ప్రధమ నంది
(IPLTOURS)
నవనందులు దర్శనము ప్రారంభించుటకు ముందుగా నంధ్యాలనందుకల కాళికాంబ చంద్రశేఖరస్వామి ఆలయములోనున్న విఘ్నేశ్వరునిపూజించి పిమ్మట నంద్యాల పట్టణమునందు రైల్వే స్టేషన్ సమీపములో ఎత్తైన ఇసుకదిబ్బపైనున్న ప్రధమనంది దర్శించవలసిఉన్నది. ఈఆలయము నంధ్యాల పట్టణము మొదలులో చామకాలువఒడ్డున రైల్వ స్టేషను సమీపములో ఉన్నది. ఈఆలయము దర్శించినపిమ్మట మాత్రమే నవనందులందు మిగిలిన ఆలయములు దర్శించవలెను. కార్తీకమాసమునందు సూర్యాస్తమయ సమయములో నందీశ్వరునిపైన సూర్యకిరణాలు పడటం ఇక్కడ విశేషం. ఈఆలయములో శివుడు లింగ రూపములో దర్శనము ఇచ్చును.
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours