రామేశ్వరం

(IPLTOURS)

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి

హిందువులకు రామేశ్వరం ముఖ్యమైనది. వారణాశి తీర్థయాత్ర రామేశ్వరంయాత్ర లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. రామనాథస్వామి దేవాలయంతోపాటు రామేశ్వరపట్టణం బద్రీనాథ్, పూరి మరియు ద్వారకలతో కూడిన పవిత్రమైన (చార్ ధామ్) నాలుగు దైవిక ప్రదేశాలు ప్రదేశాలలో ఒకటి. శంకరాచార్య స్థాపించిన హిందూ మతం యొక్క అద్వైత పాఠశాల, చార్ ధామ్యొ క్క మూలాన్ని తెలియచేస్తుంది. నాలుగు మఠాలు భారతదేశంలోని నాలుగుదిక్కులందు ఉన్నాయి మతములా సహాయక దేవాలయాలు ఉత్తరాన బద్రీనాథ్ వద్ద బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ వద్ద జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక వద్ద ద్వారకాధీశుని ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాలు ఉన్నాయి. సైద్ధాంతికంగా దేవాలయాలు హిందూ మతం, అంటే శైవం మరియు వైష్ణవం మధ్య విభజించబడినప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర అనేది మొత్తం హిందూ వ్యవహారం. భారతదేశంలోని నాలుగు దిక్కులమీదుగా ప్రయాణాన్ని హిందువులు తమ జీవితకాలంలో ఒకసారి ఈ దేవాలయాలను సందర్శించాలని కోరుకుంటారు. సాంప్రదాయకంగా యాత్ర తూర్పున పూరినుండి ప్రారంభమవుతుంది, హిందూ దేవాలయాలయములందు ప్రదక్షిణకోసం సాధారణంగా అనుసరించే పద్ధతిలో గడియారంముల్లు తిరుగుదిశలో ముందుకు సాగుతుంది.

రామేశ్వరం బంగాళాకాతము మరియు హిందూ మహాసముద్రములు సంగమప్రదేశంలో పంబన్ ద్వీపమునందు కల పుణ్యక్షేత్రము మరియు ద్వాదశ జ్యోతిర్లింగములలో 7వ జ్యోతిర్లింగము. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతి గాంచినవి.  కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనమిచ్చును. కేదార్నాథ్ నందు మాత్రము ఎద్దుమూపురము రూపములో దర్శినమిస్తాడు. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధరూపములతో ఖ్యాతినార్జించినది. రామేశ్వరం చేరుటకు తమిళనాడు మరియు పంబన్  ద్వీపముకలుపు పంబన్ బ్రిడ్జిపై ప్రయాణించవలయును. ఈరైల్వేబ్రిడ్జికి సమాంతరముగా రోడ్డుబ్రిడ్జి నిర్మించబడినది. పంబన్ బ్రిడ్జి మండపం మరియు పంబన్ తీరములను కలుపుచూ నిర్మించబడినది. రైల్వేబ్రిడ్జిపై ప్రయాణము యాత్రికులకు ఆనందదాయకము.

రామనాథస్వామి దేవాలయం

రామేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలో కల 12 జ్యోతిర్లింగాలలో శ్రీరామ ప్రతిస్టీతమై రామునిచే అర్చించబడిన ఏడవ జ్యోతిర్లింగం. హిందూ ఇతిహాసముల ప్రకారం శ్రీరాముడు సీతను అపహరించిన రావణునినుండి సీతను రక్షించుటకు లంకచేరునిమిత్తము రామేశ్వరం నందు సముద్రముపై సేతువు నిర్మించినాడు. శివుని జ్యోతిర్లింగమైన రామనాధస్వామిఆలయము తామేశ్వరపట్టణం మధ్యలో శ్రీరాముని మరియు శివుని ఒకేప్రదేశమందు కలుపుకూ శైవులను మరియు వైష్ణవులకు పుణ్యక్షేత్రమైఉన్నది. రామేశ్వరం భారతదేశమునుండి శ్రీలంక చేరుటకు ఆటిదగ్గరప్రదేశము మరియు భారతదేశమునుండి శ్రేలంక చేరుటకు రామసేతునిర్మాణముపై ఆధారములున్నవి. రామేశ్వరంనందు అధికశాతంప్రజలు పర్యాటకులపైఆధారపడి జీవించుచున్నారు. ఈశ్వరుడు అనగా భగవానుడు. రామేశ్వరుడుఆనగా రామభగవానుడు. 

