శ్రీ హనుమాన్ చట్టి
(IPLTOURS)
(IPLTOURS)
హనుమాన్ చట్టి అనునది గోవిందాఘాట్ నుండి బదరీనాద్ ప్రయాణించు మార్గములో జోషీమఠ్ నకు 34కి.మీ. మరియు బదరీకి 12కి.మీ దూరములోనూఉన్న హనుమంతుని ఆలయము. హనుమంతుడు శ్రీరామునికి ప్రధమభక్తుడు. చార్ ధామ్ యాత్ర చేయుప్రతిభక్తుడు బదరీనాధుని దర్శించుటకుముందుగా జోషీమఠ్ నుండి బదరీనాధ్ మార్గమధ్యములో తప్పనిసరిగా దర్శించు ముఖ్యమైన ఆలయము ఈహనుమాన్ ఆలయము. నారింజరంగులోకల ఈఆలయము చూచుటకుచిన్నఆలయముగా కనపడిననూ దర్శించువారికి మిక్కిలి సుందరముగాకనపడును. ఈఆలయమువద్ద రెస్టారెంట్లుకానీ మరిఏఇతరమైన పెద్ద దుకాణములు ఉండవు. ఇచ్చట కేవలము పూజాసామాగ్రి విక్రయించు దుకాణములు మాత్రమేకలవు.
ఈపవిత్రప్రదేశము వెనుక ఆశక్తికరమైన మహాభారతకాలమునందు సంభవించిన చరిత్ర ఉన్నది. పాండవులు జూదములో రాజ్యము పోగొట్టుకొని అరణ్యవాసము చేయు సమయమునందు హిమాలయాపర్వతములు చుట్టూ తిరిగినారు. మార్గములో పాండవుల ధర్మపత్ని ద్రౌపది చేతిలోఒక కమలముపదినది. ఆపుష్పము అందమునకు ముగ్ధురాలైన ద్రౌపదిభీముని అటువంటి కమలములు మరికొన్ని కావలెనని కోరినది. భీముడు ఆమెకోరిక తీర్చుటకొరకు అన్నిప్రదేశములు తిరిగినాడు. అనేకరకములైన పుస్పములు కనపడినవి కానీ కమలములుకనపడలేదు. ఆకమలములను వెదకుచూ హనుమాన్ చట్టి అను ఈ ప్రదేశమును చేరినాడు. ఈప్రదేశములోనే హనుమంతుడు పాండవమధ్యముడైన భీమునికితాను అమిత బలవంతుదనని శక్తికలవాడినననికల అహంకారము అణచి గర్వభంగము చేసినాడు.
భీముడు ఈమార్గమునందు ప్రయాణించుచుండగా, మార్గమునకు ఆడ్డుగా ఒకముసలికోతిని (హనుమంతుడు) చూసినాడు. ఆకోతియొక్కతోక మార్గమునకు అడ్డముగా వ్యాపించి మార్గమునకు ఆటంకముగాయుండుట గమనించినాడు. భీముడు ఆముసలికోతిని పలుమారులు తోకను తొలగించవలసినదిగా కోరినాడు. హనుమంతుడు తానుముసలివాడిని మరియు అశక్తుడను కావున తోకమార్గమునకు అడ్డుతొలగించి ప్రయాణించవలసినదిగా తెలియజేసినాడు. భీముడు అమితముగా కోపగించి తనశక్తితోతోకను అడ్డుతొలగించ తలచుకొనినాడు. భీముడు తనశక్తితో హనుమతోకను తొలగించుటకు పలుమారులు ప్రయత్నించినాడు కానీఆతోకను కదల్చలేకపోయినాడు.
భీముడు ఆశ్చర్యచకితుడై ఆకోతి సాధారణమైనదికాదని మహానుభావుడని గ్రహించి ఆకోతిని వాస్తవరూపముతో దర్శనం ఈయకోరినాడు. అప్పుడు రామభక్తుడైన హనుమంతుడుతన వాస్తవరూపములో భీమునికి దర్శనము ఇచ్చినాడు. హనుమంతుడు భీమునితో తానువాయుదేవుని పుత్రుడనని ఆతనికి సోదరుదనని తెలిపినాడు. భీమునిదీవించి భీముడు వెతుకుచున్న కమలములు కుబేరుని వనములో దొరకునని తెలిపి కుబేరవనమునకుపోవు మార్గము చూచించినాడు.
మరియొక కధనము ప్రకారము హనుమంతుడు బదరీనాధుని గురించి తపస్సుచేసి సంతోషపరచినాడు అనితెలిపేదరు. బదరీనాధ్ ఆలయము మూసివేయు కాలములో ఈఆలయముకూడా మూసివేయుడురు. ఆలయప్రవేశము ఉచితము. మేనెలనుండి అక్టోబరుమాసము వరకు ప్రయాణము సౌకర్యవంతముగా ఉండును. శీతాకాలములో దర్శనము కష్టము.
IPLTOURS – Indian Pilgrim Tours