జోగులాంబ దేవి
(5వ శక్తి పీఠం)
జోగులాంబ మహాదేవీ !
రౌద్ర వీక్షణ లోచనా!!
అలంపుర స్థితా మాతా!
సర్వార్ధ ఫల సిద్ధిదా!!
(5వ శక్తి పీఠం)
జోగులాంబ మహాదేవీ !
రౌద్ర వీక్షణ లోచనా!!
అలంపుర స్థితా మాతా!
సర్వార్ధ ఫల సిద్ధిదా!!
బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.
దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.
మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.
సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.
సతీదేవి ఖండిత శరీర భాగములందు పైపళ్ళు పడిన పవిత్ర క్షేత్రము అష్టాదశశక్తి పీఠములలో 5వ శక్తిపీఠము జోగులాంబదేవి శక్తిపీఠము. జోగులాంబ శక్తిపీఠము తెలంగాణా రాష్ట్రంలో గద్వేల్ జిల్లానందు కలదు. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపూర్ ఆలయం ఉంది. అలంపురం ద్వాదశ జ్యోతిర్లింగాములలో రెండవ జ్యోతిర్లింగమైన మల్లిఖార్జునుడు మరియు అష్టాదశ పీఠములలో ఆరవ శక్తి పీఠము అయిన బ్రమరాంబ కొలువై ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు పశ్చిమద్వారంగా భావించబడినది. శ్రీశైలం పుణ్య క్షేత్రమునకు సిద్ధవటం దక్షణ ద్వారంగాను, త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను మరియు ఉమామహేశ్వవరం ఉత్తర ద్వారంగాను భావిస్తారు. తుంగభద్రా, కృష్ణానదులు అలంపురంనకు దగ్గరలో కలుస్తాయి. కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు.
అలంపురం నందు గల నవబ్రహ్మ ఆలయములు సుమారు 1300 సంవత్సరములకు పూర్వము నిర్మించబడినది. ఈ తొమ్మిది నవబ్రహ్మ ఆలయములు శివాలయములే. బాల బ్రహ్మేశ్వరాలయం నవ బ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనది. జోగులాంబాలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధానార్చకాలయం ఇదే. ఈ దేవాలయం చుట్టూ బహిఃప్రదిక్షణాపథాన్ని, ప్రాకారాన్ని, ముఖమంటపాన్ని చాళుక్య కట్టించినట్లు తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయములో నుండేదిడి అమ్మవారి విగ్రహం ఆలయంలోని గర్భగుడిలో ఆశీనముద్రలో తేలు, కప్ప మరియు బల్లితలపైకల శవముపై ఆసీనురాలై ఉంటుంది. నాలుక వెలుపలికి పెట్టి భయంకరమై యోగులకు సిద్ధినిచ్చు అవతారముతో దర్శనము ఇస్తుంది. కావున జోగులాంబ పేరుతో పిలువబడుతున్నది.
అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కొనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఆతల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి. జోగులాంబఅనునది యోగులకు తల్లిఅయిన యోగుల అమ్మనుండి రూపాంతరము చెందినది. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు జోగులంబ ఉగ్రస్వరూపాన్ని కిటికీ గుండా చూసేవారు. 2008 సంలో నూతన ఆలయ నిర్మాణం చేసి శాంత స్వరూపంతో జోగులాంబను ప్రతిష్టించారు. శంకరాచార్యులవారు జోగులాంబ ఆలయమునందు శ్రీచక్రమును ప్రతిస్ఠించినారాని తెలిపేదరు కానీ ఇప్పుడు ఆ శ్రీచక్రము లభ్యముగాలేదు.
