వారెవాల్
(IPLTOURS)
వారెవాల్ సోమనాథ్ నుండి 5 కి.మీ. దూరములోనున్న పట్టణము. పౌరాణిక కధప్రకారము శ్రీ కృష్ణుడు బోయవానిచే లేడిఅని బ్రమించి వదలినబాణము పాదమునకు తగులుటవలన నిర్యాణము పొందినస్థలము. మహాభారతమునందు కురుక్షేత్రసంగ్రామములో పాండవులు భీష్మ, ద్రోణ, కర్ణాదులతోపాటు దుర్యోధణాధి కౌరవులను వధించినపిమ్మట శ్రీకృష్ణుడు కౌరవుల తల్లిఅయిన గాంధారినికలిసి సంతాపము తెలుపుటకు హస్తినాపురముచేరి గాంధారి దర్శనమునకు వెళ్ళగా సంగ్రామములో శ్రేకృష్ణుడు మాయోపాయములతో పాండవులు తనకుమారులైన కౌరవులు మరణించుటకు కారణమైనాడని ఆగ్రహముతో ఎట్లు కౌరవులు పాండవులు తమలోతాము కొట్టుకొని మరణించినారో అట్లే యాదవులు అందరూ తమలో తాముకొట్టుకొని మరణించేదరని యాదవవంశము నిర్మూలనముఅగునని శపించినది. అట్లుకొంతకాలము గతించిన పిమ్మట శ్రీకృష్ణుని కుమారులు చిన్నతనముతో తమలోఒకరైన సాంభుడుఅనువానికి గర్భిణీస్త్రీగా వేషమువేసి శ్రేకృష్ణుని దర్శనార్ధము వచ్చినఋషులను సాంబునిగర్భములోనున్న శిశువు వివరములు అడుగగా వారుకోపగించి సాంభునిగర్భమునుండి ముసలము జన్మించునని ఆముసలము యదువంశ వినాశనమునకు దారితీయునని శపించినారు. ఆమరునాడు సాంబుని గర్భమునుండి ముసలము జన్మించగా శ్రీకృష్ణుడు ఆముసలమును అరగదీయించి పోడెమును ఒకసీసాలోనింపి సముద్రములో కలిపివేయించినాడు.
కొద్దిరోజులకు ఆసీసా ఒడ్డునకు కొట్టుకువచ్చి అలలతాకిడిడికి పైమూత తెరచుకొని అందలి ఇనుపరజను దర్భగడ్డిగా మొలకెత్తినది. రజను ఒకబాణములుకునకు కూడా అంటినది. ఆబాణము ఒకవేటగానికి దొరికినది. శ్రీకృష్ణుడు ద్వారక నందు యాదవులందు కలహములురాకుండా మధుపానము నిషేదించినాడు. అయిననూ ఒకరోజున యాదవులు మధ్యపానముచేసి ఒకరితో ఒకరు కలహించుకొని ఆదర్భగడ్డితో ఒకరినొకరు కొట్టుకొనిమరణించినారు. ఆవిధముగా బలరామకృష్ణులుతప్ప యాదవవంశమంతయూ నిర్మూలన జరిగినది. శ్రీకృష్ణుడు సేదతీరుటకు బల్కితీర్ధమునకు వెళ్ళగా జారాఅనుపేరుకల ఒకవేటగాడు చెట్టు చాటునుండి శ్రీకృష్ణునిపాదము ఒకలేడిగాతలంచి బాణమువేయగా ఆదితగిలి శ్రీకృష్ణుడు నిర్యాణముచెంది అవతారము చాలించినాడు. శ్రీకృష్ణుడు జారాఅను ఆవేటగాడి చేతిలో మరణించుటకు కారణము ఉన్నది. ఆవేటగాడు గతజన్మలో అంగారామాయణ కాలమునందు వాలి. శ్రీకృష్ణుని ముందు అవతారము శ్రీరాముడు. శ్రీరామ అవతారమునందు రావణుడు అపహరించిన సీతజాడ తెలుసుకొనుటకు శ్రీరాముడు వానరరాజైన సుగ్రీవునితో స్నేహము చేసినాడు. వాలిస్థానే సుగ్రీవుని కిష్కిండ రాజుగా చేయుటకు వాలిసుగ్రీవుల యుద్ధములో శ్రీరాముడు సుగ్రీవునిపక్షము వహించి తనస్నేహితుడైన సుగ్రీవుని గెలిపించుటకు, వాలికి ఎదురునిలచి సంహరింపబడకుండునట్లు కలవరమును పురస్కరించుకొని చెట్టుచాటునుండి బాణమువేసి వాలిని సంహరించినాడు. వాలి చనిపోవునప్పుడు శ్రీరాముడు వాలిమరణించినట్లుగానే తానుమరుజన్మలో ఆతనిచేతిలో నిర్యాణముచెందేదనని తెలిపినాడు. ఆప్రకారముగానే తరువాతిజన్మలో కృష్ణావతారమునందు వాలిరూపమైన జారావేసిన బాణమునకు నిర్యాణముచెందినాడు.
బల్కితీర్ధమునందు శ్రీకృష్ణునిఆలయముకలదు. వారెవాల్ మహాప్రభు బేతక్ ఆలయమనిప్రసిద్ధి. ఇచట శ్రీకృష్ణుడు నిర్యాణము పొందినస్థలమునందు తులసిచెట్టు కృష్ణుని జ్నాపకార్ధమునాటబడినది. 9వ శతాబ్ధాము నందు శ్రీవల్లభాచార్యులు ఇచట ఏడురోజులపాటు భగవద్గీతపారాయణము చేసిరి. మరియు 1970 సంవత్సరములో బిర్లావంశస్థులు గీతామందిరము నిర్మించిరి. ఆలయమునందు. శ్రీకృష్ణుడువిశ్రమించచూ వేణుగానముచేయు భంగిమలో విగ్రహముకలదు. ఇక్కడకు దగ్గరలోనే బలదేవగుహ అనుగుహ కలదు. కృష్ణుని సోదరుడు బలదేవుడు ఈ గుహద్వారా పయనించి అదృశ్యమైనట్లు వారు నాగులరాజైన శేషనాగు అవతారమనికధనము. ఈఆలయమునకు దర్శనసమయములు ఏమిలేవు. అన్నీ సమయములలోనూ దర్శించవచ్చును.