గృష్నేశ్వర్
(12వ జ్యోతిర్లింగం)
IPLTOURS
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్
సముల్లసంతం చ జగద్వరేణ్యమ్
వందే మహోదారతరస్వభావం
ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే
(12వ జ్యోతిర్లింగం)
IPLTOURS
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్
సముల్లసంతం చ జగద్వరేణ్యమ్
వందే మహోదారతరస్వభావం
ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే
కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
ద్వాదశ జ్యోతిర్లింగములలో 12వ జ్యోతిర్లింగమైన గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రరాష్ట్రములో ఔరంగాబాద్ నకుసమీపములోనున్న దౌలతాబాద్ నుండి 20 కి.మీ. దూరములోని వేరుల్ అను గ్రామములొఉన్నది. ఈ ఆలయముసమీపములోనే అజంతా ఎల్లోరాగుహలు ఉన్నవి. ఈఆలయము 14వ శతాబ్దములో ముఘల్ రాజులచే ధ్వంశం కాబడినది. మరలా 18 వ శతాబ్ధములో వారణాశినందు కాశీవిశ్వనాధుని ఆలయము పునర్నిర్మించిన మరాఠారాణి అహల్యాభాయి హోల్కర్ అనువారిచే ఈ ఆలయము నిర్మించబడినది. ఈమహారాణి గయ నందు విష్ణుభగవానునిఆలయము మరియు సోమనాధ్ నందు అతిపెద్దజ్యోతిర్లింగ ఆలయం నిర్మించినారు. ఈఆలయమునందు అందరూ ప్రవేశించవచ్చును కానీ గర్భాలయమునందు మగవారు ఆచ్ఛాధనలేని ఛాతీతోమాత్రమే ప్రవేశమునకు అనుమతిస్తారు. అయిదుఅంతస్తుల శిఖరముకలిగిన ఈఆలయము రాళ్ళతో కట్టబడినది.
శివపురాణమునందు చెప్పబడిన ప్రకారము సుధర్మ మరియు సుదేహ అను దంపతులు దేవగిరిపర్వతముపై నివసించేడివారు. వారికిపిల్లలు జన్మించకపోవుటవలన సుదేహ తన సోదరి గుష్మను సుధర్మకుఇచ్చి వివాహముచేసినది. గుష్మకు ఒకబాలుడు జన్మించాడు. సుదేహ అసూయపడి గుష్మ101 శివలింగములను వదలిపెట్టినకొనేరులో ఆబాలుని విసిరివేసినది. గుష్మ శివుని ప్రార్ధించగా శివుడు ఆశిశువును గుష్మకు అప్పగించి సుదేహచేసిన కార్యముగురించి తెలిపినాడు. సుధర్మ కోరికమేరకు శివుడు ఇచట గృశ్నేశ్వర్ జ్యోతిర్లింగరూపములో వెలసినాడు. ద్వాదశ జ్యోతిర్లింగఆలయములలో ఈఆలయమే అతి చిన్నది. విష్ణువు దశావతారములు ఎర్ర రాయిపై చెక్కబడినవి. తూర్పుముఖముగా లింగమూర్తి అతిచిన్నగర్భాలయములోనుండును. 24 స్తంభములతో నిర్మించబడిన మండపమునందు నంది ప్రతిస్థించబడియున్నది. వృశ్చికరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగముల దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది.
గృష్ణేశ్వర్ ఆలయము ఔరంగాబాదు నుండి 31 కి.మీ. స్థానిక రవాణా యందు సుమారు 45 ని.లలో చేరవచ్చును. ఉదయం 5-30 నుండి రాత్రి 9-00 వరకు ఆలయమునందు దర్శనమునకు అనుమతింతురు. శ్రావణమాసము, కార్తీకమాసము మరియు శివరాత్రి ముఖ్యఉత్సవములు నిర్వహింతురు. శాస్త్రబద్ధమైనదుస్తులు మాత్రమే ధరించవలెను. అనగా మగవారు ధోవతి (పంచే) ఖండువా (ఆచ్ఛాధన లేని ఛాతీతో మాత్రమే ప్రవేశమునకు అనుమతి) మరియు ఆడవారు చీర, చూడేదార్, పరికీని ధరించవలసి ఉంటుంది.
IPLTOURS – Indian Pilgrim Tours