ఋషీకేశ్
(IPLTOURS)
చార్ ధామ్ యాత్రగాని మానస సరోవర్ యాతరకాని హిమాలయమూలందు ఏ పుణ్యక్షేత్రం దర్శించవలెనన్నా హరిద్వార్ మీదుగానే వెళ్లవలసి ఉంటుంది. హిమాలయాలలోని పుణ్యక్షేత్రములు ఋషీకేశ్ లేదా హరిద్వార్ నుంచి ప్రారంభం చేయవచ్చు. ఋషీకేశ్ హరిద్వార్ నుండి 30 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుండి హరిద్వార్ మరియు ఋషీకేశ్ నకు రైలుసౌకర్యం కలదు. చార్ ధామ్ యాత్రలో దర్శించు ముఖ్యక్షేత్రములు గంగోత్రి, యమునొత్రి, కేదార్నాధ్ మరియు బదరీనాధ్ సంవత్సరములో ఆరునెలలు అంటే ప్రతిసంవత్సరం మే నెలనుండి నవంబరు నెలవరకు మాత్రమే తెరచి ఉంటాయి. డిసెంబరునుండి మే నెలవరకు ఆరునెలలు విపరీతంగా మంచుకురియుటవల్ల చలి అధికంగా ఉంది ఆలయాలు మూసివేస్తారు. యాత్ర చేయువారికి మే నెల నుండి ఆగస్టు వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో సాదారాణ దుస్తులతో ప్రయాణం చేయవచ్చు. సెప్టెంబరు నుండి నవంబరు వరకు వర్షములతో చలిగా ఉంటుంది. ఈసమయంలో ఉన్నిదుస్తులు, బూట్లు ధరించవలసి ఉంటుంది.
దత్త పీఠము ఋషీకేశ్ నందు కలదు. ముందుగా సంప్రదించి అవధూత ధత్తపీఠం నంధు నివాస భోజన సదుపాయములు పొందవచ్చును. ఇచటదత్తఒపీఠమునందు రూమ్ బుక్ చేసుకొనిన ప్రయాణము సులభతరమగును. దత్తపీఠంతో పాటు అనేక ఆశ్రమాలు ఉన్నాయి. హరిద్వార్ నుండి రవాణా సౌకర్యం బాగానే ఉంటుంది. ఋషీకేశ్ నందు యీ క్రింది ఆలయములు మరియు ప్రదేశములు చూడ తగినవి.
త్రివేణి ఘాట్
త్రివేణి ఘాట్ ఋషికేష్ పట్టణం మధ్యలో గంగానది ఒడ్డునఉంది. యాత్రికులు ఉదయమే గంగాస్నానంచేసి ఆలయాలు దర్శిస్తారు. దసారా, ఏకాదశి మరియు పౌర్ణమినాడు వేలసంఖ్యలో యాత్రికులు స్నానం చేస్తారు. ఇక్కడ పూజలు చేయటంతోపాటు నీళ్ళలోఉండే చేపలకు ఆహారం, పాలు పోస్తారు. వారణాశి (కాశీ), హరిద్వార్ వలె ఇచటకూడా ప్రతిరోజూ సాయంత్రం 6 గం నుండి 7 గం వరకు గంగా హారతి వివిధవాయిద్యములతోనూ మరియు డప్పులతో జరిపుతారు. భక్తులు నిశబ్దంగా హారతి చూడవచ్చు లేదా హారతిఇచ్చు మరియు స్థానిక భక్తులతో పాటు వారు ఉచ్చరించు గీతములు మరియు స్త్రోత్రములలో గొంతు కలుపవచ్చును. ఈ హారతి కూడా లైటింగు పెట్టుటవలన మిక్కిలి రమ్యముగా నుండి చూడతగినది.
స్వర్గ ఆశ్రమం
త్రివేణి ఘాట్ సమ్మీపములోనే ఈ స్వర్గ ఆశ్రమం కలదు. ఇది చాలా పురాతనమైనది. ఇచట యోగా మేడిటేషను నేర్పెదరు. ఈ ఆశ్రమం మంతా తిరగి చూడవలేనన్న సుమారు 2 గంటలు సమయము పట్టును. ప్రవేశ రుసుము లేదు అన్నిరోజులలోనూ అన్నీ వేళలయందు తెరచి ఉంచబడును.