ramewsaram india

శివుడు రామనాద్ధేశ్వరస్వామిగా ఆలయమందు కొలువైఉన్నాడు. పురాణముల ప్రకారము రాముడు శ్రేమహావిష్ణువు ఏడవఅవతారము. రాముడు సీతాలక్ష్మణసమేతుడై రావణునిసంహరించుటవలన చేసిన బ్రహ్మహత్యపాపమునుండి విముక్తిపొందుటకు ఋషుల సలహామేరకు శివుని ఇచట అర్చించినాడు. రామాయణమునందు రాముడు శివుని తనకస్టములనుండి విముక్తి చేయకోరుచూ అర్చించుటకు పెద్దలింగము హిమాలయములనుండి తెచ్చుటకు హనుమంతుని ఆదేశించగా హనుమంతుడు శివలింగముతెచ్చుటలో జాప్యముకలిగినది. అప్పుడుసీత సముద్ర తీరములోకల ఇసుకతో ఒకచిన్నలింగము చేసినది. అదియే ప్రస్తుతము గర్భాలయము నందున్న శివలింగమని భావించబడుచున్నది. ఈలింగముపై అభిషేకములు చేయుటనిషిద్ధము.

ఆధ్యాత్మరామాయణంనందు శ్రీరాముడు రామేశ్వరమునను 22 కి.మీ దూరములోనున్న ధనూష్కోడివద్ద రామసేతు నిర్మాణము నకుముందుగా లింగరూపమునందు శివుని అర్చించినట్లు తెలుస్తున్నది. ఆలయపూజారులు శృంగేరిమఠమునుండి దీక్షతీసుకొనిన మరాటాబ్రాహ్మణులు. ఆలయమునందు ఆదిశంకరాచార్యులువారిచే స్థాపించబడిన స్పటికలింగము కలదు. ప్రాతః కాలమున ప్రతిరోజు ప్రధానలింగమునకు అర్చనచేయుటకుముందుగా స్పటికలింగమునకు అభిషేకము నిర్వహించేదరు. స్పటికము వేడిని హరించును. శరీరములోని వేడినితగ్గించుటకు ప్రజలు స్పటికమాలను ధరింతురు. మేషరాశికిచెందిన స్త్రీ పురుషులు రామనాధ జ్యోతిర్లింగమును అర్చించిన దోషములు తొలగును.                                                                                          

ఆలయ తీర్ధములు

రామేశ్వర ఆలయమునందు మరియు ద్వీపము చుట్టూ 64తీర్ధములు (నీటి నూతులు) ఉన్నవి. స్కంధపురాణము ప్రకారము ఈతీర్ధములలో 24 అత్యంత ప్రధానమైనవి. ఇందులో 22 తీర్ధములు ఆలయ ప్రాంగణములోఉన్నవి. ఈ తీర్ధములందలి నీటితో స్నానముచేసిన పాపములనుండి విముక్తిపొందేదరని నానుడి. కావున యాత్రికులు ఈతీర్ధములలో స్నానము ఆచరించుట ఒకనియమముగా తలచెదరు ఈతీర్ధముల వద్దనున్న బాణముగుర్తులు రాముడు వేసిన 22 బాణములుగా తలచెదరు. మొదటిది ముఖ్యమైనతీర్ధము బంగాళాఖాత సముద్రతీరమునందున్న అగ్ని తీర్ధము. పక్షులరాజైన జటాయువు సీతను అపహరిచుకొనిపోవు రావణునితో యుద్ధముచేసి రెక్కలుపొగుట్టుకొని నేలపైపడిన ప్రదేశము జటాయుతీర్ధము. ఆలయమునుడి పంబాన్ ప్రోవు మార్గములో ఏడు కిలోమీటర్ల దూరములో విల్లోంది తీర్థం. ఈటీర్థమును సముద్రపు నీటిలో విల్లును ముంచడం ద్వారా రాముడు సీత దాహాన్ని తీర్చిన ప్రదేశంగా నమ్ముతారు. హనుమాన్ తీర్ధము, సుగ్రీవతీర్ధము లక్ష్మణతీర్ధములు ఇతర ముఖమైనతీర్ధములు. ఈతీర్ధముల వద్దనున్న బాణముగుర్తులు రాముడు వేసిన 22 బాణములుగా తలచెదరు.

