కేదారనాధ్
(IPLTOURS)
మహాద్రిపార్శ్వే చతటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః
కేదారమీశం శివమేకమీడే
దానవులు బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను జనులను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. వారు రాక్షసులనునిర్ణించి మునులను భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్యక్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో పిలువబడుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతి గాంచినవి. జ్య్తోతిర్లింగ ఆవిర్భావం ఇదివరలో తెలిపియున్నాము. కేదార్నాధ్ తప్ప ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రములులో లింగాకారంలో శివుడు దర్శనం ఇచ్చును. ద్వాదశజ్యోతిర్లింగదర్శనం ఆధ్యాత్మికముగా ఉన్నతస్థితిపొందిన సమయంలో సాధ్యపదును. జ్యోతిర్లింగాలు వివిధ రూపములతో ఖ్యాతినార్జించాయి.
శివపురాణంనందు చెప్పబడిన కధనంప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారుఅను తర్కంవచ్చింది. శివుడు మూడులోకములు కలుపుచూ జ్యోతిర్లింగ రూపంలో వెలుతురుతో ఒకస్తంభం సృస్టించి స్తంభంచివర కనుగొనినవారు అధికులని తెలిపినాడు. బ్రహ్మ మరియు విష్ణువు స్తంభం చివర కనుగొనుటకు బ్రహ్మస్తంభం హంసరూపంలో పైకి విష్ణువు తాబేలురూపంలో క్రిందకు ప్రయాణించినారు. బ్రహ్మ మొగలిపూవు సాక్షముతో స్తంభము చివర చూసినానని అసత్యం పలికాడు. విష్ణువుమాత్రం కనపడలేదని అంగీకరించినాడు. శివుడు రెండవస్తంభం రూపంలో ప్రత్యక్షమై బ్రహ్మను క్రతువులందు పూజాలందు పూజ్యస్థానము లేకుండా మొగలిపువ్వు తనపూజకు అనర్హముగాను శపించినాడు. విష్ణువుమాత్రము శాశ్వతముగా పూజలు అందుకొను వరంఇచ్చాడు. జ్యోతిర్లింగములు అన్నియు మండుచూ వెలుగునిచ్చు స్థలములుగా పేరు కాంచినవి. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారంలోనే శివుడు దర్శనం ఇస్తాడు. భారతదేశమునకు ఉత్తరముగా హిమాలయములందు శివుని నివాసమైన కైలాస పర్వతంనకు సమీపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందున్న ఏకైక జ్యోతిర్లింగం కేదార్నాధ్ జ్యోతిర్లింగం.
కేదార్నాథ్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగములలో పదకొండవ జ్యోతిర్లింగం మరియు కేదార్నాధ్ యాత్ర కష్టతరమైనది. కేదార్నాధ్ జ్యోతిర్లింగ దర్శనమునకు సంవత్సరములో మే లేదా జూన్ నెలనుండి నవంబరునెలలో దీపావళివరకు మాత్రమే సాధ్యపదుతుంది. ఆరునెలలు మాత్రమే ఆలయంతెరచిఉంటుంది. బదరీ కేదార్ ఆలయకమిటీ నిర్ధారించిన తేదీవరకు గంగోత్రి, యమునొత్రి మరియు బదరీనాద్ ఆలయములతోపాటుగా మూయబడి ఉంటుంది. ఈఆరునెలలు చలికాలమగుటవలన విపరీతముగా కురియు మంచువలన రవాణాసదుపాయంకూడా ఉండదు. కేదార్నాధ్ యాత్ర చేయుటకుగాను రుద్రప్రయాగనుండి గౌరీకుండ్ వరకు ప్రవేటు వాహనం లేదా బస్సులోచేరి ఆచట స్థానికఆలయములు దర్శించి గుర్రం లేదా నడచి లేదా పల్లకీపై కేదార్నాధ్ చేరవలయును.
