శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం
(IPLTOURS)
రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి. ఆచరణలో రామాలయం లేని గ్రామము ఉండవచ్చేమో కానీ ప్రధమపూజ్యుడు అయిన వినాయకుడుని పూజించనిదే హిందువులు ఆచరించు పూజాకార్యక్రమం ప్రారంభంకాదు. అట్లే గణేశుని ఆలయాలు దేశంలో అనేకంఉన్నా వినాయకుడురూపం ఒకేవిధంగా ఊహాలోకివస్తుంది. విశ్వంలోఉన్నఆలయాలలోని మూర్తులకు భిన్నంగా ఉత్తరాఖండ్ రాష్ట్రములో కేదార్నాధ్ జ్యోతిర్లింగ సమీపములో గౌరీకుండ్ వద్ద ముండ్కతియా అనుచోట తలలేకుండా కేవలం మొండేముతో జనబాహుల్యానికి దూరంగాఉన్న గణేశుని ప్రతిమకల ప్రాచుర్యానికి నోచుకోని ఆలయముఉన్నది. కైలాసశిఖరం మహాశివుడు మరియు పార్వతీదేవి నివాసమని మానససరోవరమునందు ప్రతిరోజూ దేవతలు ప్రాతః కాలమునే స్నానమాచరించి మహాశివుని కొలిచెదరను విషయం నిర్వివాదాంశము.
మహాశివుడు గౌరీదేవిరూపంలోని పార్వతీదేవిని త్రయగినారాయణ ఆలయమునందు మహావిష్ణువు తదితర దేవతల సమక్షంలో వివాహము చేసుకొనినట్లు పురాణములు తెలుపుతున్నాయీ. దీనినిబట్టి గౌరీకుండ్ వద్ద గౌరీదేవిని కలియుటకువచ్చిన శివుడు ఆటంకపరచిన పార్వతీదేవిపుత్రుని శిరము ఖండించినట్లు కధనం. కావున గౌరీకుండ్ వద్దనున్న ముండ్కతియా ఆలయమునందు తలలేని గణేశుని విగ్రహమునకు ఎంతోప్రాముఖ్యం ఉన్నదని తెలియచేసి ఉండదమైనది మరియు చార్ ధామ్ యాత్రనందు కేదార్ నాధ్ దర్శించుయాత్రికులు గౌరీకుండ్ వద్ద ముండ్కతియానందు గణేశునిఆలయము దర్శించవలెనని తెలియచేయుట జరిగింది. మహాశివుడు మరియు పార్వతీదేవి రెండవ కుమారుడై 108 పేర్లతో పూజించబడు గణేశుడు భార్యలు సిద్ధి మరియు బుద్ధి,కుమార్తె సంతోషీదేవి, కుమారులు. శుభ మరియు లాభ.లతో కష్టములు తొలగించి సంతోషకరమైన జీవితము ప్రసాదించువాడు.
గౌరీకుండ్ సరస్సునందు స్నానము చేయుటకు పార్వతి తనశరీరముపైనున్న నలుగుపిండితో బొమ్మ తయారుచేసి ఆబొమ్మకు ప్రాణముపోసి రక్షకునిగా నియమించినది. మహాశివుడు పార్వతిని కలియుటకువచ్చి ఆబాలునిచే నిరోధించబడి. ఆగ్రహముచెంది త్రిశూలముతో గణేశునితలను నరకివేయుటవలన వలనపార్వతి దుఃఖితు రాలైనది. ఆమెగణేశుని పునర్జీవితుని చేయకోరగా శివుడుగతంలో గజాసురుని వధించినప్పుడు ఆతనిశిరస్సు లోకపూజ్యమగునని వరము ఇచ్చియుండుట వలన గజాసురుని శిరస్సు గణేశుని మొండేమునకు జతచేసి పునర్జీవితుని చేసినాడు. పార్వతి తనకుమారుని తిరిగిపొందుటతోపాటు హిందువులు అందరకు గణేశుని జననవృత్తాంతము ఈవిధముగానే తెలియును.పునర్జీవితుడు కాకముండు వినాయకుని పూర్వ స్వరూపము ఎక్కడనూ వివరముగా తెలియచేయుట జరుగలేదు. అటుపిమ్మట బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు గజాననుడైన పార్వతీ నందనునికి వరములు ఇచ్చుటవల్ల మరియు శివుడు గణములకు అధిపతిని చేయుటద్వారా ప్రధమపూజ్యుదాని ప్రకటింపబడి విఘ్నములను తొలగించువాడు కావున విఘ్నేశ్వరుడు అయినాడు.
విజ్ఞానానికిఅధిపతియై అగ్రపూజలందుకున్న గణేశుడిని దేవతలందరూ ఆరాదిస్తారు. భారతదేశం అంతటా వివిధప్రాంతాల్లో విభిన్న ఆకృతులతో గణేష్ చతుర్థిని అత్యంతభక్తితో జరుపుకుంటారు. వక్రతుండ మహాకాయ, కోటిసూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వకార్యేషు సర్వదా అనిధ్యానిస్తే ఆటంకాలు తొలగించి విజయంప్రసాదిస్తాడు అనినమ్మకం.గణేశ్ మహరాజ్ అని ఉత్తరభారతంలో, వినాయగర్, గణపతిపేర్లతో దక్షణాధిలో, గణనాయక, గణాధ్యక్ష, విగ్నరాజ మొదలైన ఏకాదశ నామములలో తెలుగురాష్ట్రములందు స్థానికముగా వినాయకుడనిపిలువబడు స్వామికి స్వయంభూదేవాలయములతో పాటుగా వివిధఆకార పరిమాణములు మరియు వివిధమహత్తులతో భారతధేశమంతటా స్థాపించబడిన వినాయక దేవాలయములలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరిజిల్లాలో ప్రధానకేంద్రము కాదినాడ నుండి 33 కి.మీ. రాజమహేంద్రవరమునుండి 40 కి.మీ.దూరంలో బిక్కవోలు గ్రామంలోలోఉన్న శ్రీలక్ష్మి గణపతి దేవాలయం విశిష్టమైనది.
