కాశీ విశ్వనాథ్
(9వ జ్యోతిర్లింగం)
IPLTOURS
సానందమానందవనే వసంతం
ఆనందకందం హతపాపబృందమ్
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
(9వ జ్యోతిర్లింగం)
IPLTOURS
సానందమానందవనే వసంతం
ఆనందకందం హతపాపబృందమ్
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ద్వాదశ జ్యోతిర్లింగములలో తొమ్మిదవది వారణాశిలోని కాశీవిశ్వేశ్వర జ్యోతిర్లింగము. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
వారణాశి ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోనున్న పవిత్రమైన శైవక్షేత్రము. వారణాశి చేరుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విమాన, రైలు మరియు బస్సు సౌకర్యములు కలవు. వారణాశినందు నివశించడానికి అనేక ఆశ్రమాలు, సత్రములు తదితర వసతులు ఏర్పడ్డాయి. భోజన సౌకర్యములు విశేషంగా ఏర్పడి నిత్యాన్నదాన పధకంలో వివిధ కులములవారికి వారికి సంభంధించిన సత్రములలోనూ ఆశ్రమాలలోనూ అన్నికులములవారికి కాశీఅన్నపూర్ణ నిత్యాన్నదాన పధకంలో ఉచిత భోజనవసతి ఏర్పాటు చేయబడినది. ఒక్క మాటలో చెప్పాలంటే కాశీనివాసం మన స్వంత ఇంటిలోనూ ఊరిలోనూ ఉన్న అనుభూతి కలుగుతుంది. కాశీలో నిత్యము గంగానదికి సాయంసమయంలో ఇచ్చే గంగాహారతి ప్రత్యేకముగా చూడవలసినది. పితృదేవతలకు మణికర్ణికా ఘాట్నందు పిండప్రధానములు చేయవచ్చును. వారణాశినందు గంగాతీరము వెంబడ 64ఘాట్ లు కలవు. సందర్శకులు మోటారునావపై 64 ఘాట్ లు దర్శించుకోవచ్చును .
కాశీ బ్రహ్మ సృష్టిలోనిది కాదుఅనియు, విష్ణువు హృదయంనుండి వెలువడినది అని, సృష్టి ఆరంభంలో శివుడు స్వయంగా శివుడు నివాసమునకు నిర్మించుకున్న నగరం అనియు, శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి మునుగకుండా కాపాడే అతి ప్రాచీన పట్టణం అనియు, కాశీ సప్త మోక్ష ద్వారాలలో ఒకటిగాను, విశ్వనాధ జ్యోతిర్లింగం పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనదిగాను మరియు గంగా స్నానం, బిందుమాధవ దర్శనం, దుండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యంఅనియు గ్రంధాలలో వ్రాయబడినది. అంతేకాక ఎన్నో జన్మలపుణ్యం ఉంటేతప్ప క్షేత్రపాలకుడు బైరవుడు ఎవరిని కాశీలోనికి అనుమతించడని, వారి పాపపుణ్యముల చిట్టా కాలభైరవుని వద్దకు వచ్చునని, దుండిగణపతి, కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే అధికశిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారు అని, కాశీలో మరణించిన వారికి యమబాధ పునర్జన్మ ఉండదుఅని, శివుడు దర్శనమిచ్చి వారి కుడిచెవిలో తారక మంత్రంపలికి మోక్షం ప్రసాదిస్తాడు అని, కాశీవాసం చేసేవారికి సమస్తయాగాలు, తపస్సులు చేసిన పుణ్యం సంప్రాప్తిస్తుంది అని, కాబట్టే చివరిజీవితం చాలామంది కాశీలో డుపుతారుఅని, మరణించినవారి ఆస్తికలు గంగలోకలిపితే గతించినవారు మరల కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింపబడతారు అని గ్రంధములలో వ్రాయబడినది.
కాశీలో ఆవులు మన ప్రక్కనుండే వెలుచున్ననూ పొడవవు, శవాలు కాలుతున్నా వాసన రావు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచెవి పైకిలేచి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మముతో పూజ ప్రారంభిస్తారు. కాశీ క్షేత్రంలో పుణ్యం చేసినా; పాపం చేసినా కోటి రెట్ల ఫలితం. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి. ఇక్కడ అష్టాధశ శక్తిపీఠములలో 17వ శక్తి పీఠం విశాలాక్షి ఉన్నది. జగత్తుకి ఆహారంపెట్టే అన్నపూర్ణదేవి నివాసస్థలం కాశి. పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. మహమ్మదీయ దండయాత్రానందు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి ఇండోర్ రాణి శ్రీ అహల్యాబాయిహోల్కర్ కట్టించిన మందిరాన్ని ప్రస్తుతము మనం చూస్తున్నాము. కాశీ స్మరణం మోక్షకారకం.
వారణాశినందు అధికముగా సత్రములు ఆశ్రమములు మరియు ఉచిత భోజన సదుపాయమునకు ఉచితా భోజనపధకములు అమలు చేయుచున్న సత్రములు కలప్రాంతము మానససరోవర్. ఇచ్చటినుండి స్నానముచేయు ఘాట్ లకు మరియు విశ్వేశ్వరాలయమునకు కూడా నడచిపోవచ్చును. వారణాశినందు ఉచితవసతి సదుపాయము లేదు. కానీ విశ్వనాధఆలయము మరియు గంగాస్నానమునకు వివిధఘాట్ లకు దగ్గరగా మానససరోవర్ నందు అఖిలభారత కరవేన నిత్యాన్నదాన సత్రము (0542-2451953), శ్రీ ఇంద్రగంటి శేషమ్మ ఛారిటబుల్ ట్రస్టు వారి శ్రీ అక్షయ నిత్యాన్నదాన వసతి గృహము (0542-2450290 మరియు 7981817063), శ్రీ రామ తారక ఆంధ్రాశ్రమం (0542-245418), ఆర్య వైశ్య సత్రము(0542-2455087) కలవు. కానీ ఇందు వసతి కొరకు అడ్వాన్సు బుకింగు సౌకర్యము లేదు. సమీపములోని బంగాలీతోటనందు సైకిల్ స్వామి ఆశ్రమం (0542-2450502) కలదు. ఈ ఆశ్రమములలోనూ సత్రములలోనూ ఉచిత ఆన్నదాన పధకము అమలులోనున్నది. ఇదికాక కాశీ అన్నపూర్ణ నిత్యనాదాన పధకము లో అన్నికులములవారికి ఉచిత భోజనసదుపాయము దేవస్తానమువారు ఏర్పాటుచేసియున్నారు. ఇవి కాక శ్రీ కాశీ అన్నపూర్ణా యాత్రిభవన్ (9246428903), మా అన్నపూర్ణ (9336110234) మొదలైన వసతి గృహములు మానససరోవర్ ప్రాంతములో అనేకములు కలవు. వీటిలో మాత్రము వసతి సౌకర్యము ఫోను ద్వారా బుక్ చేసుకొనవచ్చును. వారణాశి నందు 2016 సంవత్సరములో శ్రీ గాయిత్రి నిత్యాన్నదాన సత్రం హరహరబాగ్ నందు సాయిబాబాబా గుడివద్ద మరియు చింతామణి గణేశ్ ఆలయం వెనుక ఇం.నెం. 7/131 నందు స్థాపించినారు. ఫోన్ నెం. 0542-2450347 నకు ఫోను ద్వారా కానీ sgnsas@gmail.com నకు మెయిలు చేయుట ద్వారా ఏ.సి. నాన్ ఏ.సి. రూములు బుక్ చేసుకొని గది 3 మంది షేర్ చేసుకొని ఉండవచ్చును. మరియు వారణాశి నందు పితృ కార్యక్రమములు నిర్వహించుటకు శ్రీ చల్లా లక్ష్మణ శాస్త్రి (0542-2275107) మరియు శ్రీ రాజవరపు విశ్వనాధ శాష్ట్రి (0542-2454218)లను సంప్రదించవచ్చును. నైమిశారణ్య దర్శనమునకు మరియు గయ, ప్రయాగరాజ్ దర్శనమునకు కలిపి వారణాశి యాత్రలో వారణాశి నందు 15 రోజులు (ఒకరోజు గయ 5 ఒకరోజు ప్రయాగరాజ్ మరియు 3 రోజులు నైమిశారణ్యమునకు) బస చేయవలసి యుండును. మరియు వారణాశినందు 9 రాత్రులు విశ్రమించి కాశీ నివాసము కూడా పూర్తి చేయవచ్చును. వారణాశి నందు ముఖ్యముగా చూడవలసిన ఆలయములు ఉదహరించు చున్నాము.
