శ్రీశైలం
(2వ జ్యోతిర్లింగం)
IPLTOURS
శ్రీశైలశృంగే వివిధప్రసంగే
శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేనం
నమామి సంసారసముద్రసేతుమ్
(2వ జ్యోతిర్లింగం)
IPLTOURS
శ్రీశైలశృంగే వివిధప్రసంగే
శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేనం
నమామి సంసారసముద్రసేతుమ్
ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది శ్రీశైలములోనున్న మల్లిఖార్జున జ్యోతిర్లింగం. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
ద్వాదశ జ్యోతిర్లింగములలో మల్లిఖార్జునుడు రెండవ జ్యోతిర్లింగము. కర్నూలుజిల్లా సిరిధన్, శ్రీగిరి అని పిలువబడు నల్లమలకొండలపైకలకృష్ణానదికికుడిభాగమున చదునైన శిఖర భాగమున మల్లిఖార్జునుడు ద్వాదశజ్యోతిర్లింగములలో రెండవజ్యోతిర్లింగముగా ప్రకాశించు చున్నాడు. భారతదేశములో గల పురాతన మరియు అత్యధిక శక్తికల ఆలయముగా శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆలయము వెలుగొందుచున్నది. వందలసంవత్సర ములనుండి శ్రీశైలము పవిత్ర శైవక్షేత్రముగా ప్రసిద్ది చెందినది. విజయనగర రాజులపాలనలో హరిహర రాయునిచే ఈ ఆలయము నిర్మించబడినది. బృంగిమహర్షి శివుని ఒక్కడినే పూజించుటవలన కోపగించి పార్వతి బృంగిని నిలుచుండమని శపించినది. శివుడు పార్వతిని శాంతపరచి సుఖ వంతముగా నిలుచుందుటకు వీలుగా బృంగికి మూడవ కాలు ప్రసాదించినాడు. అందువలననే ఇచట మూడుకాళ్లతో నిలుచున్న బృంగి విగ్రహము ఉన్నది.
కన్య రాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ మల్లికార్జున జ్యోతిర్లింగము దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది.అంతే కాక నంది, సహస్ర లింగ మరియు నటరాజ విగ్రహములు ఉన్నవి. మల్లిఖార్జునస్వామి జ్యోతిర్లింగముగా కొలువైఉన్న శ్రీశైలము క్షేత్రమునందే అష్టాదశశక్తిపీఠములలో ఒకటిగా భావించబడుచున్న బ్రమరాంబాదేవి కొలువై ఉన్నది. ఈక్షేత్రములో కృష్ణానది లోతైన సన్ననిలోయద్వారా క్రిందికి నాగార్జునసాగర్ వరకు ప్రవహించుచున్నది. శ్రీశైలము వద్ద ఈనది పాతాళగంగ పేరుతో పిలువబడుచూ మిక్కిలి మనోహరముగా ఉంటుంది. శ్రీశైలాన్ని భువిలోకైలాసంగా అభివర్ణిస్తారు. దేవాలయనిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారి దేవాదాయదర్మాదాయశాఖ పర్యవేక్షణనందు ఉన్నది.
శ్రీశైలం నంధ్యాల, మార్కాపురం, కర్నూలు రైల్వేస్టేషన్లకు సుమారు 150 నుండి 160 కి.మీ. దూరములోఉన్నది. కర్నూలు జిల్లాలోని యీ పట్టణముల నుండే కాక పలురాస్త్రములనుండి కూడా బస్సుసౌకర్యము కలదు. బసచేయుటకు దేవస్థానమువారి కాటేజీలు, రూములేకాకుండా అన్నికులములవారికి సత్రములు ఉచిత భోజనసదుపాయము, శ్రీశైలమునందు చూడవలసినప్రదేశములు త్రిప్పుటకు దేవస్థానమువారి ఉచితబస్సు సౌకర్యముకలదు. దేవస్థానమువారి కాటేజీలు, గదులు ఆన్ లైన్ ద్వారా ముందుగా బుకింగ్ చేసుకొనవచ్చును.
