బద్రినాధ్
(IPLTOURS)
(IPLTOURS)
అవిభక్త హిందూదేశం పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఈపవిత్రక్షేత్రములందు స్వయంభూఃఆలయములు, ఋషులచే ప్రతిష్టించబడిన ఆలయములు, మానవప్రతిష్టవలన నిర్మించబడిన ఆలయములు. ఋషిప్రతిష్ట మరియు మానవప్రతిష్టలకంటే స్వయంభూః ఆలయములు ఉన్నతమైనవి అనిప్రజల నమ్మకము. మహావిష్ణువు స్వయంభూఃగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాధ స్వామి, కడలూర్ వద్ద భూః వరాహస్వామి, తిరునల్వేలివద్ద వనమామలైపెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్, గండకినదీతీరమున ముక్తినాధ్, పుష్కర్ నందు వరాహ, నైమిశారణ్యంనందు చక్రతీర్ధంవద్ద లక్ష్మీనారాయణ, కేసరగాడ్ వద్ద అనంతపూర్ నందు అనంతపద్మనాభస్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రినాధ్ ఆలయములు.
జోషీమఠ్ నకు 46 కి.మీ దూరములోనున్న బద్రినాధ్ హిందువులకు అతిపవిత్రమైన యాత్రాస్థలము. బద్రినాధ్ శ్రీమహావిష్ణువు ఎనిమిది స్వయంభూః ఆలయములలో ఒకటి. చార్ ధామ్ పేరొందిన నాలుగు విష్ణుక్షేత్రములయిన పూరీ, రామేశ్వరం, మరియు ద్వారకతో నాలుగవది. అంతేకాక 20వ శతాబ్దములో ఛోటా చార్ ధామ్ అని పేరుపడిన హిమాలయ పర్వతములందు నెలకొనియున్న గంగోత్రి, యమునొత్రి, కేదార్నాథ్ లతో పాటుగా కూడా నాలుగవ పుణ్యక్షేత్రము. విష్ణువుకు చెందిన 108 దివ్య దేశములలో ఒకటి. బధ్రీనాధ్ చామోళీజిల్లాలో ఒక నగరపంచాయితీ. యాత్రికులు ప్రయివేటు వాహనములందు ప్రయాణించి బద్రినాధ్ చేరవచ్చును. కేదార్నాధ్ వలెనే చేరుటకు పర్వతసానువులయందు కాలినడకన ప్రయాణము అవసరములేదు. బద్రినాధ్ నందు సూర్య మరియు తప్తకుండములు సమతుల్య వాతావరణము ఉండునట్లుచేస్తాయి. బదరీ (రేగుపండు) అనునది ఇచటవిస్తారముగా పెరుగుఫలము మరియు నాధ్ అనగా భర్త. మహావిష్ణువు ఇచ్చట తపముచేసినప్పుడు లక్షీదేవి ఆయనకు ఎండ తగులకుండా రేగుచెట్టు రూపములో రక్షణ కల్పించినది. బదరీ (లక్ష్మీదేవి) నాధ్ (భర్త) కావున బద్రినాథ్ అయినాడు. ఈప్రాంతములో జూజుబీ లేదా బదరీ(రేగు) చెట్లు ఎక్కువగా ఉంటాయి. 8వ శతాబ్ధములో ఆదిశంకరాచార్యులువారు కేదార్నాధ్ నందు నివసించుటకుముందుగా బద్రినాథ్ నందు ఆరుసంవత్సరములు 814 నుండి 820 వరకు నివసించినారు. తరచూసంభవించు భూకంపములవలన ఆలయము దెబ్బతిన్ననూ, ఈపుణ్యక్షేత్రమునకువచ్చు యాత్రికులుపెరిగి బదరీనాధ్ అమితముగా అభివృద్ధిచెందినది. ఇండోర్ మహారాణి ఆలయము దర్శించి స్వామికి బంగారు గొడుగు బహూకరించినారు.
