అనంత పద్మనాభస్వామి ఆలయం

(IPLTOURS)

విష్ణుమూర్తి స్వయంభూః క్షేత్రములుగా చెప్పబడుచున్న ఎనిమిది పవిత్రప్రదేశములలో కేసరగాడ్ జిల్లానందు కుంభ  పట్టణమునకు ఆరుకిలోమీటర్ల దూరములోనున్న అనంతపుర గ్రామమునందుకల అనంతలేక్ టెంపల్ లేదా అనంత పద్మనాభస్వామి ఆలయము ఒకటి. అనంతపూర్ అనంతపద్మనాభస్వామి నివాసము. కేరళనందు సరస్సులోకల ఆలయము ఇదిఓక్కటే. ఈఆలయము తిరువనంతపురమునందుకల అనంతపద్మనాభస్వామివారి మూలస్థానమని ఈఆలయమునందుఉన్న గృహనుండి అనంతపద్మనాభస్వామి పయనించినట్లు గ్రంధములుచెపుతున్నవి. సుమారు రెండుఎకరముల విస్తీర్ణముకల సరస్సునందు ఆలయమునిర్మించబడినది. ఆలయమునందు సేవలుచేయు ప్రస్తుత పూజారులు హవ్యక బ్రాహ్మణులు కానీ తంత్రి శివల్లి బ్రాహ్మణులు

Sree Padmanabhaswamy Temple-kerala-india

సరస్సు ఊటనీరువలన నిండుగా ఉంటుంది. సరస్సుచుట్టూ ఉన్నశిధిలములు గమనించిన ఆలయము పెద్దఆలయప్రాంగణము అనితెలుపుతాయి. గర్భగుడి, నమస్కారమండపం, జలాదుర్గఆలయం, గర్భగుడికివెళ్ళుటకు నడకవంతెన మరియు గుహముఖద్వారము ఉన్నవి. గర్భగుడిలో నున్నప్రధానదైవము విష్ణుమూర్తి మరియు ఇతరవిగ్రహములు రాతితోకానీ లోహముతోకానీ తయారుకాబడినవి కావు. ఆవిగ్రహములు ముందుగా ‘కాడు శర్కర యోగం’ అని పిలువబడే వివిధ ఔషధపదార్ధముల మిశ్రమములతో తయారుకాబడినవి. దర్మిలా కంచికామకోటి పీఠాధిపతి శ్రే జయేంద్రసరస్వతివారిచే పంచలోహవిగ్రహములు బహూకరించబడినవి. విష్ణుమూర్తివిగ్రహము అయిదుతలల అనంతుడుఅను నాగరాజుపై కూర్చొనినభంగిమలో దర్శనంఇస్తాడు. ఆలయపైకప్పునందు చెక్కతోచేయబడిన విష్ణువు దశావతారముల కధలతో రూపొందించిన శిల్పములుఉన్నవి. ముఖః మండపమునందు నవగ్రహములచిత్రములు చిత్రీకరించబడినవి. అనంత పద్మనాభపేరుపై గ్రామము అనంతపురఅని పిలువబడుచున్నది. కులమత ప్రశక్తిలేకుండా ఆలయమునందు అందరికీ ప్రవేశముకలదు. ఆలయగోపురమునకుగల అంతస్తుల ద్వారమునుండి సూర్యాస్తమయము మిక్కిలి సుందరముగాను మనోహరముగాను కనపడుతుంది.