దర్శన సమయములు ఉదయం 3-30 నుండి రాత్రి 10 గంటల వరకు. అభిషేకం కూడా ఆన్ లైన్ బుకింగ్ ద్వారా రిజర్వు చేయించుకొనవచ్చును.
దక్షయజ్ఞమునందు ప్రాయోపవేశము చేసిన సతీదేవి శరీరము శ్రీహరి తనసుదర్శనచక్రముతో ఖండించినప్పుడు ఆశరీర భాగములు భూమిపై వివిధ ప్రదేశములలో పడినవి. సతి శరీరభాగములు పడిన ఆప్రదేశములు శక్తిపీఠములుగా భూమిపైఅవతరించి వెలుగొందు చున్నవి. ఈశక్తిపీఠములలో 18 శక్తిపీఠములు అత్యంత మహిమాన్వితముగా అష్టాదశశక్తి పీఠములుగా ప్రసిద్ధి చెందినవి.
ఆష్టాదశ శక్తిపీఠములలో 12వ శక్తి పీఠము పార్వతీదేవి రూపమైన బ్రమరాంబికాదేవి ఆలయము శ్రీశైలము నందు మల్లిఖార్జునస్వామి ఆలయ ప్రాంగణమునందు ఉన్నది. సతీదేవి శరీరభాగములలో మెడభాగము ఇచటపడినది మరియు పార్వతి బ్రాహ్మణిశక్తి రూపమునందు కొలువబడుచున్నది.
ఈ దేవతామూర్తి విగ్రహము ఎనిమిది చేతులతో పూజించబడుచున్నది. గర్భాలయమునందు అగస్త్యమహర్షి భార్యఅయిన లోపాముద్ర విగ్రహము ఉన్నది. గర్భాలయము ముందుభాగములో శ్రీయంత్రము ఉన్నది. ప్రాచుర్యములోని కధనము ప్రకారము అరుణాసురుడు అనేరాక్షసుడు బ్రహ్మప్రసన్నముకోరి తపస్సుచేసినాడు. బ్రహ్మప్రత్యక్షమై వరము కోరుకొమ్మని అడుగగా రెండు లేదా నాలుగుకాళ్ళ జీవితో మరణము లేకుండా వరముపొందినాడు. పిమ్మట మునులను, దేవతలను హింసించగా వారు దుర్గామాతకు మొరపెట్టుకొనినారు. బ్రమరాంబికారూపముదాల్చి వేలకొలది ఆరుకాళ్ళ తేనెటీగలను సృస్టించగా వాటివలన అరుణాసురుడు సంహరించబడినాడు. అప్పటినుండి దుర్గ బ్రమరాంబికా రూపముతో శ్రీశైలమునందు వెలసినది. బ్రమరాంబికాదేవికి కుంకుమపూజ ఆన్ లైను బుకింగ్ చేసుకొనవచ్చును.
ఈ ఆలయము ఉదయము 4-30 నుండి రాత్రి 10 వరకు దర్శనమునకు వివిధ సేవలకు తెరచి యుండును. ప్రతి సంవత్సరము చైత్ర మాసములో పౌర్ణమీ తరువాతి శుక్రవారము నాడు బ్రమరాంబ దేవికి బ్రహ్మోత్సవము జరిపేదరు.
శ్రీశైలమునకు 21 కి.మీ దూరములో మనోహరమైన మరియు దట్టమైన ఆటవీ వాతావరణమునందు ఇష్టకామేశ్వరి ఆలయము ఆలయము ఉన్నది. ఈ ఆలయదర్శనము చాలాకష్టమైనది. శ్రీశైలమునుండి దోర్నాలవైపురోడ్డుపై 12 కి.మీ. ప్రయాణించి ఆచటినుండి దట్టమైన అడవిమార్గములో సుమారు 10 కి.మీ. ప్రయాణించ వలెను. అడవిలో రోడ్డుమార్గము లేదు. వర్షాకాలమున కొండవాగుల ప్రవాహమువలన ప్రయాణించుట వీలుకాదు. దట్టమైనఅడవిలో ఉండుటవలన క్రూరమృగముల బెడదకూడా ఉండును. కావున ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటలలోగా దర్శించుట శ్రేయస్కరము. జీపులు మాత్రమే ప్రయాణించుటకు సులువుగాయుండును. ఈఆలయము సుమారు 8 నుండి 9 వ శతాబ్దమునకుచెందిన పురాతనమైన ఆలయము. చిరునవ్వుముఖముతో ఉండు ఇష్టకామేశ్వరీదేవిని దర్శించిన భక్తులు విపరీతముగా ఆకర్షించబడతారు. దేవి పార్వతీ దేవి అవతారముగా అభివర్ణిస్తారు.