బద్రినాథ్ నీలకంఠ తదితర మహాపర్వతములకు ముఖద్వారమువంటిది. బద్రినాథ్ చుట్టూకల పర్వతములకు మహాభారతము నందుతెలిపినట్లుగా అధికప్రాముఖ్యమున్నది. పాండవులు స్వర్గారోహణయందు పడమరగర్వాల్ పర్వతప్రాంతమందు ప్రయాణించు చున్నప్పుడు ఆపర్వతసానువులయందు ఒక్కొక్కరుగా పరమపదించినారు. వారిస్వర్గప్రయాణమునందు బద్రినాథ్ మరియు 4 కి.మీ. దూరములోఉన్న మానాగ్రామము ద్వారా ప్రయాణించినారు. మానాగ్రామమువద్ద వ్యాసభగవానుడు మహాభారతమును రచించిన గుహకలదు. హిమాలయములను గౌరీశంకర్, కైలాష్, బద్రినాథ్, నందా, డ్రోగ్రీ , నారాయణ్, నర మరియు త్రిశూల్నా మములుకల ఎనిమిది ఆష్టపదులపేరుల పర్వతశ్రేణులతో పిలిచెదరు.
బద్రినాథ్ ఆలయము విష్ణు భగవానునికి అంకితమైన స్వయంభూఃక్షేత్రము వేదములు మరియు శ్రీహరితోపాటుగా బద్రిక్షేత్రము కూడా సృష్టితోపాటుగా ఉద్భవించి నారదుడు తదితరమునులతో కీర్తించబడుచూ చార్ ధామ్ లలోఒకటిగాను పవిత్రస్థలముగాను వెలుగొందుచున్నది. బద్రినాథ్ ఆలయము గ్రామము మధ్యభాగములో నుండుటవలన ముఖ్యఆకర్షణ అయినది. బ్రహ్మహత్యా పాతకమునకు గురికాబడిన శివుడు ఇచట తపస్సు చేసినాడు. జగద్గురు ఆది శంకరాచార్యులువారు అలకనందనది ఒడ్డున ఒకనల్లనిరాయిపై (సాలిగ్రామముపై) బద్రినారాయణుని కనుగొని నారాయణ స్వరూపమైన ఆసాలిగ్రామమును వేడినీటి ఊటకల తప్తకుండ్ దగ్గరలోకల ఒకగృహనందు ప్రతిస్టించినారు. పిమ్మట రామానుజాచార్యులు గృహలోని బద్రినారాయణుని ఆచటినుండి ప్రస్తుతముగల ప్రదేశమునకు స్వామిని తరలించినాడు. ప్రస్తుతము ఆలయముకల ప్రదేశము 50 అ ఎత్తులో బంగారు తాపడము చేయబడినపైకప్పుతో అందముగా నిర్మించబడింది. గోపురము రాతితోనూ వెదురుకిటికీలతో నిర్మించబడింది. వెడల్పయిన మెట్లు యాత్రికులను ప్రవేశద్వారమునకు తీసుకువెళ్ళును. ఈనిర్మితము బౌద్ధఆలయమును పోలిఉండును. పెద్దపెద్దస్తంభములతో కూడిన హాలుద్వారా ప్రధాన ఆలయనకు చేరవచ్చును.
