గరుడ నంది

(IPLTOURS)

నంధ్యాలనుండి మహానంది పోవురోడ్డు నందు మహానందిగుడికి ముందు పెద్దనంది విగ్రహం కనిపిస్తుంది. అది దాటిన పిమ్మట మహానందికి 500 మీటర్ల దూరములో గరుడనంది ఉన్నది. నంది తన రెక్కలను ఇచ్చటనే వదలివేసినట్లు తెలిపేదరు. మరియు ఇచ్చటనే గరుత్మంతుని తల్లి వినతాదేవి తనువెళ్ళే పనిలో ఎటువంటి ఆటకములు కలుగకుండా ఉండుటకు పరమేశ్వరుని ప్రార్ధించినడే అనికూడా నానుడి.               

నవనంది క్షేత్రములలో నంద్యాలలోని నాగనంది మరియు మహానంది సమీపములోనున్న గరుఢనంది ఈరెండింటికి ప్రత్యేకత ఉన్నది. గరుత్మంతుడు నాగులపై దాడి చేసినప్పుడు గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనందినందు మరియు గరుత్మంతుతల్లి వినతాదేవి తనను కద్రు దాస్యమునుండి విడుదలచేయించుటకు గరుత్మంతుడు అమృతము తెచ్చుటకు స్వర్గలోకమునకు వెల్లునప్పుడు ఆతనిరక్షణార్ధము గరుఢనందినందు శివుని గురించి తపస్సు చేసినారు.

Garuda-Nandi-Temple

సదరు ఇతిహాసము గురించి సంక్షిప్తముగా వివరించుచున్నాము. బ్రహ్మమానసపుత్రుడైన కశ్యపమహర్షి దక్షప్రజాపతి కుమార్తెలైన కద్రు మరియు వినత అనువారిని వివాహమాడినాడు. ఈఇరువురు అమితమైన అందముకల వారు మరియు ఒకరిపైఒకరికి అసూయకలవారు. కశ్యపుడు ఆయిరువురిపై అమితవాత్చల్యముతో ఇరువురిని వరము కోరుకొమ్మనినాడు. కద్రు తనకు వేయిమంది అమితబలవంతులైన సంతానము కావలెనని కోరగా అట్లేవేయిమంది బలవంతులైన సర్పజాతి జన్మించినారు. వినతతనకు తనసోదరి కుమారులకంటే పరాక్రమవంతులు మరియు కీర్తిగడించెడి ఇరువురు కుమారులను కోరినది. తరువాతి సమయములో వినతకు రెండుగుడ్లు కలుగగావాటిని సేవకులకు జాగ్రత్త చేయుటకు అప్పగించినది. వారు ఆరెండు గుడ్లను వెచ్చని పాత్రలలోఉంచి రాత్రిపగలు రక్షించినారు. అయిదువందలసంవత్సరములు గడచిననూ గుడ్లుపొడగబడలేదు. కద్రుఆసరికే వేయినాగులను కుమారులుగాపొందియుండుటవలన వినత అసహనముతో ఆమె ఒకగుడ్డును పగులగొట్టినది. అందలిపిండము పైభాగము వృద్ధిచెందినది కానీ క్రిందభాగము తయారుకాలేదు. అందుకల అరుణ అనుపేరుకల కుమారుడు  అమిత కోపముతో తల్లిని ఆమె అసహనమువలన చేసినచర్యవలన తననుచంపినట్లు అయినదని అందువలన ఆమె బానిసత్వమునకు గురికాబడునని, తనసోదరుడు కలరెండవగుడ్డును కదపవద్దని, ఆమె మరియొక 500 సం నిరీక్షించిన జనించువాడు ఆమెను బానిసత్వమునుండి విముక్తురాలిని కావించేదడు అనిశాపము ఇచ్చినాడు.

కద్రు మరియు వినత తమవాదులాటనందు కద్రు ఇంద్రుని అశ్వమురంగు రెలుపవలేను అనిఅడుగగా వినత అశ్వముముక్కు నుండి తోకవరకు తెలుపుఅని జవాబుఈయగా కద్రు ఆమెతప్పుసమాధానము ఇచ్చినదిఅని శరీరమంతా తెలుపుఅయిననూ తోక మెరయుచున్ననలుపుఅని ఆవిషయమై ఎవరుఓడిన రెండవవారు గెలిచినవారికి బానిసగా ఉండవలెనుఅని పందెం వేసుకొనారు. వినుతకు తానుగెలిచేదనని నమ్మకముతోనుండగా కద్రుఆమాట వాస్తవమైననూ ఒకపధకము ప్రకారం తనకుమారులను గుర్రముతోకకుచుట్టుకొని తనపందెము నెగ్గించమని కోరినది. నాగులకు అట్లుచేయుటకు ఇష్టములేక వెనుకంజవేయగా కద్రుకోపగించి తనమాటవినని వారుఅందరూ అగ్నికి ఆహుతి ఆగుదురని శాపము ఇచ్చినది. ఈకారణము గానే తరువాత పాండవవంశములోని జనమేజయుడు సర్పయాగము చేసినప్పుడు నాగులు అందరూ అగ్నికిఆహుతి అయినారు. బ్రహ్మముందుగా ఆశాపమునకు ఆమోదము తెలిపిననూ కశ్యపునికోరికపై నాగులలో ధర్మవంతుడు మరియు సత్యముపలికేడి నాగులకువర్తించకుండా పరిహారము ఇచ్చినాడు. తదుపరినాగులు ఆలోచించుకొని కద్రు మరియు వినుత వచ్చుసమయమునకు అశ్వముతోకకు చుట్టుకొనినారు. అపుడుతోకనల్లగా కనపడినది. అందువలన ఒప్పందము ప్రకారము వినత కద్రు మరియు ఆమెసంతానమునకు బానిసఅయినది.  తరువాతి సమయములో రెండవగుడ్డునుండి గరుత్మంతుడు అమితతేజస్సుతో అమితవేడిమితో జన్మించినాడు. ఆతేజస్సునకు వేడిమికి దేవతలకనులుకూడా చూచుటకుఅవకాశము ఈయలేదు. అప్పుడు దేవతలుఅందరూ గరుత్మంతుడిని అనేకవిధముల స్తుతించగా గరుత్మంతుడు తనతేజస్సును వేడిని ఉపసంహరించుకొనినాడు. గరుత్మంతుడు తనతల్లి వినతితోపాటు కద్రు మరియు ఆమెకుమారులైన నాగులనుసేవించ  సాగినాడు. వినత గరుత్మంతునికి తానుకద్రువేసిన పందెముగురించి అంతయూ తెలిపినది. అప్పుడు గరుత్మంతుడుతాను ఏమిచేసిన తాను తనతల్లి దాశ్యవిముక్తులయ్యేదమో తెలుపమనినాగులను అడుగగా వారు తమకు స్వర్గమునందలి అమృతము తీసుకువచ్చిఇచ్చిన విముక్తులము చేసేదమని తెలిపినారు. గరుత్మంతుడు అమృతము తెచ్చుటకు స్వర్గలోకము వెల్లునప్పుడు ఆతని క్షేమముకోరి వినతి గరుఢనందివద్ద శివునిగురించి తపస్సు చేసినది.

