పితృకర్మలకు సోనాపురలో (వారణాసి) ఆచార సౌకర్యాలు

(IPLTOURS)

శ్రాద్ధకర్మ కాశీతో పాటుగా చేయవలసిన క్షేత్రములు గయ మరియు ప్రయాగరాజ్. శాస్త్రాల్లో చెప్పినా పెద్దలు చెప్పినా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అన్నమాటలు అక్షర సత్యాలు. కనిపించని దైవం కంటికి కనిపించే ఈరూపాల్లో ఉంటాడు అన్నది సుస్పష్టం. శ్రాద్ధకర్మ స్వగృహములో చేసుకొనవచ్చును. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిండ ప్రధానం చేయడం ద్వారా వారికి నివాళు లర్పించడం తద్వారా తమకు మంచిభవిష్యత్తు ఉండేలా చూసుకోవడం సంతానం బాధ్యత. తల్లితండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తి పొందుటకు పితృముక్తి క్షేత్రాలుగా పరిగణించు పంచ (ఐదు) గయ క్షేత్రాలైన శిరో గయ (బీహార్), నాభి గయ (ఒరిస్సా), పాద గయ (ఆంధ్రప్రదేశ్), మాతృ గయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మ కపాల్ (బద్రీనాథ్)లలో పిండ ప్రధానం చేయవలసి ఉంటుంది. పంచ గయాక్షేత్రములలో శారీరక ఆర్థిక దృఢత్వంలేక పిండ ప్రదానం చేయలేని వారు వారణాశి లేదా కాశీ, గయ మరియు ప్రయాగరాజ్ క్షేత్రములలో చేసేదమని అభిలాష ఉన్నవారి సౌలభ్యం నిమిత్తం ఈక్షేత్రములందు శ్రాద్ధకర్మలు చేయుటకు అనువైన ఆశ్రమములు మరియు సత్రముల వివరములతో పాటుగా పురోహితుల లభ్యత వివరములు తెలియచేస్తున్నాం. వారణాసి (కాశీ)లోని అన్ని ఆశ్రమాలు మరియు సత్రాలు దక్షిణ భారత శాఖాహార వసతితో మాత్రమే సౌకర్యాలు కల్పిస్తున్నాయని మేము తెలియజేస్తున్నాము.

pitru paksha at varanasi
    1. శ్రీగాయత్రి సనాతన నిత్యాన్న దాన సత్రం సోనాపుర: శ్రీ గాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రం సోనాపురనందు చింతామణి గణేశ ఆలయ సమీపంలో ఉన్నది. భోజనవసతి, బససౌకర్యం ఉన్నది. సత్రమునందు బ్రాహ్మణులకు అధికప్రాధాన్యత ఇచ్చేదరు. సత్రంలో బసచేసిన వారితోబాటు ఇతర బ్రాహ్మణ కుటుంభములకు ఆన్నదాన సౌకర్యం ఉంది. వీరు మహాలయ పక్ధములందు పిండప్రధానమునకు పౌరోహితులను ఏర్పాటుచేసేదరు. గయ మరియు ప్రయాగ లందు పిండప్రధానం జరుపుటకు వాహనములు, పురోహితుల ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేసేదరు. సత్రం వాహనముల రాకపోకలకు అనువుగా సోనాపుర చింతామణి గణపతి రోడ్డునందు ఆలయసమీపంలో నున్నది. శ్రాద్ధకర్మ, పిండప్రధానం చేయుటకు కర్త (కర్మ చేయవలసినవారు) లభ్యంకానప్పుడు బ్రాహ్మణుని నియోగించి వారి ద్వారా శ్రాద్ధకర్మ మరియు పిండ ప్రధానం చేయించు ఏర్పాటు చేసేదరు. అంతే కాకుండా విదేశములలో నుండి పితృకర్మలు చేయడం లేదా చేయించు కొనుటపట్ల ఆశక్తి ఉన్న లేదా పితృకర్మ చేయుటకు ఆశక్తిఉన్ననూ శారీరక ధృఢత్వంలేక చేయలేనివారికి