బిక్కవోలునందలి శ్రీ లక్ష్మీగణపతి ఎంతోప్రాముఖ్యతను కలిగినవాడు. వినాయకునిచెవిలో కోరికలుకోరి ముడుపుకడితే కోరిన కోరికలు తీరుస్తాడుఅని స్వామినిపూజిస్తే సకలపాపాలు తొలగుతాయని ప్రసిద్ధి. స్థానికకధనం ప్రకారము మరియు లభ్యమగు శాసనాలప్రకారం పద్నాలుగువందల సంవత్సరములకు పూర్వము ఈప్రాంతమును పాలించిన చాళుక్యులచే ఈఆలయం నిర్మింపబడినట్లు సమాచారం. వారువారి పాలనయందు జరిపిన యుద్ధములలో యుద్ధమునకుముందు యుద్ధముతరువాత ఈస్వయంభూః విఘ్నేశ్వరుని అర్చించేదివారని ప్రసిద్ధి. ఈపురాతనఆలయం వ్యవసాయభూములందు కప్పబడిఉండేదని, సుమారు వంద సంవత్సరములకు పూర్వము వినాయకుడు ఒకభక్తునికి కలలోకనిపించి భూమినందు తనఉనికిని తెలిపినట్లు ఆభక్తుడు గ్రామస్తులకుచెప్పి ఆచోట త్రవ్వించగా ఆలయం బయటపదిండని అప్పటినుండి ఈఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ ప్రచారంలో ఉన్నకధనం.
సుమారు పద్నాలుగువందల సంవత్సరములకు పూర్వము చాళుక్యుల కాలములో నిర్మితమైన ఈఆలయం మహమ్మదీయ పాలనలో భూస్థాపితం అయిపోయింది. సుమారు వందసంవత్సరములకు పూర్వము బహిర్గతమై విగ్రహంపెరుగుతూ ఉండడం. ఆలయములో గమనించతగిన అత్యుత్తమ అద్భుతం. ఇక్కడవినాయకుడు ప్రతిసంవత్సరం సుమారు అంగుళం లేదా రెండుసెంటీ మీటర్లు పెరుగుతూ ఉంటాడని మరియు స్వామివిగ్రహం చిన్నకొబ్బరి కాయ ప్రమాణమునుండి మరియు ప్రస్తుతం కొన్నిఅడుగుల ఎత్తుకుపెరిగి ప్రస్తుతం 90 అం ఎత్తు మరియు 50 అం వెడల్పు కలిగియున్నది అనికధనం. స్వామి ఎడమకాలు దిగువభాగంనుండి నీరు నిరంతరంగా వెలువడుతూ ఉంటుంది. విగ్రహం 8 అడుగుల ఎత్తుతో పెద్దది మరియు విగ్రహానికి ఆధారం లేదా మొదలు భూగర్భంలో ఎంత లోతువరకు ఉన్నదో ఎవరికీ తెలియదు. విగ్రహంయొక్క ప్రత్యేకత తొండం దక్షిణం వైపు అనగా కుడివైపు తిరిగిఉండడం. విగ్రహం అందంగా కళతో కనిపిస్తూ చాళుక్య రాజవంశాన్ని తలపుకు తెస్తుంది. ఇచ్చట మాత్రమే ఈస్వయంభూః స్వామితొందము కుడివైపు తిరిగిఉంటుంది.
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్దచవితినాడు గణపతిహోమం మరియు లక్షపత్రిపూజ నిర్వహించేదరు. ఈ ఏకశిలా విగ్రహాన్ని విజయానంద గణపతి అని పిలుస్తారు. ప్రాంగణంలోకి అడుగిడగానే దివ్యానుభూతి కలుగుతుంది ప్రాంగణంలో రాజరాజేశ్వరీదేవి, చంద్రశేఖర, గొలింగేశ్వర, పార్వతి, సుబ్రమణ్య స్వామి, నంది విగ్రహములతోపాటుగా నవగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రతీసంవత్సరం గణపతి నవరాత్రులతోపాటు సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఆలయంలో గణపతిహోమం జరిపించినవారికి గణపతి అండగాఉంటాడని భావిస్తారు. ఇక్కడ వినాయకచవితి, మార్గశిర షష్ఠినాడు ఉత్సవాలు చేస్తారు. ప్రతి శుద్ధచవితినాడు అభిషేకములు, చండిహోమం జరిపేదరు.
దేశములోని ఏప్రాంతమునందునుండి అయిననూ రాజమహేంద్రవరం రైలుపైకానీ విమానముద్వారాకానీ ప్రయాయించి బసచేసి 40 కి.మీ దూరములోని ఆలయము రోడ్డు ద్వారా చేరవచ్చును.