కాంచీపురం
(IPLTOURS)
ఉత్తరభారతదేశంలో వారణాశి పిమ్మట దక్షణాన అత్యదిక ఆలయాలుకల పట్టణంగా తమిళనాడులోని కాంచీపురం పేరుపడ్డది. కాంచీపురం పట్టణంలో 108 శైవ మరియు 18 వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనయందు కాంచీపురమును కంజీవరమని పిలిచేదివారు. పాలార్ నదిఒడ్డున సుమారు పదహారువందల సంవత్సరములకు పూర్వం పల్లవరాజ్యపాలన యందు పట్టణం నిర్మించ బడింది. ప్రముఖ హిందూ తత్వవేత్త మరియు సన్యాసి అయిన జగద్గురు శ్రీఆది శంకరాచార్యులవారు క్రీస్తుశకం ఇక్కడ నివసించి అద్వైతతత్వాన్ని భోధించి ప్రచారంచేశారు. కామాక్షీదేవి ఆలయం కాంచీపురము నందుకల అత్యంత ప్రసిద్ధమైన పురాతన దేవాలయం. కామాక్షీదేవి ఇసుకతోచేసిన శివలింగమునకు పూజలుచేసి శివుని ఏకాంబరేశ్వరుని అవతారంలో వివాహం చేసుకున్నట్లు పురాణములందు తెలుపబడినది.
సుమారు 5 ఎకరముల స్థలంలో విస్తరించబడిన ఆలయం గర్భగుడి బంగారుపూత పూసిన విమానం కలిగిఉంది. గర్భగుడిలో కూర్చున్న భంగిమలో పరబ్రహ్మ స్వరూపిణిగా కామాక్షి దర్శనమిస్తుంది. కామాక్షిచుట్టూ త్రిమూర్తులైన శివుడు, విష్ణువు మరియు బ్రహ్మ విగ్రహాలు కనపడతాయి. గర్భగుడి చుట్టూ బంగారు కామాక్షి, ఆది శంకర మరియు మహాసరస్వతి యొక్క చిన్నఆలయాలు ఉన్నాయి.