ద్వారక

(IPLTOURS)

ద్వారక భారతదేశమునకు పశ్చిమంగా గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ద్వీపకల్పమునందు అరేబియాసముద్రం ఒడ్డునఉన్న నగరం. మహా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు సుమారు అయిదువేల  సంవత్సరాలకు పూర్వం తానుజన్మించిన మధురనుండి ద్వారకకు తరలి వెళ్లాడని, ద్వారక రాజధానిగా రాజ్యపాలన చేశాడని భాగవత పురాణంలో తెలుపబడింది. శ్రీకృష్ణుడు గోమతీ నదిఒడ్డున ద్వారక నగరాన్ని స్థాపించాడు. కృష్ణుడి మరణానంతరం, గాంధారి శాపంవలన యాదవవంశం మొత్తం  పతనమయ్యింది. అటుపిమ్మట వరదలు వలన చివరికి శ్రీకృష్ణుని ద్వారకా నగరం అరేబియా సముద్రంలోమునిగి కలసిపోయింది. ద్వారకనందు ప్రస్తుతం నిలచిఉన్న ద్వారకాధీష్ ఆలయం నూటనలభై ఒక్క అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తులతో నిర్మించబడి అరేబియాసముద్రం కంటే ఎత్తులో కనిపిస్తుంది. దీనిని జగత్ మందిర్ లేదా త్రిలోక్ సుందర్ అనికూడా పిలుస్తారు, ద్వారకనుండి 2 కి.మీ దూరంలో బెట్ ద్వారకనందు శ్రీకృష్ణుని భార్య రుక్మిణి ఆలయం ఉంది. ద్వారక శ్రీకృష్ణుని అధికారిక రాజధానిగా ఉన్నప్పుడు రాజ్యపాలన ద్వారకానుండి నిర్వహించుచూ బెట్ ద్వారక నందు నివసించేడివాడు. ద్వారక క్షేత్రం గురించి పూర్తి కధనం మరియు దర్శనీయ స్థలములు, ఆలయముల వివరములు సోమనాధ్ యాత్రనందు సవివరముగా ఫోటోలు మరియు వీడియోలతో తెలియాయచేసి యున్నాము. 

dwarkadhish mandir

రామజన్మభూమి అనిపిలువబడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రాముడు జన్మించిన పురాణ ప్రదేశం. అయోధ్యనందు శ్రీరాముడు, కనక్ భవన్ అని పిలువబడు సీతఆలయం, కొండపై హనుమాన్ గర్హి అని పిలువబడు హనుమాన్ ఆలయం, కూర్చున్న భంగిమలో హనుమాన్ విగ్రహం, ఎల్లప్పుడూ పూలతో అలంకరించబడు హనుమంతుని చిత్రంతోపాటు సీతక్షీరేశ్వరనాథ్ తదితర ముఖ్యమైన ఆలయములతో పాటుగా 100 పైబడి ఆలయాలు ఉన్నాయి. అదనంగా, పౌరాణిక పాత్రల కలయికతో అనేకకుండములు లేదా చెరువులు మరియు స్నానఘట్టములు ఉన్నవి. ఇక్కడ బ్రహ్మ పేరుపై నిర్మించిన బ్రహ్మకుండ్, సీతాకుండ్, భరత్ కుండ్ లతోపాటు లక్ష్మణుడు స్నానంచేసిన లక్ష్మణఘాట్, స్వర్గద్వారం అనిపిలువబడు రామఘాట్ వంటిస్నానఘట్టములు ఉన్నవి.                               

అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి ఆలయ గోడలపై చేయాల్సిన 60 పెయింటింగ్స్ చూడండి, శ్రీ రామ్ జీమీద చాలా అందమైన పెయింటింగ్ జరిగింది, చూడండి మరియు ఇతరులకు చూపించండి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.