పరమార్ధ నికేతన్
ఋషీ కేష్ నందు గల పురాతన పెద్ద ఆశ్రమము. ఈ ఆశ్రమము 1942 సంవత్సరములో పూజ్యస్వామీజీ యోగానంద మహరాజ్ జీ చే స్థాపించబడినది. ఇచట యాత్రికులు బస చేయుటకు సుమారు 1000 రూములు కలవు. ఇచట యోగా, మేడిటేషను తో పాటు పురాతన ఆయుర్వేద వైద్యము చేయబడును. ఇచ్చటినుండి గంగా హారతికి వెళ్లవచ్చును మరియు సూర్యాస్తమయము చూచుటకు కడు రమ్యముగా యుండును.ఇచట వాతావరణము ప్రశాంతముగా యుండి అందమైన ఉద్యాన వనములు కలవు. పరమార్ధ నికేతన్ నందు ప్రతిరోజూ త్రివేణి ఘాట్ మాదిరిగా గంగా హారతి ఇచ్చేదరు. ఈ హారతి ఈ ఆశ్రమమునందు వేదము చదువుచున్న విధ్యార్ధులచే నీయబడి చూడుటకు కడు రమ్యముగా యుండును. వీక్షకులు నిశబ్ధముగా ఈ హారతి చూడవచ్చును లేదా హారతి ఇచ్చు మరియు స్థానిక భక్తులతో పాటు వారు ఉచ్చరించు గీతములు మరియు స్త్రోత్రములలో గొంతు కలుపవచ్చును.
శివపురి
ఋషీ కేష్ నము 19 కిమీ దూరములో గంగానది ఒడ్డున ఉన్నది. ఇచట ప్రాచీన శివాలయము ఉన్నాను ఇటీవల కాలములో శివపురి గంగానదిలో నౌకా విహారమునకు కేంద్రమైనది. నౌకావిహారమునకు రుసుము వసూలు చేయుడురు.
భరత్ మందిర్
త్రివేణి ఘాట్ సమీపములోనే యీ భరత్ మందిర్ ఉన్నది. క్రీస్తు శకము 9 వ శతాబ్దములో ఆది శంకరాచార్యులు ఏకశిలపై (శాలిగ్రామమందురు) పై చెక్కబడిన విష్ణుమూర్తి విగ్రహమును ఇచట ప్రతిస్తించారు. ఈ ఆలయము 1398 సవత్సరములో పూర్తిగా పతనం చెయ్యబడినది. బసంత పంచమినాడు యీ ఆలయము సందర్శించిన రమ్యముగా నుండును.
ఋషి కుండం మరియు రఘునాధ్ మందిరం
త్రివేణి ఘాట్ సమీపములోనేకుబ్జ మహర్షికి యమునా నది అనుగ్రహమువలన నింపబడిన పురాతనమైన కుండం కలదు. దీనినే ఋషి కుండం అంటారు. ఇచ్చటనే రఘునాధ్ మందిరం అనబడు సీతా రాముల ఆలయమున్నది.
లక్ష్మణ్ జూలా
స్వర్గ ఆశ్రమమునకు రెండు కిలీమీటర్ల దూరములో తపోవన్ అనుస్థలములో 1923 సంవత్సరములో రాముని తమ్ముడు లక్షమణుని గుర్తుగా గంగా నదిపై 70 అడుగుల ఎత్తున నిర్మించబడిన లక్ష్మణ్ జూలా అనబడు 450మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ కలదు. ఇటీవల అనగా ప్రస్తుత సంవత్సరములో యీ బ్రిడ్జ్ అనేకచోట్ల పాడై బరువు మ్రోయు స్థితిలో లేనందున రాకపోకలను నిషేధించియున్నారు. ప్రస్తుతం పాదచారులను ద్విచక్ర వాహనములను మాత్రమే అనుమతించుచున్నారు. యీ బ్రిడ్జి కి రెండువైపులా వివిధ దేవాలయములు కలవు.
