మాతృగయ
(IPLTOURS)
సృష్టికి మూలాధారమైన పరాశక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయ కారకులుగా తనఅంశలు సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతిదేవిలను వారికి అర్ధాంగులుగా సృస్తించినది. వీరితోనే అన్నిలోకముల సృష్టి, స్థితి మరియు లయ కొనసాగుతున్నది అనునది నిర్వివాదాంశము. పురాణ కాలమునుండి పరాశక్తి రూపమైన తల్లికి ఒక ప్రత్యేకస్థానముఉన్నది. జన్మనిచ్చుటలో తల్లితండ్రుల భాగస్వామ్యమున్ననూ ముందుగా తల్లినే పేర్కొంటారు. జన్మలయందు మానవజన్మ పొందడం అదృష్టం. అట్టి జన్మఇచ్చిన తల్లిఋణం తీర్చుకోలేనిది. ఆర్ధిక, శారీరకశక్తులు లభ్యతప్రకారం జనులు వివిధపుణ్యక్షేత్రాలు దర్శించి పిండప్రధానం చేసి మాతాపితరులకు సద్గతులు కలిగించడానికి కృషిచేస్తారు. పురాణాల్లోతెలుపబడిన ఆపుణ్యక్షేత్రాలు ఉత్తరప్రదేశ్ నందు ప్రయాగ(అలహాబాద్), వారణాశి(కాశీ), భీహార్ నందు విష్ణుగయ/ శిరోగయ (గయ), ఒరిస్సాలో నాభిగయ (పూరీ), ఆంధ్రప్రదేశ్ పిఠాపురంనందు పాదగయలతోపాటు హిమాలయపర్వతములందు బ్రహ్మకపాలం (బదరీనాధ్). ఈక్షేత్రాలలో పిండప్రధానము చేయుటవలన వారికి సద్గతి ప్రాప్తిస్తుందిఅని హిందువుల నమ్మకం. హిందువులు వారివంశములోనివారి మరణానంతరము వారిఅస్థికలు పైక్షేత్రములలో పవిత్రనదులలో నిమజ్జనం చేస్తారు.
మాతృమూర్తులకు మాత్రమే పిండప్రధానముచేయు పవిత్రస్థలము గుజరాత్రా రాష్ట్రములో సిద్ధాపూర్ నందున్న మాతృగయ అన్నిక్షేత్రముయాలోనూ మాతృ, పితృ వంశములలోనివారికి ఇరువురకు పిండప్రధానము చేసేదరు. గతములో సరస్వతీ ప్రస్తుతం సబర్మతీనదీ తీరమున సిద్ధాపూర్ ఉన్నది. అహమ్మదాబాద్ నుండి సుమారు 100 కిలో మీటర్ల దూరములోనున్న ఈక్షేత్రమునకు రైలువసతి ఉన్నది. సుమారు 1200 సం లకు పూర్వము చాళుక్యరాజైన మూలరాజుచేఇచట రుద్రమహాలయ ఆలయము ప్రారంభించబడి సుమారు రెండువందల సంవత్సరములుగడచి ఆలయనిర్మాణము పూర్తిఅయినపిమ్మట జయసింహ సిద్ధరాజఅను రాజువలన పవిత్రము చేయబడి ఈనగరము నిర్మించి ముఖ్యపట్టణముగాచేసుకొని రాజ్యపాలన చేసినాడు. ఆనగరమునకుపేరు తనపేరుతో సిద్ధరాజానగరమని పేరుపెట్టగా కాలక్రమేణా అదిషిద్ధపూర్ అనిరూపాంతరము చెందినది. తరువాత ముఘల్ రాజైన అక్బరుపాలనలో నగరమునందలి హిందూసంప్రదాయము క్షీణించి రుద్రమహాలయ ఆలయము శిధిలముకాబడినది.
హిందువులచే పవిత్రగ్రంధముగా పరిగణించబడుచున్న ఋగ్వేదములో ప్రస్తావించబడి మరియు భాగవతమునందు పరమ పవిత్రములుగా పేర్కొనబడిన పంచసరోవరములు మానససరోవర్, బిందుసరోవర్, నారాయణసరోవర్, పంపాసరోవర్ మరియు పుష్కరసరోవర్ లందుఒకటి అయిన బిందుసరోవర్ అనుకుత్రిమముగా ఏర్పాటుకాబడిన సరోవరముఉన్నది. మాతృశ్రాద్ధము మరియు ఉత్తరఖర్మలు జరుపు ప్రదేశము ఆగుటవలనదేశము నలుమూలలనుండి వేలసంఖ్యలో ప్రజలు మరణించినతల్లికి ఉత్తరఖర్మలు జరిపించుటకు కార్తీకమాసము (అక్టోబరు, నవంబరుమాసములలో) సిద్ధాపూర్ సందర్శించేదరు.