పౌరాణికకధప్రకారం మూడువేల సంవత్సరములకు పూర్వము బిల్వమంగళ మహర్షి శ్రీమహావిష్ణువుగూర్చి తపస్సు చేయగా ఆయనతపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు చిన్నబాలునిరూపంలో దర్శనమిచ్చాడు, ఆపసిబాలుడు శ్రీహరిఅని గుర్తించలేక మహర్షి ఆబాలుని పలకరించాడు. బాలునిమాటలు, అందానికి, ఆకర్షణకి ముగ్ధుడై బాలుని తల్లితండ్రుల గురించిఅడుగగా, తనకు తల్లితండ్రులులేరని చెప్పగా తనతోఉండమని మహర్షిఅడిగారు. ఆబాలుడు తనపై ఎన్నడు ఆగ్రహించకూడదుఅని ఆగ్రహించితే తానునిలువనని తెలిపాడు. నియమానికిఅంగీకరించి మహర్షి బాలుడ్ని తన ఆశ్రమంలో అల్లారుముద్దుగా చూసుకునేవాడు. బాలుని రూపంలోఉన్న శ్రీహరి మహర్షికి ఆగ్రహంకలిగించాలని పలురకాలు ప్రయత్నం చేసేడివాడు. మహర్షి ఎంతోసహనం మరియుఓర్పుతో భరించెడివాడుకాని ఎన్నడూబాలునిపై కోపగించలేదు. మహర్షి దగ్గర శ్రీ మహా విష్ణుస్వరూపమైన సాలగ్రామములు ఉండేడివి. ప్రతిరోజు వాటికి అభిషేకం, పూజ, నైవేద్యంపెట్టి ఆరాధించెడివాడు. ఒకనాడుమహర్షి సాలగ్రామానికి అర్చన చేయుచుండగా బాలుడు ఆసాలిగ్రామాన్ని నోటిలోపెట్టుకున్నాడు. మహర్షి కోపంతో బాలుడ్నితిట్టాడు. బాలుడు వెంటనే నువ్వుతిట్టిన కారణంచేత నియమాన్ని అతిక్రమించావు కనుక నేనువెళ్ళిపోతున్నానని అడవిలోకి వెళ్ళిపోయాడు. మహర్షి ఆబాలుడ్ని వదిలిఉండలేక వెనుకనే పరుగులెడుతూ బాలుడ్నిఅనుసరించాడు. బాలుడు ఒకగుహదగ్గర అదృశ్యమయ్యాడు. 

గుహలోనికివెళ్ళి చూసేసరికి అక్కడ ఒకమార్గంకనిపించింది. ఆమార్గంద్వారా వెళ్ళగా ఒకపెద్ద అశ్వర్ధవృక్షంకింద బాలుడు మరలకనిపించి అదృశ్యుడయ్యాడు. మహర్షి తపించి లపిస్తుండగా అశ్వర్ధవృక్షం ఆకాశంబ్రద్దలయ్యేలా పెళపెళధ్వనులతో విరుగుతూ అనంతశయనంపై చతుర్భుజాలతో శ్రీమహాలక్ష్మితో దర్శనం ఇచ్చారు శ్రీహరి. ఆశ్రేహరే మనందర్శిస్తున్న తిరువనంతపురం అనంతపద్మనాభస్వామివారు. దివాకరబిల్వమంగళమహర్షి ఆశ్రమంప్రాంతంలోనే ఈఆలయంఉంది, అదే మూలస్థానం. ఈ గుహ నుండి తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభస్వామి వారి ఆలయానికి దారి ఉంది అని ఆగుహలోనే బబియా అనబడే మొసలినివాసం అనికధనము. ఈ బబియాను శ్రీ పద్మనాభస్వామివారిగా రక్షకునిగా భావిస్తారు. బబియా కేవలంస్వామివారి ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించుచూ భగవంతునిపై నమ్మకాన్ని పెంపొందిస్తోంది. ఎవరికీ హానిచేదని మొసలి అర్చకస్వాములు ఆలయము కొలనునందుదిగి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం నోటికి అందించు స్వామిప్రసాదంతప్ప ఇంకేమితినదు. ” బబియా ” స్వామివారినైవేద్యం స్వీకరించడం ఎవరికీహాని చేయకపోవడం నమ్మలేనివిషయం. మొసలిగురించితెలిసి ఒకబ్రిటిషుఅధికారి దానిని తుపాకితోకాల్చిచంపినాడని ఆతనిని పాము కాటువేయగా మరణించినాడని, ఆలయఅర్చకులు మరుసటిరోజు ప్రసాదం తయారుచేసి కొలనులోదిగి పిలచిన వెంటనే ” బబియా ” వచ్చి స్వీకరించినదిఅని స్థానికకధనము ఆలయసరస్సులో ఒకేఒకమొసలి కనిపిస్తుందని, ఒకవేళ  బబియా మరణించితే సరస్సులోకి మరో కొత్తమొసలివచ్చి, ఆలయ రక్షణబాధ్యతలు స్వీకరిస్తుందని నమ్మకం.   

