పృధ్వీ లింగం
(IPLTOURS)
పంచభూతలింగములు అగ్ని (అరుణాచలేశ్వర్), జల (జంబుకేశ్వర్), పృద్వి (కాంచీపురం) మరియు ఆకాశ (చిదంబరం) తమిళనాడురాష్ట్రముయందు వాయులింగము మాత్రము ఆంద్రప్రదేశ్ నందు కాళహస్తినందు కలదు. పంచభూతలింగములు ఆయా పంచభూతముల తత్వమును కలిగి ఉంటాయి. కాంచీపురములోగల పృధ్విలింగాన్ని ఏకాంబరేశ్వరస్వామిగా కొలుస్తారు. పార్వతీదేవిచే ప్రతిష్టించబడిన ఈలింగం పంచభూత లింగములలో పృద్వి (భూః లింగము) లింగముగా ప్రసిద్ధిచెందినది. ఆలయమునందుపార్వతి గౌరిదేవిగా పూజింపబడుచున్నది. గరుడపురాణమునందు మోక్షస్థలములని ఏడు పుణ్యక్షేత్రములు పేర్కొనబడియున్నవి. అవి అయోధ్య, మధుర, హరిద్వార్, వారణాశి, అవంతిక, ద్వారక మరియు కాంచీపురము. కాంచీపురమునందు ఏకాంబరేశ్వరఆలయం మరియు 108 దివ్యదేశములలో ఒకటి అయిన వరదరాజపెరుమాళ్ ఆలయం ప్రధానఆలయములు. శివకంచిగా పేరుపొంది, 25ఏకరముల విస్తీర్ణముకలిగిన ఆలయసముదాయం భారతదేశములో అతిపెద్ద ఆలయసముదాయములలో ఒకటి. ఆలయములో 1008 శివలింగములు కలవు.
ఎకంబరనతార్ ఆలయం
ఏకాంబరేశ్వర ఆలయమునను నలుదిక్కులా గోపురములున్నవి. దక్షణదిక్కున 11 అంతస్తులతో సుమారు 200 అడుగుల గోపురము భారతధేశములో అత్యధిక ఎత్తుకలిగిన గోపురములలో ఒకటిగా విరాజిల్లుచున్నది. దేవాలయములో అనేక విగ్రహములు ఉన్ననూ ఏకాంబరేశ్వర్ మరియు పెరుమాళ్ విగ్రహములు చెప్పతగ్గవి. చోళరాజులచే సుమారు పదకొండువందల సంవత్సరములకు పూర్వము నిర్మించబడిననూ కాలక్రమములో విజయనగరరాజులచే ఆలయము విస్తరించబడినది. ప్రస్తుతము తమిళనాడు దేవాదాయశాఖ నిర్వహణలో ఉన్నది. ఆలయమునందు విజయనగరరాజులచే నిర్మించబడిన వేయిస్తంభములమండపమున్నది.
పురాణప్రవచనము ప్రకారము శివుని భార్యఅయిన పార్వతి ఒకపర్యాయము శివుని రెండుకనులు మూసినది. సూర్యచంద్రులు కాంతివిహీనులై లోకముఅంతయూ అంధకారములో మునిగినది. శివుడు తన మూడవకన్నుతెరచి వెలుగుప్రసాదించి లోకమును అంధకారమునుండి కాపాడినాడు. పార్వత తనచర్యకు చింతించినప్పుడు శివుడు ఆమెచేసిన అనుచిత కార్యమునకు పరిహారముగా తపస్సు చేయవలసినదిగా సూచించి నాడు. పార్వతి కామాక్షిగా భూమిపై అవతరించి వేగవతినది వద్దనున్న మామిడి చెట్టుక్రింద ఇసుకతో (మట్టితో) పృధ్విలింగము తయారుచేసి పూజించుట ప్రారంభించినది. పార్వతిని పరీక్షింపతలచి శివుడు అగ్నిదేవుని పంపినాడు. పార్వతి తనసోదరుడైన విష్ణుమూర్తి గురించి ప్రార్ధించినది. విష్ణువు ఆమెను కాపాడతలచి శివుని శిరస్సులోనున్న చంద్రునితీసుకొని అగ్నిదేమునికి చూపినాడు. చంద్రునివలన మామిడిచెట్టు మరియు పార్వతి చల్లబడినవి.