బదరీనాధ్ అందమైన ప్రకృతిదృశ్యములతో అలరారుభూలోకస్వర్గము. బదరీనాధ్ ఆలయం ప్రతిసంవత్సరము అధికహిమపాతము వలన శీతాకాలమునందు దీపావళి గడచినపిమ్మట ఆరునెలలు మూసివేయబడును. మూసివేయు సమయమునందు నేతితో అఖండదీపము వెలిగించి ద్వారము మూసివేయుడురు. ఈజ్యోతికి అవసరమైన ఒత్తిని సమీప మానాగ్రామమువారు భక్తిశ్రద్ధలతో తయారుచేయుదురు. ద్వారములు మూసివేసిన పిమ్మట ఆరునెలలు గడచినపిమ్మట అనగా ఏప్రియల్ లేదా మే మాసములందు బదరీ కేదార్ ఆలయకమిటీవారు ఆలయపూజారులను సంప్రదించి నిర్ణయించిన తేదీలలో తిరిగి ద్వారము తెరిచెదరు. ఆలయము మూసివేసి మరలతెరుచు ఆరునెలలకాలమునందు బదరీనాధునికి దేవతలచే దేవతల పంచాయతన పాలకసంస్థ సహకారముతో పూజలు నిర్వహించబడునని ప్రసిద్ధి. ఆలయము తెరుచు సమయమువరకు ఆలయము మూసివేయు సమయమునందుఉంచిన అఖండదీపము జ్వలించుతూ ఉండుట బదరీనాధ్ ఆలయదివ్యశక్తికి నిదర్శనం. బదరీనాధ్ ఆలయపూజారి కేరళనంబూద్రి కుటుంభమునకు చెందినవారు. వీరిని Ravalji అనిపిలిచేదరు.
ఆలయగర్భగృహములో యాత్రికులు పంచాయతనసభ్యులైన కుబేర, ఉద్ధవ, నరనారాయన్, నారద మరియు గరుడమూర్తులు దర్శించవచ్చును. బదరీనాధుడు ఈపంచాయతన్ పర్యవేక్షణాధికారి. బడరీనాధుడు మధ్యలోచతుర్భుజములు కలిగి పై రెండు చేతులలో శంఖము, చక్రము ధరించి క్రింది రెండుచేతులు ఒడిలోనుంచుకొని పద్మాసనముద్రలో కూర్చొనియుండగా గణేశుడు మరియు కుబేరుడు స్వామికి కుడివైపు నరనారాయణులు ఎడమవైపుకూర్చొని దర్శనము ఇస్తారు. ఉద్ధవుడు స్వామికి కుడిప్రక్క లక్ష్మీదేవి ఎడమప్రక్క నిలబడియుంటారు. గరుడుడు కుడిప్రక్క నారదుడు ఎడమప్రక్క స్వామిపాదములచెంత కూర్చొని దర్శనం ఇస్తారు. విశ్వమునకు మేలుకలుగుటకు తీసుకొనవలసిన చర్యలపై స్వామిపంచాయతన సభ్యులతో సంప్రదించి నిర్ణయిస్తారని వేదములు చెపుతున్నాయి. కుబేరుడు ఇక్కడ ప్రముఖముగా కొలువబడతాడు.
ఉద్ధవుడు శ్రీకృష్ణునికిమిత్రుడు మరియు సలహాదారు. శ్రేకృష్ణునితండ్రి వసుదేవుని సోదరుడు దేవభాగుని కుమారుడు. భాగవత పురాణమునందు ఉద్ధవుడు ముఖ్యభూమికనిర్వహించాడు. ఉద్దవుడు శ్రీకృష్ణుని పోలికలతోఉండి కొన్నిసార్లు శ్రీకృష్ణుడుఅని బ్రమించేలా ఉండేడివాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత భోధించినట్లు ఉద్ధవగీతనందు ఉద్ధవునికి యోగము మరియు ఉపాసన తెలియచేసినాడు ఉద్ధవుడు. యదువంశనిర్మూలనము చెందుటకుముందుగా శ్రీకృష్ణుడు ఉద్ధవుని బదరీనాధ్ వెళ్ళి అచట జీవితకాలము నివసించమని సలహా ఇచ్చినాడు.
