దొడ్డ గణపతి దేవాలయం

(IPLTOURS)

పరమశివునిచే గణములకు అధినాయకునిగా ప్రకటింపబడి దేవతలందరిలోనూ ఆదిపూజ్యుడుగా విశిస్టస్థానము కలిగియున్నగణపతి వినాయకుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు తదితర పేర్లతో పిలువబడుచున్నాడు. ఆలయములందు ప్రధానదైవమును దర్శించుటకు ముందుగా వినాయకుని దర్శనం చేయవలెనని తెలుపబడినది. అదేవిధంగా గృహములందు జరుపు ప్రతిపూజనందు, వ్రతమునందు, కార్యక్రమమునందు మంగళకరమైన పసుపుతో విఘ్నేశ్వర ప్రతిమచేసి పూజించిన విఘ్నములు తొలగునని అటుపిమ్మట పూజ లేదా వ్రతము కొనసాగించిన వారికార్యములు దిగ్విజయముగా పూర్తికాబడునని పురాణములన్నిటియందు చెప్పబడింది. అట్టివినాయకునికి పలునామధేయములతో దేశములో అనేక ఆలయాలు ఉన్నాయి. అట్టిఆలయాలలో బెంగుళూరు బసవగుడిదక్షణ ప్రాంతమున కొలువైన శక్తిగణపతి మరియు సత్యగణపతిఅని పిలువబడు దొడ్డగణపతి ఆలయం ప్రత్యేకత సంతరించుకొన్నది. 

దొడ్డగణపతి ఆలయము నందలిమూర్తి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరిజిల్లాలో బిక్కవోలునందు మరియు చిత్తూరుజిల్లాలో కాణిపాకంనందు స్వయంభూః గావెలసిన వినాయకులవలెనే ప్రతిసంవత్సరం పరిమాణము పెరుగుచున్నదిఅని నిర్ధారించినారు. దొడ్డగణపతిగా కుడివైపు పెరుగుతూ ప్రస్తుత పరిమాణంనకు చేరుకొన్న ఏకశిలా గణపతి. విజయనగర రాజవంశములోని కేంపేగౌధ అనబడు నాధప్రభు హిరియా కేంపేగౌధ అనువారు వాహ్యాళి చేయునప్పుడు అనేకశిలలు వాటిలో ఒక బండరాతిపై వినాయకుని ఆకారం కనుగొని,శిల్పులను భారీ ఆకారంతో మరియు అద్భుతమైన ఏకరాతి విగ్రహంగా మార్చమని ఆదేశించారు అనితెలుస్తూంది. కర్ణాటకలోని అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఈదొడ్డగణేశ ఆలయంనందు చూడవచ్చు. దొడ్డ అనగా కన్నడభాషనందు పెద్దఅనిఅర్ధం. దొడ్డగణేశ అనగా పెద్దగణేశుడు అన్నభావం వ్యక్తీకరిస్తుంచి. ఆలయములో పద్దెనిమిది అడుగులఎత్తుతో పదహారుఅడుగుల వెడల్పుతో గణేశుడుదర్శనం ఇస్తాడు.                               

Lord Ganesh at Sri Dodda Ganesh Temple, Basavanagudi, Bengaluru

ఈఆలయము దొడ్డగణపతిని వివిధరకముల అలంకారములతో అలంకరించి వారమురోజులు జరుపబడు ఉత్సవములు దేశములో వివిధప్రాంతముల నుండి వచ్చుసందర్శకులను ఆకర్షిస్తాయి. అలంకారములు అన్నిటిలోనూ వందకేజీల వెన్నపూసి పూజించబడు బన్నేఅలంకారం ప్రసిద్ధిచెందింది. కొన్నిసార్లు, పొడిద్రాక్ష మరియు బాదం వెన్నపై అందంగా అద్దుతారు. గర్భాలయంనందు వెచ్చగా ఉన్నప్పటికీ, వెన్నకరుగక పోవడం అలంకరణయొక్క విశేషం. బజారునందులభించు అన్నికూరగాయలను ఉపయోగించికూడా అలంకరణలు చేయబడతాయి.

దొడ్డగణపతి ఆలయంవెనుక విశాలమైన పూలతోటకలదు. ఆలయం ఉదయం 6-30 నుండి మధ్యాహ్నం 1-00వరకు తిరిగి సాయంత్రం 4-30 నుండి రాత్రి 8-00వరకు తెరచి ఉంటుంది.

బుల్ టెంపుల్

దొడ్డ గణపతి ఆలయంమునకు చేర్చిఉన్న Bugle Rock పార్క్ ప్రాంగణమునందు బసవన్నగుడి ఉంది. దీనిని ‘బుల్ టెంపుల్’ లేదా ‘వృషభ ఆలయం’ గా పిలుస్తారు. నందీశ్వరుడు ఆలయాల్లో కెల్లా అతి పెద్దదైన ఈనంది ఆలయమునందు పడిఐహేనుఅడుగుల ఎత్తు, ఇరవైఅడుగుల పొడవుఉండే నందివిగ్రహాన్ని గ్రానైట్ రాతితో మలిచారు. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణశైలిలో ఉంటుంది. ఏడాదికొకసారి, కార్తీక (డిసెంబర్) మాసంలో నిర్వహించు వేరుశెనగ పండగ నందు భక్తులు వేరుశెనగసమర్పిస్తారు. నందియొక్క ఏకశిలావిగ్రహం వెన్నయొక్క కొత్తపొరలతో నిరంతరం కప్పబడిఉంటుంది. కడలేకయి పరిషె అను ఈపండుగసమయంలో వేరుశనగ విక్రేతలు మరియు భక్తులు అక్కడకు వస్తారు. ఈదేవాలయ గర్భగృహంలో ఒకశిలాఫలకంపై ఉంచిన పెద్దగ్రానైట్ నందిపేరుమీద ఈదేవాలయానికి పేరు పెట్టబడింది, ఇదికొన్నేళ్లుగా బొగ్గు మరియు నూనెతో రుద్దడంవలన నల్లగామారింది.

SRI BIG BULL TEMPLE,Karnataka

ఈఆలయంనందు విజయనగరశైలిలో ఒకవాకిలి ఎదురుగాఉన్న చిన్నమందిరం మాత్రమే ఉంటుంది. ఈమందిరం మీదుగా ప్రస్తుతగోపురం సుమారు రెండువందలసంవత్సరములకు పూర్వము నిర్మించబడింది.

వినాయకుడు మరియు నందీశ్వరుల అతిపెద్ద విగ్రహాలు ఒకేప్రాంగణమునందు కలక్షేత్రము కర్ణాటకరాష్ట్రమునందు బెంగుళూరునందు బసవగుడిదక్షణ ప్రాంతమున కొలువైన దొడ్డగణపతి మరియు బుల్ టెంపల్ ఒక్కటిమాత్రమే. బెంగూళూర్ మేజిస్టిక్ రైల్వే స్టేషన్ నుండి బసవగుడి ఆరుకిలోమీటర్ల దూరములో నున్నది.   

ఓం గం గణపతయే నమః