శివుడు పార్వతి తపస్సునకు అంతరాయం కలిగించుటకు గంగను ప్రయోగింఛాడు. గంగవరద రూపములోవచ్చి ఆప్రాంతమును అచ్చటనున్నలింగమునుతాకినది. ఆసమయములో లింగము నీటిఉధృతికి కరుగుట ప్రారంభించినది. కామాక్షి లింగమును నీటినుండి కాపాడుటకు లింగమును ఆలింగనము చేసుకున్నది. శివుడు కామాక్షి భక్తికి సంతోషించి నిజరూపముదాల్చి ఆమెను వివాహము చేసుకొన్నాడు. కామాక్షిరూపమునందున్న పార్వతి శివలింగమును కౌగలించుకొని ఉండుటవలన శివలింగముపై పార్వతి గాజులు మరియు మెడలో ఆభరణములు తగులుట మూలముగా గుర్తులు ఏర్పడినవి. ఈగుర్తులను ఇప్పటికినీ లింగముపై చూడవచ్చును. కామాక్షి తపస్సు చేసినమామిడిచెట్టు ఇప్పటికినీ ఆలయప్రాంగణములో ఉన్నది. సుమారు 3500 సం.ల వయస్సుకల ఈచెట్టుక్రింద పడిన మామిడిపండు సంతానంలేనివారు తిన్నట్లయిన సంతానము కలుగునని నమ్మకం.
మార్చ్ ఏప్రియల్ నెలలలోవచ్చు తమిళమాసములో ఆలయమునందు 13 రోజులు జరుగుఉత్సవం చెప్పతగ్గది. ఆలయం ఉ 6-00 నుండి మ 12-30 వ తిరిగి సా 4-00 నుండి రాత్రి 08-30 వ తెరచియుంచబడును. స్వామివారికి వేరువేరు సమయములలో వేరువేరు పూజలు జరుగుతాయి.
ఇక్కడున్నఅమ్మవారు కామాక్షీదేవి అష్టాదశపీఠములలో ఒకటి. దక్షయజ్ణమునందు అగ్నిప్రవేశము చేసిన సతీదేవి శరీరమును ఆమె వియోగముతో కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు భుజముపై ధరించి తాండవం చేయుచుండగా, శివునితలంపు నుండి సతిజ్ఞాపకమును తోలగించుటకు మహావిష్ణువు తన సుదర్శన చక్రముతో సతీశరీరము ఖండించగా సతిశరీరము ఛిద్రమైభూమిపై పడగా ఆభాగములుపడిన ప్రదేశములు శక్తిపీఠములుగా వెలసినవి. ఈ 51 శక్తిపీఠములు సంస్కృతములో 51 అక్షరక్రమము కలిగియున్నవి. అందు అత్యంత శక్తివంతములైన 18 శక్తి పీఠములులలో సతీదేవి బొడ్డుభాగముపడిన పవిత్రస్థలముగా కామాక్షిశక్తిపీఠము ప్రసిద్ధి. సుమారు పన్నెండు వందల సంవత్సరములకు పూర్వము జగద్గురు ఆదిశంకరాచార్యులవారు శ్రీచక్రము నెలకొల్పిన పూర్వపు కామాక్షీఆలయం ప్రధానమ నివాదనలు ఉన్నవి.
తమిళనాడు రాష్ట్రమునందు మధురమీనాక్షి, తీరుచురాపల్లివద్ద తిరువనికవైనందు అఖిలాందేశ్వరి మరియు కంచికామాక్షి ప్రధాన దేవీఆలయములుగా ప్రసిద్ధిచెందినవి. కాంచిపురం ముఖ్యపట్టణంగా పాలించిన పల్లవరాజులచే ఆలయనిర్మాణం జరిగినది. పద్మాసనముద్రలో కూర్చొనినభంగిమలో కామాక్షిదేవి శాంతిసౌభాగ్యములను ప్రసాదించుదేవిగా ప్రసిద్దము. దేవికిగల నాలుగు చేతులలోనూ క్రింధి రెండింటిలో చెరకుగెడ, అయిదుపూవులగుత్తి, పైరెండింటిలో శంఖము, పాశము కలిగియుండును. కాంచీపురమునందు ఈదేవికి తప్ప మరిఏదేవికి ఆలయములేదు. మధురైలో మీనాక్షీ, కాశీలో విశాలాక్షివలెనే కామాక్షీదేవికి ఇచట ప్రత్యేక ఆలయమేమియు లేదు. కామాక్షి ప్రారంభమునందు ఉగ్రస్వరూపిణి. ఆదిశంకరాచార్యులువారు దేవిని శాంత స్వరూపిణి చేయుటకు శ్రీచక్రమును ప్రతిస్టించినారు. కామాక్షిదేవి పరమబట్టారికగా కామకోటి పీఠగర్భాలయమునందు మూలదేవతగా కూర్చొని ఉండును. ఆలయమండపమునకుకల నాలుగుగోడలు నాలుగు వేదములు. ఇరువదినాలుగు స్తంభములు గాయిత్రీ మంత్రములోని ఇరువదినాలుగు భీజాక్షరములు.