కపిలమహర్షితండ్రి కర్ధము అనుఋషి ఇచట నివసించినాడు. కర్ధమ మరియు భార్య దేవహుతిలకు కపిలుడు కుమారుడు మరియు మారిచి, ఆత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ట మరియు అతర్వన్ అనుతొమ్మిదిమంది ఋషులను వివాహము చేసుకొన్న కల, అనసూయ, శ్రద్ధ, హవిర్భూ, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి మరియు శాంతిఅను తొమ్మిదిమంది కుమార్తెలు. కర్ధమ బిందుసరోవరమునుండి సన్యాసిగామారి వెడలినపిమ్మట కపిలుడు ఆశ్రమభాధ్యత స్వీకరించినాడు. ఒకరోజు దేవహుతి మహావిష్ణువు తనకుమారుడు కపిలునిగా అవతారము దాల్చుటలో ముఖ్యఉద్దేశ్యము భక్తిమార్గము మరియు అధ్యాత్మిక సాక్షాత్కారము కలయికఅయిన సంఖ్యాయోగము వ్యాప్తిచేయుటకు మాత్రమేనని గుర్తుకుతెచ్చుకొని, కపిలుని ముక్తిమార్గము తెలియపరచకోరినది. కపిలుడుఆమెకు సంఖ్యాయోగము గొప్పతనము ఇలావివరించినాడు. మానవుని ఆత్మ పురుష. అది పరమాత్మఅనగా భగవంతునిచేరుటకు సంఖ్యాయోగము ఉపకరిస్తుంది. పురుషుడు తనశక్తిని ప్రకృతివద్ద వ్యక్తపరచి ప్రకృతి ప్రేరణతో జీవాత్మలక్షణాలు పొందుతాడు అప్పుడు నేను అన్నభావనస్థానే నాదిఅన్న భావముమనస్సులో కలుగుతుంది. ఆసమయంలో పరమాత్మవేరు జీవాత్మవేరు అనిగ్రహిస్తాడు. అప్పటినుండి మనస్సులో ప్రేమ, అసహ్యము, క్రోధము, ఇష్టము మొదలైన అన్నీభావనలు కలుగుతాయి. తద్వారా సంతోషము మరియు దుఃఖము కలుగుతాయి.
దేవహుతి ఈస్థితిని దాటుటఎట్లు అనిఅడుగాగా కపిలుడుఇలా వివరించాడు. మనస్సు ఏవిధమైన ఉద్వేగపరిస్థితులకు లోను కాకూడదు, కానీ ప్రకృతి ఆతనిపైతన ఒత్తిడి తీసుకువచ్చుటవలన ఈస్థితి పొందుట చాలాకష్టము. నీటితో నిండినగ్లాసు నందు ఇతర వస్తువువేయుట సాధ్యముకానట్లే భగవంతునిపై మనస్సునిలుపుటతో మాత్రమే ఇతరఆలోచనలు మనస్సులో చేరకుండా చేయుట సాధ్యమని తెలిపినాడు. మనిషి మనస్సు అనేక విధమైనవిషయాలతో ముడిపడిఉంటుందని ఒక్కసారిగా వాటిని తుడిచివేసి భగవంతుని ధ్యానమునందు నిమగ్నమగు విధానము ఆడిగినది. కపిలుడుదానికి భక్తి ఒక్కటేమార్గమని, ఇతర భక్తులతో సహవాసముచేసి భగవంతునిఅవతార కధలువినుచూ భగవంతుని స్తుతించుటద్వారా మనస్సును లోభపరచు విషయములనుండి విముక్తుడుఅయి భగవత్ ధ్యానములో ఏకాగ్రతపొందవచ్చును. మరియు ఒకపవిత్ర ప్రదేశములో నివసిస్తూ అతితక్కువ ఆహారము భుజించుచూ మిగిలిన జీవులతో వైరముతోకాక ప్రేమతో జీవించిన నెమ్మదిగా మనస్సు ప్రాపంచిక విషయములనుండి విముక్తిపొంది భగవంతునిపై ధ్యానముకలిగి జీవాత్మ మరియు పరమాత్మ ఒకరేఅన్నవిషయం తెలిస్తుంది. భక్తుడు అన్నికోరికలు త్యజించి ముక్తిపొందవలేనన్నకోరిక ఒక్కటియే పొందుతాడు. ఆ విధముగా భగవంతునితో అనుసంధానింప బడినందున లింగప్రసక్తిలేకుండా అందరూ జననమరణములందు ఆశక్తిలేనివారై స్వేచ్ఛపొంది తద్వారా ముక్తిపొందుదురు అనితెలియచేసినాడు.
