కరంజ నృసింహ

(IPLTOURS)

కరంజనృసింహ అహోబిలమునందున్న నవనృసింహఆలయములలో ఒకటి. ఈ ఆలయము నల్లమల ఆటవీ ప్రాంతములో దిగువ అహోబిలంనుండి ఎగువ అహోబిలం వెళ్ళుమార్గములో అతి దట్టమైన అడవుల మధ్య ఉన్నది. ఆంజనేయస్వామి శ్రీరామదర్శనం కోరుచూ కరంజ (కానుగ లేదా గానుగ) చెట్టుక్రింద తపముచేయుచుండగా విష్ణుభగవానుడు ఆంజనేయుని పరీక్షింప దలచి నృసింహుని (సగము మనిషి సగము సింహము) రూపములో దర్శనము ఈయగా ఆంజనేయుడు తనకురాముని దీవనలభించలేదని అసంతృప్తిచెందినాడు. నృసింహుడు తానేరాముడినిఅని నచ్చచెప్పుటకు ప్రయత్నించగా ఆంజనేయుడు సంతృప్తిచెందక తనరాముడు అమితసౌందర్యవంతుడని ఎప్పుడును విల్లుఆతనిచేతిలోనే ఉంటుందని వారుతప్ప ఇతరులు తనకుతెలియరు అనిచెప్పగా నృసింహస్వామి ధనస్సుతో దర్శనము ఇచ్చినాడుఅని, ఆంజనేయుడు నృసింహుని చేతివేళ్ళ గోరులు చూసిఅంగీకరించలేదని, అప్పుడు ఆంజనేయునిభక్తికి సంతోషించి ఎడమచేతిలో విల్లుతో కుడిచేతిలో సుదర్శన చక్రముతో శిరస్సుపైఆదిశేషుతో సగముమనిషి సగముసింహముగా దర్శనముఇచ్చి ఆంజనేయునికి తానేవిష్ణువుఅని, తానేరాముడుఅని మరియు తానేనృసింహుడినని నచ్చచెప్పినాడు. అందువలననే చేతులలో ధనస్సు మరియు చక్రముతో ఆదిశేషుని పడగలో నృసింహుడు దర్శనము ఇచ్చేదడు అనికధనము. 

Entrance of Karanja Narasimha Swamy Temple - Ahobilam

గోబిలమహర్షి దూర్వాసమహర్షివలన మందభాగ్యుడు అగునట్లు శాపముపొందినాడు. పిమ్మట గోబిలమహర్షి కరంజ నృసింహుని నృసింహమంత్రము పారాయణచేయుచూ పూజించినాడు. స్వామికరుణించి గోబిలమహర్షికి పూర్వజ్ణానము ప్రసాదించినాడు. అటుపిమ్మట గోబిలుడు అమితజ్ణానముతో ముక్తిపొందినాడు. అందువలన కరంజినృసింహుని సేవించిన జ్ణానము మరియు తెలివితేటలు పొందుటకు భక్తులు ఈఆలయము దర్శించేదారు అనినానుడి. నృసింహుడు కానుగ (గానుగ) చెట్టుక్రింద ఆదిశేషునినీడలో పద్మాసనముద్రలో ధ్యానముచేయుచూ ఇచట దర్శనం ఇస్తాడు. మరియు కరంజనృసింహస్వామికి పాలనేత్రము (మూడవనేత్రము) ఉన్నది. ఆంజనేయుడు నమస్కరించుచూ స్వామివైపు తిరిగి దర్శనం ఇస్తాడు. సారంగ అను పేరుగలవిల్లు ధరించిఉండును కావునస్వామిని సారంగనృసింహుడని ప్రసిద్ధి. ఇచట సుమారు 600 సం నాటి నూరుస్తంభముల మండపముఉన్నది. అహోబిలం మొదటిజీయరస్వామి ఉపన్యాసములు ఇచ్చటనే ఇచ్చినారు.

కరంజనృసింహుడు చంద్రగ్రహమునకు అధిపతి. జాతకచక్రమందు చంద్రగ్రహదోషములైన బుద్ధిమాంధ్యము తెలివిలేకపోవుట, ఆలోచనవిధానములో లోపము తదితరములనుండి ఈస్వామినిదర్శించి అర్చనచేసిన వారికితొలగునని ఇతిహాసము. ఆరణ్యప్రదేశము కావున ఆలయం ఉ 9-00 నుండి సా 4-00 వరకు తెరచి ఉంటుంది. 

IPLTOURS Indian Pilgrim Tours