు సౌకర్యం ఉండటంవలనా శూలభంగా ప్రయాణించవచ్చును. దేశంలోని ఏ ప్రాంతంవారైననూ కర్నూలు వరకు రైలులో ప్రయాణించి అచ్చటినుండి మంత్రాలయం బస్సు లేదా ప్రయివేటు వాహనంలో ప్రయాణించడం అనువుగా ఉంటుంది. విమానాశ్రయం మాత్రం రాయచూర్ సమీపంలోఉన్నది.