ఈవిషములన్నిటితో దేవహుతికి మరియు ఇతర ఆశ్రమనివాసులకు జ్నానభోధచేసి కపిలుడు తండ్రివలెనే బిందుసాగర్ వదలివెళ్ళినాడు. ఆయన ఎచ్చటికివెళ్ళిననూ ఋషులు మరియు పెద్దలు ఆయనజ్ఞానమునందు నడచుటకు అర్ధించేడివారు. చివరిగా ఆయన సముద్రములోని ఒకదీవినందు స్థిరపడి ఉపన్యాసములు ఇచ్చేడివాడు. అటుపిమ్మట దేవహుతి కపిలుడు ఇచ్చిన సూచనలు పాటించి తనమనస్సులోని లోపములుఅన్నియు తొలగించుకోగలిగినది. భగవంతుని ఆనుగ్రహముతో ఆమెశరీరము వదలివేయగా ఆశరీరము గ్యానవాపి పేరుతో ఒకపవిత్ర నదిగామారినది. ఈరోజునకు కూడా ఋషులు తమను శుద్ధిచేసుకొనుటకు ఈనదినందు స్నానము చేయదురు. మాఘమాసములో వేలకొలది భక్తసమూహములు కపిలమహర్షికి నివాళులు అర్పించుటకు ఆదీవిసందర్శింతురు. అపవిత్రప్రదేశము సిద్ధపూర్ పేరుతో తీర్ధయాత్రస్థలము అయినది. సాగరుడు అనురాజు అశ్వమేధయాగము చేసినప్పుడు ఆతని కుమార్లు 60000 మంది యాగాశ్వమునకు రక్షణగా వెళ్ళి అశ్వము కపిలుని ఆశ్రమములో చూసి కపిలునికి తపోభంగము కావించినారు. అప్పుడు కపిలుని కోపాగ్నికి దగ్ధమైనారు. పిమ్మట తరువాతి వారివంశములోని భగీరధుడు తపస్సుచేసి గంగను దివినుండి భూమిపై అవతరింపచేసి గంగతో తమవంశములోని 60000 మండి ఆస్తికలపై ప్రసరింపచేసి వారికి సద్గతులు కలుగుటకు కారణమైనాడు. ఆవిదముగా గంగను భూమికి తీసుకొనివచ్చుటకు పరోక్షంగా కపిలుడుకారణము.
బిందుసరోవరము అనగా బిందువులతో ఏర్పాటుకాబడిన సరస్సు. మహావిష్ణువుని కన్నీరు ఈసరోవరముయందు పడినదని నమ్మేదరు. పరశురాముడు తనతల్లికి పిండప్రధానము ఇచ్చటనే బిందుసరోవర్ గట్టుపైచేసినాడు. పరశురాముని ఆలయము ఇచట నిర్మించినారు. కపిలమహర్షి తపోస్థలము మరియు తల్లికి మోక్షజ్ఞానము భోధించిన స్థలము. ఆకారణమున దేశములోని యాత్రికులు వారితల్లికి ఇచట పిండప్రధానము చేయవలెనని తలచెదరు. సిద్ధాపూర్నం దుమాతృకర్మ మరియు పిండప్రధానము చేయుటకు బాగుగాతర్పీదుపొందిన అనుభవజ్ఞులైన పండితులు లభించేదరు.
సిద్ధాపూర్ నందుకల రుద్రమహాలయ ఆలయము మరియు ముఘల్ కాలములో నిర్మించబడిన జామీమసీదు జాతీయ వారసత్వసంపదగా గుర్తించి పురావస్తుశాఖవారిచే సంరక్షింపబడుచున్నవి. గైక్వాడ్ రాజ్యపాలనలో 1915 సం.లో సుమారు రూ15000/- ఖర్చుతో ఏర్పాటుచేసిన గడియారస్తంభము ఇప్పటికినీ కలదు.
మాతృప్రేమ అజరామరం పిండప్రధానం ఆమెకు మోక్షం