అనంతపురఆలయము దర్శించునప్పుడు సరస్సునకు కుడివైపుమూలగా ఒకగృహ చూడవచ్చును. స్థానికకధనము ప్రకారము అనంత పద్మనాభుడు తిరువనంతపురము వెళ్ళుటకు ఈగృహమార్గమునే ప్రయాణించినాడు. అందువలననే రెండుఆలయములందలి ప్రధానదేవత ఆదేపేరుతో పిలువబడుచున్నాడు. రెండు క్షేత్రములు కేరళ రాష్ట్రమునము ఉత్తర మరియు దక్షణదిక్కులలో రెండువైపులా ఆనగా అనంతపుర ఉత్తరమున తిరువనంతపురము దక్షణమున ఉన్నవి.  

తదుపరి తిరువనంతపురమునందు కల అనంత పద్మనాభస్వామి ఆలయము గురించి తెలుపవలెనన్నకేరళ రాష్ట్రరాజధాని మరియు భారతదేశ పశ్చిమమునకల అరేబియాసముద్రపుఒడ్డునఉన్న తిరువనంతపురంనందుకల అనంతపద్మనాభస్వామి ఆలయం ప్రసిద్ధచెందినది మరియు పురాతనమైనది. ఆలయగోపురం సుమారు ఏడువందలసంవత్సరములకు పూర్వము పద్మనాభతీర్ధం అనుచెరువు ప్రక్కన నిర్మించబడినది. ఆలయగోపురంఎత్తు వందఅడుగులు. దేవశిల్పి విశ్వకర్మచే పూర్తిగా మూడువందలఅరవైఅయిదు రాతిస్తంభములతో నిర్మితమైన ఆలయమండపం పురావస్తురీత్యా ఒకప్రత్యేకతకలిగిఉన్నది. ప్రధానముఖద్వారము తూర్పువైపునఉన్నది. గోపురముక్రిందగల ముఖద్వారమువద్దకల నాటకశాలనందు సంవత్సరంలో రెండుమార్లు కేరళనందుఆచరించు మీనం మరియు తులం మలయాళ మాసములందు పదిరోజులచొప్పున నిర్వహించు ఉత్సవములో కధాకలినృత్యము నిర్వహించెదరు. బ్రహ్మపురాణం, మత్సపురాణం, వరాహపురాణం, స్కందపురాణం, పద్మపురాణం. వాయుపురాణములందు, భాగవతము, మహాభారతము మొదలగు ఇతిహాసములయందు ఈపవిత్ర అలయము గురించి ప్రస్తావనయున్నది. 

బంగారుదేవాలయముగా కొందరుచరిత్రకారులు పిలిచెడి ఈఆలయము సుమారు 2500 సం.ల పూర్వముదని అనేక విధములైన సంపదకలిగియున్నదని తెలుయుచున్నది. తొమ్మిదవ శతాబ్దమునకు చెందిన తమిళకవి నమ్మాళ్వార్  ఈపట్టణము మేలిమిబంగారుగోడలు కలిగియున్నట్లు ఆలయము మరియు మొత్తంపట్టణము బంగారు మయమని ఆలయం స్వర్గమనిపేర్కొనినాడు. పరశురాముడు ద్వాపరయుగమునందు శ్రీపద్మనాభస్వామిమూర్తిని సృస్టించెనని ఆలయనిర్వహణకుగాను ఏడు కుటుంభములను నియమించినాడని, కంచిరాజైన ఆదిత్య వర్మకు ఆలయసంరక్షణ మరియు పరిపాలన ఆప్పగించినాడని ఆలయతంత్రము (యంత్రము) నంబూద్రిపాధ్ నకు వప్పగించినట్లు బ్రహ్మాండ పురాణభాగమైన కేరళమహాత్యమునందు పేర్కొనబడినట్లునమ్మకము.

