కేదారనాధ్
(11వ జ్యోతిర్లింగం)
IPLTOURS
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః
కేదారమీశం శివమేకమీడే
(11వ జ్యోతిర్లింగం)
IPLTOURS
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః
కేదారమీశం శివమేకమీడే
జ్యోతిర్లింగములలో సోమనాధ్ జ్యోతిర్లింగం మొదటిది. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
కేదార్నాథ్ జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలో పదకొండవజ్యోతిర్లింగము మరియు జ్యోతిర్లింగయాత్రలో కష్ట తరమైన యాత్ర. కేదార్నాధ్ యాత్రచేయుటకు గాను రుద్రప్రయాగలో ఆగి రుద్రప్రయాగ నుండి యాత్ర కొనసాగించవలెను. కేదార్నాధ్ యాత్రకుగాను రుద్రప్రయాగ నుండి గౌరీకుంద్ వరకు ఆగస్టముని, గుప్తాక్షి, పాత, సీతాపూర్ మరియు సొనప్రయాగ (పంచ ప్రయాగల లోనిది కాదు) ద్వారా రోడ్డుమార్గముద్వారా టెంపోలో లేదా వేసవి కాలమైన బస్సులో చేరి ఆచటినుండి గుర్రముపైగాని, నడచిగాని, పల్లకీపై గాని కేదార్నాధ్ చేరవలయును. అట్లు ప్రయాణము చేయలేనివారు గుప్తాక్షి వరకు రోడ్డు ప్రయాణము చేసి అచటవిశ్రమించి పాత హెలీపాడ్ నుండి హెలీకాప్టర్ ముందుగా బుక్ చేసుకొని కేదార్నాథ్ వెళ్ళిరావచ్చును. హేలీకాప్టర్ సౌకర్యము ఉదయమునుండి సాయంత్రం వరకు మాత్రమేలభించును. పవన్ హేయన్సు హెలికాప్టర్ సర్వీసువారి ఛార్జీలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.
పాత-కేదార్నాథ్-పాత – మనిషి ఒక్కంటికి | రూ 4798/- |
పాత-కేదార్నాథ్ | రూ 2399/- |
కేదార్నాథ్-పాత | రూ 2399/- |
డోలీ గౌరీకుంద్-కేదార్నాథ్-గౌరీకుంద్- 32 కి,మీ. | రూ 7950/- |
గౌరికుంద్-కేదారనాథ్ – 16 కి.మీ | రూ 4550/- |
గుర్రము పై | రూ 2300/- |
హేలీకొప్టర్ సర్విస్ వారు కేదార్నాధ్ నందు దర్శనమునకు 2 గంటలు సమయము కేటాయించి దర్శనము పిమ్మట మరలా పాత హేలీపాడ్ వరకు తీసుకువచ్చేదరు. అదనపు రుసుము రూ 1000/- చెల్లింపుపై స్పెషల్ దర్శనము చేయించెదారు. కానీ దీని ఆవశ్యకత అంతగాలేదు.
2013 సం వరదలలో కేదార్నాథ్ ఆలయము వెనుకభాగమునకు పెద్ద బండకొట్టుకు వచ్చి ఆలయమునువరద నీటికిదెబ్బ తినలేదు. అంతయు ఈశ్వరేచ్చ కానీ మరియొకటి కాదు.
భువిపై వెలసిన 12 జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ పరమ పవిత్రమైనది. మిగిలిన జ్యోతిర్లింగ దర్శనమునకు అంతగా శ్రమ పడవలసిన అవసరములేకున్ననూ కేదార్నాథ్ యాత్ర మాత్రము బహు కస్టతరమైనది. సముద్ర మట్టమునకు సుమారు 11000 అడుగుల ఎత్తులో ఉన్న యీ పవిత్ర శైవ పుణ్య క్షేత్రమునందు ఆక్సిజన్ అందుట కొంచెము కస్టతరము. కావున హుద్రోగులుదర్శనము చేసుకొనుటకువెల్లునప్పుడు ఆక్సిజన్ సిలిండరుఅందుబాటులో నుంచుకొనవలయును. ఇచట చాలా చలిగా శరీరము గద్దకట్టునట్లుగాయుండును.
నరనారాయణులు ప్రతిదినము శివుని కేదార్నాథ్ నందు నివశించవలసినదిగా ప్రార్ధించేడివారు. శివుడు అందుకు అంగీకరించి కేదార్నాథ్ నివాసముగా చేసుకొనినాడు. శివుని (నంది) మూపురము కొలువబడుచున్న కేదార్నాధ్ నకు ముందుగా శివుని తలభాగము పూజింపబడు చున్న పశుపతినాధ్ నుండి 25 కిలో మీటర్ల దూరములో నున్న చౌలిమహేశ్వర్ దేవాలయమునుండి ఈ యాత్ర ప్రారంభము అవుతుంది. కేదార్నాధ్ చిహ్నము పశుపతినాధ్ ఆలయగోపురముపై దర్శనము ఇచ్చును. గర్భగృహమందలి లింగము ఎద్దుమూపురమువలె త్రిభుజాకారములో దర్శనము ఇచ్చును. గుడి చుట్టూ పాండవులకు సంబంధించిన అనేక గుర్తులు కలవు. ఇక్కడి గిరిజనులు పాండవనృత్యము అనే పేరుతో నృత్యముచేసేదరు. బదరీనాథ్ నందు స్వర్గారోహిణి అను పేరుతో నున్న పర్వత శిఖరము హిమాలయములలోనిదే. స్వర్గారోహణముచేయు సమయమునందు ధర్మరాజు చేతివేలు ఇచ్చటపడినట్లు చెప్పేదరు. ధర్మరాజు బోటకనవేలుపరిమాణములో ఒక లింగమును ఇచట ప్రతిష్టించినాడు. నందిరూపమునుపొందిన శివుని వెనుక కాళ్ళు మరియు తోక పట్టుకొనగా శివుడు మాయమైనట్లు చెపుతారు. నంది శరీరము ఆరు భాగముగా విడిపడి మూపురము కేదార్నాధ్ నందు, నాభి మరియు ఉదరభాగము మధ్యమహేశ్వర్ నందు, చేతులు తుంగనాధ్ నందు, ముఖము రుద్రనాధ్ నందు, కురులు కల్పెశ్వర్ నందు మరియు తల నేపాల్ నందు ఖాట్మండునకు 25 కిమీ దూరమునందుకల చౌలిమహేశ్వర్ నందుపడినవి. ఈ కారణముననే కేదారేశ్వరుడు లింగ రూపమున కాక మూపురరూపములో దర్శనంఇస్తాడు. అప్పుడు భీముడు శివుని శరీరమును చేతితో మర్ధన చేసినాడు. అప్పటినుండి ఇక్కడి త్రిభుజాకారపు శివజ్యోతిర్లింగమునకు నేతితో మర్ధన లేదా అభిషేకము చేసేదరు. నీరు మరియు బెల్ ఆకులతోనూచేయదురు.
