మంత్రాలయం

(IPLTOURS)

మంత్రాలయం ఒక ప్రసిద్ధ యాత్రా స్థలము. వాడుకనందు మంత్రాలయంఅని పిలువబడు చున్ననూ అనేక విషయము లందు అపూర్వమైన గౌరవము కలిగియున్నది. ఇచటకల ఆలయము ప్రత్యేకించి ఏదేమునికి ఉద్ధేశించినది కాదు. ఇచట ఏదేవతావిగ్రహము ప్రతిష్టజరిగి యుండలేదు మరియు పూజింపబడుటలేదు. అంతేకాక ఈప్రదేశమును బృందావనం అనిపిలిచెదరు. ఈప్రదేశము 17 వ శతాబ్దమునకు చెందిన శ్రీరాఘవేంద్రస్వామి అనబడు ఒకపవిత్రవ్యక్తి సమాధికల స్థలము. ఈసమాధి ఇతరసమాధులవలేనే కాక శ్రీరాఘవేంద్రస్వామి జీవించిఉండగా, ఆయన ఐచ్చికముగా సమాధినందు ప్రవేశించినారు. రాఘవేంద్రస్వామి సమాధిచెందువరకు ప్రాముఖ్యములోలేని మంత్రాలయం. అప్పటినుండి ఒక పవిత్రప్రదేశముగా రూపొంది దేశవిదేశములనుండి వేలకొలది యాత్రికులను సంవత్సరమంతయూ ఆకర్షించుచున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంనందు కర్నూలుజిల్లానందు తుంగభద్రా నదితీరంనందు ఈయాత్రాస్థలం ఉన్నది.

Sri Raghavendra Swamy Mutt View Mantralayam

17వ శతాబ్ధంనందు నివశించిన యోగి రాఘవేంద్ర స్వామి బృదావన్ గా పేరు పొందినది. వెలకొద్ది జనము తుంగభద్రా నదీ తీరమునందున్న రాఘవేంద్రస్వామి మథమును ఇతర దేవాలయములను దర్శింతురు. హంసనాయక పరమాత్మ పరంపరకు చెందిన దానిగా శ్రీ రాఘవేంద్ర స్వామి మథమునకు గుర్తింపుఉన్నది. దేశవిదేశాల్లో శ్రీమధ్వాచార్య సాంప్రదాయంలో రాఘవేంద్రస్వామి మఠము ముఖ్యమైనది. రాఘవేంద్రస్వామి మఠమునందు మూల రామవిగ్రహం వాస్తవంగా చతుర్ముఖ బ్రహ్మచేత కొలువబడిందని, శ్రీదిగ్విజయరాముని విగ్రహం శ్రీమద్వాచార్యులతోనూ, శ్రీజయరామ విగ్రహం శ్రీ జయతీర్ధులతోనూ కొలువబడుతున్నదని చెపుతారు.                                    

మంత్రాలయయోగి అయిన రాఘవేంద్రస్వామి మరియు ప్రాచుర్యము పొందిన రాఘవేంద్రతీర్ధ సుమారు 700 సం క్రిందట నివసించిన ప్రఖ్యాత పండితుడు మరియు యోగి. తమిళనాడులోని భువనగిరినందు మధ్వబ్రాహ్మణ కుటుంభములో వెంకటనాధుడు అనుపేరుతో 1595 సం నందు జన్మించినారు. ఆయన కుటుంభములోవారు అందరూపండితులు మరియు సంగీతవిద్వాంసులు అందువలన రాఘవేంద్రుడు సంగీతమునందు ఆకర్షితుడు అవడములో ఆశ్చర్యము లేదు. చిన్న తనములో తండ్రిని పొగుట్టుకొనిన ఆయన మధురైలో విధ్యాభ్యాసంచేసి అటుపిమ్మట వివాహం చేసుకొనినాడు. ఆయన పండితుడు అగుటయేకాక అంతరార్ధములను తెలుసుకొను జ్ణానము మరియు అనర్ఘముగా ఉపన్యసించు పరిజ్ణానము సంపాదించినారు. కుంభకోణం మధ్వమఠాధిపతి సుతీంద్రతీర్ధ వారిదృష్టికి వెంకటనాధుని విషయం తెలిసి ఆతని తెలివితేటలకు ముగ్ధుడై మతమునకు ఉత్తరాధికారిగా ఉండుటకు కోరినారు. కానీ ఈవిధముగా జరుగుటకు వారు సంసారజీవితము త్యజించి సన్యాసిగా మారవలసియున్నది. వేంకటనాధునికీ ఆసరికే భార్య ఒకపిల్లవాడు ఉండుటవలన జీవితమందు ఆస్థితిలో అటువంటి ముఖ్యనిర్ణయము తీసుకొనుట చాలా బాధాకరమైన విషయము. కానీ పెద్దలు వత్తిడి తెచ్చి ఆతనిమనసు క్రమేపీమార్చి సుతీంద్రతీర్ధుల వారికోరిక తీర్చుటకు అంగీకరించునట్లు ఒప్పించినాఋ. అందువలన వెంకటనాధుడు 26 సం వయసులో అనగా 1621 సంలో సన్యాసిగా మారుటకు అంగీకరించినాడు. సుధీంద్రతీర్ధులు మరణించిన పిమ్మట మఠాధిపత్యమును పొంది రాఘవేంద్ర తీర్ధులు అనుపేరు ధరించినారు.                   

