మహనంది
(IPLTOURS)
మహానంది కర్నూలు జిల్లాలో నల్లమాల కొండలకు తూర్పుగా నంధ్యాల పట్టణమునకు దగ్గరగా చుట్టూఅడవితో ఉన్న గ్రామము. మహానంది నుండి నంద్యాల మార్గములో 15 కి.మీ.మార్గము నందుకల తొమ్మిదినందుల దేవాలయములే నవనందులు. మహానంది నవనందులలో ఒకటి. దాదాపు 1500 సంలకు పూర్వమునుండి మహానందీశ్వరాలాయము ఉన్నఈగ్రామము అదేపేరుతో మహానందిగా పిలువబడుతూంది. చోళులు, పల్లవులు మరియు విజయనగర రాజులచే ఈప్రాంతము అభివృద్ధిచెందినను వాస్తవముగా ఈఆలయము నిర్మించినది ఎవరు అనుసమాచారము అభ్యమూకాలేదు. మహానందినందు శివలింగము చరిత్ర కూడా అగమ్యగోచరము. ఇచట ఆలయములోపలకల కోనేటీచరిత్ర చాలా ఆశక్తికరము. ఆంధ్రప్రదేశ్ నందు కర్నూలుజిల్లా అంతయూ కరవుప్రాంతము మరియు నీటిలభ్యత చాలాతక్కువ. కానీఆశ్చర్యముగా ఇచటఆలయమందు అంతరాలయమునందుండి కొనేరునందు చేరునీరు నిరంతరమునీరు గర్భాలయము బయటఉన్న కళ్యాణి మరియు పుస్కరిణి అను మంచినీటికొనేరులకు ప్రవహించును. రెండుకొనేరులకు ప్రవహించిననూ నీరు నిండుగానే ఉంటుంది.
ప్రధానకొనేరునందు నీరుఎక్కడినుండి ప్రవహించుచున్నది తెలియరాదు. కోనేరు గణేశుడు,శివుడు, పార్వతి మరియు అనేకదేవతల శిల్పాలు చెక్కబడిన రాతిగోడలతో నిర్మించబడినది. కోనేటిమధ్య ఒకరాతిపైకల అయిదు రూపములలోనున్న శివలింగములపైభక్తులు కోనేటినందలినీరు చల్లేదరు. ఆలయమునకుముందు రెండుచిన్నకొనేరులు, ఆలయప్రాంగణమునందు యాత్రికులు స్నానము ఆచరించుటకువీలుగా అయిదుఅడుగులలోతుతో పెద్దకోనేరు కలవు. లోపలఉన్నకొనేరునందు స్నానము చేయుటకు సాయంత్రం 5-గం వరకు మాత్రమే అనుమతింతురు. కొనేరుకు గర్భాలయమునుండి స్వయంభూలింగము క్రిందిభాగమునుండినీరు ఋతువులతో సంబంధము లేకుండా సంవత్సరమంతయూ ప్రవహించును. సంప్రదాయముగా అన్నిదేవాలయమునందు దేవతామూర్తిని భక్తులకు దూరముగా ఉంచుటవలన శివలింగముతాకుటకు అనుమతించిననూ తాకుటకు వీలుకాదు. ఈకోనేరునుండి బయటకువదులు నీటితో పరిసరములలో 8 కి.మీదూరమువరకు 2000 ఏ.ల భూమి సాగుచేయుచూ వరి, పండ్లు, కూరగాయలు తదితరపంటలు పండించెదరు. కోనేటినీరు శీతాకాలమువేడిగాను వేసవిలోచల్లగాను ఉండును. నీరు ఉదయం నులివెచ్చగాఉండి, నెమ్మదిగా మధ్యాహ్నము అయేసరికిచల్లబడును.
మహానందిలో గరుఢనంది ఆలయము సమీపములో శివుని ద్వారపాలకుడుఅయిన నందివిగ్రహము అతిపెద్దది నిర్మించబడినది. నందివిగ్రహములు నల్లరాయితో చెక్కబడి ఉండును కానీమహానందిలో నందివిగ్రహము అందుకు భిన్నముగా తెల్లనిరంగుతో దర్శనం ఇస్తుంది ప్రతి సంవత్సరము మహాశివరాత్రిరోజు ఈక్షేత్రమునందు ఇతరప్రధాన శైవక్షేత్రములవలెనే ఉత్సవము మిక్కిలి వైభవముగా జరుగుతుంది. ఆలయనిబంధనల ప్రకారం భక్తులు అందరూ పంప్రదాయదుస్తులు ధరించ వలసి ఉన్నది. అనగాశరీరమంతయు దుస్తులు ధరించవలెను. సెల్ ఫోనులు మరియు కెమెరాలు తీసుకొనిపోవుట నిషేధము. కోనేరు పరిశుభ్రముగానుంచుటకు కోనేటినందు స్నానమునకు సబ్బులు ఇతర డిటర్జెంట్లు ఉపయోగించుట నిషేధిచబడినది. ఇతర దేవాలయములవలేనే ఇచ్చటలాకరు, సామాను బధ్రపరచుకొనుగది సదుపాయము కలదు దర్శన సమయములు – ఉదయం 4-30 నుండి మధ్యాహ్నం 1-00 వరకు తిరిగి 2-00 నుండి రాత్రి 9-30 వరకు మహానంది నంద్యాల రైలు స్టేషన్ నుండి 20 కి.మీ. దూరములో నున్నది. నవనందుల దర్శనము పిమ్మట మహానంది చేరిబసచేయవచ్చును. బసచేయుటకు మహానందిలో కారవేన నిత్యాన్నదాన సత్రము మరియు హోటళ్లు కలవు. కారవేనసత్రమునందు బసతోపాటు ఉచితఆన్నదాన సందుపాయమున్నది. మహానందీశ్వర దేవస్తానం అధికారిక వెబ్ సైట్ నందు నవనందులలో ఇతర నందిక్షేత్రముల ప్రాముఖ్యతకానీ ఆక్షేత్రముల చరిత్రగురించికాక సమీప దేవాలయములగురించి సమాచారం పొందుపరచడానికి చర్యతీసుకోవడం ఆశ్చర్యపడవలసిన విషయం.
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours