హరిద్వార్
(IPLTOURS)
హరిద్వార్ మహావిష్ణువు లేదా హరిని మరియు పరమశివుడు లేదా హరుని చేరుటకు ప్రవేశద్వారం. హరిద్వార్ హిమాలయ పర్వతసానువులలో నివాసముండు శివకేశవులను చేరుటకు కలఏకైక ప్రవేశద్వారం. హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన నగరం. ఈయాత్రాస్థలం గురించి చెప్పబడిన పురాణంప్రకారం కపిలమహర్షి యువరాజు భగీరథుని పూర్వీకులను తనకోపాగ్నితో బస్మంచేశాడని. భగీరథుడు ఇక్కడ శివునికి తపస్సుచేసి శివుని అనుగ్రహంతో గంగను భూమిపైకి అవతరింపచేసి పూర్వీకుల భస్మముద్వారా ప్రవహింపచేసి వారికి ముక్తి కలిగించాడని తెలుస్తున్నది.
హరిద్వార్ క్షేత్రం గురించి పూర్తి కధనం మరియు దర్శనీయ స్థలములు, ఆలయములవివరములు మా చార్ ధామ్ యాత్ర నందు సవివరముగా ఫోటోలు మరియు వీడియోలతో తెలియాయచేసి యున్నాము.