మఠాధిపతి అయినందువల్ల రాఘవేంద్రతీర్ధులు దైవసిద్ధాంతము, ధర్మమునుగూర్చి మరియు ప్రజలకు సరియైన జీవనవిధానము తెలియచేయుచూ దైవికక్రమమును ప్రపంచవ్యాప్తముగా స్థాపించినారు. వారి ప్రవచనములన్నియు మధ్వాచార్యులువలె వైష్ణవము అధారముగా సాగినవి. వారు ప్రస్తుతము మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రములోకల ఉడుపి, కొల్హాపూర్ మరియు బీజాపూర్త దితర పవిత్రప్రదేశములకు యాత్రలు చేసినారు. వారిపేరు మరియుకీర్తి వ్యాప్తి చెందియుండుటవలన ప్రజలువారి అనారోగ్యములను తగ్గించుకొని వారిఇబ్బందులనుండి విముక్తిపొందుటకు గుంపులు గుంపులుగా వచ్చేడివారు. వారు విజ్ణతతో కూడినసలహాఇచ్చి వారిని ధర్మమార్గమున నడుపుటద్వారా వారిని వారి పాపములనుండి ధర్మమార్గములో నడుచుటద్వారా ముక్తిమార్గము చూపినారు. వారి ఆశ్రయము పొందినవారు వారికి ఆధ్యాత్మికముగాకల శక్తులవలన ప్రజలసమస్యలను పరిష్కరించి వారికిజీవితములో ఉన్నతినికల్పించేదరని ప్రజలు నమ్మినారు. త్వరలోనే చాలామంది ఆయన శిష్యులుగాను, పరమభక్తులుగాను మారినారు.                         

అప్పటిలో అధోని గవర్నరు వీర్కి మంత్రాలయం గ్రామమును బహూకరించినారు. తుంగబధ్రనది తీరప్రాంతంలో ఈ ప్రదేశమును కనుగొని దొడ్డకెంపదేవరాజునుండి స్వీకరించిన సొమ్ముసహాయముతో అభివృద్ధిచేసినారు. 1671 సం లో ఐచ్చికముగా జీవినసమాప్తి కావలెనని నిర్ణయించుకొనినారు. తాను సమాధి చెందవలసిన తేదీ మరియు సమయం సంప్రదాయబద్ధంగా గుణించుకొని తనశిష్యులను తనచుట్టూ సమాధి నిర్మించవలెనని ఆదేశించినారు. నిర్ణీతసమయమున సమాధినందు ప్రవేశించి కూర్చున్నస్థితిలోఉండగా శిష్యులు వారిచుట్టూ మరియు పైనసమాధి నిర్మించినారు. ఇదియే బృందావనంగా పూజించబడుచున్నది.

