భూఃవరాహస్వామి ఆలయం

(IPLTOURS)

శ్రీమహావిష్ణువు వరాహావతారము దాల్చుటకు పురాణకధ ఉన్నది. జయవిజయులు వైకుంఠమునకు ద్వారపాలకులు. శ్రీమహావిష్ణుపై అమితభక్తికలవారై స్వామిదర్శనార్ధము వచ్చువారిని వైకుంతములోనికి పంపేదివారు. ఒకపర్యాయము బ్రహ్మకుమారులు మహాఋషులు అయిన సనకకుమార, శాంతనకుమార, సనందనకుమార మరియు సనాత్కుమార విశుమూర్తిదర్శనమునకు రాగా స్వామిఏకాంతములో నుండుటవలన జయవిజయులు వారిని లోనికివెళ్లకుండా ఆపారు. అందుకుఆగ్రహించిన బ్రహ్మకుమారులు వారిని మానవులుగాజన్మించమని శపించినారు. ఆప్పుడు విష్ణుమూర్తివచ్చి తనపై భక్తితోవారు నిలిపినారుకావున శాపముఉపసంహరించగొరినాడు. బ్రహ్మకుమారులు ఉపసంహరించుట వీలుకాదనిచెప్పగా ఏడుజన్మలు మానవులుగా జనించిననూ లేదా మూడుజన్మలు రాక్షసులుగాజన్మించి తనచే సంహరింపబడినట్లు శాప ఫలితము అనుగ్రహించినాడు జయవిజయులు విష్ణువును వదలిఉండలేక మూడుజన్మలు రాక్షసులుగా జనించి విష్ణువుచేసంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతికోరినారు. ముందుగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా  అటుపిమ్మట శిశుపాల దంతవక్తులుగా చివరిగా రావణ కుంభకర్ణులుగా జనించి శ్రీహరిచేసంహరించబడి వైకుంఠము చేరినారు.

Entrance of Bhoo Varaha Swamy Temple, Kallahalli

హిరణ్యాక్షు హిరణ్యక్షిపులుగా జనించినప్పుడు హిరణ్యాక్షుని శ్రీహరి వరాహారూపములోనూ హిరణ్యకశిపుని నృసింహ రూపములోనూ సంహరించినాడు. హిరణ్యాక్షుడు బ్రహ్మనుగూర్చి తపముచేసి దేవతలచేతను, మనుషులచేత, రాక్షసులచేత జంతువులచేత మరియు దెయ్యములచేత మరణము లేకుండా వరముపొందినాడు. కానీ అడవిపందిని మరచినాడు. హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకమునకు తీసుకొనిపోయినాడు. బ్రహ్మ విష్ణువును ప్రార్ధించగా విష్ణువు ముక్కురంద్రములనుండి ఒకాడవిపంది రూపములో ఉద్భవించి అంతకంతకూ పెరిగి సముద్రమునందున్న భూదేవిని తనకోరలపై పైకితీసుకొనివచ్చి హిరణ్యాక్షునితో అవిశ్రాంతముగా యుద్దముచేసి సంహరించినాడు.