పురాణాలయందు ఒకకధనముప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయకారకులుగా పేర్కొనబడింది. బ్రహ్మ అయిదు ముఖములవాడు. నాలుగుతలలు నలుదిక్కులు చూచుచుండగా ఐదోతల పైకిచూస్తూ ఉండేది. అందువలననే బ్రహ్మను పంచముఖుడని అంటారు. ఒకసారి బ్రహ్మకు విపరీతమైన అతిశయంకలిగి త్రిమూర్తులు ముగ్గురిలో తానేగొప్పవాడను అనేభావన కలిగింధి. తానుజీవరాసులను సృష్టించకపోతే విష్ణువునకూ శివుడికి నిర్వర్తించువిధులు ఉండవని బ్రహ్మ తనచుట్టూఉన్న దేవతలు, మునులతోఅన్నాడు. బ్రహ్మకు విధేయులైన దేవుళ్లు, ఋషులు బ్రహ్మచెప్పినది అక్షరసత్యంఅని బ్రహ్మనుపొగిడారు. బ్రహ్మ గర్వంతో విర్రవీగగా, ఆసమయంలో బ్రహ్మవిధేయులందు విష్ణువునుకూడా అభిమానించువారు వైకుంఠానికి వెళ్లి ఈవిషయాన్ని విష్ణువుతోచెప్పారు. దానితో బ్రహ్మ, విష్ణు భక్తులమధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. విష్ణువు బ్రహ్మకు ఎంతసర్థిచెప్పినా ప్రయోజనం లేకపోయింది. త్రిమూర్తుల్లో ఒకరుఎక్కువ ఒకరుతక్కువ అనేభేదభావం ఉండదని ముగ్గురూ సమానమని చెప్పినా బ్రహ్మ వినిపించుకోక పోవడంవల్ల అన్యమనస్కంగానే విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మగొప్పవాడని ఒప్పుకొన్నాడు. విజయగర్వంతో బ్రహ్మ కైలాసానికి వెళ్లి త్రిమూర్తుల్లో తానేగొప్పవాడని వాదనకుదిగేడు. ఇందువల్ల కైలాసవాసులకు, బ్రహ్మవిధేయులకు గొడవ ప్రారంభమయింది. పరమశివుడు బ్రహ్మతో వాదనకుదిగి త్రిమూర్తుల్లో ఎక్కువ, తక్కువ అన్నభేదంఉండదని ఒప్పించాడు. బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తనఐదోతలలో మాత్రం తానుగొప్పవాడని అనితతలచేవాడు. ఈవిషయాన్ని పరమశివుడు పసిగట్టి, ఆఆలోచన ఆలాగే కొనసాగితే సృష్టిలోఅల్లకల్లోలం జరుగుతుందని భావించాడు. రానున్న ఉపద్రవంతప్పడంకోసం పరమశివుడు తనత్రిశూలంతో బ్రహ్మ ఐదోతలను ఖండించివేశాడు. ఆతల బద్రీనాథ్ పుణ్యక్షేత్రంఉలోఉన్న అలకనందనదీతీరంలోపడి మోక్షం పొందిందని పురాణకథనం. పిమ్మటబ్రహ్మకు గర్వము తగ్గినదని పురాణకధనం.
మరోకథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడి తపస్సుకుమెచ్చి మూడుబాణములు బహూకరించుచూ, అవి ప్రయోగింపబడినవారు సమ్మోహనానికిలోనై శృంగారవాంచ పెరుగుతునని తెలిపాడు. బాణములు పనిచేయునోలేదో తెలుసుకోవడం కోసం మన్మథుడు అందులో ఒకబాణాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. బ్రహ్మలోకూడా శృంగార భావాలుపెరిగి సృష్టిచేసేపనిలో తనకు సహాయం చేయడంకోసం సృష్టించిన శతరూపఅనే అందమైన యువతిని మోహిస్తాడు. ఆమె ఎక్కడికిపోయినా తనకామపుకోరికలతో ఆమెను చూస్తూ ఉండటంతో బ్రహ్మనుంచి తప్పించుకోవాలని ఆమె ఆకాశంలోకి వెళ్లిపోగా బ్రహ్మతనకుఉన్న ఐదో శిరస్సుతో ఆమెను కామించడం మొదలు పెడుతాడు. దీంతో సృష్టికార్యం మొత్తం నిలిచిపోయింది. ఇదిగ్రహించిన శివుడు తనఅంశఅయిన వీరభద్రుడిని సృష్టించి బ్రహ్మఐదోతలను ఖండించాల్సిందిగా ఆదేశించాడు. వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించి ఆతలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగా ఉన్న అలకనంద నదీతీరంలో విసిరివేశాడు. బ్రహ్మశిరస్సు పడినప్రాంతమే బ్రహ్మకపాలంగా పేర్కొంటున్నారు. అలకనందలోపడిన బ్రహ్మశిరస్సునకు మోక్షము కలిగినది. పిమ్మట శివుడు బదరీనాధ్ నందు తపస్సుచేసి బదరీనాధుని పూజించి బ్రహ్మహత్యాపాతకమునుండి విముక్తిలభించినది.