అటుపిమ్మట గరుత్మంతుడు దేవలోకమునకు వెళ్ళి దేవతలతో పొరాడి అమృతకలశము కలప్రదేశమునకు చేరినాడు.ఆకలశముచుట్టూ అగ్నికీలలు ఆకాశమంటఎత్తుగా కనపడగా గరుత్మంతుడు తననోటినిపెద్దదిచేసి సముద్రమునీటిని పీల్చిఅగ్నికీలలపై వదలినాడు. పిమ్మట చిన్నరూపములో మారిపోయి అమృతము ఉన్న పాత్రవద్దకు చేరినాడు. ఆపాత్రకు రెండుపెద్ద నాగులు కాపలా ఉన్నట్లు కనుగొని వాటిపైదుమ్ము అమితవేగముతో ఊదీ వాటికి కండ్లు కనపడకుండా చేసి పిమ్మటవాటిని చిన్నాభిన్నము చేసి అమృతకలశముతో వెడలినాడు. అప్పుడు ఇంద్రుడు అమృతము దొంగతనము ఆగుటచూసి, వజ్రాయుధము ప్రయోగించగా తప్పించుకొని వెడలినాడు. దారిలో గరుత్మంతుడు విష్ణువునుకలువగా విష్ణువుఆతనికి వరముకోరుకొమ్మని అడుగగాతాను విష్ణువుకన్నా ఎత్తులులో ఉండునట్లువరము కోరినాడు.

విష్ణువుఅనుగ్రహించి తన జెండాగా నుండుటకు వరము ఇచ్చి తనకటే ఎత్తులో ఉండునట్లు అనుగ్రహించినాడు. విష్ణువు గరుత్మంతునితో ఆతని సోదరులు దుర్మార్గులని అమృతము తెచ్చేదను అనితప్ప ఇచ్చేదను అని తెలుపనందున వారు తాగకుండా తాత్సారము చేయవలెనని చేప్పినాడు. ఆప్రకారమే గరుడుడు నాగుయలవద్దకు వచ్చి వారిని వారు కోరినట్లు అమృతము తెచ్చినందున తనను తన తల్లిని బానిసత్వమునుండి విడుదల చేయ కోరినాడు. వారు అట్లే అని చెప్పి అమృతము కల పాత్రవద్దకు వచ్చుచుండగా వారినిఅమృతము తీసుకొనుటకు ముందుగా శుభ్రముచేసుకొమ్మని తెలిపినాడు. నాగులు నదివద్దకు వెళ్ళగా ఇంద్రుడు అమృతము ఉన్న పాత్ర పట్టుకొని దేవలోకము వెళ్ళిపోయినాడు. పాత్ర ఉంచిన కుశగడ్డి (ధర్భలు) దేవతలకు ప్రీతిపాత్రమైనవి. గరుడుడు ఇంద్రునితో స్నేహము వలన గరుడుడు పక్షులు ఇతర ఎగురు జీవులకు రాజుగాను ఇంద్రుడు మిగిలిన వారికి రాజుగాను ప్రకటింపబడినారు. విష్ణువు అందుకు సంతోషించి తన వాహనముగా గరుత్మంతుని అనుగ్రహించి నాగులు ఆతనికి ఆహారము అగునట్లుగా వారము అనుగ్రహించినాడు. అప్పటినుండి గరుత్మంతుడు నాగులను ఆహారము చేసుకొనుచుండగా గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనంది నందు శివుని గురించి తపస్సు చేసినాడు. బ్రహ్మముందుగా కద్రు నాగులకు ఇచ్చినశాపమునకు ఆమోదము తెలిపిననూ కశ్యపునికోరికపై నాగులలో ధర్మవంతులు  మరియు సత్యముపలికేడి నాగులకు వర్తించకుండా పరిహారము ఇచ్చినాడు. ఆప్రకారమే శివుడు అనుగ్రహించి వాసుకిని తన కంఠమాలగా ధరించినాడు మరియు విష్ణువు ఆదిశేషుని తన తల్పముగా చేసుకొనినాడు.

IPLTOURS Indian Pilgrim Tours