బ్రాహ్మణుని నియోగించి ఆబ్దీక, సంవత్సరీకాది కార్యక్రమములు నిర్వహణ Live telecast చేయు సదుపాయంఉన్నది. బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు బస మరియు భోజన సౌకర్యములు ఏర్పాటుకు ఒకే భవంతి ఆగుటవలన సాధ్యంకాదు. అయిననూ వీలును బట్టి ముందుగా తెలిపిన వారికి లేదు అనకుండా ఇతరులకు కూడా అన్నదానం చేసేదరు. శ్రీగాయత్రీ సనాతన నిత్యాన్నదాన సత్రం ఇటీవలే చింతామణి గణపతి దేవాలయంలోని భవనంలో 15 గదులతో పాటు, కేదార్ ఘాట్ ముందు నెం.B/7 185, 186తో 15 గదుల భవనాన్ని తీసుకుని, వసతి, అర్చకులు, ఇతర ప్రదేశాలను సందర్శించడానికి వాహనాల ఏర్పాటు బ్రాహ్మణులకు మరియు ఇతరులకు ఆహారాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. మొత్తం 30 గదులు వీరివద్ద లభ్యం అగునని తెలుస్తోంది. సత్రంనందు విరాలములిచ్చు దాతల కోరిక అనుసరించి వారు కోరినరోజున పండితులకు, వేద విద్యార్థులకు, సాధువులకు సమారాధన చేయు సౌకర్యం ఉన్నది. AC మరియు నాన్ AC గదులు అందుబాట్లో ఉన్నాయి. లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంవల్ల కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది. సత్రం యాజమాన్యానికి కాశీలోని ఇతరఆశ్రమాలతో మరియు హోటళ్లతో సత్సంబంధాలు ఉండటంవల్ల ఇతరులకు ఇతరసంస్థలలో వసతి కల్పిస్తారు. వారణాశినందు విశ్వేశ్వరునికి అభిషేకం, అన్నపూర్ణ మరియు విశాలాక్షి దేవేరులకు కుంకుమార్చన జరిపించేదరు. స్నాన ఘట్టాలు అతి తక్కువ దూరంలో ఉండటం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది అంతే కాకుండా పితృ కర్మలు చేయుటలో లేదా చేయించు కొనుటపట్ల ఆశక్తి కలిగిఉన్ననూ బస, భోజనం లభ్యతకు పిండ ప్రధానం తదితర సేవలకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కలదు. సంప్రదించవలసిన ఫోన్ నెం. 0542-2450347 మరియు 919490380777.
    2. శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం, మానస సరోవర్ ఘాట్: మానస సరోవర్ ఘాట్ సమీపంలో ఉన్న శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం పురాతనమైనది. ఆశ్రమమునకు రవాణా సదుపాయంలేదు. ఆశ్రమం ఒక సందుతో ఉంటుంది.. కులప్రమేయం లేకుండా అందరకు వసతి మరియు ఆశ్రమవాసులకు మాత్రం ఆన్నదాన సౌకర్యం కలదు. వసతికి అడ్వాన్సు బుకింగ్ ఏర్పాటు లేదు. ఉ 7-00లకు సత్రమునందు హాజరైన లభ్యతను బట్టి వసతి ఏర్పాటు చేసేదరు. లిఫ్ట్ సౌకర్యం లేదు ఇతరప్రదేశములకు వెళ్ళుటకు వాహన ఏర్పాటు, పిండప్రధాన తదితర క్రతువులకు మరియు అభిషేకములకు, పూజలకు  పురోహితుల ఏర్పాటు లేదు. మరిన్ని వివరాలకు  0542 2450418 మరియు 919334987412 లందు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవచ్చును. 