శివుడు అప్పటినుండి తనభార్యపార్వతితో బదరీ క్షేత్రమునందు ఇతరమునులతోపాటు తపస్సు చేయుచూ నివసించసాగినాడు. అందువలననే వారణాశి బదరీక్షేత్రముల విశిష్టత అసమానమైనది మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మవావివరసలు మరిచి కన్నకూతురులాంటి శతరూపను కోరుకోవడంవల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శపించాడని పురాణకథనం, చేసిన తప్పుపోగొట్టుకోవడానికి బ్రహ్మ ఎల్లవేళలా నాలుగుతలలతో నాలుగువేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మశిరస్సుపడి, ఆశిరస్సుకుమోక్షం కలిగినందువల్లే బ్రహ్మకపాలం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికికూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానంచేస్తే మరెక్కడా పిండప్రదానం చేయాల్సినఅవసరం లేదని, ప్రతిసంవత్సరం పిండప్రదాన చేయవలసిన అవసరంలేదని చెబుతారు. అందువల్లే బ్రహ్మకపాలంనందు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలుచేయడానికి హిందువులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.
భక్తులకు మోక్షము సాధించుటకు బదరీనాథ్ క్షేత్రదర్శనముతో మార్గము సుగమము అయినది. బదరీనాథ్ క్షేత్రములో శివుడు ఆదికేదార్ శివలింగరూపములో అర్చింపబడుచున్నాడు. బదరీనారాయణని పాదపద్మములచెంతనున్న ఆదికేదార్ శివలింగమును పూజించెడి భక్తులు పరమపదమును పొండేదరనినానుడి. బ్రహ్మ శిరస్సుపడిన ప్రదేశమైన బ్రహ్మకపాలమునకు మరియు బదరీనాధ్ ధామ్ నకు అట్టిప్రాశస్యమున్నది. పాండవులు కురుక్షేత్రయుద్ధమునందు మరణించిన తమబంధువులకు సద్గతులు ప్రాప్తించుటకు శ్రీకృష్ణుని సలహామేరకు వారుస్వర్గారోహణమునకు వెల్లునప్పుడు ఇచ్చటఆగి పూర్వీకులకు పిండప్రధానం చేయుటవలన వారుమోక్షము పొందినారుఅని మహాభారతములో లిఖించబడినది.
ఆదికేదాశ్వరాలయం తప్తకుండం ఒడ్డున కొంచెంఎత్తులో బద్రీనాధుని ఆలయమునకు వచ్చు మార్గములోనున్నది. ఆలయము శివునికి అంకితము చేయబడినది. స్కంధపురాణము ప్రకారము ఈఆలయమునకు కేదార్నాధ్ ఆలయముతో సమానమైన ప్రాముఖ్యము ఉన్నది. బ్రహ్మయొక్క అయిదవ తలనరకి అలాకానందనదిలో పడవేయుటద్వారా బ్రహ్మహత్యాపాతకమునకు గురికాబడిన శివుడు ఆపాపము నుండి విముక్తి పొందుటకుగాను తపస్సు చేయుటకు ప్రధమముగా ఈస్థలమును ఎంచుకొని తపము ప్రారంభించినాడు. విష్ణుమూర్తి ఈప్రదేశమును పొందగోరి బాలుని రూపముపొంది ఏడ్చుట ప్రారంభించినాడు. అప్పుడు పార్వతి లాలించబోగా శివుడు వలదని వారించినాడు. అయిననూ పార్వతి ఆబాలుని తామునివసించు గృహములోనుంచి ఇరువురు స్నానముచేయుటకు అలకనందనదికి వెళ్ళినారు. తిరిగి వచ్చిచూచుసరికి బాలుడు ఆగృహము తలుపులువేసి నాలుగుచేతులతో (చతుర్భుజములతో) నారాయణతూపములో దర్శనము ఇచ్చిఆప్రదేశము కావలెనని తెలిపినాడు. అందువలన శివుడు ఆప్రదేశమును విడచి తపస్సు కొనసాగించుటకు కేదార్నాధ్ వెడలినాడు.