కాశీ విశ్వనాథ్ ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగములలో 9వ జ్యోతిర్లింగము. ఈ ఆలయము గంగానది పశ్చిమఒడ్డుపై ఉన్నది. విశ్వేశ్వరుడు అనగా విశ్వమునకు అధిపతి లేదా దైవము. విశ్వం ఆనగా ప్రపంచము ఇషా అనగా అధిపతి వర ఆనగా సుప్రీం లేదా ప్రపంచమునకు అధినాయకుడు. ఈ ఆలయము పలుమారులు నాశనము చేయబడినది. ఆఖరుగామొఘల్ రాజైనఔరంగజీబు కార్యాలయములో నాశనముచేయబడి ఆస్థలములో మసీదు నిర్మాణము చేయబడినది. కానీ 1780 సంవత్సరములో మరాఠా రాణి అహల్యాభాయిచే మసీదునకుచేర్చి ఆలయముపునః నిర్మాణముచేయబడినది. ఈ ఆలయము 1983 సంవత్సరములో ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఆధీనములోనికి వచ్చినది. దేశములో అధికఆధాయము కలిగిన 5 ఆలయముయాలో విశ్వేశ్వరఆలయము ఒకటి. ధనస్సురాశికి చెందిన స్త్రీ పురుషులు వారణాశినందు ఈ విశ్వనాధ్ జ్యోతిర్లింగముదర్శించి అర్చించిన దోషములుతొలగునని చెప్పబడినది.
కాశీ విశ్వనాధమందిరమునకు ముందుగా అన్నపూర్ణ ఆలయమునకు చేరువలో ఈ సాక్షి వినాయక ఆలయము కలదు. యాత్ర ప్రారంభములో యాత్రనందు ఎటువంటి ఆటంకములు కలుగకుండా కోరుకొనుచూ గణపతి దర్శనము చేసుకొనేదరు. మరియు కాశీ యాత్ర చేసినందుకు సాక్షిగా గణపతికి నమస్కరింతురు. దారి మార్గమునకు కొంచెము పైన ఈ గణేశప్రతిమ ఉన్నది. ఈ ప్రతిమకు వెండి చేతులు, దంతము, పాదములు, చెవులు ఉండి రమ్యముగాను ఆకర్షణీయముగాను ఉంటుంది. ఈ ఆలయమును మరాట పీష్వా 18 వ శతాబ్ధములో నిర్మించినారు.
వినాయక ఆలయమునకు తరువాత అన్నపూర్ణ ఆలయము కలదు. కానీ దర్శన వరుస క్రమములో వినాయకుని దర్శనము పిమ్మట విశ్వేశ్వర దర్శనము చేసుకొనెదరు. పిమ్మట అన్నపూర్ణ దర్శనము చేసుకొనేదరు. మతపరంగా ఈ ఆలయమునకు గుర్తింపు ఉన్నది. పార్వతీదేవి మరో రూపం అయిన అన్నపూర్ణ మనకు ఆకలి తీర్చే హిందూ దేవత. మరాటా పీష్వా బాజీరావుచే ఈఆలయము 18వ సంవత్సరములో నిర్మించబడినది. ఈ ఆలయములో అర్చనకు ఉపయోగించు ముడిబియ్యము ప్రసాదముగా భక్తులకు ప్రసాదించెదరు. భక్తులు ఈ ముడిబియ్యమును చిన్నమూటగాను పోట్లముగాను చుట్టి తమ ఇండ్లలో ఉంచుకొనినట్లయిన అమ్మదయవలన సదరు బియ్యము నిలువ ఉంచుడబ్బా పాత్ర ఎన్నడూ ఖాళీఅవబోదని విశ్వాసము. మరియు ప్రతి సంవత్సరము దీపావళికి ముందురోజున, తరువాతిరోజున మొత్తము మూడురోజులు బంగారు అన్నపూర్ణ ప్రతిమను ఈ ఆలయములో భక్తుల దర్శనార్ధము ఉంచెదరు. లక్షలకొలదీ భక్తులు ఈ బంగారు అన్నపూర్ణ దర్శనార్ధము విచ్చేయుడురు.
దేశములోని 18 శక్తి పీఠములలో విశాలాక్షి 17వ శక్తి పీఠము. గంగానది ఒడ్డున మిర్ ఘాట్ సమీపములో ఈ ఆలయమున్నది. ఇందు ఉత్సవ మూర్తికి వెనుక భాగమున శక్తి పీఠము ఉన్నది.