గర్భాలయములో నేపాల్ నందు పశుపతినాధ్ దేవాలయములో బుద్ధునికాంత ఆలయమునందు పూజలందుకొను విష్ణుమూర్తి విగ్రహమువలెనే పద్మనాభుడు గండకీనదిలో లభించు విష్ణుస్వరూపములుగా భావించు పన్నెండువేల ఎనిమిది సాలిగ్రామములతో రూపొందించబడినది. అనంతపద్మనాభుని విగ్రహము అయిదుతలల ఆదిశేషునిఒడిలో పవళించియున్నట్లు స్వామికుడిచేయి శివలింగముపైవేసినట్లు ఒకప్రక్క భార్యలు లక్ష్మిదేవి(శ్రీదేవి), భూదేవి మరియు స్వామినాభినుండి కమలమునందు బ్రహ్మకలిగియుండును. స్వామిమూర్తి అన్నివేళలా శుభ్రముగా యుండును. ప్రత్యేకపదార్ధములతో మరియు పూలతో స్వామిని అర్చింతురు. స్వామినిదర్శించుటకు సేవనిర్వర్తింపజేయగోరువారు మండపముచేరుకొని మూడుద్వారములద్వారా స్వామిని దర్శించు కొనవలసి ఉంటుంది. మొదటిద్వారముద్వారా స్వామిముఖము శివలింగముపై చేయివేసిన భాగము, శ్రీదేవి, భూదేవి, భృగుమహర్షి, నాభినుండి కమలములోబ్రహ్మ మరియు బంగారు మరియు వెండి ఉత్శవమూర్తులు రెండవద్వారముద్వారా, పాదములతోపాటు చామరమువీచు ఇద్దరుదేవతలు, గరుడుడు, నారదుడు, తుంబురుడు, విష్ణుమూర్తి యొక్క ఆయుధములు, సూర్యుడు, చంద్రుడు మరియు సప్తఋషులను మూడవద్వారముద్వారా దర్శింధవచ్చును. వైకుంఠమునకు ద్వారపాలకులైన మధుకైటభులనుకూడా గర్షాలయమునందు చూడవచ్చును. తిరువంకూర్ మహారాజు ఒక్కరు మాత్రమే సాస్టాంగనమస్కారం చేయవచ్చును. ఆలయప్రవేశము చేసినవారు వారుపొందియున్నవన్నియు స్వామికి అర్పించినట్లే. రాజు అట్లుచేసినందు వలననే ఆయనకు సాస్టాంగనమస్కారము చేయుటకు అనుమతిఉన్నదిఅని తెలిపెదరు. ఆలయములోముఖ్యమైన ఉగ్రనరసింహ మరియు కృష్ణుని విగ్రహములు ఉన్నవి. కృష్ణ (విష్ణు) వంశక్షత్రియులు 72 కుటుంభములవారిచే కృష్ణుని (పార్ధ సారధి) గ్రానైట్ విగ్రహము గుజరాత్ నుండితేబడినది. ఏకాదశిరోజు స్వామికి మోహినిఅలంకరణ చేసేదరు. సీత, రాముడు, లక్ష్మణ మరియు హనుమ, వ్యాసమహర్షి, గణపతి, పెద్దగరుడ విగ్రహములు కలవు.  