బదరీనాథ్ ఆలయము నకు కొద్దిదిగువ ప్రాంతమునందు ఔషధగుణములుకల సహజసిద్ధమైన వేదినీటిఊట తప్తకుండం. బదరీనారాయణుని దర్శించుకొనుటకుముందుగా యాత్రికులు ఈతప్తకుండములో స్నానముచేసి అటుపిమ్మట స్వామిని దర్శనము చేసుకొందురు. తప్తకుండము సమీపములో నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు మార్కండేయ పేరులతో అయిదు గండశిలలు కలవు.
బ్రహ్మకపాల్ ఘాట్ బదరీనాధ్ ఆలయమునకు ఉత్తరముగా 200 నుండి 300 మీటర్ల దూరములో అలకనంద నదిఒడ్డుననున్నది. ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్లవచ్చును. బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు పవిత్రమైన స్థలము స్కంధపురాణమునందు గయనందు పూర్వీకులకు చేసిన శ్రాద్ధకర్మలు ఫలితముకంటే బ్రహ్మకపాలమునందు చేసిన ఎనిమిదిరెట్లు ఎక్కువ ఫలితము కలుగునని చెప్పబడియున్నది. అంతేకాకుందా బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వారుముక్తిని పొందుతారని తెలుపబడుటయేకాక కొందరు పెద్దలు ఇచట పూర్వీకులకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే వారికి ప్రతిసంవత్సరం నిర్వహించే శ్రాద్ధకర్మ ఆచరించనవసరములేదని కూడా చెబుతున్నారు. ఇందు వాస్తవికత లేకపోయిననూ బ్రహ్మకపాలంలో వంశములోని పూర్వీకులకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఆచరించువారి మనస్సు నిర్మలమై పూర్వీకుల ఋణము తీర్చుకొన్నామనుతృప్తి కలుగుతుంది అనుటలో సందేహంలేదు. అందువలననే బదరీనాధ్ క్షేత్రధర్శనము చేసినభక్తులు అందరూ బ్రహ్మకపాలఘాట్ నందు పూర్వీకులకు శ్రాద్ధఖర్మలుచేసి పూర్వీకులకు ఆత్మశాంతి ఉత్తమగతులుపొందుటలో మార్గం సుగమం చేయుటకు అమితముగా శ్రద్ధ చూపెడుతారు. ఇచటకల నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు మార్కండేయ పేరులతో అయిదుగండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాన్యత ఉన్నది. ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేముని తలగా భావించబడుచున్నది.
బడరీనాధ్ ఆలయమునకు 1.5 కి.మీ దూరములో మహావిష్ణువు తల్పమైన శేషనాగు పేరుతో ఒకశిలఉన్నది. ఈరాతికి శేషనాగు కండ్లనుపోలిన ప్రకృతిషిద్ధమైన గుర్తులు కలిగి బదరీక్షేత్రమును రక్షించుచున్నది.
బదరీనాధ్ ఆలయమునకు సుమారు 3 కి.మీ. దూరములో అలకనంద నదిఒడ్డున మాతామూర్తి ఆలయముకలదు. ఈమె విష్ణుమూర్తి కవలఅవతారములైన నారనారాయణుల తల్లియని భావించబడుచున్నది. మాతామూర్తి విష్ణుమూర్తినుండి తన గర్భముద్వారా జన్మించునట్లు వరము పొందియున్నది. సెప్టెంబరునెలలో ఇచ్చట సంబరము జరుగును.
