నాత్ ద్వారా శ్రీనాథ్ జీ ఆలయం

(IPLTOURS)

శ్రీనాథ్ జీ ఆలయం

నాత్ ద్వారా రాజస్థాన్ రాష్ట్రమునందు ఉదయపూర్ నకు ఈశాన్యముగా సుమారు 48 కి.మీ దూరములోఉన్న శ్రీనాథ్ జీ శ్రీకృష్ణుని మరోరూపము మరియు ఈఆలయము వైష్ణవులకు ప్రీతిపాత్రమైనది. ఈఆలయము సుమారు 300 సం.లకు పూర్వము మేవార్ రాజూచే గోవర్ధనంనందు నివసించిన శ్రీనాధ్ జీ నల్ల్తటి చలువరాతి విగ్రహముతో నిర్మించబడినది. ఆలయమునందలి కృష్ణుని దర్శనార్ధము భక్తులు ప్రాత: కాలమునుండి ఎదురుచూసేదరు. కృష్ణుడు చిన్నతనములో మీవార్ రాణితో పచ్చీస్ (గవ్వలాట) ఆడునిమిత్తము వచ్చేదివాడని, కృష్ణుడు తిరిగి  వృందావన్ (బృదావన్) వెల్లునప్పుడు రాణి చాలావిచారముగా నుండెడిదని నానుడి.    

శ్రేకృష్ణుని ఆవతారమైన శ్రీనాధ్ జీ ఏడుసంవత్సరముల పిల్లవానిలా దర్శనం ఇస్తాడు నాత్ ద్వారానందు శ్రీనాధ్ జీఆలయములో శ్రీనాధ్జీ ప్రధానదైవము. వల్లభాచార్యచే స్థాపించబడిన వలభ సాంప్రదాయమునందు భక్తియోగము పాటించు వైష్ణవులకు గుజరాత్ మరియు రాజస్థాన్ వాసులలో మిగిలినవారికంటే శ్రీనాథ్ జీప్రధాన దైవము. వల్లభాచారుని కుమారుడైన విఠల్ నాధ్ జీ నాత్ ద్వారానందు శ్రీనాథ్ జీని పూజించుట ప్రారంభించినాడు. శ్రీనాధ్ జీకి వచ్చినప్రజాదరణవలన నాత్ ద్వారాపట్టణము శ్రీనాధ్ జీ పేరుతో పిలువబడుచున్నది. ప్రజలు శ్రీనాధ్ జీని బాబాగాతలచి ఈపవిత్ర ప్రదేశమును బాబానగరి అనికూడా పిలుస్తారు. వల్లభాచార్య కృష్ణునికి ముందుగా గోపాల అనుపేరుపెట్టినాడు. అందువలన ఈక్షేత్రము గోపాలపూర్ అనిపిలువబడినది. తరువాత విఠల్ నాథ్ జీ స్వామికి శ్రీనాధ్ జీ అని పేరుపెట్టినాడు. శ్రీనాధ్ జీ సేవ ప్రతిరోజూ ఎనిమిదిపర్యాయములు జరుగును. స్వామి చేయి మరియు ముఖము గోవర్ధన పర్వతమునుండి ఉద్భవించినవిఅని, మాధవేంద్ర పూరీ గోవర్ధన పర్వతమువద్ద స్వామినికనుగొనిట్లు నానుడి. మాధవేంద్ర పూరీ ముందుగా స్వామిలేచిఉన్న చేతిని తరువాత ముఖమును పూజించినాడుఅని తరువాత స్థానిక వైష్ణవులు మాధవేంద్ర పూరీ ఆధ్వర్యములో గోపాల్(కృష్ణుని) స్వామిని పూజించుట ప్రారంభించినారు. ఈగోపాలస్వామికి తరువాత శ్రీనాధ్జీ గాపేరు వచ్చినది.

