అరుల్మిగు శ్రీ వనమామలై తోటత్రి పెరుమాళ్ ఆలయం

(IPLTOURS)

వానమామలై పెరుమాళ్ ఆలయం హిందూదేవాలయం మరియు విష్ణుమూర్తికి ప్రియమైన 108 దివ్యదేశములలో ఒకటి. విష్ణుమూర్తి స్వయంభూఃగా వెలసిన ఎనిమిది క్షేత్రములలో ఒకటి. తమిళనాడు రాష్ట్రములో తామ్రపర్ణి నదితీరములో తిరునల్వేలివద్ద వానమామలై గ్రామమునందు ఈఆలయముఉన్నది. వానమామలై ఇచ్చటనే ఆదిశేషునికి మరియు గరుడునికి దర్శనము ఇచ్చినాడు. ద్రావిడ వాస్తుశాస్త్రము ప్రకారము నిర్మించబడి  దివ్యప్రభంధమునందు కీర్తింపబడినది. విష్ణుమూర్హి వానమామలై పెరుమాళ్ పేరుతోభార్య లక్ష్మీదేవి వారమనాగి పేరుతోనూ ఇచటపూజించబడుచున్నారు. ఈఆలయము పాంధ్యరాజులకాలములో నిర్మింపబడి విజయనగరరాజులమరియు మధురై నాయకులపాలనలో అభివృద్ధిపరచబడినది. ఆలయగోపురము అయిదుఅంతస్తులతోను ఆలయము అయిదుఏకరముల విస్తీర్ణములోనూ నిర్మించబడియున్నవి. ఈఆలయమును గురించి బ్రహ్మాండ, స్కంధ మరియు నృసింహపురాణములందు ఉదహరించబడినది.  

Evening View of Arulmigu Sree Vanamamalai Totatri Perumal Temple, Nanguneri, Tamil Nadu

ఈదివ్యక్షేత్రముపై రెండు విభిన్న పురాణకధలు ఉన్నవి. విష్ణుమూర్తిభార్య లక్షీదేవి ఇచట శ్రీవరమాంగై పేరుతోజన్మించినట్లు ఆమెపేరుతో ఈగ్రామమునకు వానమామలై పేరువచ్చినట్లు ఒకకధనము. ఈప్రదేశములోనే విష్ణుమూర్తి ఆడుశేషుడు మరియు గరుడునికి వానమామలైగా దర్శనము ఇచ్చినట్లు మరియొక కధనము. సర్పారాజైన ఆదిశేషుడు విష్ణుమూర్హి అనుగ్రహముకోరి తపస్సుచేయగా విష్ణుమూర్హి దర్శనముఇచ్చి ఆదిశేషునికోరికపై ఆతనిపై విశ్రమించినాడు. అటులనే గరుడుడు తపస్సుచేసి మెప్పించగా విష్ణుమూర్తి తననివాసమైన వైకుంఠమునకు అంగరక్షకునిగాను తనవాహనముగాను అనుగ్రహించినాడు. స్థానికకధనము ప్రకారము ఒకరాజు పిల్లలులేక బాధపడుచూ భూమినిత్రవ్వగా భూమినందుకల మూర్తికితగిలి భూమిరక్తముతో తడిసిపోయేను. అప్పుడురాజు ప్రతిరోజూ ఆమూర్తిని ప్రతిరోజూనూనెతో శుభ్రపరచినాడు. అప్పుడు రాజుదీవించబడి సంతానముజన్మించగా సంతోషముతో ఈఆలయము నిర్మించినాడు. ఈఆలయము త్రివాంకోర్ మహారాజుల పాలనక్రిందకు వచ్చి తరువాత వానమామలైమఠం ఆధ్వర్యములోనికి తీసుకురాబడినది. వానామమలై భార్య తిరుపతినుండి తీసుకురాబడినది. ఇచ్చటిపూజారులైన నంబూద్రిలుస్థానే తిరుపతినుండీవచ్చిన పూజారులతో భర్తీచేయబడినారు. 

ఈఆలయమందు ప్రధానదైవమును దేవాపిరన్ అనిపిలిచెదరు. ఆయన వనమామలైమఠాధిపతి కుమార్తెను వివాహము చేసుకోనినట్లు నమ్మకము. మఠమునకు చెందిన జీయర్ స్వామి నేపాల్ నందు విష్ణువుఅవతారమైన శ్రీరాముడు సీతను వివాహమాడిన నేపాల్ నందలి జనకపురివద్దకూడా నంగునేరినందు వనమామలై ఆలయమునుపోలిన ఆలయముకలదని వెల్లడించినారు. విష్ణువు అలంకారప్రియుడు మరియు శివుడు అభిషేకప్రియుడు. కానీ వానమామలై నందు దైవమునకు ప్రతిరోజూ ఉదయము పంచామృతములైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు బెల్లం (ప్రస్తుతము పంచదార)లతో శుభ్ర పరచెదరు. శుభ్రపరచుటకు ఉపయోగించిన నెయ్యి పవిత్రముగా తలచెడి నూనెయందు కలిపేదరు. ఉత్సవవిగ్రహములు ఉత్సవసమయములలో వానమామలై మఠమునుండి తీసుకువచ్చేదరు. ఆలయమందు పూజలు పండుగలు వైఖాసన ఆగమ పద్దతిలో నిర్వహించెదరు. ప్రతిసంవత్సరము మార్చి-ఏప్రియల్ నెలలలో వచ్చు తమిళమాసము చిత్తరినందు రధోత్సవము నిర్వహించేదరు. ఆలయము నిర్వహణ పరిపాలనాభాధ్యత వానామమలైమఠము పరిధిలోనున్నవి. తమిళనాడులోని ఇతరవిష్ణుక్షేత్రములవలేనే ఇచ్చటిపూజారులు బ్రాహ్మణకులము లోని ఉపకులమైన వైష్ణవులు. ఉషత్కాలం, కాలశాంతి, ఉచ్ఛికాలం, సాయరాక్షాయి, ఇరందంకాలమ్ మరియు ఆర్ధాజామం అనునవి దైవమునకు నిర్ణీతసమయములలో నిర్వహించు ముంఖ్యమైన రోజువారీ సేవలు. అలంకారం, నివేదనం మరియు దీపహారతి వనమామలైపెరుమాళ్ నకు మరియు తాయార్ నకు ప్రతీసేవనందునిర్వహింతురు. రాత్రిఆర్ధాజామం నిర్వహించు సమయమునందు నాదస్వరము మరియుతాళవాద్యములు ఉపయోగింతురు. పూజారులుమరియు భక్తులు ద్వజస్తంభము వద్ద సాస్టాంగనమస్కారము చేయుచూ వేదము పఠించెదారు. ప్రతిసంవత్సరము జనవరి-ఫిబ్రవరిమాసములలోవచ్చు తమిళ మాసము థాయినందు 12 రోజులు బ్రహ్మోత్సవము జరిపెదరు.