సోమారామం

(IPLTOURS)

పురాణముల ప్రకారము కుమారస్వామి (కార్తికేయుడు) తారకాసురుని వధించుటకు ముందుగా ఆతనికి రక్షాగాఉన్న మెడలోని ఆత్మలింగమును ఆగ్నేయాస్త్రము ప్రయోగించి అయిదుముక్కలు (శకలములు) చేసినప్పుడు ఒకశకలం క్షీరారామంనందు పడినది. పంచారామములందు ఒకటి అయిన క్షీరారామం పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లు మునిసిఫల్ పట్టణమునందు ఉన్నది.

పురాణముల ప్రకారము కుమారస్వామి (కార్తికేయుడు) తారకాసురుని వధించుటకు ముందుగా ఆతనికి రక్షాగాఉన్న మెడలోని శివలింగమును ఆగ్నేయాస్త్రము ప్రయోగించి అయిదుముక్కలు (శకలములు) చేసినప్పుడు అందు ఒకశకలం సోమారామమునందు పడినది. పురాణకధ భూమిమీద పడిన ఆత్మలింగాశకలాలు కైలాసాన్నిచేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయిఅని, అవిపెరిగి కైలాసం చేరుకున్నకలియుగంలో మానవులకు పూజించుటకు స్వామిదర్శనం దుర్లభమని ఆత్మలింగాశకలాలు ఎదగకుండా ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు మరియు కార్తికేయునిచేత ప్రతిష్టించబడి అభిషేక మరియు అర్చనలు చేయబడినవి. ఈఆలయములందు శివుడు స్వయంభూః ఆగుటవలన, ఆలయములు దేవతలైన ఇంద్ర, సూర్య, చంద్ర, విష్ణు మరియు కుమారస్వామిచే (కార్తికేయునిచే) నిర్మించబడి యుండుటవలన ఈఆలయములు దేవతలచే నిర్మించబడిన స్వయంభూః ఆలయములు. ఈఆలయములు దర్శించిన ఆలయములను ఒకెరోజురాత్రి నిర్మించినట్లు అట్లు నిర్మించుట మానవమాత్రులకు సాధ్యముకాదుఅన్నది సుస్పస్టమగుతుంది. అమరావతినందు అమరలింగేశ్వరుడు బాలచాముండితో, భీమవరం సోమేశ్వరస్వామి శ్రీరాజరాజేశ్వరితో, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు పార్వతితో, ద్రాక్షారామభీమేశ్వరుడు అష్టాదశశక్తిపీఠమైన మాణిక్యాంబతో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరుడు బాలాత్రిపురసుందరితోను భక్తులను అనుగ్రహించుచున్నారు.

పురాణకథ ప్రకారం చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించినాడని, గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన సోమేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. సోమారామం పంచారామములలో ఒకటి. ఈక్షేత్రము పశ్చిమగోదావరిజిల్లానందు మునిసిఫల్ పట్టణము భీమవరమునకు రెండు కిలోమీటర్ల దూరరములో గునుపూడి గ్రామంనందు ఉన్నది. ఇచట శివుడు సోమేశ్వరుని పేరుతోనూ మరియు మాతపార్వతి రాజరాజేశ్వరిదేవి రూపములోనూ పూజించబడుచున్నారు శివలింగము చంద్రునిచే ప్రతిస్టించబడినది ఈఆలయము పురాతనమైనది. కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖవారి ఆధ్వర్యములో పరిరక్షింపబడుచున్న ఆలయములలో సోమేశ్వరాలయం ఉన్నది. ఆలయపుగోడలకు మరియుశిల్పములకు రంగులువేయుటవలన అందముగా కనపదును. శ్వేతవర్ణంలో కనిపించే  సోమేశ్వరలింగము పౌర్ణమినుండి అమావాస్య వచ్చుసరికి కృమ క్రమముగా నలుపు వర్ణమునకు మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చుసరికి శ్వేత (తెలుపు) వర్ణములో దర్శనం ఇస్తుంది. చంద్రకళలను అనుసరించి వర్ణము మారుట ఇచ్చటి శివలింగమునకుగల ప్రత్యేకత. 

Sri Someswara Janardana Swamy Temple

సోమేశ్వరలింగము చంద్ర ప్రతిష్టకావున చంద్రకళలను అనుసరించి శివలింగము నందుమార్పులు కలుగుతున్నాయని నానుడి.

ఆలయము ముందుభాగమున అన్నీకాలములలోనూ కమలము లేదా తామరపూలతో నిండిన చంద్రకుండం పేరుతో  కోనేరు ఉన్నది. కోనేరు గట్టున 15 అడుగుల రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు. మొదటి ప్రాకారమునందున్న పెద్దనందీశ్వరుని కొమ్ములమధ్య నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. దేవాలయం ముందున్న రాతి గట్టునుండి చూస్తే శివలింగానికిబదులు గర్భగుడిముందు పైఅంతస్తులోకల ఉప ఆలయములోని అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈవిధమైన నిర్మాణము దేశమునందు మరెక్కడాకానరాదు. అమ్మవారి మెడచుట్టూ పవిత్రమైనతాడు మరియు ఆమెకాళ్లవద్ద పసిపాప ఉంటాయి.