అనంతపద్మనాభస్వామివారిమూర్తి పూర్తిగానీటిలోమునిగిన ప్రళయంసంభవిస్తుందని ఆలయశాసనములో ఉన్నది 2020 సం.లో కురిసిన భారీవర్షములకు అనంత పద్మనాభస్వామికొలువైఉన్న తిరువనంతపురంలో వరదలువచ్చినవి. స్వామివారిమూర్తి ఎంతవరకూ వరదలో మునిగిందోఅని ప్రజలు భయాందోళలనుపొందారు. స్వామివారిఆలయంముందు పద్మతీర్ధంనుండి ఆలయందగ్గరకువెళ్ళుమార్గం వర్షపునీటిలో మునిగిపోయింది. అందువలన మూడురోజులపాటు స్వామివారి ఆలయంతెరుచుట మరియు నిత్యపూజలుజరుపుట సాధ్యముకాలేదు. పురాణకధనంప్రకారం అనంతపద్మనాభస్వామివారిని ప్రతిరోజూ దేవతలుపుజిస్తారని అర్చకస్వాములు ఆలయాన్ని తెరువకముందే దేవతలు స్వామివారిని సేవిస్తారని నానుడి. మూడురోజుల తరువాత అర్చకస్వాములు ఆలయతలుపులు తీసిచూసి నిశ్చేష్టులయ్యారు. గర్భాలయంలోనికి నీరుప్రవేశించలేదని, ఎక్కడా తేమకూడాలేదని, అప్పుడేకడిగి శుభ్రపరచినట్లు సుగంధ పరిమళాలతో సువాసనలతో, అఖండలంగా ప్రజ్వరిల్లుతున్నదీపంతోనూ ఆలయందర్శనమిచ్చింది అనితెలుస్తూంది. అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగాఉన్నాయి. బయట ధ్వజస్థంభంకూడా పరిశుభ్రంగా తేమలేకుండాఉన్నది. స్వామివారి ఆలయం చుట్టూఉండే ఉపఆలయాలలోకూడా వరదనీరు ప్రవేశించలేదు. ఇది అద్భుతంకాక మరిఏమిటి.

అనంతపద్మనాభుని సంపద అనంతము. ఆరు నేలమాలిగలందు అయిదు నేలమాలిగలను సుప్రీం కోర్టు ఆదేశముల మేరకు తెరచి చూసినారు. అందు వందలకొద్దివజ్రములు ఇతర విలువకలిగిన నవరత్నములు పొదగబడిన మూడున్నర అడుగుల ఎత్తైన పూర్తిబంగారు మహావిష్ణువిగ్రహము, 18 అడుగుల పొడవైన బంగారుగొలుసు, 500 కేజీల బంగారురేకు, బంగారు ఆభరణములు లక్షలకొద్దీ బంగారు రోమన్ నాణెములు మొత్తముగా 12 లక్షలకోట్ల మార్కెట్టు విలువకలిగిన ఆస్తులు కనుగొన్నారు. ఇంకనూ నేటికీ ఒక నేల మాళిగ తెరువ వలసి ఉన్నది. స్వామి దర్శనము ఉదయం 3-30 నుండి 4-45 వరకు నిర్మాల్య ధర్శనం, 6-30 నుండి 7-00 వరకు, 8-30 నుండి 10-00 వరకు, 10-30 నుండి 11-00 వరకు, 11-45 నుండి 12-00 వరకు సాయంత్రం 5-00 నుండి 6-15 వరకు 6-45 నుండి 7-20 వరకు. దర్శించుకొనువారు విధిగా సాంప్రదాయ వస్త్ర ధారణ చేయవలెను. మగవారు పంచె పైవస్త్రము ఆడువారు చీర రవికె ధరించవలేను. మగవార్కి వక్షముపై పైవస్త్రముతప్ప బనియన్ వగైరాఇతరఆచ్ఛాధనలు నిషిద్దము. ఎవరునూ ఇతరవస్త్రధారణతో ఎట్టిపరిస్థితులలోనూ అనుమతించబడరు. అనంతపురనందలి లేక్ ఆలయము సందర్శించుటకు కాసరగాడ్ రైల్వేస్టేషనును నుండి 12 కి.మీ ప్రయాణించి చేరవచ్చును లేదా తిరువనంతపురం నుండి రైలులో వెళ్లవచ్చును. తిరువనంతపురమునుండి మంగుళూరు విమానాశ్రయమునకు విమానములో ప్రయాణింధి ఆచతికి 60 కిమీ దూరములో నున్న అనంతపుర ఆలయము చేరవచ్చును.