పాత-కేదార్నాథ్-పాత – మనిషి ఒక్కంటికి | రూ 4798/- |
పాత-కేదార్నాథ్ | రూ 2399/- |
కేదార్నాథ్-పాత | రూ 2399/- |
డోలీ గౌరీకుంద్-కేదార్నాథ్-గౌరీకుంద్- 32 కి,మీ. | రూ 7950/- |
గౌరికుంద్-కేదారనాథ్ – 16 కి.మీ | రూ 4550/- |
గుర్రము పై | రూ 2300/- |
హేలీకొప్టర్ సర్విస్ వారు కేదార్నాధ్ నందు దర్శనమునకు 2 గంటలు సమయము కేటాయించి దర్శనము పిమ్మట మరలా పాత హేలీపాడ్ వరకు తీసుకువచ్చేదరు. అదనపు రుసుము రూ 1000/- చెల్లింపుపై స్పెషల్ దర్శనము చేయించెదారు. కానీ దీని ఆవశ్యకత అంతగాలేదు.
పర్వతప్రయాణం చేయలేనివారు గుప్తాక్షివరకు రోడ్డుప్రయాణంచేసి గుప్తాక్షివద్దనున్న పాతహెలీపేడ్ నుండి హెలీకాప్టర్ ముందుగా బుక్ చేసుకొని కేదార్నాథ్ వెళ్ళిరావచ్చును. హేలీకాప్టర్ సౌకర్యము ఉదయంనుండి సాయంత్రంవరకు మాత్రమే లభించును. హెలీకాప్టర్ సర్వీసువారి ఛార్జీలు ఈ క్రింది విధముగా ఉన్నాయి. గౌరీకుంద్ నుండి పల్లకి లేదా గుర్రముపై ప్రయాణించుటకు సుమారు 4000 నుండి 5000 వరకు చెల్లింకావలసీ ఉంటుంది. అతులనే గుప్తాక్షి నుండి హెలీకాప్టర్ నాకూ రమారమి 9000 వరకు ఖర్చుకాగలదు. హేలీ కొప్టర్ సర్విస్ వారు కేదార్నాధ్ నందు దర్శనమునకు 2 గంటలు సమయము కేటాయించి దర్శనము పిమ్మట మరలా పాత హేలీపాడ్ వరకు తీసుకువచ్చేదరు. దర్శనమునకు అదనపు రుసుం చెల్లించవలసి ఉంటుంది. కానీ దీని ఆవశ్యకత అంతగా లేదు. 2013 సం కేదార్నాథ్ వద్ద సంభవించిన జలప్రళయమునందు ఆలయము వెనుకభాగమునకు పెద్దబండ కొట్టుకువచ్చి వరదనీటికి ఆలయమునకు నష్టముకలుగకుండా రక్షణ ఇచ్చినది. అంతయు ఈశ్వరేచ్చ కానీ మరియొకటి కాదు.
12 జ్యోతిర్లింగములలో కేదార్నాథ్ పరమపవిత్రమైనది. మిగిలిన జ్యోతిర్లింగ దర్శనమునకు పడనిశ్రమ కేదార్నాథ్ దర్శనమునకు శ్రమపడ్డవలెను. సముద్ర మట్టమునకు సుమారు 11000 అ. ఎత్తులోఉన్న యీ పవిత్ర శైవపుణ్యక్షేత్రమునందు ప్రాణవాయువు అందుట కొంచెము కస్టతరము. కావున హుద్రోగులు దర్శనము చేసుకొనుటకు వెల్లునప్పుడు ఆక్సిజన్ సిలిండరు అందుబాటులో నుంచుకొన వలయును. ఇచట చలి చాలాఎక్కువ.
పురాణకధనం ప్రకారం కృతయుగంలో భస్మాసురుడు అనురాక్షసుడు చేసినతపస్సుకు మెచ్చిన పరమశివుడుడు రాక్షసుడు ఎవరినెత్తిపై అరచేయి పెట్టిన వారు భస్మమంగు వరం అనుగ్రహించినాడు. భస్మాసురుడు వరప్రభావం పరీక్షించ తలచి శివుని నెత్తిపై అరచేతిని ఉంచబోగా శివుడు కేదార్నాధ్ వెళ్ళు సమయమునందు రుద్రప్రయాగ పట్టణమునందు అలకనంద నది ఒడ్డున గుహలో ఉన్న పవిత్ర దేవాలయం కోటేశ్వర మహదేవ్ ఆలయంనందు మహావిష్ణువు గురించి తపస్సుచేసినట్లు కధనం. మహావిష్ణువు మోహిని అవతారంలో భస్మాసునికి కనిపించి నృత్యములో పోటీపడమని రెచ్చకొట్టగా భస్మాసురుడు అంగీకరించి నృత్యము చేయసాగాడు. నృత్యంమధ్యలో విష్ణువు తనచేతిని తలపైనుంచుకొను భంగిమ అభినయించగా భస్మాసురుడు తనఅరచేతిని తలపై స్వయముగా పెట్టుకొని భస్మమై మరణించినాడు.
