అయోధ్య
(IPLTOURS)
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే !
రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః !!
రామచంద్రుని ఈనామములందు రామా అని తండ్రి ధశరధుడు, రామభద్రా అని తల్లి కౌసల్య, రామచంద్ర అని పినతల్లి కైకేయి, వేదసే అని గురువు వశిష్టుడు, రఘునాధా అని ఋషులు, నాధా అని సీతాదేవి, సీతాపతి అని అయోధ్యవాసులు పిలిచేదివారు. ఆప్రకారం నామములన్నీ కలిసి పై శ్లోకం వచ్చినది.
రామజన్మభూమి అనిపిలువబడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రాముడు జన్మించిన పురాణ ప్రదేశం. అయోధ్యనందు శ్రీరాముడు, కనక్ భవన్ అని పిలువబడు సీతఆలయం, కొండపై హనుమాన్ గర్హి అని పిలువబడు హనుమాన్ ఆలయం, కూర్చున్న భంగిమలో హనుమాన్ విగ్రహం, ఎల్లప్పుడూ పూలతో అలంకరించబడు హనుమంతుని చిత్రంతోపాటు సీతక్షీరేశ్వరనాథ్ తదితర ముఖ్యమైన ఆలయములతో పాటుగా 100 పైబడి ఆలయాలు ఉన్నాయి. అదనంగా, పౌరాణిక పాత్రల కలయికతో అనేకకుండములు లేదా చెరువులు మరియు స్నానఘట్టములు ఉన్నవి. ఇక్కడ బ్రహ్మ పేరుపై నిర్మించిన బ్రహ్మకుండ్, సీతాకుండ్, భరత్ కుండ్ లతోపాటు లక్ష్మణుడు స్నానంచేసిన లక్ష్మణఘాట్, స్వర్గద్వారం అనిపిలువబడు రామఘాట్ వంటిస్నానఘట్టములు ఉన్నవి.
అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ్ జన్మభూమి ఆలయ గోడలపై చేయాల్సిన 60 పెయింటింగ్స్ చూడండి, శ్రీ రామ్ జీమీద చాలా అందమైన పెయింటింగ్ జరిగింది, చూడండి మరియు ఇతరులకు చూపించండి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.