విగ్రహముఅంతయూ రాయితో మలచబడినదైననూ అమ్మవారి నుదురుతాకిన మెత్తగా మానవశరీరమువలె స్పర్శ కలిగించును. ఈ రకమైన అనుభూతినిచ్చు ఆలయము మరియొకటిలేదు. దేవి ఇరుకైన చిన్నగదిలో ఉండుట వలన జాగ్రత్తగా శరీరము వంచి లోనికి ప్రవేశించవలేను. దర్శనమునకు పిమ్మట ఆలయ పూజారి భక్తులను అమ్మవారినుదుటన సింధూరము ఉంచుటకు అనుమతిస్తారు. ఆ స్పర్శవలన కలుగు అనుభూతి అనుభవించవలసినదే గాని వర్ణించుటకు శక్యము కాదు. దేవిని దర్శించుకొనినచో మనసులోని కోరికలుతీరును. కొన్ని అనివార్య కారణముల వలన మరియు ఇది టైగర్ రిజర్వు ఫారెస్టు మరియు పులులు తిరుగాడు చున్నవని ఆటవీశాఖ వార్కి సమాచార ముండుటవలన ముందుజాగ్రత్తచర్యగా ఆలయమునకుపొవుట తాత్కాలికముగా 2 సం నుండి నిషేధించబడినది.
శ్రీశైలము నందు మల్లిఖార్జున ఆలయమునుండి 1 కి.మీ. దూరములో ఈ పాతాళ గంగ ఉన్నది. పాతాళగంగ అనగా కృష్ణానదికి వెళ్ళుటకు సుమారు 1000 మెట్లుక్రిందకు దిగవలసి యున్నది. కొద్దిసంవత్సరముల క్రిందట పాతాళగంగ వెళ్ళుటకు వీలుగా రోప్ వేనిర్మాణము జరిగి ప్రస్తుతము అమలులోఉన్నది. రోప్ వేపై పాతాళగంగ ప్రయాణము మిక్కిలి ఆహ్లాదకరముగాయుండును. పాతాళగంగచేరి స్నానము చేయవచ్చును. మరియు బోటుపై కృష్ణానదిలో విహారము చేయవచ్చును. రోప్ వే ప్రతి రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 5-30 వరకు అనుమ తింతురు. కృష్ణానదిలో విహారము ఉదయము 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు అనుమతికలదు. రూ50 చొప్పున పెద్దలకు రూ.35/- చొప్పున పిల్లలకు రోప్ వేనకు వేరు మరియు బోటువిహారమునకు రుసుము వసూలు చేయుదురు. శ్రీశైలం పాతాళగంగవద్ద కార్తీకపౌర్ణమి సందర్భముగా కృష్ణవేణినదీమతల్లికి 12-11-2019 తేదీన అతివైభవముగా గంగాహారతి జరిగియున్నది.
