ప్రహ్లాద వరదాన్ నృసింహ

(IPLTOURS)

ప్రహ్లాద వరదాన్ఆలయమును దిగువఆహోబిలఆలయము అనికూడా పిలిచెదరు. దిగువఅహోబిలమునందున్న ఆలయములు ఆన్నిటిలో ఈఆలయము ప్రధానమైనది. దిగువ అహోబిలమునందున్న నృసింహఆలయములు నాలుగు దర్శించినపిమ్మట దిగువ అహోబిలమునందు కల ప్రహాదవరదాన్ ఆలయమునందునృసింహుని దర్శించవచ్చును. కానీ ఈఆలయము నవ నృసింహ ఆలయములలోనిదికాదు. ఇతిహాసము ప్రకారము వెంకటేశ్వరస్వామియే ఈనృసింహుని తాను వివాహము చేసుకొనుటకు ముందుగా ప్రతిష్టించినట్లు తెలియుచున్నది. ఎగువఅహోబిలమునందు నృసింహుడు ఉగ్రరూపముతో ఉండుటవలన శాంతస్వరూపముతోనున్న నృసింహుని దిగువఆహోబిలమునందు ప్రతిష్టించినాడు. ఈఆలయమునకు తూర్పుదిక్కుగా ఏడుఅంతస్తులతో రాజగోపురం మూడుప్రాకారములు కలిగిఉన్నది. దక్షణభారత సంప్రదాయములో దేవాలయము గోడలపై అనేకమైన అందమైనబొమ్మలతో నిర్మించబడినది.

lower-ahobilam Prahlada Varada Narasimha-temple

లక్షీనృసింహుడు లక్ష్మీదేవిని తనఎడమ తొడపైకూర్చోన్న భంగిమలో తూర్పుదిక్కు చూచుచున్నట్లు దర్శనము ఇచ్చేదరు. ఈస్వామిని ప్రహ్లాదునిపై అనుగ్రహము చూపించియుండుటవలన ప్రహ్లాదవరదాన్ అనికూడా పిలిచేదరు. అమ్మవారిని అమృతవల్లి తాయార్అ నిఅందురు. ప్రహ్లాదవరద, ప్రణవనృసింహ, పదిచేతులతో ఇరువైపులా శ్రీదేవిభూదేవిసమేత జ్వాలానృసింహ విగ్రహములు ఈఆలయగర్భగుడినందు ఉన్నవి. మొదటి జియ్యర్ స్వామి అయిన శ్రీఆదివన్ షడగోపస్వామి చిన్నవిగ్రహము గర్భగుడిముందు ఉన్నది. భద్రతాకారణములరీత్యా మాలోలనృసింహుని తప్ప మిగిలిన 8 ఉత్సవమూర్తులను ఈఆలయముయ నందు భద్రపరచెదరు. మాలోలనృసింహుని మూర్తిమాత్రము అహోబిలమఠమునందు భద్రప్రచ్చినారు. ఆలయము బయట అనేకమండపములు నిర్మించబడినవి. మరియు వెంకటేశ్వరుని ఆలయమున్నది. వెంకటేశ్వరస్వామి పద్మావతితో వివాహమునకు ముందుగా ఈచటికి వచ్చి నృసింహుని దీవనలు తీసుకొన్నట్లు కధనము. ఆలయముఖమండపము ప్రస్తుతము స్వామికళ్యాణమండపముగా ఉపయోగించబడుచున్నది. వెంకటేశ్వరుని ఆలయముతోపాటు కృష్ణదేవరాయుని విజయము తెలుపుటకు ఒక పెద్ద జలస్తంభము, గోదాదేవి, ఆండాళ్ మరియు ఆళ్వార్ ఆలయములున్నవి. ఇవికాక పెక్కు ఉపాలయములు ఉన్నవి. 

IPLTOURS Indian Pilgrim Tours