మహాకలేశ్వర్
(3వ జ్యోతిర్లింగం)
IPLTOURS
అవంతికాయాం విహితావతారం
అకాలమృత్యోః పరిరక్షణార్థం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
వందే మహాకాలమహాసురేశమ్
(3వ జ్యోతిర్లింగం)
IPLTOURS
అవంతికాయాం విహితావతారం
అకాలమృత్యోః పరిరక్షణార్థం
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్
వందే మహాకాలమహాసురేశమ్
ద్వాదశ జ్యోతిర్లింగములలో మూడవది ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
మహాకాలేశ్వర్ దక్షణముఖముగా నుండుటవలన దక్షణముఖి అనికూడాపిలిచేదరు. ద్వాదశజ్యోతిర్లింగములలో ఒక్క మహాకాలేశ్వర్ నందుమాత్రమే తంత్రశివనేత్రము సంప్రదాయపద్ధతిలో కనుగొనగలము. ఓంకారేశ్వర్ మహదేవ్ యొక్కవిగ్రహము గర్భగుడిలో మహాకాలునివిగ్రహము పైభాగమున ఉన్నది. గర్భగుడినందు పశ్చిమ, ఉత్తర మరియు తూర్పునందు విఘ్నేశ్వరుడు, పార్వతి మరియు కార్తికేయ విగ్రహములున్నవి. దక్షణమువైపున శివునివాహనము నందిఉన్నది. ఈఆలయము ఒకసరస్సువద్ద చుట్టూ భారీగోడలతో కూడిన విశాలమైనప్రాంగణమునందు ఒక భూగర్భఅంతస్తుతోపాటు అయిదుఅంతస్తులు కలిగియున్నది. తులారాశికి చెందినస్త్రీపురుషులు ఈమహాకాలేశ్వర్ జ్యోతిర్లింగముదర్శించి అర్చించిన దోషములు తొలగుననిచెప్పబడినది.
మహాకాళేశ్వర ఆలయసముదాయం ముఘల్ రాజులకాలములో ద్వంశముకాబడి జ్యోతిర్లింగము సమీపములోని ఒక నీటిగుంటలోనికి విసిరివేయబడి జ్యోతిర్లింగము క్రింది భాగము దాడినందుతస్కరించబడినది. అటుపిమ్మట సుమారు 500 సంవత్సరములు గడచినపిమ్మట 1734 సంలో మరాటారాజులకాలమునందు ఆలయము మరలా నిర్మించబడి అటుపిమ్మట అనేకమార్లు అభివృద్ధి చేయబడినది. ప్రస్తుతము ఆలయము దేవస్థానంట్రస్ట్ఆ ధ్వర్యములోనున్నది.
దక్ష యజ్ఞమునందు ప్రాయోపవేశము చేసిన సతీదేవి శరీరము శ్రీహరి తన సుదర్శన చక్రముతో ఖండించినప్పుడు సతి శరీర భాగములు భూమిపై వివిధ ప్రదేశములలో పడినవి. సతి శరీర భాగములు పడిన ఆ ప్రదేశములు శక్తి పీఠములుగా భూమిపై అవతరించి వెలుగొందు చున్నవి. ఈ శక్తి పీఠములలో 18 శక్తి పీఠములు అత్యంత మహిమా న్వితముగా అష్టాదశ శక్తి పీఠములుగా ప్రసిద్ధి చెందినవి. ఈ అస్టాదశ శక్తి పీఠములలో మూడవ శక్తి పీఠము ఉజ్జయిని నందున్న మహాకాళి శక్తి పీఠము. ఇచట సతీదేవి పై పెదవి భాగము పడినది. స్థానికముగా ఈమె శక్తిపీఠము అనితెలియక కాళి అని కాక హరసిద్ధిమాత అనిపిలిచేదారు.
స్థానికముగా ఈమె శక్తిపీఠము అనితెలియక కాళి అని కాక హరసిద్ధిమాత అనిపిలిచేదారు. ఈమాత తనతలను పదకొండుమార్లు అర్పించి ఆమెచే మరలా పునర్జీవితుడైన విక్రమాధిత్యమహారాజు ఆరాధ్యదేవత. ఆలయము నందు మహాలక్ష్మి మరియు మహాసరస్వతి మధ్యలో అన్నపూర్ణాదేవి చిత్రము ముదురు ఎరుపు రంగులో చిత్రీకరించబడినది. శక్తి స్వరూపమైన యంత్రము కూడా ఈ ఆలయమునందున్నది.4 నుండి 5 వ శతాబ్ద్దములో విక్రమాదిత్యుని ఆస్థానములో సంస్కృత పండితునిగా నున్న కాళిదాసునకు వాక్కునిచ్చినదేవత ఈమహాకాళి.
కాలభైరవుడు శివుని మరియొక అవతారము. కాలభైరవ ఆలయాలు అన్ని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఉన్నాయి శివుణ్ణి దర్శించినపిమ్మట కాలభైరవున్ని దర్శించవలేనని గ్రంధాలు చెపుతున్నాయి. ఉజ్జయినిలో కాలభైరవగుడి ప్రత్యేకం. యీ గుడిలో పూజా సామగ్రితోబాటు కాలభైరవునికి ఇష్టమైన మధిర నైవేధ్యంగాపెడతారు విచిత్రం ఆ మధిర పళ్ళెంలోపోసి స్వామి పెదవులదగ్గరపెడితే కొంతమేర స్వీకరిస్తాడు. మిగిలినమధిర తిరిగి ప్రసాదంగాఇస్తారు. అలవాటు ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు లేదా అక్కడఉన్నవారికి ఇచ్చివెయచ్చు.కాలభైరవునికి మధిర అత్యంత ప్రీతి పాత్రమైనది. భారతధేశములో మధిరను పూజాసామాగ్రితోపాటు కాలభైరవునికి సమర్పించే ఆలయం ఉజ్జయినిలోని కాలభైరవ మందిరం ఒక్కటే
ఉజ్జయినిలో ధర్మ శాలనందు కానీ రైల్వై రిటైరింగ్ రూమ్ నందుదు కానీ హోటల్లుల్స్ నందు కానీ మకాము వేసి దేవస్తానం వెబ్ సైట్ నందు ఆన్ లైన్ ద్వా టికెట్టు తీసుకొని ప్రాతఃకాలమున జ్యోతిర్లింగస్వ రూపు డైన మహాకాళేశ్వరుని బస్మాభిషేకం మరియు హారతి దర్శించుకొనవచ్చును. ధర్మశాలనందు నివాసము కొరకు కూడా ఆన్ లైన్ రిజర్వేషను కలదు. దేవస్థానం బస్సులో ఉజ్జయిని నందు ఈ ఆలయముతో పాటు పై ఆలయములను దర్శించుకోవచ్చు. ఉజ్జయినిలో నవగ్రహాలకి వేరు వేరు రంగుల గోపురాలతో కోడిన ఒకే ఆలయ సముదాయము కలదు.
IPLTOURS – Indian Pilgrim Tours