వారణాశిలో కల ఇతర ఆలయములలో కాలభైరవ మందిరము ముఖ్యమైనది. కాశీ పట్టణమునకు క్షేత్రపాలకుడు ఈకాలభైరవుడు. కాశీ సందర్శించినవారు ప్రతిపర్యాయము తప్పని సరిగా కాలభైరవుని దర్శించవలసి యున్నది. వారణాశినందు బారోనాథ్ ప్రాంత ములో విశ్వేశ్వరగంజ్ సమీపములోకల ఈఆలయమునకు చరిత్రపరముగా అధిక ప్రాధాన్యత ఉన్నది. కాశీవిశ్వేశ్వరునికి మనఆగమనము కాలభైరవుడు నివేదించగలదని ప్రసిద్ధి.
గంగానదికి మరోవైపున వారణాశికి ఎదురుగా రాంనగర్ నందు ఈ వ్యాసమందిరం లేదా సారనాధ్ కలదు. వ్యాసమందిరం రామ్ నగర్ కోటనందు కలదు. మరియు ఈ కోటలోని మ్యూజియము నందు పూర్వపురాజులు వాడిన అనేక ఖడ్గములు, పల్లకీలు, తుపాకులు కలవు. ఈఆలయము మహాభారతగ్రంధమును వ్రాసిన వేదవ్యాస మహర్షిపేరున పిలువబడుచున్నది. రాంనగర్ నందుగల ఈవ్యాసమందిరము తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశము మరియు సంవత్సరమంతయు ఈ మందిరము సందర్శకులతో నిండియుండును. వ్యాసమహర్షికికల అధిక అహంకారమునకు కోపగించి శివుడు వారణాశినుండి వ్యాసుని బహిష్కరించి గంగకు ఆవలివైపున నివశించమని ఆదేశించినట్లు ఆవిధముగానే వ్యాసుడు కాశీప్రవేశము లేనందున రాంనగర్ నందు ఈ ఆలయము నిర్మించిఇచట నివసించినట్లు తెలియుచున్నది.
ఈఆలయం దశాశ్వమేధఘాట్ మరియు మనమందిర్ ఘాట్ నకు 150 మీ దూరములోనున్నది. ఈ ఆలయము ఉదయం 4-30 నుండి 8-30 వరకు మాత్రమే తెరచి యుండి తరువాత మూసివేయబడుతుంది. స్థానిక ప్రజల సహకారముతో రోడ్డులోపల ఉన్న ఈఆలయమును చేరవచ్చును. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది మరియు భీకరమైనది. అందువలన నేరుగా చూచుట నిషిద్దము. అమ్మవారు నేలమాగళి నందు ప్రతిస్టించబడినది. కావున నేలపై రెండు గ్రానైట్ఫలకలు తొలగించబడి రంద్రములువలె ఉండును. ఒకరంద్రము నుండిపాదములు ఇంకొక రంద్రమునుండి లీలగా ముఖభాగము గోచరించును. ఆరీతిగానే చూడవలసి యుండును. పూజారి తప్ప ఇంకఎవరికి నేలమాగళి ప్రవేశము లేదు.
క్రొత్తగాపెళ్ళైనజంట కొన్నినెలల క్రితం అన్నిదేవాలయాలు దర్శనం చేస్తూ వారణాశివచ్చి ఈదేవాలయాన్ని సందర్శించారు. పూజారి పలకఖాళీనుండి చూడమని తెలియజేయగా వినలేదు. పూజారివారితో అమ్మవారికి శాంతకళ, ఉగ్రకళ అని రెండు ఉంటాయి అని, శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు అని, ఉగ్రకళ అనగా దుష్ట సంహరనార్థం ఎత్తిన అవతారంఅని, ఆకళని సామాన్యులు తట్టుకోలేరు అని, తానువెళ్లినా ఆకళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తానుఅని, కాబట్టి చూడవద్దు అని చెప్పారు. వారు వినలేదు. వెళ్ళి ఆఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేక క్షణాలవ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరు కిందపడి మరణించారు. కాశీఖండము 70 నందు ఈ వారాహిదేవిని దర్శించినవార్కి ఎటువంటి ఆపదలు కలుగవని చెప్పబడినది. మరియు వారాహి అమ్మవారు వరాహఅవతారము శక్తియని ఈ శక్తివారణాశిని దుష్టగ్రహములనుండి కాపాడునని వారాహిఅమ్మ వారు రాత్రిఅంతయూ కాశీ పట్టణమును కావాలి కాశీ సూర్యోదయమునకు పూర్వము ఆలయప్రవేశముచేయునని తెలియుచున్నది. ఈ అమ్మవారి ఉగ్రరూపమును ఉపాసనచేయువారు తప్పఆన్యులు ఎవరూ చూసితట్టుకొనలేరని, పూర్వము పోతన మహా భాగవతమును నందు యజ్నవరాహము వ్రాయుసమయములో ఒక రాజు భాగవతమును అంకితమివ్వమని అడిగి పోతన ఆ గ్రందమును శ్రీరామునికితప్ప ఇతరులకు అంకితమిచ్చుటకు నిరాకరించుటవలన అప్పటివరకూ పోతన వ్రాసిన భాగగతమును బలవంతముగా పొందు నుద్దేశ్యముతో సైన్యముతోరాగా అతి పెద్ద వరాహారూపము నిరోధించినాడు. అప్పుడు రాజుపోతనను క్షమింపకోరినాడు. పోతన వారాహిశక్తి వచ్చి కాపాడినదిఆని తెలిపినాడు. వారాహదేవత వారణాశికి గ్రామదేవత. వారణాశి దర్శించినవారు ఈఅమ్మవారిని దర్శించిన తాముఎదుర్కొనే అన్నీ లిటిగేషన్ల నుండి ప్రభుత్వ ఇబ్బందులనుండి రక్ష పొండేదరని చెప్పబడినది మరియు ప్రజల నమ్మకం.