    3. అఖిల భారతీయ బ్రాహ్మణ కరవేన నిత్యాన్నదాన సత్రం, మానస సరోవర్ ఘాట్: మానస సరోవర్ ప్రాంతంలో బెంగాలీతోటలో కల అఖిల భారతీయ బ్రాహ్మణ కరవేన నిత్యాన్నదాన సత్రం నందు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వసతి మరియు భోజన సౌకర్యములు కలదు. బసచేసినవారికి మరియు చేయనివారికి బ్రాహ్మణులకు మాత్రం ఆన్నదాన సౌకర్యం ఉన్నది. లిఫ్ట్ సౌకర్యం లేదు సత్రమునకు రవాణాసౌకర్యం లేదు. మానస సరోవర్ నందున్నా సత్రంవద్దకు ఆటోలువచ్చు వీలులేదు. వసతికి అడ్వాన్సు బుకింగ్ ఏర్పాటు లేదు. సత్రమునందు హాజరైన లభ్యతనుబట్టి వసతి ఏర్పాటు చేసేదరు. భోజనమునకు వచ్చు నివాసంకాని  బ్రాహ్మణులు ఉదయం 8-00 లకు తెలియపరచవలసి ఉంటుంది. ఏ.సి. మరియు నాన్ ఏ.సి. గదులు లభ్యమైననూ Lift సౌకర్యం లేనందున వయోవృద్ధులు, మోకాళ్ళనెప్పులు తదితర శారీరక ఇబ్బంది కలవారు శ్రమపడవలసి ఉంటుంది. ఇతరప్రదేశములకు వెళ్ళుటకు వాహన ఏర్పాటు, పిండ ప్రధాన తదితర క్రతువులకు మరియు అభిషేకములకు, పూజలకు బ్రాహ్మణుల ఏర్పాటు లేదు. మరిన్ని వివరములకు 0542-2451953 నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమూలందు వీరి బ్రాంచిలు ఉన్నవి.  
    4. సైకిలుస్వామి ఆశ్రమం, పాండే హవేలీ, బంగాలీ తోట: బంగాలీతోట పాండే హవేలీ నందూకాల సైకిలుస్వామి ఆశ్రమం కలదు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమూలందు వీరి బ్రాంచిలు ఉన్నవి. ఆశ్రమమునందు అందరికీ వసతి మరియు భోజన సౌకర్యం ఉన్నది. ఏ.సి. మరియు నాన్ ఏ.సి గదులు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం ఉండుటవలన ముందుగా బుక్ చేసుకొనవచ్చును. లిఫ్ట్ సౌకర్యం లేదు ఆశ్రమంలో బసచేసినవార్కి ఆన్నదాన సౌకర్యంఉంది. ఇతరప్రదేశములకు వెళ్ళుటకు వాహన ఏర్పాటు చేసేదరు పిండప్రధాన తదితర క్రతువులకు మరియు అభిషేకములకు, పూజలకు బ్రాహ్మణుల ఏర్పాటులేదు. మరిన్ని వివరాలకు 0542 2450502 నందు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవచ్చును.
    5. శ్రీ వెదజనని వెల్ఫేర్ ట్రస్ట్, సోనాపుర: సోనాపుర నందున్న శ్రీవేద జనని వెల్ఫేర్ ట్రస్ట్ వారి సత్రం నందు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆన్నదానం సౌకర్యం ఉంది. వసతి సౌకర్యం లేదు. ఇతరప్రదేశములకు వెళ్ళుటకు వాహనముల ఏర్పాటుఉంది. మరిన్ని వివరాలకు  917989112316 నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును.
    6. శ్రీ చల్లా లక్షణ శాస్త్రి సోనాపుర: వీరి స్వగృహం నందు కేవలం ఆబ్దీకాది కార్యక్రమములు పురోహితులతో నిర్వహణ సదుపాయం కాశీ సందర్శించు బ్రాహ్మణులకు మాత్రమే వసతి సౌకర్యం ఉన్నది. తక్కువ వసతిలభ్యం. కావున ముందుగా బుక్ చేసుకొనవలసి ఉంటుంది. వారే పురోహితులు. ఇతరప్రదేశములకు వెళ్ళుటకు వాహనముల ఏర్పాటు లేదు. మరిన్ని వివరాలకు  0542-2275107 మరియు 09415606617 నందు వారిని సంప్రదించవచ్చును.
