ద్రాక్షారామం
(IPLTOURS)
కుమారస్వామి (కార్తికేయడు) రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేసినాడు. ఆయుద్ధము నందు కుమారస్వామి వదలిన బాణంవలన తారకాసురుడు మెడలొ ధరించిన ఆత్మలింగము అయిదు శకలములై భూమిపై అయిదు చోట్లపడి పంచారామక్షేత్రములుగా అవతరించాయి. ఆఅయిదు క్షేత్రములలోనూ ఒకటి తూర్పుగోదావరిజిల్లా నందున్న ద్రాక్షారామంనందు కల భీమేశ్వర క్షేత్రము.
పురాణకధ ప్రకారము భూమిమీద పడిన ఆత్మలింగాశకలాలు కైలాసాన్నిచేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయిఅని, అవిపెరిగి కైలాసం చేరుకున్న కలియుగంలో మానవులకు పూజించుటకు స్వామిదర్శనం ఉండదని ఆత్మలింగాశకలాలు ఎదగకుండా ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు మరియు కార్తికేయునిచేత ప్రతిష్టించబడి అభిషేక మరియు అర్చనలు చేయబడినవి. ఈఆలయములందు శివుడు స్వయంభూః ఆగుటవలన, ఆలయములు దేవతలైన ఇంద్ర, సూర్య, చంద్ర, విష్ణు మరియు కుమారస్వామిచే (కార్తికేయునిచే) నిర్మించబడి యుండుటవలన ఈఆలయములు దేవతలచే నిర్మించబడిన స్వయంభూః ఆలయములు. ఈఆలయములు దర్శించిన ఆలయములను ఒకెరోజురాత్రి నిర్మించినట్లు అట్లు నిర్మించుట మానవమాత్రులకు సాధ్యముకాదు అన్నది సుస్పస్టమగుతుంది. అమరావతి నందు అమరలింగేశ్వరస్వామి బాలచాముండిక ఆమ్మవారితో, భీమవరం సోమేశ్వరస్వామి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారితో, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి పార్వతి అమ్మవారితో, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి అష్టాదశ శక్తిపీఠమైన మాణిక్యాంబ అమ్మవారితో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరస్వామి బాలాత్రిపురసుందరి అమ్మవారితో భక్తులను అనుగ్రహించుచున్నారు.
పూర్వం దక్షప్రజాపతి యజ్ఞంచేసినప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు దక్షారామంగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. ఆత్మలింగము అయిదుశకలములై భూమిపై అయిదుచోట్ల పడినప్పుడు ఇచ్చటపడిన శకలము సూర్యునిచే ప్రతిస్టించబడి అదేరాత్రి ఆలయము నీర్మించబడినది. శ్రీలక్ష్మీ నారాయణుడు ఈక్షేత్రమునకు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలోఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారనీ పురాణాలు చ్పుతున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈగోదావరిని సప్తగోదావరి’ అని పిలుస్తారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8 వశతాబ్దం నుండి ఉన్నవిఅని తెలియుచున్నది. స్వామికి ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని భావిస్తారు. తూర్పునకోలంక, పడమరవెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయంలోదంగేరు, నైరుతిలో కోరుమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం మరియు ఈశాన్యమునందు పెనుమల్ల ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి.
ఈభీమేశ్వర ఆలయప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. నాలుగు దిక్కులలోఉన్న గాలిగోపురాలను ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది. భీమేశ్వర స్పటికలింగం సుమారు 10 అడుగుల ఎత్తుగా రెండు అంతస్తులలో విస్తరించి ఉంటుంది.
దక్షుడు చేసిన నిరీశ్వరయాగమునకు తనభర్త అయిన శివునికి ఆహ్వానం పంపక పోయినప్పటికి పుట్టింటిపై ప్రేమతో యాగానికివచ్చి అవమానం పాలైన సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. సతిని అవమాన పరిచినందుకు వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడితల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని తప్పించుటకోసం మహావిష్ణువు సతిశరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించాడు. సతిశరీర అవయవాలు పడినప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి. అస్టాదశ శక్తిపీఠములలో 12వ శక్తిపీథము సతీదేవి ఖండితాంగాలలో ఎడమచెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామంనందుకల మాణిక్యాంబ శక్తిపీఠం.
సప్తగోదావరి పేరుతో ఆలయమునకు తూర్పువైపున పుస్కరిణియున్నది. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈప్రాంతమనీ ఆచక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒక పర్యాయము శివుడు వ్యాసమహర్షిని పరీక్షింప కోరి ఒక రోజు కాశీనందు ఆయనకు భిక్ష దొరకకుండా చేసియాడు. వ్యాసునికి ఆకలి వేసి సహనము కోల్పోయి కాశీని శపింపబోగా, అన్నపూర్ణ ఆటానికి భోజనము పెట్టినది. శివుడు మహర్షిని కాశీ వదలి వెళ్ళమనగా అమ్మవారు కాశీతో సమానమైన ద్రాక్షారామ వెళ్ళమని సలహా ఇచ్చినది. శివుడు కాశీకిఅర్ధము ఆత్మవిముక్తి పొందడమేనని సుఖవంతమైన జీవితము పొందుటకుకాదని వ్యాసునికి చెప్పినాడు. కానీ భీమఖండములో ద్రాక్షారామకు ఆత్మవిముక్తి పొందుట మరియు సుఖమయజీవితము పొందుటకు అర్హమైనదీగా పేర్కొనబడినది. ఉత్తరాది నుంచి వింధ్య పర్వతశ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్యమహర్షి కూడా కొద్దిరోజులు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు. సుమారు 1200 సంవత్సరములకు పూర్వము ఆదిశంకరాచార్యులవారు ఈ ఆలయమును దర్శించి మాణిక్యాంబ విగ్రహమువద్ద శక్తివంతమైన శ్రీచక్రము నెలకొల్పినారు. ఆలయసమీపములో సతీదేవి శరీరము విడచిన ప్రదేశము, దక్షప్రజాపతి హోమము నిర్వహించిన హోమకుండము కలదు. హోమకుండము ప్రస్తుతము చిన్నకోనేరు రూపుదాల్చినది. సతీదేవి విగ్రహము కోనేటిమధ్యలో నెలకొల్పబడినది. హోమకుండమునకు సమీపములో చిన్న చిన్న దేవాలయములుకలవు.
ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ సమయాలు & ద్రాక్షారామం చేరుకోవడం ఎలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాసంస్థ వారు కాకినాడ బస్సు డిపోనుండి అయిదు పంచారామ క్షేత్రములు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ మరియు సామర్లకోట) యాత్ర 24 గంటలలో పూర్తి అగునట్లు కార్తీకమాసములోనూ మరియు శివరాత్రి పర్వదినము రోజున సర్క్యులర్ టూర్లూ ఏర్పాటుచేయుడురు. యాత్ర రాత్రి 8 గం లకు ప్రారంభమై సుమారు 700 కి.మీ ప్రయాణించి మరుసటిరోజు సాయంత్రం సుమారు 7 గం లకు ముగుస్తుంది.
ఆలయం మాసశివరాతి రోజున ఉ 5-30 నుండి రాత్రి 9-00వరకు మిగిలిన రోజులలో ఉ 5-30నుండి 12వరకు తిరిగి మ 3 నుండి రాత్రి 8 వరకు కార్తీక మాసం ఉ 5 నుండి 12-30 తిరిగి మ 3 నుండి రాత్రి 8-30వరాళి తెరచి ఉంటుంది.
IPLTOURS – Indian Pilgrim Tours