ఆలయప్రవేశము చేసిన పిమ్మట ఎడమభాగములో మండపమునందు శ్రీరాముడు మరియు హనుమంతుని ఆలయాలు కలవు. ఆలయము నందు కుడిప్రక్కన మండపమునందు పండితులు భక్తులచేత పూజలు నిర్వహించెదరు. అనేక శిల్పములు ఆలయమునందుకలవు. గర్భగుడిలో శివుడు అందమైన శివలింగరూపములో దర్శనం ఇస్తాడు. ఈఆలయము నందు శివలింగము చిన్నదిగాను, మిగిలిన పంచారామక్షేత్రములలో స్తంభాకృతిలో ఉండును. సోమేశ్వరునిభార్య శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు. ఆలయమునందు గర్భగుడిలో ఆదిలక్ష్మి, ఆలయములోపల కుమారస్వామి, నవగ్రహములు, సూర్యుడు మరియు గణేశుని విగ్రహములు దర్శించవచ్చు. ఈపవిత్ర ప్రదేశము సమీపము నందుకల భీమవరం గ్రామదేవత అయిన దర్శనం చేసుకొనవచ్చును.

సోమారామం సమీపంలోని శ్రీ సోమేశ్వర ఆలయ సమయాలు & ఎలా చేరుకోవాలి, సందర్శించవలసిన ప్రదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాసంస్థ వారు కాకినాడ బస్సు డిపోనుండి అయిదు పంచారామ క్షేత్రములు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ మరియు సామర్లకోట) యాత్ర 24 గంటలలో పూర్తి అగునట్లు కార్తీక మాసములోనూ మరియు శివరాత్రి పర్వదినము రోజున సర్క్యులర్ టూర్లూ ఏర్పాటు చేయుడురు. యాత్ర రాత్రి 8 గం లకు ప్రారంభమై సుమారు  700 కి.మీ ప్రయాణించి మరుసటిరోజు సాయంత్రం సుమారు 7 గం లకు ముగుస్తుంది.   

ఆలయం ఉదయం 5 నుండి 12 వరకు తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు తెరచి ఉంటుంది.    

శక్తేశ్వరస్వామి ఆలయం, యనమదుర్రు

భీమవరం సోమేశ్వరుని దర్శించిన పిమ్మట భీమవరం గ్రామమునకు 5 కి.మీ దూరములో యనమదుర్రు గ్రామములొ నున్న శక్తీశ్వర స్వామిని దర్శించుకొన వచ్చును. శివుడు సాధారణముగా లింగరూపములోనే అన్నీ క్షేత్రములందు దర్శినము ఇచ్చును. అట్లు కాకుండా విగ్రహరూపములో దర్శనముఇచ్చు ఆలయములు అరుదుగా కనిపిస్తాయి. అటువంటి అరుదైన ఆలయములలో యనమదుర్రు నందున్న శక్తీశ్వరస్వామి ఆలయము ఒకటి. శివుడు తలకిందులుగా తపస్సుచేయు భంగిమలో భక్తులచే ఈఆలయమందు పూజింపబడుచున్నాడు. శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో ఇచ్చట దర్శనమిస్తాడు. శివుడు, పార్వతి మరియు సుబ్రహ్మణ్యస్వామి ఏకపీఠం మీద ఉండటం, పార్వతిదేవి బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ ఒడిలో లాలిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత.                   

కధనము ప్రకారము శంబురాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, మునులను బాధించుచుండగా ఆబాధలు వారు ఒక్క యముడు మాత్రమే వానిని చంపగలడు అనితలచి యముని వద్దకువెళ్లి జరిగిన విషయాన్నీ మొరపెట్టుకొనగా, వానితో అంతకుముందు యుద్ధంలో ఓడిపోయిననందున అతనితో పోరాడే శక్తికోసము యముడు శివుడికి తపస్సు చేశాడు. 

శివుడు తపస్సులో ఉండుటవలన యముని తపస్సు చూసి పార్వతి దేవి ప్రత్యక్షం అయి యమధర్మరాజుకు ఆయుధాన్ని ప్రసాదించగా యముడు ఆఆయుధంతో శంబురాసురుని వధించి ప్రజలకు విముక్తి కలిగించాడు. శంబురాసురుడు నిర్జింప బడిననూ యమపురికి కాపాడుటకుఇచ్చటనే నివసించమని యముడు శివుడిని ప్రార్ధించాడు.తపస్సులోనే ఉన్న శివుడు అదేరూపంలొ కుటుంబసమేతముగా యమపురిలో వెలిసాడని స్థానిక కథనము. ఆ ప్రాంతానికి యమపురిగా పేరువచ్చి కాలక్రమేణా యనమదుర్రుగా మారింది. శివుడు శక్తితో వెలయుటవలన స్వామి శక్తీశ్వరునిగా ప్రసిద్ధిచెందినాడు.

స్వామిని దర్శించితే దీర్ఘకాలరోగాలు నయం అవుతాయని స్థలపురాణంలో పేర్కొన్నారు..

IPLTOURS Indian Pilgrim Tours