పితృవర్గ గోత్రం & ప్రవర ఆవశ్యకత

Pitru Paksha
(IPLTOURS)

ప్రస్తుతం అందరూ వేగవంతమైన జీవితం గడుపుతున్నారు. కుటుంభ సభ్యులమధ్య ఆప్యాయితకొరవడి అందరూ కంప్యూటర్ మరియు సెల్ ఫోన్లతో రోజులో నిద్రపోయే సమయంతప్ప మిగతా సమయం చాలా బిజీగా కనీసం తిండికి కూడా సమయం లేకుండా గడుపు తున్నారు. ఉద్యోగరీత్యా, కారణాలవల్ల గతంలోఉన్న ఉమ్మడి కుటుంభాలు విడిపడి నగరాలకు ఇంకా చెప్పాలంటే విదేశాలకువలస పోతూ బంధుత్వాలు మరచి జీవిస్తున్నారు. చాలామందిలో సంబంధాలు కనుమరుగు అవుతున్నాయి. ఎవరు ఎక్కడ నివసించినా వారి వంశచరిత్ర గోత్రనామాలతో జ్ఞప్తికు ఉంచుకొనవలసిన ఆవశ్యకత ఉంది.

అనాదిగా పఠించబడు యుగాలకు సంబంధించిన ఇతిహాసాలు, పురాణాలు మరియు చరిత్రలు పరిశీలించిన రామాయణంలో  రాముడు, రావణుడు, సీతాదేవి తదితరుల వంశం, వారు ఎన్నోతరంవారు, వారిసోదరులు సంతానం వారి గోత్రం మొదలైన వివరాలు తెలుస్తాయి.

మహాభారతంలో కురువంశ మూలపురుషుడు నుండి పాండవుల, కౌరవుల గోత్రనామాలతో అన్నివివరాలు కనపడతాయి. అట్లే భాగవతంలో శ్రీకృష్ణుని పూర్వీకుల వివరాలు అన్నీ తెలుస్తాయి. తీర్ధయాత్రలు చేస్తూ వివిధ క్షేత్రాలు దర్శించినప్పుడు శిలాశాసనాల్లో ఆలయం నిర్మించిన వారివివరాలు పొందుపరచబడటం అవిచదివి ఆలయాలు ఏవిధంగా ఎవరిచే ఎప్పుడు నిర్మించబడ్డాయి ఆరాజుల వంశచరిత్ర ఏమిటి అనేవివరాలు సాధారణంగా అందరూ తెలుసుకుంటారు. లేదా స్థానికంగా అడిగి తెలుసుకుంటారు. మనిషి ఏవిధంగా ప్రస్తుతస్థితికి వచ్చాడు అనేవిషయం తెలుసుకోవాలి అన్నఆశక్తి తమవంశంలో మూడుతరాల చరిత్ర వారి గోత్రం, పేర్లు తెలుసుకోవాలిఅని ఎప్పటికీ శాశ్వతమైన సమాచారం జ్ఞప్తికోసం పరిరక్షించుకోవాలనే చాలామందిలో విషయంలో కనపడదు.

గతంలో ఉమ్మడికుటుంభాలు మరియు గ్రామాల్లో నివసించడంవల్ల తమకు తెలియని పూర్వీకుల సమాచారం పెద్దలనడిగి తెలుసుకొనేవారు. కాలంమారి తరువాతి తరంవారు విద్యాభ్యాసంవల్ల భుక్తికొసం ఉద్యోగాలు చేయడంవల్ల పట్టణాలు ఇంకా విదేశాలు వలసవెళ్ళుట వలన తమవారికి దూరమై తమదైనందిన కార్యక్రమాలలో లీనమై తమవారితో మాట్లాడటానికికూడా సమయంలేనంతగా కంప్యూటర్లు మరియు సెల్ ఫోన్లకు పరిమితమయ్యారు.

అందువలన కనీసం తమవారు ఎవరు తమగోత్రం ఏమిటి అన్న వివరాలుకూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. శుభకార్యములైన ఉపనయనం, వివాహాది క్రతువులకేకాక అశుభకార్యములైన వైదికకర్మలు, శ్రాద్ధకర్మలు, పిండప్రధానం తదితర కార్యక్రమాలకు కూడా వంశములో మూడుతరముల వారి గోత్రనామములు, ప్రవర తదితరముల ఆవశ్యకత ఉంది. సాధారణంగా అధికభాగం తమ తాతలపేర్లు గోత్రం చెప్పలేని స్థితిలో ఉన్నారు. బ్రాహ్మణులలో చాలా మందికి తమ ప్రవర తెలియయదు అనడంలో ఆశ్చర్యం లేదు.