నరనారాయణులు ప్రతిరోజు శివుని కేదార్నాథ్ నందు నివశించవలసినదిగా ప్రార్ధించెడివారు. శివుడు అంగీకరించి కేదార్నాథ్ నివాసంగా చేసుకొనినాడు. నంది మూపుర రూపక్లో పరమశివుడు కొలువబడుచున్న కేదార్నాధ్ దర్శనమునకు ముందుగా శివుని తలభాగం పూజింపబడుచున్న ఖాట్మండునకు 25 కి.మీ దూరములో భక్తాపూర్ వద్ద సూర్యభినయక్ పట్టణంలో నున్న దౌలేశ్వర్మహదేవ్ ఆలయం దర్శించవలసిఉంది.శివరూపమైన నందితలభాగము ఈఆలయము నందున్నదని మిగతాభాగములు ఉత్తరాఖండ్ నందలి పంచకేదార్ క్షేత్రములని భావించేదరు. కేదార్నాధ్ చిహ్నము పశుపతినాధ్ ఆలయ గోపురం నందు దర్శనం ఇచ్చును. గర్భగృహమందలి లింగము ఎద్దు మూపురమువలె త్రిభుజా కారములో దర్శనమిస్తుంది.
గుడిచుట్టూ పాండవులకు సంబంధించిన అనేకగుర్తులు కలవు. ఇక్కడి గిరిజనులు పాండవనృత్యముఅనే పేరుతో నృత్యం చేసేదరు. బదరీనాథ్ నందు స్వర్గారోహిణి పర్వతశిఖరం కేదార్నాధ్ పర్వతపంక్తిలోనిదే. స్వర్గారోహణం చేయసమయంనందు ధర్మరాజు చేతివేలు ఇచ్చటపడినట్లు చెప్పెదరు. ధర్మరాజు బోటకనవేలు పరిమాణములో ఒకలింగమును ఇచట ప్రతిష్టించాడు. మహిష రూపములో శివుడు భీమునితో ఇచట యుద్ధము చేసినట్లు యుద్ధంలో భీముడు పరాజితుడైనట్లు చెపుతారు. భీముడు శివుని శరీరమును వేతితో మర్ధన చేసినాడు. అప్పటినుండి ఇక్కడి త్రిభుజాకారపు జ్యోతిర్లింగమునకు నేటితో మర్ధన లేదా అభికేకము చేసేదరు. నీరు మరియు బెల్ ఆకులతోనూ చేయదురు.
స్థానిక స్థల పురాణంప్రకారం మహాభారత కాలంనందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు సంహరించినపిమ్మట, యుద్ధమునందు జరిగిన గోత్రీకులహత్య మరియు గోహత్యల పాపములనుండి విముక్తులు కావలెనని తమ రాజ్యభారమును వంశీకులకు వప్పగించి శివుని వెదకి దీవెనలు పొందవలేనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్యక్షేత్రమును చేరగా శివుడువారిపై కురుక్షేత్ర సంగ్రామంనందు వారివలన కలిగిన జననష్టమునకు కోపించి వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అద్దృశ్యమైనాడు. కాశీనందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళారు. భీముడు రెండుపర్వతములమధ్య నిలబడిచూడగా నంది గుప్తాక్షి వద్ద గడ్డిమేయుచూ కనిపించింది. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా అదృశ్యమై ఆరుభాగాలుగా విడిపోయింది.