విగ్రహముఅంతయూ రాయితో మలచబడినదైననూ అమ్మవారి నుదురుతాకిన మెత్తగా మానవశరీరమువలె స్పర్శ కలిగించును. ఈ రకమైన అనుభూతినిచ్చు ఆలయము మరియొకటిలేదు. దేవి ఇరుకైన చిన్నగదిలో ఉండుట వలన జాగ్రత్తగా శరీరము వంచి లోనికి ప్రవేశించవలేను. దర్శనమునకు పిమ్మట ఆలయ పూజారి భక్తులను అమ్మవారినుదుటన సింధూరము ఉంచుటకు అనుమతిస్తారు. ఆ స్పర్శవలన కలుగు అనుభూతి అనుభవించవలసినదే గాని వర్ణించుటకు శక్యము కాదు. దేవిని దర్శించుకొనినచో మనసులోని కోరికలుతీరును. కొన్ని అనివార్య కారణముల వలన మరియు ఇది టైగర్ రిజర్వు ఫారెస్టు మరియు పులులు తిరుగాడు చున్నవని ఆటవీశాఖ వార్కి సమాచార ముండుటవలన ముందుజాగ్రత్తచర్యగా ఆలయమునకుపొవుట తాత్కాలికముగా 2 సం నుండి నిషేధించబడినది.
శ్రీశైలమునందు తప్పనిసరిగా చూడవలసిన మరియొక ప్రదేశము ప్రకృతిలో ఆశ్చర్యమునకు గురిచేయు అక్కమహాదేవిగుహలు. రోప్ వేనందు పాతాలగంగచేరి ఆచటినుండి కృష్ణానదినిదాటి అక్కమహాదేవి గుహాలను చేరుకోనవచ్చును.ఈ గుహాలనుచేరిన వెంటనే ఇచ్చటి పచ్చదనము చూసి ఆనందము కలుగుతుంది 12వ శతాబ్ధమునందునివసించిన సన్యాసిని అక్క మహాదేవిగుహలు పిలువబడుతున్నది. గుహ అంతర్భాగమునకు వెళ్ళిన కొద్దిచీకటి, ఇంకనూ ముందుకుసాగిన శివుని విగ్రహము దర్శనము ఇచ్చును.
512 మీటర్ల పొడవు 145 మీటర్ల లోతు కలిగిన శ్రీశైలండామ్ యాత్రికులకు విపరీతమైనఆకర్షణ కలిగిస్తుంది. శ్రీశైలందర్శించు ప్రతియాత్రికుడు తప్పనిసరిగా ప్రకృతి అందమును ఆస్వాదించుటకు శ్రీశైలండామ్ తప్పనిసరిగా దర్శిస్తారు.1960 సంవత్సరములో కేవలము విద్యుత్ ఉత్పత్తినిమిత్తము ప్రారంభించబడి 1987 సం. నందు 12 గెట్లతో 885 అడుగుల లోతుతో సాగునీటి ప్రాజెక్టుగా రూపాంతరము చెందినది. డామ్ గేట్లుఎత్తి నీటిని వదలినప్పుడు డామ్అందము చూడవలసినదే కానీ వర్ణించసాద్యముకాదు.
ఇతర ముఖ్యప్రాంతములవలెనే శ్రీశైలమునకు 4 కి.మీ. దూరములో నున్న పాలాధార పంచాధార జలపాతములు వైధ్య పరమైన గాలిని శరీరమునకు అందమును కలిగించును. నీటిప్రావాహము లేదా జలపాతము అనునది శివుని నుండి ఉత్పన్నమైనది. పహల్ అనగా లలాటము లేదా నుదురు అని అర్ధము. ధార ఆనగా ప్రవాహము అనిఅర్ధము.శివుని నుదురునుండి పుట్టినది కావున పాలధార (పహెల్ ధార)అయినది. పంచధార అనగాశివుని అయిదు ముఖకవలికలని అర్ధము. పంచఅనగా అయిదుధారల ప్రవాహము. ఆది శంకరాచార్యులు వారు వారియాత్ర ప్రారంభములో ఇచట ధ్యానముచేసి శివానందలహరి, బ్రమరాంబ ఆష్టకం వంటి గ్రంధాలను రచించినారని చెపుతారు.
