ఛత్రవట నృసింహా

(IPLTOURS)

ఛత్రవవట నృసింహక్షేత్రము అహోబిలమునందున్న నవనృసింహాక్షేత్రములలో ఒకటి. చత్రవటనృసింహక్షేత్రము ప్రణవ నృసింహక్షేత్రమునకు వెళ్ళు మార్గములో యోగానందనృసింహక్షేత్రముకు అరకిలోమీటరు మరియు దిగువఅహోబిలం నుండి మూడు కిలోమీటర్ల దూరములోనున్నది. ఇచ్చటినుండి ప్రణవనృసింహక్షేత్రం సుమారు పది కిలోమీటర్ల దూరములోఉన్నది. నవనృసింహులలో ఛత్రవవటనృసింహుడు మనోహరముగా దర్శనము ఇచ్చును. ఈక్షేత్రమును దేవతల ఆరాధనక్షేత్రముగా కూడాపిలుస్తారు. హిరణ్యకశిపునివధ అనంతరము ఉగ్రరూపముతోఉన్న నృసింహస్వామిని శాంతపరచుటకు .హాహా. హూహూ అను ఇరువురుగంధర్వులు మేరు పర్వతమునుండి ఇచ్చటికివచ్చి నృసింహుని తమసంగీతముతో వినోదపరచినారు. అందువలననే స్వామి చిరునవ్వుతో ఎడమచేతితో తాళమువేయుచున్నట్లు దర్శనము ఇస్తాడు. ఇట్లు తాళమువేయుచున్న ముద్ర మరెచ్చటనూ కావరాదు. స్వామి వీరుఇరువురకు ఖ్యాతిలభించునట్లు వరము అనుగ్రహించినాడు.హాహా. హూహూ అను ఈయిరువురు గంధర్వుల ప్రతిమలు ఈఆలయమందు కలవు. 

Sri Chatravata Narasimha Swamy Temple View

చుట్టూ ముల్లుచెట్లతో రావిచెట్టుక్రింద ఈఛత్రవవటనృసింహ ఆలయము ఉన్నది. ఛత్రముఆనగా గొడుగు వటఅనగా చెట్టు ఈస్వామి రావిచెట్టుక్రింద కొలువుతీరి ఉండుటవలన ఈనృసింహుని ఛత్రవవటనృసింహుడు అనిప్రసిద్ధి ఇంద్రుడు తదితర దేవతలు హిరణ్యకశిపుని సంహరించమని నృసింహస్వామిని ఇచ్చట ప్రార్ధించినారు. ముఖమునందు మందస్మితమైన చిరునవ్వుతో చత్రవటనృసింహుడు మనోహరంగా దర్శనము ఇస్తాడు. సంగీతజ్ణానముకల భక్తులు స్వామి ఎదురుగా తమవిధ్యప్రదర్శించి చత్రవటనృసింహుని ఆశీస్సులు కోరతారు. స్వామిఆశీస్సులతో తాము కళాకారులుగా ఉన్నతస్థాయి చేరేదమని భక్తుల నమ్మకం.

కేతువు తన పాపములను తొలగించమని ఛత్రవటనృసింహుని ప్రార్ధించినాడు. ఛత్రవట నృసింహుడు కేతుగ్రహమునకు  అధిపతి. ఛత్రవవటనృసింహుని దర్శించి అర్చించినవారికి కేతుగ్రహ దోషములు నివారణఅగుణని చెప్పబడినది. 

IPLTOURS Indian Pilgrim Tours