క్షీరారామం
(IPLTOURS)
పురాణముల ప్రకారము కుమారస్వామి (కార్తికేయుడు) తారకాసురుని వధించుటకు ముందుగా ఆతనికి రక్షాగాఉన్న మెడలోని ఆత్మలింగమును ఆగ్నేయాస్త్రము ప్రయోగించి అయిదుముక్కలు (శకలములు) చేసినప్పుడు ఒకశకలం క్షీరారామంనందు పడినది. పంచారామములందు ఒకటి అయిన క్షీరారామం పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లు మునిసిఫల్ పట్టణమునందు ఉన్నది.
పురాణముల ప్రకారము కుమారస్వామి (కార్తికేయుడు) తారకాసురుని వధించుటకు ముందుగా ఆతనికి రక్షాగాఉన్న మెడలోని శివలింగమును ఆగ్నేయాస్త్రము ప్రయోగించి అయిదుముక్కలు (శకలములు) చేసినప్పుడు అందు ఒకశకలం సోమారామమునందు పడినది. పురాణకధ భూమిమీద పడిన ఆత్మలింగాశకలాలు కైలాసాన్నిచేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయిఅని, అవిపెరిగి కైలాసం చేరుకున్నకలియుగంలో మానవులకు పూజించుటకు స్వామిదర్శనం దుర్లభమని ఆత్మలింగాశకలాలు ఎదగకుండా ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు మరియు కార్తికేయునిచేత ప్రతిష్టించబడి అభిషేక మరియు అర్చనలు చేయబడినవి. ఈఆలయములందు శివుడు స్వయంభూః ఆగుటవలన, ఆలయములు దేవతలైన ఇంద్ర, సూర్య, చంద్ర, విష్ణు మరియు కుమారస్వామిచే (కార్తికేయునిచే) నిర్మించబడి యుండుటవలన ఈఆలయములు దేవతలచే నిర్మించబడిన స్వయంభూః ఆలయములు. ఈఆలయములు దర్శించిన ఆలయములను ఒకెరోజురాత్రి నిర్మించినట్లు అట్లు నిర్మించుట మానవమాత్రులకు సాధ్యముకాదుఅన్నది సుస్పస్టమగుతుంది. అమరావతినందు అమరలింగేశ్వరుడు బాలచాముండితో, భీమవరం సోమేశ్వరస్వామి శ్రీరాజరాజేశ్వరితో, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు పార్వతితో, ద్రాక్షారామభీమేశ్వరుడు అష్టాదశశక్తిపీఠమైన మాణిక్యాంబతో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరుడు బాలాత్రిపురసుందరితోను భక్తులను అనుగ్రహించుచున్నారు.
పరమశివుడు ఇచ్చట క్షీరారామలింగేశ్వరుడు అనుపేరుతో కొలువబడుచున్నాడు. ఈశివలింగము మహావిష్ణువుచే ప్రతిష్ట చేయబడినది. క్షీరారామమునందు ఒకరోజు విశ్రమించిన ఒకసంవత్సరము కాశీవాసము చేసినట్లు అని తెలుపబడినది. కేంద్ర ప్రభుత్వమువారిచే జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారకకట్టడముగా గుర్తించబడినది. ఆలయ గోపురము 120 ఆ ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో సుమారు 9వ శతాబ్దములో చాళుఖ్య రాజులచే నిర్మించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనే అతిఎత్తైన గోపురముకలిగిన దేవాలయము. మిగిలిన శివలింగములవలేనే కాక క్షీరా రామలింగేశ్వరుడు పాలవలే స్వచ్చమైన తెలుపురంగులో పొడవుగా ఉండును. ఆలయమండపం 72నల్లటి గ్రానైట్ రాయితో నిర్మించబడినది. గర్భాలయములోపల ఎడమవైపు గోకర్ణేశ్వర మరియు విఘ్నేశ్వర ఆలయములు ఉన్నవి. కుడిప్రక్క సుబ్రహ్మణ్యస్వామి మరియు జనార్ధనస్వామి ఆలయములునంది ఆలయములో మధ్యభాగమున కలవు. మూలవిరాట్టును ఆనాగా క్షీరారామలింగేశ్వరుని గర్భగుడికి నాలుగు వైపులాఉన్న కిటికీలద్వారా చూడవచ్చును.
స్థానిక కధనము ప్రకారము పూర్వము కౌశికుడుఅను తినుటకు తిండికూడాలేని నిరుపేద బ్రాహ్మణుడు నివసించేదివాడని, ఒకరోజు ఆతని కుమారుడైన ఉపవీత అనువాడు తల్లినిపాల ఆన్నము (చక్రపొంగలి) అడుగగా, ఆమె భీమేశ్వరుని ప్రార్ధించమని తెలుపగా శివుని ఎదురుగా కూర్చొని పాలకొరకు ప్రార్ధించినాడు. శివుడు సంతృప్తిచెంది ఆతనికి పాలకోనేరు తనత్రిశూలమునుండి సృస్ఠించి ఇచ్చినాడు. అప్పటినుండి ఈక్షేత్రము క్షీరారామపేరుతో, ఈగ్రామము పాలకొలను పేరుతో ప్రసిద్ధమైనవి. కాలగమనమున పాలకొలను పాలకొల్లుగా మారినది.
ఆలయమునందు సూర్యుడు, కాశీవిశ్వేశ్వరుడు, పార్వతి, లక్ష్మి, నాగేశ్వరలింగం, దుండివిఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సప్తమాతృకలు, కనకదుర్గ, బ్రహ్మ, సరస్వతి, కుమారస్వామి, కార్తికేయుడు, మహిసాసురమర్ధిని, కాలభైరవ, నాగసర్ప, నటరాజ, దత్తాత్రేయ, నాగేశ్వర, శనీశ్వర, రాధాకృష్ణ మరియు శంకరుని ఉపాలయములు ఉన్నవి. పాలకొల్లునందు గోస్తనీనది ప్రవహించుచూ నర్సాపురంవద్ద గోదావరినదితో కలిసి అంతర్వేదివద్ద సముద్రములో కలియుచున్నది. ముఖ్యమైన పండుగ అయిన మహాశివరాత్రినాడు వేలకొలది భక్తులు క్షీరారా మలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ముక్తి పొందుటకు స్వామినిదర్శించి పూజిస్తారు.
క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ సమయాలు & క్షీరారామం చేరుకోవడం ఎలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాసంస్థ వారు కాకినాడ బస్సు డిపోనుండి అయిదు పంచారామ క్షేత్రములు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ మరియు సామర్లకోట) యాత్ర 24 గంటలలో పూర్తి అగునట్లు కార్తీకమాసములోనూ మరియు శివరాత్రిపర్వదినమురోజున సర్క్యులర్ టూర్లూ ఏర్పాటుచేయుడురు. యాత్ర రాత్రి 8 గం లకు ప్రారంభమై సుమారు 700 కి.మీ ప్రయాణించి మరుసటిరోజు సాయంత్రం సుమారు 7 గం లకు ముగుస్తుంది
ఆలయము ఉదయం 5-30 నుండి 12-30 వరకు తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8-30 వరకు తెరచి ఉంటుంది.
IPLTOURS – Indian Pilgrim Tours