సాధారణంగా అందరూ తల్లితండ్రులు తమకు ఏమి సంపాదించి ఇచ్చారో లెక్కవేసుకోవడం గమనిస్తాము. అనంతకోటి జీవరాశులలో మానవజన్మ ఉత్కృష్టమైనది. గతజన్మలలో చేసిన పుణ్యకార్యములవల్ల మాత్రమే మానవజన్మ లభిస్తుంది అనడంలో ఏవిధమైన సందేహంలేదు. దైవం మానవునిగా మనకు జన్మనిచ్చించి ప్రత్యక్షదైవాలైన తల్లితండ్రులు పరోక్షముగా వారి పూర్వీకుల పుణ్యఫలమే కారణం. అందువలననే మాతృదేవోభవ, పితృదేవోభవ అని ప్రత్యక్ష దైవస్వరూపాలలో మొదటి రెండుస్థానములు తల్లితండ్రులకు పిమ్మట విధ్యనేర్పిన ఆచార్యుడు (గురువు), అతిధిని దైవములని చెప్పబడింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జీవన విధానాన్ని బోధించిన గురువుకు వారి వృద్ధాప్యంలో సేవ చేయడం మరియు వారికి భౌతికంగా కనిపించని తరువాత కాలంలో మరణం నుండి పిండ ప్రధానం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించి వారికి ముక్తి కలిగించడం వారికి ఇచ్చే నివాళి. అశౌచకర్మలైన వైదికకర్మలు, శ్రాద్ధకర్మలు, పిండప్రధానం తదితర కార్యక్రమాలకు వంశంలో గత మూడు తరముల గోత్ర నామములు (బ్రాహ్మణులలో ప్రవర) అవసరమని తెలియ చేసినాము. కావున మిత్రుల మరియు వీక్షకుల సౌలభ్యముకొరకు విషయసేకరణకు పట్టిక నిచ్చుచున్నాము. అవసరమైన సమయం కేటాయించి అందలి వివరములు తెలిసినవి పూర్తిచేసి తెలియనివి బంధువులను, కుటుంభపెద్దలను సంప్రదించి పూర్తిచేసిన వంశవృక్షముపైకల అవగాహన తెలుస్తుంది. సంతానముకు ఆస్తి పాస్తులు సమకూర్చక పోయినను ఈ సమాచారం చేర వేసిన వారుచేయు కర్మలవల్ల ప్రస్తుత తరం ముక్తి పొందుటకు అవకాశం ఉండగలదు. ముఖ్యంగా నగరాలు మరియు విదేశాలలో ఉద్యోగ రీత్యా నివసిస్తున్న వారు శ్రద్ధ వహించి, అవసరమైన సమాచారాన్ని సేకరిస్తారని ఆశిస్తున్నాం.

ప్రవర :  మూడు లేదా నలుగురు ఋషులతో కూడినది

                                      పితృవర్గ  సమాచారం
నెం. బంధుత్వం  గోత్రం  పేరు 
1 పితుః (తండ్రి) 
2 పితామహః (తాత/తండ్రి తండ్రి))
3 ప్రపితామహః (తండ్రి తాత)
4 మాతుహుః (తల్లి)
5 పితామహి (తండ్రి తల్లి/బామ్మ)
6 ప్రపితామహి (ముత్తాతభార్య/ బామ్మ అత్తగారు) 
7 సాపత్నిమాతా (సవతి తల్లి)
8 మాతామహ (తల్లి తండ్రి) 
9 మాతుహుః పితామహః (తల్లి తాత)
10 మాతుహుః ప్రపితామహః (తల్లి ముత్తాత) 
11 మాతామహి (తల్లి తల్లి/అమ్మమ్మ)
12 మాతుః పితామహి (అమ్మమ్మ అత్త) 
13 మాతుః ప్రపితామహి (తల్లి ముత్తాత భార్య) 
14 ఆత్మపత్ని (భార్య)
15 సుతః (కుమారుడు) 
16 బ్రాతః (సోదరుడు) 
17 జెష్ట పితృవ్యః (పెద తండ్రి)  
18 కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)  
19 మాతులః (మేనమామలు) 
20 తత్ పత్నిహిః మేనమామ భార్యలు)
21 దుహిత (కుమార్తె) 
22 ఆత్మ భగినీ (తోబుట్టువులు) 
23 దౌహిత్రః (కూతురు పిల్లలు)
24 భాగినేయకః (మేనల్లుళ్ళు)
25 పితృ ష్వసా (మేనత్తలు)
26 మాతృ ష్వసా (తల్లి తోబుట్టువులు) 
27 జామాతా (అల్లుళ్లు)
28 భాహుకః (తోబుట్టువు భర్త/బావగారు)
29 స్నుష (కోడలు) 
30 శ్వశురః (మామగారు) 
31 తత్ పత్నీ (వారి భార్య/అత్తగారు)
32 శ్యాలకః (బావామరుదులు) 
33 గురుః (గురువు) 
34 అర్హిన (ఆశ్రితులు /స్నేహితులు) 

పిండప్రధానం పితృదేవతలకు మోక్షప్రదం