తల నేపాల్ నందు సూర్యభినయక్ పట్టణంలోనున్న దౌలేశ్వర్ మహదేవ్, మూపురం కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్యమహేశ్వర్, ముఖభాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ నందు పడినవి. పాండవులు శివుని కొలుచుటకుగాను సూర్యభినాయక్ నందుతప్ప అయిదు స్తలములలో ఆలయములు నిర్మించి పాపములనుండి విముక్తి పొందారు. అయిదు ఆలయములు పంచకేదార్ అని ఖ్యాతి గాంచినవి. శివుని ముందుభాగము పడిన ప్రదేశమునందు నేపాల్ లోని ధోలేశ్వర్ ఆలయముఉన్నది అనిచెపుతారు. పాండవులు ఈ పంచకేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట కేదార్నాధ్ నందు తపస్సుచేసి యజ్ణముచేసి వారు స్వర్గలోకప్రయాణం ప్రారంభించారు. కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు కేదారేశ్వర్ జ్యోతిర్లింగము అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది. కేదార్నాధ్ యాత్రలో అందమైన జలపాతములు సరస్సులు చూడవచ్చును. మనసునకు ఆహ్లాదముగా యుండును.
చొరబోరి సరస్సు
ఇది పురాతనసరస్సు. దీనినిగాంధీ సరస్సు అనికూడా అంటారు. మహాత్మాగాంధీ అస్థికలు ఇచట నిమజ్జనం చేసినారు. ఇచ్చటనే శివుడు యోగావిద్యను సప్త మహాఋషులకు నేర్పినాడు.
వాసుకి సరస్సు
ఇది హిమాలయములపై కల అద్భుతమైన సరస్సు.
ఆది శంకరాచార్య విగ్రహం
హిందూమత వ్యాప్తికి అవిరళ కృషిచేసిన ఆదిశంకరాచార్యులువారు తన 32 సం. ల వయస్సులో తమిళనాడులోని కాంచీపురం నందు మరణించినారని మరికొందరు కేరళనందు మరణించినట్లుకూడా కధనములున్నను, భారతదేశమునకు ఉత్తరమున హిమాలయము లందు పుణ్యక్షేత్రమైన బదరీనాధ్ వద్ద జోషీమఠ్ స్థాపించి ఆచటినుండి కేదార్నాధ్ పయనించి అచ్చటనే శివైక్యంచెందినట్లుగా భావిస్తారు. శంకరాక్యార్యులవారి మరణవిషయమై నిర్ధిష్ట సమాచారం ప్రకారం ఆయనశిష్యులు చివరిసారిగా శంకరాచార్యులవారిని కేదార్నాథ్ పుణ్యక్షేత్రమునందు ఆలయమునకు వెనుకభాగమున చూసినట్లుగా తెలియుచున్నది. కేదార్నాధ్ ఆలయము అభివృద్ధిపరచి అచ్చటనే నివసించినారని, ప్రధానశిష్యులు నలుగురుని హింధూధర్మ ప్రచారమునకై తననువిడిచి వారిప్రయాణము కొంసాగించమని ఆదేశించినట్లు తెలియుచున్నది. శిష్యులను అక్కడి శీతలవాతావరణంనుండి కాపాడుటకు కేదార్నాధ్ నకు 16 కి.మీ దూరములో గౌరీకుంద్ వద్ద వేడినీటి ఊట సృష్టించారని అనినానుడి.
కేదార్నాధ్ ఆలయమువెనుక ముప్పై నిమిషములు నడచిన శంకరాచార్యులవారి సమాధిస్థలమును చేరవచ్చును. 2013 సం.నందు కేదార్నాధ్ నందు సంభవించిన వరదలయందు శంకరులసమాధి ధ్వంశమైనది. శంకరాచార్యుల సమాధిస్థలములో శ్రీఆదిశంకరుల విగ్రహాన్నిప్రతిష్ఠించాలని ప్రభుత్వమువారు సంకల్పించి 12 అ ఎత్తు మరియు 35 ట బరువుతో నల్లరాతితో కూర్చొనిఉన్న భంగిమలో విగ్రహాన్నికర్ణాటకనందు తయారుచేయించి ఇటీవల కేదార్నాధ్ నందు ప్రతిష్టించి యున్నారు.
కేదార్నాథ్ యాత్ర పుణ్యము మనోజ్ణము ఆహ్లాదకరము.