శ్రీనాధ్ జీ వల్లభాచార్యునికి తెలుగు విక్రమాదిత్యసంవత్సరము 1549 నందు దర్శనము ఇచ్చి గోవర్ధనపర్వతము వద్దకువెళ్ళి పూజించుట ప్రారంభించవలెనని తెలిపినాడు. వల్లభాచార్య ప్రారంభించిన సంస్కృతి ఆయనకుమారుడు విఠల్ నాథ్ జీ కొనసాగించినాడు. నాత్ ద్వారా వైష్ణవులకు పుణ్యక్షేత్రము\మరియు శ్రీనాథ్ జీవారి ప్రధానదైవము. తిలకాయత్ మహారాజ్ అనువారు శ్రీ వల్లభాచార్య మరియు వారి కుమారుని తరువాత నాత్ ద్వారా అధిపతి అయినారు శ్రీ వల్లభాచార్య మహాప్రభుజీ పిమ్మట 17వ . శ్రీ ఇంద్రమాన్ జీ మహరాజ్ వారసునిగా అధిపతి అయినారు. వీరిని నాత్ ద్వారా తిలకాయత్ అని పిలిచెదరు మరియు వీరే శ్రీనాథ్ జీకి ప్రధాన అర్చకులు.                

పురాణసమాచారము ప్రకారము ఇచ్ఛటి శ్రీనాథ్ జీస్వామి గోవర్ధనపర్వతమునుండి స్వయంభూః గా రాతినుండి అవతరించినాడు. ఈవిగ్రహము మధురవద్దనున్న గోవర్ధనపర్వతమువద్ద ముందుగ పూజించబడినది. మధురనుండి 1672 సం.లో ముందుగా యమునానదితీరమండలి ఆగ్రా తరలించబడి ఆగ్రానందు మొఘలురాజైన ఔరంగజీబు ఈవిగ్రహము తనవద్ద ఉండవలేనని కోరిక ఉండుటవలన బధ్రతనిమిత్తము ఆరుమాసములు ఉంచబడినది. అక్కడినుండి మొఘల్ పాలకుడు ఔరంగజీబు దాడుల నుండి రక్షించుటకు రధములో ఆగ్రాకు ఇంకనూదక్షణముగా సురక్షితప్రదేశమునను తరలించింవారు. ఆవిగ్రహము సిహాడ్ గ్రామము వచ్చుసరికి రధచక్రములు బురదనందు కూరుకుపోయి ముందుకు కదలలేదు. రధముతో వచ్చుచున్న పూజారులు ఆప్రదేశము శ్రీనాధ్ జీఎన్నుకొన్న ప్రదేశముగా తలంచి ఆవిగ్రహమును మేవార్ రాజు మహారాణా రాజ్ సింగ్ ఏలుబడిలోనూ రక్షణలోనూ ఉన్నఅచ్చటనే ఒకఆలయమునందు స్థాపించినారు. పద్దెనిమిది మరియు పంతొమ్మిది శతాబ్దములలో పిండరులు ఈఆలయముపై దాడులు చేసినప్పుడు గజదొంగలబారినుండి కాపాడుటకు విగ్రహమును మరలా రక్షణార్ధము మేవార్ రాజైన మహారాణా భీమ్ సింగ్ పాలనలో ఉన్న ఉదయపూర్ తరలించబడినది. ఆవిధముగా శ్రీనాథ్ జీ విగ్రహము ఉదయపూర్ సమీపములోని నాత్ ద్వారానందు ప్రస్తుత ఆలయములో దర్శనము ఇచ్చేదరు. 

శ్రీనాథ్ జీ ఇచ్చటప్రత్యక్షముగా చాలామందికి భక్తులకు దర్శనం ఇచ్చినట్లు, తమకనులతో చూసినట్లు  స్థానికులు చెపుతారు. స్వామికనులు కలువపూలవలె ప్రశాంతంగాఉండి చూపరులను ఆకర్షిస్తాయి. బహుశా తదేకముగా స్వామిని చూసి బయటకు వచ్చినవారికి ఆరూపం కనులందునిలచి స్వామియాత్రికుల మధ్యలోనున్న భావనకలుగుతుంది. స్వామిమహిమలను గురించి ఇక్కడి నివాసులు పలు ఆశక్తికరమైన కధలు వెల్లడిస్తారు.  

Shrinathji Temple Festive SeasinNathdwara