గంధమాధన పర్వతం  

గంధమాధనపర్వతం రామేశ్వరఆలయమునకు ఉత్తరముగా మూడుకిలోమీటర్ల దూరములోఉన్న ద్వీపములో ఎత్తైనప్రదేశముకల ఒకకొండ. ఇచ్చట రాముని పాదముగుర్తు చక్రరూపములో రెండు అంతస్తులహాలునందు కనపదును మరియు రామార్ పాదం ఆలయము ఉన్నది. ఆలయమునుండి చూచిన పంబన్ దీవిఅంతయు కనపడును. శ్రీరాముడు లంకకువారధి నిర్మించుటకు ముందుగా ఇచ్చటనే నిలబడి వారధినిర్మించు స్థలమును నిర్ణయించినట్లునమ్మకం. అంతేకాక హనుమంతుడు తదితర వానరసేన లంకకుబయలు దేరుటకు ముందు ఇచ్చటనే విశ్రాంతితీసుకొన్నట్లు పేర్కొనబడినది. 

 కోదండరామస్వామి ఆలయం         

ధనుష్కోడి ద్వీపం యొక్క దక్షిణ కొన మరియు రామేశ్వరం పట్టణమునకు 12 కిలోమీటర్ల దూరములో కొదండరామస్వామిఆలయం కలదు. సుమారు వెయీసంవత్సరముల పురాతన ఆలయం మరియు రామేశ్వరంనందు దర్శించవలసిన ప్రదేశములలో ఒకటి. ఆలయము బంగాళాఖాత సముద్రముచే చుట్టబడిన ద్వీపములోనున్నది. స్వామివివేకానంద చికాగో పర్యటనకు వెళ్ళుటకు ముందుగా ఈయాలయము దర్శించినారు. 60 సం లకు పూర్వం సంభవించిన తుఫానునందు రామేశ్వరం మొత్తము ధ్వంశముకాబడినను ఈఆలయం చెక్కు చెదరలేదు. కధనము ప్రకారం రామునికి రాక్షసరాజైన రావణునికి యుద్ధము జరుగుటకు ముందుగా సీతను శ్రీరామునికి అప్పగించమని రావణునికిచెప్పి విఫలమైన విభీషణుడు ఇచ్చటనే శ్రీరాముని శరణుచొచ్చినాడు. ఆలయసమీపంలోనే బృంగిమహర్షి ఆశ్రమం ఉండేడిదని శ్రీరాముడు కొద్దికాలము ఆశ్రమంనందు గడిపినాడుఅని బృంగిపేరుపై ఇచ్చట ఆలయాకోనేరు ఉన్నదనితెలియుచున్నది.  

పంచముఖ హనుమాన్ ఆలయం   

ఈ పంచముఖ హనుమాన్ ఆలయము వద్ద రామసేతు నిర్మాణమునకు శ్రేరాముడు మరియు వానర సేన ఉపయోగించిన రాళ్ళు చూడవచ్చును. ఈ రాయిని నీటిలో వేసినట్లయిన ఆ రాయి 20 కేజీల బరువు కలది అయిననూ అది నీటిలో తేలుతుంది కానీ మునిగిపోధు లభ్యమైన రాయి వేసి చూచుట జరిగినది.

రామ సేతు    

రామ సేతు అనునది శ్రీలంక వాయువ్య తీరంలోని పంబన్ ద్వీపం మరియు మన్నార్ ద్వీపం అని పిలువబడే రామేశ్వరం ద్వీపం మధ్య సున్నపురాళ్లతో కలుపబడిన గొలుసు. ఈ వంతెన భారతదేశానికి మరియు శ్రీలంకకు మధ్య 48 కి.మీ.ల దూరముతో గతములో ఉన్న భూ సంబంధమని స్పష్టమవుతోంది. రామసేతు వెలుపల సముద్రం లోతు ఉన్నప్పటికీ రామసేతుపై మాత్రము 3 అ వరకు ఉంది. ఆరువందల సంవత్సరాల క్రితంవరకు రాకపోకలకు అవకాశంఉందని గమనించవచ్చును మరియు ఆకాలములో సంభవించిన తుఫాను వరకు సముద్ర మట్టానికి పూర్తిగా పైనఉండేది. ఇప్పటికీ వంతెనకొరకు ఉపయోగించిన సున్నపురాళ్లు అందుబాటులో కలవు.

ఇంకనూ సుగ్రీవుని ఆలయం, భద్రకాళి ఆలయం, రామతీర్ధం ముఖ్యమైనవి. రామేశ్వరమునందు బస చేయుటకు అనేక సత్రములు, మఠములు, రైల్వే విశ్రాంతి గదులు  మరియు  ఆలయ అతిధిగృహములు ఉన్నవి. సత్రములందు, మథములు మరియు ఆలయములో ఉచిత ఆన్నదానపధకము అమలులో ఉన్నది. రామేశ్వరమునందు అన్నీదేవాలయములు మరియు ప్రదేశములు దర్శించుటకు రెండురోజులు బాసచేయవలసి ఉండును.