మూలదేవతకు కుడిభాగమున బిలద్వారమునకు చేరువలో పరంభ (తపః కామాక్షి) రూపములో యుండును. శివునితో వేరుపడిన ఉమాదేవి (పార్వతి) అన్నపూర్ణగా కాశీనందు, పిమ్మట కళ్యాయన మహర్షిసలహాతో కంచినందు కామాక్షిగా జన్మించి ఏకాంబరేశ్వరుని వేగవతినది వద్దనున్న మామిడిచెట్టు క్రింద ఇసుకతో (మట్టితో) పృధ్విలింగ రూపములో పూజించి వివాహమాడెను. మూలదేవతకు ఎడమభాగమున సౌభాగ్యగణ పతికిఎదురుగా ఉత్తరముఖముగా అంజనకామాక్షి రూపమున్నది. రాముడు తనఅందమును తిరిగిపొందుటకుగాను ఇచట ప్రాయిశ్చిత్తము చేసుకొనినట్లు నమ్మకం. భక్తులు మూలదేవతకు పసుపుకుంకుమలు ఇచ్చట సమర్పించుకొంటారు. రెండవ ప్రాకారములో బంగారు కామాక్షి రూపముకలదు. శ్రీవింధ్యపరమేశ్వరి తనమూడవకంటినుండి ఏకాంబరేశ్వరుని సేవించుటకు ఏకాంబికగా బంగారుకామాక్షి లేదా స్వర్ణకామాక్షి రూపము ప్రసాదించినట్లు తెలియుచున్నది.
మొఘలులదాడులనుండి అసలు దేవీమూర్తిని కాపాడుటకు తంజావూరు తరలించినట్లు అదితంజావూరులో ఉన్నట్లు తెలియుచున్నది. రెండవ ప్రాకారమునందు ఉత్సవ కామాక్షిరూపం ఉన్నది. ఉత్సవకామాక్షికి ఇరువైపులా శారదాదేవి, రాముని విగ్రహములు ఉన్నవి. అందరు దేవతలు వారివారి పురుష/స్త్రీ మూర్తులతోవుండెదరు. శక్తిస్వరూపిణి ఆగుటవలన శ్రీలలితాంబికాదేవి సతిచితాగ్నినుండి ఉద్భవించి బండాసురుని కామాక్షిపేరుతో వధించినది. కామాక్షిదేవికి మను, చంద్ర, కుబేర మొదలైన 32 మంది ముఖ్యమైన ఉపాసకులు కలదు. అందు కామరాజ, లోపాముద్ర మరియు దూర్వాసుడు ముఖ్యులు. కామాక్షిదేవి గర్భాలయమునకు ఎదురుగా దూర్వాసమహాముని విగ్రహముకలదు. ఆలయంఉ 5-30 నుండి మ 12-15వ తిరిగి సా 4-00 నుండి రాత్రి 08-15 వ తెరచియుంచబడును.
దయచేసి మా ipltours.page.link/y2u చానెల్ దర్శించి subscribe చేయుటతోపాటు ఛానల్ నందలి వీడియోల మీద మీ అమూల్యమైన విమర్శలు కామెంటు రూపములో తెలియపరచి మా చానెల్ తప్పులను సరిదిద్దుకుని అభివృద్ధి చెందడానికి తమ వంతు సహకారం అందించి మమ్ములను ప్రోత్సహించాలి అని కోరుచున్నాను.