స్థానిక స్థల పురాణము ప్రకారము మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు ఓడించి చంపినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావ్లేనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకులకు వప్పగించి శివుని వెదకి దీవెనలు పొందవలేనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్యక్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేతెర సంగ్రామమునందు వారివలన కలిగిన చావులకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునకు అద్దృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు. భీముడు రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించినది. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాత ప్రత్యక్షమై అయిదుభాగములుగా విడిపోయినది. మూపుర భాగము కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ నందు తల నేపాల్ లోని పశుపతినాధ్ నకు 25 కి.మీ. దూరములో నున్నచౌలిమహేశ్వర్ నందుపడినవి. పాండవులు శివుని కొలుచుటకుగాను ఈ అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని ముందు భాగము పడిన ప్రదేశమునందు నేపాల్ లోని ధోలేశ్వర్ ఆలయము ఉన్నది అని చెపుతారు. పాండవులు ఈ పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట కేదార్నాధ్ నందు తపస్సు చేసి యజ్ణము చేసి వారు స్వర్గలోకము పొందినారు. కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు కేదారేశ్వర్ జ్యోతిర్లింగముదర్శించి అర్చించిన దోషములుతొలగునని చెప్పబడినది. కేదార్నాధ్ యాత్రలో అందమైన జలపాతములు సరస్సులు చూడవచ్చును. మనసునకు మిక్కిలి ఆహ్లాదముగా యుండును.
చొరబోరి టాల్అ నునది పురాతన సరస్సు. దీనినే గాంధీ సరస్సు అనికూడా అంటారు. మహాత్మా గాంధీ అస్థికలు ఇచట నిమజ్జనం చేసినారు. ఇచ్చటనే శివుడు యోగా విద్యను సప్త ఋషులకు నేర్పినాడు. వాసుకి టాల్ అనునది హిమాలయములపై కల అద్భుతమైన సరస్సు.
కేదార్నాథ్ యాత్రలో గౌరీకుండ్ ప్రారంభస్థానమై యున్నది. ఇది సముద్ర మట్టమునకు సుమారు 6000 అ ఎత్తున ఉన్నది.ఈ క్షేత్రము ఉకీమత్ నకు 28 కి.మీ. మరియు సోనాప్రయాగకు 6 కి.మీ. దూరములోనున్నది. 2013 వరదలలో ఈ గ్రామము మొత్తముగా కొట్టుకొని పోయినది. కానీ ఇప్పటికినీ ఇచట కుండ్ప్రాం తములో చిన్న వేడినీటి ధార ఉన్నది. 2013 వరదలకు ముందు గౌరికుండ్ కేదార్నాధ్ యాత్రికులకు కేంద్రస్థానమై యుండేదిది. వరదలకు కొట్టుకొనిపోయిన పిమ్మట ప్రభుత్వము వారు నెమ్మదిగా పునర్ నిర్మించియున్నారు. శివుని భార్య అయిన పార్వతి/గౌరి పెరున ఈ పుణ్యస్థలము ప్రాశస్తమైనది. ఇచట గౌరీదేవి ఆలయమున్నది. శివుని ప్రసన్నము చేసుకొనుటకు పార్వతీమాత ఇచ్చటనే ప్రాయిచ్చిత్తము చేసుకొనినట్లు తెలియుచున్నది. పార్వతీమాత సరోవరములో స్నానముచేయుటకు వెళ్ళుటకుముందుగా విఘ్నేశ్వరుని సృష్టించినది ఇచ్చటనే.
త్రియుగినారాయణ్ ఆలయం గౌరికుండ్ నకు దగ్గరలోగల యీఆలయమువద్ద శివుడు పార్వతీదేవిని అందరు దేవతల ఎదుట వివాహముచేసుకొనినాడు. ఈ ఆలయమునకు ఎదురుగా బ్రహ్మశిల అనిపిలవబడు రాయిఉన్నది. ఇచ్చటనే పార్వతీ పరమేశ్వరుల వివాహకాలమునుండి వెలుగుచున్న అఖండజ్యోతి ఉన్నది. కేదార్నాథ్ యాత్ర పెద్దవారికి పుణ్యము చిన్నవారికి ఆహ్లాదకరము. మొత్తముపై అన్నీ వయస్సుల వారిని ఆకర్షించి ఆనందింప చేసేది హిమాలయన్ యాత్ర.
IPLTOURS – Indian Pilgrim Tours