నిష్కలంక మహదేవ్

(IPLTOURS)

గుజరాత్ రాస్త్రములో భావనగర్ నకు 23 కి.మీ. దూరములో పాండవులచే ప్రతిస్టించబడిన నిష్కలంకమహదేవ్ ఆలయం ఉన్నది. యాత్రికులు ఈఆలయమునకు రైలు ద్వారాకానీ రోడ్డుమార్గము ద్వారాకానీ వెళ్లవచ్చును. కొలియాక్ అను గ్రామమునకు సుమారు మూడు కెలోమీటర్ల దూరమునందు అరేబియా సముద్రమునందు సుమారు 2 కి.మీ. దూరములో కల ఒక దీవినందు నిష్కలంక మహదేవ్ విగ్రహము స్థాపించబడినది. ఈఆలయం దర్శించుటకు బోటులో ఆలయపైభాగమునందు కట్టియున్న జండాఅనుసరించి చేరవలయును. సముద్రపు అలలతాకిడికి ఈఆలయము పగటిపూట కొద్దిసేపు మాత్రమే కనపడును. మిగిలిన సమయంలో సముద్రంలో ములిగియుండును. సముద్రపు అలలు అమావాశ్యరోజున మరియు పౌర్ణమిరోజున ఉదృతముగా ఉండును. ఆలయము ఆలల ఉదృతికి తట్టుకొనువిధముగా నీర్మించబడినది. యాత్రికులు ఈఅలలఉదృతి తగ్గి ఆలయము దర్శించుటకు ఆతృతతో ఎదురుచూచేదరు. మహాశివరాత్రిరోజున ఇచట విశేషపూజలు జరుగును.

Nishkalanka Mahadev Temple

పౌరాణికకధనము ప్రకారము మహాభారత సమయమునందు పాండవులచే ఈఆలయము నీర్మించబడినట్లు తెలియుచున్నది. ఆనాటి భారతీయుల ఈఆలయనిర్మాణము తప్పనిసరిగా మెచ్చుకో తగ్గది మరియు ఈనాటి ఇంజనీర్ల మేధస్సుకుఅందనిది. మహాభారతకాలములో పాండవులు కురుక్షేత్రయుద్ధములో కౌరవులను నిర్జించిన పిమ్మట మనస్తాపముచెంది, వారిపాపనివృత్తి కోసమై శ్రీకృష్ణుని కోరగా శ్రీకృష్ణుడువారికి ఒకనల్లజండా ఒకనల్లఆవు ఇచ్చి అవితెల్లగాఅగునప్పటికివరకు త్రిప్పమని అప్పటికి పాపనివృత్తి అగునని శివుని పూజింపవలసినదిగా తెలియ చేసినాడు. వారుపలురోజులు వాటితో తిరిగినపిమ్మట ఈస్థలమునకు వచ్చుసరికి అవి తెల్లగా మారిపోయినవి. శివుడు వారిపూజలకు సంతోషించి లింగరూపములో దర్శనము ఇచ్చినాడు. పాండవులపేరుపై అయిదు స్వయంభూః లింగములు వెలసినవి. ప్రతిలింగమునకు ఎదురుగా నందివిగ్రహము ఉన్నది. ఇచటకలపాండవ కుండము అనుకొనేరులో కాళ్ళుచేతులు శుభ్రము చేసుకొని పిమ్మట శివుని దర్శించవలెను.