త్రయంబకేశ్వర్ ఆలయం
త్రయంబకేశ్వర్ ఆలయం ఋషికేశ్‌లోని ఒక హిందూ దేవాలయం మరియు ఇది రిషికేశ్ పవిత్ర స్థలములలో ఒకటి. ఈఆలయం రిషికేశ్ లోని లక్ష్మణ్ జూలాకు సమీపంలో ఉంది మరియు మహారాష్ట్రలోని నాసిక్‌లో త్రయంబకేశ్వరుని పేరును సూచిస్తుంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరుడు ఒకటి. ఈఆలయం 13 అంతస్తుల భవనం మరియు దీనిని ‘తేరా మంజిల్ ఆలయం’ అని పిలుస్తారు. ఆలయంలో వివిధ హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ప్రధానంగా ఇది శైవక్షేత్రం.‘త్రయంబకేశ్వర్’ శివుని నివాసంగా తలచెదరు.
ఆలయం ఉదయం 6-00 నుండి సాయంత్రం 7-00 వరకు తెరిచి ఉంచబడుతుంది.
రామ్ జూలా మరియు గీతా భవన్
ఋషీకేశ్ నకు ఉత్తరముగా 3 కిమీ దూరంలో 1983 సంవత్సరములో నిర్మించబడిన రామ్ జూలా బ్రిడ్జి కలదు. రామ్ జూల మరియు లక్ష్మన్ జూల వంతెనలు స్టీలుతో ఒకేరకంగా కట్టబడినవి. లక్ష్మణ్ జూలా బ్రిడ్జ్ నకు దిగువగా తూర్పువైపున గల శివానంద ఆశ్రమం మరియు పడమరవైపున కల స్వర్గ ఆశ్ర మములను కలుపుచూ గంగానదిపై రామ్ జూలా బ్రిడ్జ్ కలదు. ఇచ్చటనే గీతా భవన్ కలదు.
నీలకంటేశ్వర్ మహదేవ్ ఆలయం
నీలకంఠ మహదేవ్ ఆలయం బాగా ప్రాచుర్యము పొందిన ఆలయం. ఈ ఆలయం సముద్ర మట్టమునకు 5500 మీటర్ల ఎత్తున ఉన్నది. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం వాసుకి మరియు మేరు పర్వతంతో క్షీరసాగరం మధించి నప్పుడు సముద్రంనుండి హాలాహల్ (విషం) ఉద్భవించిందని చెబుతారు. పరమేశ్వరుడు ఇచ్చటనే హాలాహలం స్వీకరించి కంఠమునందు ధరించినాడని అందువలన ఈ అలయమునకు నీలకంఠ మహదేవ్ ఆలయమని పేరు వచ్చినదని చెబుతారు. ఈఆలయం ఉందయం 6 గం నుండి సాయంత్రం 7 గం వరకు తెరచి యుండును. ప్రవేశము ఉచితము.
రాజాజీ నేషనల్ పార్క్
ఈ పార్కులో భీట్ లెస్ ఆశ్రమం అనునది కలదు. 1968 సంవత్సరములో మహర్షి మహేశ్ యోగి ప్రవచనములు వినుటకు యోగా మరియు మేడిటేషన్ నందు పాల్గొనుటకు విదేశీయులు ఇక్కడికి వచ్చినారు. ఆశ్రమ సందర్శనకు టికెట్టు వేల రూ 150/-.
పైన తెలుపబడిన ఆలయములు కాకుండా హృషీకేశ్ నందు యువతను ఆకట్టుకొనే నీలాగ్రహ్ జలపాతం ఉన్నది. ఇచట గంగానదిలో నౌకా విహారం చాలా ఆహ్లాదం కలిగిస్తుంది. ఋషేకేష్ సందర్శన్ కేంద్రం నుండి చూచినట్లయిన ప్రకృతి రమణీయంగాను మనోహరంగాను కనపడుతుంది.