చరణపాదుక అనునది బదరీనాధ్ నకు 3కి.మీ దూరములోనున్న నారాయణ పర్వతముపై సుమారు మూడువేల మూడువందల అడుగులఎత్తున శ్రీమహావిష్ణువు పాదముద్రఅని భావించబడుచున్న ముద్రకలిగియున్న పెద్దరాయి. అతికష్టమైన పర్వతమార్గముపై ప్రయాణించి చేరవచ్చును. వెలకొలది శారీరక ధారుధ్యము మరియు శక్తిఉన్న యాత్రికులు ఈపవిత్రప్రదేశము దర్శించుకుంటారు. ప్రజలు శ్రీమహావిష్ణువు భూమిపై తనపాదము మొదటి అడుగును ఇచ్చటనే వేసినట్లు నమ్మేదరు.
సప్తబద్రిగా పిలువబడు ఏడు బదరీనాధ్ పుణ్యక్షేత్రములందు ఒకటి బదరీనాధ్, ఆదిబద్రి, భవిష్యబద్రి, యోగధాన్ బద్రి, వృద్ధబద్రి, అర్ధబద్రి, ధ్యానబద్రి అనునవిఏడు పవిత్ర బద్రిక్షేత్రములు. ఇందు ప్రస్తుత యోగధాన్ బద్రి మరియు భవిష్యబద్రి, వృద్ధబద్రి, ఆదిబద్రి విశేషములకొరకు పంచబద్రిపేజీ దర్శించలయును. ఆర్ధబద్రి చందాపూర్ నకు 3.కి.మీ దూరములోనున్న పదహారు ఆలయముల సముదాయమునందుకలదు. ధ్యానబద్రి ఉర్గాంలోయ నందు కల్పెశ్వర్ నకుచేరువగా కల్పగంగ నడిఒడ్డున ఉన్నది. ఇవిరెండునూ దూరముగా నుండుటవలనపూర్తి ప్రస్తావన తేలేదు. యోగధాన్ బద్రి.జోషీమఠ్ నకు 18కి.మీ మరియు బదరీనాద్ నకు 23 కి.మీ దూరములో జోషీమఠ్ నుండి బదరీనాథ్ ప్రయాణించు మార్గములోనున్నది. శీతాకాలములో బదరీనాధుదు, ఉద్ధవుడు మరియు కుబేరుని ఉత్సవవిగ్రహములు ఇచ్చటనుంచెదరు. ఈ ఆలయమునందు విష్ణుమూర్తి ద్యానబంగిమలోనున్న విగ్రహమును పూజించెదరు. పురాణముల ప్రకారము పాండురాజు విష్ణుమూర్తి కాంస్యవిగ్రహము ఇచ్చట ప్రతిష్టించినట్లు నమ్ముతారు.
బదరీనాధ్ చేరువరకు బదరీనాథ్ మరియు పరిసరములలోకల ఆలయములగురించి వివరించబడినది. బదరీనాథ్ దాటినపిమ్మట నాలుగు కిలోమీటర్ల దూరమునందుకల మానాగ్రామము మరియు పాండవులస్వర్గారోహణ యాత్ర గురించి మానా గ్రామము పిమ్మటగ ఆ ప్రముఖప్రదేశములగురించి పాండవులస్వర్గారోహణ యాత్రనందు దర్శించగలరు.
బద్రినాధ్ దర్శించి తప్తకుండములో స్నానముచేసి బద్రినాధుని, ఆదికేదారేశ్వరుని దర్హించినవారికి వారు చేసిన పాపములన్నియు తొలగి చివరిగా విష్ణులోకము పొందేదరని పురాణములందు తెలుపబడినది.
బదరీదర్శనం ఆహ్లాదం ముక్తిప్రదం పూర్వీకులకు మోక్షప్రదం
IPLTOURS – Indian Pilgrim Tours