విశాలాక్షి దేవి

(17వ శక్తి పీఠం)

విశాలాక్షీదేవి  విఖ్యాత !
వారణాస్యాం శివాంతికే !!
నిరతాన్న ప్రదాత్రీద !
నిర్భాగ్య జనసంతోషిణీ !!

అష్టదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

శ్రీ విశాలాక్షి దేవి శక్తి పీఠం

అస్టాదశ శక్తిపీఠములలో 17వ శక్తిపీథము ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో వారణాశి (కాశీ) నందున్న విశాలాక్షి శక్తిపీఠము. కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయమునకు అతిసమీపంలో సతీదేవి శరీరభాగములలో కుడి చేయి భాగము పడి అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. దేశములోని 18 శక్తిపీఠములలో విశాలాక్షి శక్తిపీఠము 17వ శక్తి పీఠము. విశాలాక్షి శక్తిపీఠము వారణాశినందు గంగానడి ఒడ్డున మీరాఘాట్ (మణిiకర్ణికఘాట్) వద్ద కాశీ విశ్వనాధుని ఆలయమునకు అతిసమీపములో ఈ ఆలయమున్నది. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి  ఉత్సవ మూర్తి పెద్దది, వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే శక్తిపీఠము. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవిచేసి మరీ ఆశ్చర్యంగాచూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.వారణాశికి పూర్వ నామము కాశీ. దేవీ పురాణమునందు కాశీనందలి విశాలాక్షి ఆలయమును గురించి చెప్ప బడినది. శక్తి విశాలాక్షి పేరుతోనూ ఆమె రక్షకుడైన భైరవుడు కాలభైరవ రూపము తోనూవారణాశి నందు కొలువై ఉన్నారు. దక్షయజ్ణములో జరిగిన అవమానమునకు అగ్నినందు ఆత్మాహుతి గావించుకొన్న సతీ శరీరమును తాండవ నృత్యము చేసే శివుని క్రోదాగ్ని నుండి లోకములను కాపాడుటకు శ్రీమహావిష్ణువు తన సుదర్శనచక్రముతో ఖండించగా ఖండింపబడిన శక్తిపీఠములు కాగా అందు కుడి చెవిరింగు పడినచోటును మణికర్ణికఘాట్ అని  నానుడి. 

kashi-vishalakshi-devi

గరుఢ పురాణమునందు మోక్ష స్థలములుగా అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాశి, అవంతిక (ఉజ్జయిని), ద్వారక మరియు కాంచీపురము తెలుపబడి యున్నవి. స్కంధపురాణము ప్రకారము వ్యాసమహర్షి వారణాశి నందు ఆహారము ఎవరునూ ఇవ్వక పోవుటవలన కాశీని శపించకబోగా విశాలాక్షి ఒక కుటుంభ స్త్రీ రూపములో ఆహారము పెట్టినది. ఈ విషయములో విశాలాక్షి అన్నపూర్ణ రూపు దాల్చినది. విశాలాక్షి ఆలయము బాధ్రపద మాసములో మూడవ రోజున ఆనాగా తదియ రోజున జరుపు కాజలి టీజ్ పండుగ వలన బాగా ప్రాచుర్యము. ఈఆలయములో భక్తులకు మానసిక ప్రశాంతత కలుగును. భక్తులు ఆలయము దగ్గరలో ఉన్న గంగనందు స్నానము చేసి అర్చించేదరు. అమ్మవారికి జరుపు పూజలు, సమర్పణలు, శ్లోకములు పారాయణ మరియు స్వచ్ఛంధ ధర్మములు విశేషమైన ఫలితము ఇచ్చునని తలచెదరు. ముఖ్యముగా వివాహము కాని ఆడపిల్లలు వివాహము ఆగుటకు సంతానము లేని దంపతులు సంతానము కొరకు ప్రత్యేకముగా పూజించేదరు. భక్తులు విశ్వనాధుని, అన్నపూర్ణ మరియు విశాలక్ధి ఆలయములు సందర్శింతురు. ఈఆలయములో జరుపు ఇతర ముఖ్యపండుగలు రెండు నవరాత్రి ఉత్సవములు. మహిషాసురుడు అను రాక్షసునిపై విజయము సాధించిన దుర్గాదేవికి  అక్టోబరు మాసము లేదా తెలుగు ఆశ్విజ మాసము శుక్లపక్షము రోజులలో వచ్చు విజయదశమితో పూర్తి కాబడు నవరాత్రి అని పిలువబడు అశ్విన్ నవరాత్రి, రెండవ నవరాత్రి మార్చి అనగా చైత్రమాసములో బహుళపక్షములో వచ్చు నవరాత్రి. ఈనవరాత్రి తొమ్మిదిరోజులలో ఇచటకల నవదుర్గల ఆలయములు దర్శించ వచ్చును. ఉత్తరాదినఉన్న విశాలమైన కనులుకల విశాలాక్షి, దక్షణాదిన తమిళనాడులో కాంచిపురంనందు ప్రేమతోచూచు కామాక్షి మరియు చేపకనులుకల మధురమీనాక్షీ ఆలయములు దక్షణాదివారికి అతిముఖ్యమైన ఆలయములు.  

విశాలాక్షి దేవి ఆలయ సమయాలు

ఆలయము సంవత్సరమంతయు ఉదయం 6 గంటలనుండి రాత్రి 9గంటలవరకు తెరచి ఉంటుంది. క్షేత్రమునకు సమీపములో వసతి గృహములు మరియు హోటల్స్ కలవు. ఇచట కల భోజన వసతి సదుపాయములు మరియు పిండ ప్రదానమునకు పౌరోహితుల వివరములు ఇచ్చుచున్నాము.