భూఃవరాహస్వామిఆలయం కర్ణాటక రాష్ట్రములో మైసూరువద్ద కడలూరు గ్రామమునందు హేమవతీ నదీతీరమునందు ఉన్నది. ఆలయము సుమారు 2500 సంవత్సరముల పురాతనమైనది. ఆలయము చతురస్రాకారములో ఎర్రరాతితో నిర్మించబడి ఉన్ననూ బయటనుండిచూచుటకు ఆవిధముగాకనపడదు. ఆలయము రెండుభాగములుగా గర్భగుడి మరియు మండపం కలిగిఉంటుంది. విష్ణుమూర్తి దశావతారాములలో అడవిపందిరూపములోనుండు వరాహావతారము మూడవది. స్వామిని ప్రళయవరాహ నృసింహస్వామి అనికూడాపిలిచేదరు. భూదేవిని హిరణ్యాక్షుడు అనురాక్షసునినుండి కాపాడుటకు విష్ణువు వరాహస్వామిగా అవతరించినాడు. గండకీనదినందు లభించు నల్లనిశాలిగ్రామశిలనందు ఒక కాలు భూమిపైన ఎడమకాలు మడిచితొడపై మూడున్నర అడుగులఎత్తుతో ఒకచేతితోకమలం పట్టుకొని మరియొకచేతితో స్వామినడుముచుట్టిఉన్న  భూదేవిని కూర్చోన పెట్టుకొని తెల్లటికోరలు మరియు ఎర్రటికనులతో పద్దెనిమిది అడుగులఎత్తుతో కిరీటముకలిగి నాలుగు చేతులందు పైఎడమచేతిలో లోహముతోచేసిన శంఖము క్రిందిఎడమచేతితో భూదేవినిహత్తుకుపట్టుకొని క్రింది కుడిచేతితో అభయముద్రతో కూర్చొనిఉన్న భంగిమలో బూడిదరంగులో భూఃవరాహస్వామి దర్శనంఇస్తాడు. సుదర్శనచక్రము పైకుడిచేతి వెనుకభాగమున చేక్కబడియుండును. హనుమంతునివిగ్రహము స్వామివిగ్రహముక్రింద చెక్కబడియుండును. ఆలయము స్థానికముగా ప్రసిద్ధిచెందినది మరియు భూఃవరాహస్వామి నిగూఢశక్తులుకలవాడని స్థానికుల నమ్మకం.   

ఈపవిత్రప్రదేశమునందు గౌతమమహర్షి తపస్సుచేసి శాలిగ్రామమును పూజించినాడు. ఆలయము ముందుభాగమున ఒకరాతిఫలకపై దేవనాగరిలిపినందు ఒక శాసనముకలదు. అందుఆలయచరిత్ర పేర్కొనబడినది. గతములో వీరభల్లాల అనురాజు అడవిలోవేటకువచ్చి చెట్టునీడన విశ్రమించినప్పుడు ఒకవేటకుక్క కుందేలును తరుముటచూసినాడు. వాటిని అనుసరించగా కొంతదూరము వెల్లుసరికి కుందేలు వేటకుక్కను తరుముటచూసినాడు. అచ్చటగలభూమిలో దివ్యశక్తులు ఉన్నవని తలంచినరాజు అక్కడభూమిని త్రవ్వించగా భయంకరరూపముతో భూఃవరాహస్వామి స్వయంభూః విగ్రహము దర్శనంఇచ్చినది. అప్పడినుండిరాజు అనుదినంస్వామిని పూజించినాడు అదేఆలయము దర్మిలాహేమవతీనదికివచ్చిన అనేకవరదలకు తట్టుకొని చరిత్రతెలుపుటకు ప్రస్తుతము నిలిచిఉన్నది. 

ఆలయము శిధిలావస్థకుచేరుకొనినందున స్థానికులు పరకాల మఠం అధిపతివారిని ఆలయముసందర్శించ కోరినారు. స్వామివారు ఆలయము దర్శించి భూఃవరాహస్వామిని మరియు ఆలయమస్థితి చూసి ఆలయాభివృద్ధికి ఉత్సుకతచూపి ఆలయమును అభివృద్ధిపరచినారు. నూతనగోపురం నిర్మింపచేసి ఆలయముచుట్టూ ఉన్నగోడలుబలపరిపించి అందముగా తయారుచేసినారు. ఆలయమునకు పూర్తికాలముపై అర్చకుడినిఏర్పాటుచేసి ప్రతిరోజు అభిషేకము మరియు నిత్యపూజలు నిర్వహించుచున్నారు. హేమవతీనది ఆలయము వెనుకభాగమునా ప్రవహించుచున్నది. సుడిగుండములు ఎక్కువ ఆగుటవలన నదిలో జలక్రీడలు సాధ్యముకాదు. నదినీరు వర్షాకాలమున గుడిగోడను తాకును. ఏప్రియల్ మే నెలలందు నదిలోనీరు వెనుకకు తగ్గినప్పుడు ప్రతిసంవత్సరము వరాహజయంతి ఉత్సవము జరిపేదరు. పరిసరములలోని భక్తులు ఉత్సవమునందు తప్పక పాల్గొనేదరు. ఆలయము ఉదయమునుండి సాయంత్రం 5 గంటలవరకు తెరచిఉండును.