రాఘవేంద్రస్వామి ఇప్పటికినీ బృందావన్ నందు నివసించూచున్నారని అందుండి భక్తులకు మరియు ఇతరులకు దీవనలు ప్రసాదించు చున్నారని నమ్మెదరు. వారు 1801 సంవత్సరములో బళ్ళారిజిల్లా కలెక్టరువారికి కనపడినారాని, ఇందుకు వ్రాతపూర్వక ఆధారంకలదని తెలియుచున్నది. రాఘవేంద్రస్వామి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని అవతారంగా భావించేదరు. వారు రాముని మరియు పంచముఖ ఆంజనేయస్వామి భక్తునిగా నిలచినారు. ఆయన తత్వశాస్త్రం, మతము మరియు పురాతన గ్రంధములు అనేకము వ్రాసియున్న గొప్ప పండితులు. వారు వీణావాయిధ్యంనందు నేర్పరి మరియు అనేక గీతములను వివిధ దేవతలను కీర్తిస్తూ స్వరపరచినారు.           

మంత్రాలయం కేవలం ఒక హిందూసన్యాసికి చెందినసమాధి మాత్రమేకాదు ఇంకనూ హరి, వాయువు తదితరదేవతలను కొలుచుప్రదేశం. ఇచ్చట పల్లకీఉత్సవము ముఖ్యమైనది. ఈఉత్సవమునందు పూజించబడు దేవతావిగ్రహములు గంధపుచెక్కతో తయారుకాబడి పువ్వులతో అలంకరించిన పల్లకీలందు ఆలయముచుట్టూ ప్రతిరోజూ ఊరేగింతురు. రాఘవేంద్రస్వామివారు జీవించిఉన్నప్పుడు అనేకమహిమలు చేసినారని, ఇప్పటికినీ మంత్రాలయంలోని బృందావన్ నుండి నమ్మశక్యముకాని పనులు చేయుచున్నారని భక్తులు నమ్మేదరు.                

రాఘవేంద్ర బృందావన్ ప్రతిరోజూ ఉ 6-00 లకు పవిత్ర తీర్ధముతో ప్రక్షాళన చేయబడుతుంది. మంగలహారతి సమయంలో అభిషేకం చేయబడి విలువైన ఆభరణములు మరియు వస్త్రములతో అలంకరించేదరు. ఉదయం 10-00నుండి 11-30 వరకు మంత్రాక్షత జరుపబడుతుంది. మహాపూజ మధ్యాహ్నం చేయబడుతుంది. మూలరామునికి మరియు హనుమంతుడికి కూడా పూజలు నిర్వహించబడతాయి. ఆలయమునందు మధ్యాహ్నం 1 నుండి 3 వరకు తీర్ధ ప్రసాదం (ఉచిత భోజనం) ఏర్పాటుఉన్నది. సాయంత్రం అప్పుడప్పుడు రాత్రి 8 గంటలకు రాత్రి భోజనం ఏర్పాటు ఉంటుంది. భక్తులు సాంప్రదాయ దుస్తులతోనే ఆలయం సందర్శించవలెను. మగవారు వక్షముపై ఏ విధమైన వస్త్రము ధరించరాదు. మహారధోత్సవం, శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం మరియు ధనుర్మాస పూజలు ముఖ్యమైనవి. ఆలయము ఉ 6 నుండి మధ్యాహ్నం 2 వరకు మరలా 4 నుండి రాత్రి 9 వరకు తెరచి ఉంటుంది.   

మంత్రాలయం చేరుటకు దగ్గరలోని హైదారాబాద్ విమానాశ్రయమునుండి 236 కిలో మీటర్లు రోడ్ ద్వారా బస్సులో లేదా ప్రయివేటు వాహనములో ప్రయాణించి చేరవచ్చును. రైలు ద్వారా అయినట్లయిన పరిమిత రైళ్ల ద్వారా మంత్రాలయం రోడ్ స్టేషనుకు ప్రయాణించి ఆచటినుండి 12 కిలోమీటర్లు రోడ్డు ద్వారా ప్రయాణించి చేరుకోనవచ్చును. మరియు ప్రతిరోజూ ఇంతర రాష్ట్రముల పట్టణములనుండి అనగా మంగుళూరు, మైసూరు, బెంగుళూరు, చెన్నై, హైదారాబాద్, బళ్ళారినుండి ప్రయివేటు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ వారిచే రాష్ట్రములోని అన్ని ముఖ్య పట్టణములనుండి నడుపు బస్సులలో చేరవచ్చును.

IPLTOURS Indian Pilgrim Tours