    7. శ్రీ రాజవరపు విశ్వనాధ శాస్త్రి  సోనాపుర: సోనాపుర కేదార్ ఘాట్ పోస్టాపీసు సమీపంలో ఉన్నవీరు వసతి సౌకర్యం కలుగ చేసేడమని వారి విజిటింగ్ కార్డులో పేర్కొన్నారు. వారు పిండ ప్రధానం మరియు ఇతర ఆచారాలను స్వయంగా ఏర్పాటు చేస్తారు. భోజన ఏర్పాటు మరియు ఇతర క్షేత్రములకు వాహనం ఏర్పాటు ప్రస్తావించలేదు.మరిన్ని వివరాలకు 0542-2454218 నందు వారిని సంప్రదించ వచ్చును
    8. శ్రీ కాశీ విశాలాక్షి బ్రాహ్మణ సేవాసమితి భవన్: వీరి వివరాలు ఏమియు తెలియవు.
    9. శ్రీ కంఠ ఋశ్యాశ్రమం పాండే హవేలి: బెంగాలీ తోట పాండే హవేలీ నందున్న శ్రీ కంఠ ఋష్యాశ్రమంనందు  వసతికి ఏ.సి., నాన్ ఏ.సి. రూములు మరియు డార్మెటరీ, లాకర్ సదుపాయములు కలవు.  భోజన సదుపాయం కానీ వాహనముల మరియు పురోహితుల ఏర్పాటు కానీ లేవు.  మరింత సమాచారానికి నిర్వాహకులను 9063833844 మరియు 9491574080 నందు సంప్రదించవచ్చును. వారణాశి (కాశీ) నందు పైన తెలుపబడినవే కాక ఇంకనూ అనేక సత్రములు మరియు ఆశ్రమనులతో పాటుగా వసతి గృహాలు ఉన్నాయి. పై సత్రములు మరియు ఆశ్రమములలో అధికభాగం రామపుర లక్సా రోడ్డు (విశ్వనాధ ఆలయం నుండి 1.5 కి.మీ లేదా 15 ని. నడక) మరియు సోనాపురన( విశ్వనాధ ఆలయం నకు 1.5 కి..మీ ) బంగాలీతోట  ప్రాంతములలో ఉన్నవి. మరియు రెండు ప్రదేశములకు స్నానఘట్టములు దగ్గరగా ఉన్నవి. సోనాపుర మరియు బంగాలీ తోట ప్రాంతములో కల సత్రములు మరియు ఆశ్రమముల వివరములు ఇచ్చుచున్నాము. మేము స్వయంగా తెలుసుకొన్న మరియు ఇతరుల అభిప్రాయములు పరిగణలోనికి తీసుకొని పైసమాచారం పొందుపరిచ్చాము. ఇందు ఏమైనా తప్పిదాలుంటే మన్నించండి. పాలకొల్లు వారి సత్రంగా చెప్పబడు కాశీ యాత్రా భవన్ తప్ప ఇంక ఏ సత్రంనందు కానీ ఆశ్రమమునందు కానీ ఉచిత వసతి సౌకర్యంలేదు. సేవాదృక్పడము తక్కువ. లాభార్జన ఎక్కువగా కనపడుతుంది. అంతేకాక సత్రములు మరియు ఆశ్రమముల మధ్య పోటీ కనపడుతుంది.

యాత్రికులకు అవశ్రమైన బస, భోజనం, పిండప్రధానాది క్రతువులకు మరియు వాహన సందుపాయములతో పాటు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం అన్నియు ఒకేచోట కలిగియున్నవి సోమాపుర నందుకల శ్రీ గాయత్రీ సనాతన నిత్యాన్నడాన సత్రం మాత్రమే.

యాత్రికులు ఒకటికి పదిసార్లు స్వయంగా విచారించి ప్రతిసత్రం మరియు ఆశ్రమము కలుగజేయు సౌకర్యములు అన్నియు ఒకటికి పదిసార్లు చదివి అవగాహన చేఊకొని తగునిర్ణయం తీసుకొన కోరుతున్నాం.  అన్నదానం చేయు ఆశ్రమములు, సత్రములు అనేకంఉన్ననూ  ఆన్నదాన ఫలితం మరియు యాత్రికులకు ప్రతిఫలాపేక్ష లేకుండా  ఆన్నదానసేవ చేయు సత్రముల మరియు ఆశ్రమముల వివరం సంపూర్ణ తీర్ధయాత్రలో భాగమైన కాశీయాత్ర  నందు మాతరువాయి పోసు ఆన్నదాన మహత్యంలో తెలిపెదము.