పురాతన ఆలయాలు అన్నీ 2009 సం.లో తుంగభద్ర నది ఉప్పొంగడంతో వరదలయందు ఆలంపురం గ్రామంతోపాటు నీటమునిగాయి. అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్ని వైపులా రక్షణ గోడ ఉంది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి. కాని ముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే, పట్టణంలోని ఆలయాలు పాడై, పునర్నిర్మాణ అసాధ్యమై, వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి, అది ఊరికి అరిష్టంగా తలచి, అప్పటి ఆలయ ధర్మకర్త, ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకులు ఊరి పెద్దలను ఒప్పించి, గ్రామ పున నిర్మాణానికి దక్కే నష్టపరిహారపు సొమ్మును వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి, నిర్మించారు. ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికి పశ్చిమం వైపు ఎత్తు తక్కువగానూ, తూర్పు వైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తులోనూ ఉండి, కోటగోడను తలపిస్తుంది, వర్షా కాలంలో నది జోరుగా ప్రవహించినా ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు. పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది. ఈ నీరు తుంగభద్ర వైపు వెలుతుంది. అయితే రక్షణ గోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి చేరుస్తుంటారు. ఈ అల్లయము ప్రస్తుతము పురాతన వస్తు శాఖ వారి ఆధ్వర్యములో నున్నది.
ప్రాచుర్యములోనున్న కధనము ప్రకారము ఆరవ శతాబ్దములో రససిద్ధుదను సన్యాసికి ఇనుమును బంగారముగా మార్చగల శక్తి ఉండేడిదని, ఆరవ శతాబ్దమునందు చాళుక్యరాజు పులకేశి అనువారు ఇచట నవబ్రహ్మల ఆలయము నిర్మించు భాధ్యత వప్పగించినట్లు స్కందపురాణముయందు వివవించబడినది. శివుని గురించి బ్రహ్మ ఘోరతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై సృష్టిచేయు వరము ఇచ్చినాడు. అందువలన బ్రహ్మేశ్వరుడు అయినాడు. సంగమేశ్వరుడు అన్నపదము సంగమమునుండి వచ్చుటవలన ఈఆలయమును సంగమేశ్వరఆలయము అనికూడా అందురు. రససిద్ధుడు ఔషధమూలికల పీరులతో తొమ్మిది శివరూపములతో స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుఢ బ్రహ్మ మరియు తారక బ్రహ్మ పేర్లతో ఈఆలయములు ఇచట నిర్మించినట్లు తెలియుచున్నది. సిద్ధ రసర్ణవం అనునది తాంత్రికవిధ్య అని, సూచించిన తంత్రము ప్రకారము ఉపాసన చేసినట్లయిన బాలబ్రహ్మలింగము నుండి, సుబ్రహ్మణ్యస్వామి తొడలునుండి, గణపతిబొడ్డు నుండి మరియు తల్లి జోగులాంబ నోటినుండి స్రవించు పాదరసము ఔషధమూలికలు ఉపయోగించి బంగారంగా మార్చవచ్చును. నవబ్రహ్మఆలయములు నిర్మాణ సంబంధముగా చారిత్రాత్మిక విలువలుఉన్న ఆలయములు. ఈఆలయ సంపద పురాతనసంపదగా కేంద్రప్రభుత్వ పురావస్తుశాఖ వారు గుర్తించినారు. శ్రీశైలంహైడ్రో ప్రాజెక్టునందు ఈ ఆలయప్రదేశము ముంపునకు గురికాబడుటవలన ఎత్తైన ప్రదేశము గుర్తించి ఉత్తరభారతవాస్తు తరహాలో నిర్మించినారు.
దర్శన సమయములు: ఉదయం 6 నుండి 12 వరకు సాయంత్రం 4 నుండి 8 వరకు ప్రవేశ రుసుము రూ200/- అఖిలభారత కరవేనసత్రమునందు ముందుగాతెలుపు పద్దతిపై ఉచిత భోజనసదుపాయము కలదు. అలంపురమునందు ఆలయమునకు చేరువలోనే ప్రైవేటు హోటల్స్ నందు వసతి సదుపాయము కలదు.
IPLTOURS – Indian Pilgrim Tours