పితృకర్మలకు రామపురలో (వారణాసి) ఆచార సౌకర్యాలు
(IPLTOURS)
శ్రాద్ధకర్మ కాశీతో పాటుగా చేయవలసిన క్షేత్రములు గయ మరియు ప్రయాగరాజ్. శాస్త్రాల్లో చెప్పినా పెద్దలు చెప్పినా మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అన్నమాటలు అక్షర సత్యాలు. కనిపించని దైవం కంటికి కనిపించే ఈరూపాల్లో ఉంటాడు అన్నది సుస్పష్టం. శ్రాద్ధకర్మ స్వగృహములో చేసుకొనవచ్చును. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పిండ ప్రధానం చేయడం ద్వారా వారికి నివాళు లర్పించడం తద్వారా తమకు మంచిభవిష్యత్తు ఉండేలా చూసుకోవడం సంతానం బాధ్యత. తల్లితండ్రుల మరియు పూర్వీకుల ఆత్మలు ముక్తి పొందుటకు పితృముక్తి క్షేత్రాలుగా పరిగణించు పంచ (ఐదు) గయ క్షేత్రాలైన శిరో గయ (బీహార్), నాభి గయ (ఒరిస్సా), పాద గయ (ఆంధ్రప్రదేశ్), మాతృ గయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మ కపాల్ (బద్రీనాథ్)లలో పిండ ప్రధానం చేయవలసి ఉంటుంది. పంచ గయాక్షేత్రములలో శారీరక ఆర్థిక దృఢత్వంలేక పిండ ప్రదానం చేయలేని వారు వారణాశి లేదా కాశీ, గయ మరియు ప్రయాగరాజ్ క్షేత్రములలో చేసేదమని అభిలాష ఉన్నవారి సౌలభ్యం నిమిత్తం ఈక్షేత్రములందు శ్రాద్ధకర్మలు చేయుటకు అనువైన ఆశ్రమములు మరియు సత్రముల వివరములతో పాటుగా పురోహితుల లభ్యత వివరములు తెలియచేస్తున్నాం. వారణాసి (కాశీ)లోని అన్ని ఆశ్రమాలు మరియు సత్రాలు దక్షిణ భారత శాఖాహార వసతితో మాత్రమే సౌకర్యాలు కల్పిస్తున్నాయని మేము తెలియజేస్తున్నాము.
-
- కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్, లక్సా రోడ్, రామకుండ్: లక్సా రోడ్, రామకుండ్ నందు విశ్వనాధ దేవాలయంవద్ద శ్రీ అన్నపూర్ణ మఠ మందిరంనందు కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో వారణాశి యాత్రికులకు అన్నదానం మరియు భవనపు మొదటి మరియు రెండవ అంతస్తులలో యాత్రికులకు 13గదులు లభ్యతనుబట్టి ఉచితముగా కేటాయింపు సౌకర్యం కలదు. ఆశక్తి కల యాత్రికులు 0542-2390246 నెంబరులో నిర్వాహకులను సంప్రదించవచ్చును.
- శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం రామాపుర లక్సారోడ్: రామాపుర లుక్స రోడ్డు నందుకల శ్రీఅబ్బూరి హరిహర శాస్త్రిగారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న శ్రీకాశీ గాయత్రీ ఆశ్రమం రెండు భవనములందు బస మరియు బ్రాహ్మణులకు, ఇతరులకు వేరువేరుగా భోజన సౌకర్యం ఉంది. ఆశ్రమముల నందు బసచేసినవారితో పాటు ఇతరులకు ఆన్నదాన సౌకర్యంఉంది. స్వయంగా తీర్ధ విధులకు శ్రేష్టమైన మణికర్ణిక ఘాట్ నందు పిండ ప్రధానం మరియు తర్పణములను బ్రాహ్మణుల ఏర్పాటుచేసి జరిపించెదరు. ఏ.సి. మరియు నాన్ ఏ.సి. గదులుకల వసతి గృహములందు లిఫ్ట్ సౌకర్యం కలదు. కావున వయోవృద్ధులుకానీ, మోకాళ్ళ నెప్పులు తదితర శారీరక ఇబ్బందులు కలవారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఆశ్రమ యాజమాన్యానికి కాశీలోని ఇతరఆశ్రమాలతో మరియు హోటళ్లతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆశ్రమం యాత్రికులకు కావలసిన అన్నిసౌకర్యాలు కలిగిఉంది. వారణాశినందు విశ్వేశ్వరునికి అభిషేకం, అన్నపూర్ణ మరియు విశాలాక్షి దేవేరులకు కుంకుమార్చన జరిపించేదరు. గయ మరియు ప్రయాగ లందు పిండప్రధానం జరిపించుటకు వాహనములు, పురోహితులు తదితర అన్నిఏర్పాట్లు చేసేదరు. ఆశ్రమం వాహనముల రాకపోకలకు అనువుగా రామాపుర లక్సారోడ్డునందు విశ్వనాధ ఆలయసమీపంలో నున్నది. పురాణములందు తెలిపిన ప్రకారం శ్రాద్ధకర్మకానీ పిండప్రధానం చేయుటకుగాని కర్త అభ్యం కానప్పుడు బ్రాహ్మణుని నియోగించి వారిద్వారా శ్రాద్ధకర్మ మరియు పిండప్రధానం చేయించు ఏర్పాటుచేసేదరు. అంతే కాకుండా పితృకర్మలు చేయుటలో లేదా చేయుటపట్ల ఆశక్తి కలిగిఉన్ననూ ఉద్యోగరీత్యా విదేశములలో నివసించున్నావారికి లేదా పితృకర్మ చేయుటకు ఆశక్తి ఉన్ననూ శారీరక ధృఢత్వం లేక కర్మ చేయలేనివారికి శాస్త్రంలో తెలిపినట్లుగా వారికిబదులుగా బ్రాహ్మణుని నియోగించి వారిస్థానే ఆబ్దీక, సంవత్సరీకాది కార్యక్రమాలు నిర్వర్తించుచూ Live telecast చేయు సదుపాయం ఉన్నది.. బస, భోజనం లభ్యతకు పిండ ప్రధానాది కార్యక్రముల నిర్వహణకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కలదు. ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవలసిన ఫోన్ నెం. 919918774933 మరియు 918919123647.