వారణాశిలో ప్రతిరోజూ గంగానదికి ఇచ్చే గంగాహారతి ముఖ్యమైనది. మనోహరమైనది. వేలాదిమంది భక్తులు మరియు విదేశీయులు దశాశ్వమేధ ఘాట్ నందు నిత్యము సాయంత్రముజరిగే ఈహారతిని సందర్శకులు ఎవరునూ చూచుటకోల్పోరాదు. అయిదుగురు పూజారులు ఏక రూప ధోవతి కుర్తా దుస్తులు వేసుకొని పెద్ద రుమాలు శరీరమునకు బిగుతుగా కట్టుకొని అయిదు పెద్ద పెద్ద ఇత్తడి దీపపుకుందెలతో, పరిమళభరిత అగరవత్తులు, సాంభ్రానిధూపముతో, పూవులతో వేదములు ఉపనిషత్తులు చదువు విధ్యార్ధుల గంభీరమైన గొంతులతో గంగా నదికి హారతి ఇచ్చేదరు. కొన్ని వేలమందిభక్తులు హాజరై హర హరమహాదేవ అని స్తుతించు ఆ ఘట్టము చూడవలసినదే కానీ వర్ణించ సాధ్యము కాదు. ఈ మొత్తము కార్యక్రమము సాయంత్రం సుమారు 6.00 గంటలకు ప్రారంభమై 45 నిమిషములు కొనసాగును.
ఇవేకాక వారణాశిలో పలుఆలయములు కలవు అందు ముఖ్యమైనవి దుర్గాదేవి ఆలయం, సంకటమోచన ఆలయం, నేపాలీ ఆలయం, భారత మాత మందిరం, తులసీమాత మందిరం, కర్ధమహేశ్వర మందిరం మరియు 64 ఘాట్లు. ఈ ఘాట్ల నందు ప్రముఖమైనవి ధశాశ్వమేధ ఘాట్, ప్రయాగ ఘాట్, సోమేశ్వర ఘాట్, మీర్ ఘాట్, నేపాలీఘాట్, మణికర్ణికాఘాట్, విశ్వేశ్వర్ ఘాట్, పంచగంగాఘాట్, గాయ్ ఘాట్, తులసిఘాట్, హనుమాన్ ఘాట్, అస్సీఘాట్, హరిచ్చంద్రఘాట్, మానససరోవర్ ఘాట్, నారదఘాట్, చౌతాస్సీఘాట్, రాణామహల్ ఘాట్, అహల్యాభాయ్ ఘాట్.
యాత్రికులు వారణాసితో పాటు గయా మరియు అలహాబాద్లలో తమ పూర్వీకులకు ఆచారాలు నిర్వహించవచ్చు. 50 శాతం మంది యాత్రికులు దక్షిణ భారత రాష్ట్రాల నుండి వారణాసికి మరియు బహుశా 20 శాతం మంది ఆంధ్రా నుండి వస్తున్నారని కూడా గమనించాలి. 80 శాతం మంది స్థానికులు ఇతర భాషలతో పాటు తెలుగు బాగా మాట్లాడే వారు కాబట్టి మనం ఇబ్బంది పడవచ్చు.
IPLTOURS – Indian Pilgrim Tours