ఈఆలయం ఆత్మకూరు నుండి శ్రీశైలంవచ్చు రోడ్డుమార్గములో శ్రీశైలం పట్టణముఖ ద్వారము వద్ద కలదు. బ్రమరాంబాసమేత మల్లిఖార్జునస్వామిని దర్శించుకొను ప్రతిభక్తుడు తప్పనిసరిగా సాక్షిగణపతి దర్శనము చేసుకొనవలసియున్నది. సాక్షిగణపతి శ్రీశైలంవచ్చు భక్తుల శ్రీశైలదర్శనమునకు సాక్షిఅని తలచెదరు. గణేశుడు ఇచ్చట ప్రధాన దైవము. సాక్షిగణపతి శ్రీశైల దర్శనమునకువచ్చు భక్తుల వివరములు వ్రాసుకొని శివునికి చూపెడదని ప్రతీతి.
శ్రీశైలమునందు అతిఎత్తైన శిఖరాగ్రమున శిఖరేశ్వరఆలయమున్నది. ఇచ్చటి నుండి కృష్ణానది మరియు పరిసరములోఉన్న కొండలు మిక్కిలిఅందముగా దర్శనం ఇస్తాయి. ఈ పురాతనఆలయమునందు శివుడు శిఖరేశ్వరస్వామిపేరుతో ప్రసిద్ధుడు. శిఖర దర్శనముతో గతములోచేసిన పాపములనుండి భక్తులు విముక్తులు అవుతారని ప్రసిద్ధి. శిఖరాగ్రముననున్న నందినుండి శ్రేశైలం మల్లిఖార్జుని ఆలయశిఖరము దర్శనమైనవారికి పునర్జన్మ లేక పరమాత్మలో ఆత్మలీనంఅవుతుందని తెలుపబడినది.
శ్రీశైలమునకు 5 కి.మీ. దూరములో నల్లమల కొండలదిగువ భాగమున ఈహటకేశ్వర ఆలయము ఉన్నది. శ్రీశైలమువచ్చిన ప్రతిభక్తుడు తప్పని సరిగా శివుని మరోరూపమైన ఈపురాతనమైన హటకేశ్వరఆలయము తప్పనిసరిగా సందర్శింతురు. గూఢమైన శివలింగము ఈఆలయమునందుకలదు. ఆలయము చిన్నదైనను అందమైన వాస్తు శిల్పములతో ముఖమండపము, గర్భాలయములతో అలరారు చుండును. ఈ ఆలయము దర్శించి శివుని మరో రూపమైన హటకేశ్వరుని కొలచి దీవనలు పొందిన ఈశివలింగమునకు ఉన్న మహాత్యమువలన శరీరరుగ్మతలు అనారోగ్యములు సమసిపోవునని విశ్వాసము. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులువారు వారిరచనలలో ఒకదానిని ఈ హటకేశ్వర ఆలయమందు వ్రాసినారు అని స్థానికుల కధనము.
శివుని భక్తుడైన ఒకకుమ్మరి సాధారణ జీవితము గడుపుచూ యాత్రికులకు తనవద్దనున్న ఆహారమును ఇచ్చేడివాడు. ఒకరోజున శివుడు అతనిని పరీక్షింపతలచి యాత్రికునిరూపములో వచ్చి ఆహారముకొరకు అర్ధించినాడు. కానీ ఆకుమ్మరివద్ద ఆహారముఏమియు లేకపోవుటవలన మనస్తాపముచెంది శివుని ధ్యానించాడట. అప్పుడు శివుడు ఆతనిభక్తికి సంతోషించి ఒక కుండలో దర్శనము ఇచ్చినాడట. అందువలననే ఇది అటికేశ్వరముగా పిలువబడినదని కాల క్రమమలో అది హటకేశ్వరముగా రూపాంతరముచెందినట్లు తెలియుచున్నది. ఈఆలయము అన్ని రోజులలోనూ ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు తెరచియుండును. ఇవేకాకుండా మల్లెల తీర్ధం, కదలివనం గుహలు, చెంచులక్ష్మి మ్యూజియం తదితర ఆకర్షణీయ ప్రాంతాలు ఉన్నాయి.
శ్రీశైల దర్శనం జన్మ జన్మ పాప వినాశకరం మోక్షప్రదం
IPLTOURS – Indian Pilgrim Tours