నందప్రయాగ
(IPLTOURS)
కర్ణ ప్రయాగ నుండి 21 కి.మీ. దూరములో నందప్రయాగ ఉన్నది. కర్ణప్రయాగ తరువాత చమోలిజిల్లానందు నందప్రయాగ ఒక నగర పంచాయతి. అలకనందనదిపై గకల అయిదు సంగమప్రాంతములలో నందప్రయాగ ఒకటి. నంద ప్రయాగ అలకనంద మరియు మందాకిని నదుల సంగమ ప్రదేశము నందప్రయాగ సముద్రమట్టమునకు సుమారు 4455 అడుగుల ఎత్తునఉన్నది. నందమహారాజు ఇచట యజ్ఞము చేయుటవలన ఆతని పేరుపై దీనికి నంద ప్రయాగ అని పేరువచ్చినది. కణ్వమహర్షి ఇచ్చటనే ప్రాయిశ్చిత్తం చేసుకొనినాడు. మరియు దుష్యంతుడు శకుంతలను వివాహమాడినాడు. నందప్రయాగ ప్రకృతి దర్శనమునకు ప్రశిద్ధి. ఇచట అనేక అందమైన మరియు మతపరమైన రమణీయదృశ్యములు గోచరించును. అంతేకాకుండా పర్వతారోహణమునకు నదీవిహారమునకు ప్రకృతిసౌందర్యము ఆస్వాదించుటకు ప్రాముఖ్యముగల ప్రదేశము. ఇచట దేవాలయములు లేకపోవుటవలన సంగమప్రదేశమును దర్శించి ఇచ్చటినుండి 75 కి.మీ. దూరములో నున్న విష్ణుప్రయాగకు యాత్ర కొనసాగించవలేను.