బ్రహ్మకపాలం

(IPLTOURS)

మోక్షము సాధించుటకు బదరీనాథ్ క్షేత్ర దర్శనముతో మార్గము సుగమము అయినది. బదరీనాథ్ క్షేత్రములో తప్త కుండము ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపములో దర్శనమిచ్చును. బదరీనారాయణని యొక్క పాద పద్మముల చేత నున్న ఆదికేదార్ శివలింగమును పూజించేడి భక్తులు పరమపదం పొందేదరనినానుడి. బ్రహ్మశిరస్సు పడినప్రదేశమైన బ్రహ్మకపాలమునకు మరియు మహావిష్ణు రూపమైన బదరీనాధుడు కొలువున్న బదరీనాధ్ ధామ్ప్ర ముఖమైనవి. పాండవులు కురుక్షేత్ర యుద్ధములో మరణించిన తమబంధువులకు సద్గతులు ప్రాప్తించుటకు శ్రీకృష్ణుని సలహామేరకు వారు స్వర్గారోహణయాత్ర చేయునప్పుడు బ్రహ్మ కపాలమందు వారిపూర్వీకులకు పిండప్రధానము చేయుటవలన వారు మోక్షముపొందారుఅని మహాభారతము నందు లిఖించబడినది.  

స్కంధపురాణమునందు గయనందు వంశములోని పూర్వీకులకు చేసిన శ్రాద్ధ కర్మలు ఫలితముకంటే బ్రహ్మకపాలమునందు చేసిన ఎనిమిదిరెట్లు ఎక్కువఫలితము కలుగునని చెప్పబడియున్నది. అంతేకాక బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వారుముక్తిని పొందుతారని తెలుపబడుటయేకాక పెద్దలు ఇచట శ్రాద్ధకర్మలు ఆచరించిన ఆపెద్దలకు ప్రతిసంవత్సరం నిర్వహించు శ్రాద్ధకర్మ ఆచరించ నవసరములేదని చెబుతున్నారు. ఆవిషయం నిజంఅయినా కాకపోయినా బ్రహ్మకపాలంలో పెద్దలకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే యాత్రికులమనస్సు నిర్మలమై పెద్దలఋణము తీర్చుకొనినామను తృప్తీకలుగుతుంది అనుటలో సందేహంలేదు. అందులకే బదరీనాధ్ క్షేత్రధర్శనము చేసినభక్తులు బ్రహ్మకపాలఘాట్ నందు పూర్వీకులకు శ్రాద్ధఖర్మలుచేసి పూర్వీకులకు ఆత్మశాంతి మరియు వారు ఉత్తమగతులు పొందుటలో మార్గంనుగమం చేయుటకు అమితముగా శ్రద్ధచూపెడుతారు. బ్రహ్మకపాల్ ఘాట్ బదరీనాధ్ ఆలయమునకు ఉత్తరముగా సుమారు 300 మీటర్ల దూరములో అలకనంద నదిఒడ్డుననున్నది. ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్లవచ్చును. బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైనస్థలము. ఇచట కల నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు మార్కండేయ పేరులతో అయిదు గండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాయతఉన్నది. ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేమునితలగా భావించబడు చున్నది. 

Brahma-Kapal-Ghat

పురాణాలయందు బ్రహ్మ అయిదు ముఖములవాడు. నాలుగుతలలు నలుదిక్కులు చూచుచుండగా ఐదోతల పైకిచూస్తూఉండేది. అందువలననే బ్రహ్మను పంచముఖుడని అంటారు. ఒకసారి బ్రహ్మకు విపరీతమైన అతిశయంకలిగి త్రిమూర్తులు ముగ్గురిలో తానేగొప్పవాడను అనేభావన కలిగింధి. తనసృష్టిలేనిచో విష్ణువునకూ శివుడికి నిర్వర్తించువిధులు ఉండవని బ్రహ్మ తనచుట్టూఉన్న దేవతలు, మునులతోఅన్నాడు. బ్రహ్మకు విధేయులైన దేవుళ్లు, ఋషులు బ్రహ్మచెప్పినది అక్షరసత్యంఅని బ్రహ్మనుపొగిడారు. బ్రహ్మ గర్వంతోనుండగగా, బ్రహ్మవిధేయులందు విష్ణువును అభిమానించువారు వైకుంఠానికివెళ్లి ఈవిషయాన్ని విష్ణువుతో చెప్పారు. దానితో బ్రహ్మ మరియు విష్ణు భక్తులమధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. విష్ణువు బ్రహ్మకు ఎంతసర్థిచెప్పినా ప్రయోజనం లేకపోయింది. త్రిమూర్తుల్లో ఒకరు ఎక్కువ ఒకరుతక్కువ అనేభేదభావం ఉండదని ముగ్గురూ సమానమనిచెప్పినా బ్రహ్మవినిపించుకోక పోవడంవల్ల అన్యమనస్కంగా విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మగొప్పవాడని ఒప్పుకొన్నాడు. విజయగర్వంతో బ్రహ్మ కైలాసానికివెళ్లి త్రిమూర్తుల్లో తానేగొప్పవాడని వాదనకుదిగేడు. ఇందువల్ల కైలాసవాసులకు, బ్రహ్మవిధేయులకు గొడవ ప్రారంభమయింది. పరమశివుడు బ్రహ్మతో వాదనకుదిగి త్రిమూర్తుల్లో ఎక్కువ, తక్కువఅన్నభేదంఉండదని ఒప్పించాడు. బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తనఐదోతలలోమాత్రం తానుగొప్పవాడని అనితతలచేవాడు.ఈవిషయాన్ని పరమశివుడు పసిగట్టి, ఆ ఆలోచనఆలాగే కొనసాగితే సృష్టిలో అల్లకల్లోలం జరుగుతుందని భావించాడు. రానున్న ఉపద్రవం తప్పడంకోసం పరమశివుడు తనత్రిశూలంతో బ్రహ్మ ఐదోతలను ఖండించివేశాడు. ఆతల బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలోఉన్న అలకనందనదీతీరంలోపడి మోక్షం పొందిందని పురాణకథనం. పిమ్మటబ్రహ్మకు గర్వము తగ్గినదని పురాణకధనం. అదేబ్రహ్మకపాలం పేరుతో ప్రసిద్ధిచెందింది. 

మరోకథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడితపస్సుకుమెచ్చి మూడుబాణములు బహూకరించుచూ, అవిప్రయోగింపబడినవారు సమ్మోహనానికిలోనై శృంగారవాంచ పెరుగుతునని తెలిపాడు. బాణములు పనిచేయునోలేదో తెలుసుకోవడంకోసం మన్మథుడు అందులోఒకబాణాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. బ్రహ్మలోకూడా శృంగారభావాలుపెరిగి సృష్టిచేసేపనిలో తనకుసహాయం చేయడంకోసం సృష్టించిన శతరూపఅనే అందమైనయువతిని మోహించి ఆమె ఎక్కడికిపోయినా తనకామపుకోరికలతో ఆమెను చూస్తూఉండటంతో బ్రహ్మనుంచి తప్పించుకోవాలని ఆమెఆకాశంలోకి వెళ్లిపోగా బ్రహ్మతన ఐదోశిరస్సుతో ఆమెనుకామించడం మొదలుపెట్టాడు. దీంతో సృష్టికార్యం మొత్తం నిలిచిపోయింది. ఇదిగ్రహించిన శివుడు తనఅంశఅయిన వీరభద్రుడి నిసృష్టించి బ్రహ్మఐదోతలను ఖండించాల్సిందిగా ఆదేశించాడు. వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి బ్రహ్మ ఐదవశిరస్సును ఖండించి ఆతలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగాఉన్న అలకనందనదీతీరంలో విసిరివేశాడు. బ్రహ్మశిరస్సు పడినప్రాంతమే బ్రహ్మకపాలంగా పేరుపడ్డది. అలకనందలోపడిన బ్రహ్మశిరస్సునకు మోక్షము కలిగినది. పిమ్మట శివుడు బదరీనాధ్ నందు తపస్సుచేసి బదరీనాధుని  పూజించి బ్రహ్మహత్యాపాతకమునుండి విముక్తుడైనాడు. 

శివుడు అప్పటినుండి తనభార్యపార్వతితో బదరీ క్షేత్రమునందు ఇతరమునులతోపాటు తపస్సుచేస్తూ నివసించసాగాడు. అందువల్ల వారణాశి బదరీక్షేత్రములవిశిష్టత అసమానమైనది మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మవావివరసలు మరిచి కన్న కుమార్తెవంటి శతరూపను కోరడంవల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శపించాడని పురాణకథనం. చేసినతప్పు పోగొట్టుకోవడానికి బ్రహ్మఎల్లవేళలా నాలుగుతలలతో నాలుగువేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మశిరస్సుపడి, ఆశిరస్సుకుమోక్షం కలిగినందువల్లే  బ్రహ్మకపాలం హిందువులకు అత్యంత పవిత్రమైనప్రాంతంగా చెబుతారు ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికికూడా మోక్షంకలుగుతుందని భక్తులనమ్మకం. అంతేకాకుండా ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానంచేస్తే మరెక్కడా పిండప్రదానం చేయాల్సినఅవసరం లేదని, ప్రతిసంవత్సరం జరుపు సంవత్సరీకము మంత్రపూర్వకముగా నిర్వర్తించ అవసరంలేదనిచెబుతారు. అందువల్లే బ్రహ్మకపాలంనందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయడానికి హిందువులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. 

బ్రహ్మకపాలం పిండం పితరులకు ఇస్తుంది బ్రహ్మలోక నివాసం