- శ్రీ కాశీ అన్నపూర్ణా వాసవి ఆర్య వైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్నదాన సత్రం: కాశీనందు గురుభాగ్ ప్రాంతంలో లక్శారోడ్డు నందు శ్రీ కాశీ అన్నపూర్ణా వాసవి ఆర్య వైశ్య సత్రంము వారి రెండు సత్రములు కలవు. రెండు సత్రములందు కేవలం ఆర్యవైశ్యు లకు మాత్రమే బస మరియు ఆన్నదానం సౌకర్యం ఉంది. ఇతరప్రదేశములకు వెళ్ళుటకు వాహనఏర్పాటు చేసేదరు. పిండప్రధాన తదితర క్రతువులకు మరియు అభిషేకములకు, పూజలకు బ్రాహ్మణుల ఏర్పాటులేదు. మరిన్ని వివరాలకు 0542-2455087, 09848410047, 08639970089 నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమూలందు వీరి బ్రాంచిలు ఉన్నవి.
- శ్రీ కాశీ విశాలాక్షి బ్రాహ్మణ సేవాసమితి భవన్: వీరి వివరాలు ఏమియు తెలియవు.
- కాశీ యాత్రాభవన్ (పాలకొల్లువారి సత్రం) లక్సా గురుభాగ్ రోడ్: లక్సా గురుభాగ్ నందు పాలకొల్లువారి సత్రంఅని చెప్ప బడుతున్న కాశీ యాత్రా భవన్ నందు ఏ.సి. మరియు నాన్ ఏ.సి. గదులు రెండు రోజులు ఉచితమని, వృద్ధులు మరియు వికలాంగులు ఆలయ దర్శనమునకు ఉదయం 7 గం లోపు ఉచితవాహనం సౌకర్యం కాలదని అన్నదానం వసతి కలదని తెలిపినారు. పూర్తి వివరములు తెలియవు. వీరి ఆర్ధిక పరిపుష్టి తెలియకపోవడం వల్ల వారు తెలిపిన విషయాల్లో వాస్తవికత తెలుసుకొనుటకు సత్రం నిర్వాహకులకు 7499123456 మరియు 7526055510 నందు సంప్రదించవచ్చును.
వారణాశి (కాశీ) నందు పైన తెలుపబడినవే కాక ఇంకనూ అనేక సత్రములు మరియు ఆశ్రమనులతో పాటుగా వసతి గృహాలు ఉన్నాయి. పై సత్రములు మరియు ఆశ్రమములలో అధికభాగం రామపుర లక్సా రోడ్డు (విశ్వనాధ ఆలయం నుండి 1.5 కి.మీ లేదా 15 ని. నడక) మరియు సోనాపురన( విశ్వనాధ ఆలయం నకు 1.5 కి..మీ ) ప్రాంతములలో ఉన్నవి. మరియు రెండు ప్రదేశములకు స్నానఘట్టములు దగ్గరగా ఉన్నవి. ఇందు రామాపుర మరియు లక్శారోడ్డు ప్రాంతములో నున్న ఆశ్రమములు మరియు సత్రముల వివరములు ఇచ్చుచున్నాము. మేము స్వయంగా తెలుసుకొన్న మరియు ఇతరుల అభిప్రాయములు పరిగణలోనికి తీసుకొని పైసమాచారం పొందుపరిచ్చాము. ఇందు ఏమైనా తప్పిదాలుంటే మన్నించండి. పాలకొల్లు వారి సత్రంగా చెప్పబడు కాశీ యాత్రా భవన్ తప్ప ఇంక ఏ సత్రంనందు కానీ ఆశ్రమమునందు కానీ ఉచిత వసతి సౌకర్యంలేదు. సేవాదృక్పడము తక్కువ. లాభార్జన ఎక్కువగా కనపడుతుంది. అంతేకాక సత్రములు మరియు ఆశ్రమముల మధ్య పోటీ కనపడుతుంది.
యాత్రికులకు అవశ్రమైన బస, భోజనం, పిండప్రధానాది క్రతువులకు మరియు వాహన సందుపాయములతో పాటు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం అన్నియు ఒకేచోట కలిగియున్నవి రామాపుర నందుకల శ్రీకాశీ గాయత్రీ ఆశ్రమం మాత్రమే.
యాత్రికులు ఒకటికి పదిసార్లు స్వయంగా విచారించి ప్రతిసత్రం మరియు ఆశ్రమము కలుగజేయు సౌకర్యములు అన్నియు ఒకటికి పదిసార్లు చదివి అవగాహన చేఊకొని తగునిర్ణయం తీసుకొన కోరుతున్నాం. అన్నదానం చేయు ఆశ్రమములు, సత్రములు అనేకంఉన్ననూ ఆన్నదాన ఫలితం మరియు యాత్రికులకు ప్రతిఫలాపేక్ష లేకుండా ఆన్నదానసేవ చేయు సత్రముల మరియు ఆశ్రమముల వివరం సంపూర్ణ తీర్ధయాత్రలో భాగమైన కాశీయాత్ర నందు మాతరువాయి పోసు ఆన్నదాన మహత్యంలో తెలిపెదము.