రామనాధ
(7వ జ్యోతిర్లింగం)
IPLTOURS
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే
నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం
తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
(7వ జ్యోతిర్లింగం)
IPLTOURS
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే
నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం
తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
ద్వాదశ జ్యోతిర్లింగములలో ఏడవది రామనాధ జ్యోతిర్లింగం. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
రామేశ్వరంబంగాళాకాతము మరియు హిందూమహాసముద్రములు కలియుప్రాంతములో గల పంబన్ ద్వీపమునందుఉన్న పుణ్యక్షేత్రము మరియు ద్వాదశజ్యోతిర్లింగములలో 7వ జ్యోతిర్లింగము. పంబన్ ద్వీపమునందుకల రామేశ్వరం చేరుటకు సముద్రముపై పంబన్ బ్రిడ్జి పేరుతో రైల్వే బ్రిడ్జి నిర్మించబడి 1914 సంవత్సరమునందు ఫిబ్రవరి 24 తేదీన ప్రారంభించబడినది. ఈ బ్రిడ్జి రెండుభాగములుగాఉండి నౌకలరాకపోకలకు అవసరమైన పైకిఎత్తుటకు వీలుగా నిర్మించబడినది. 1988 సంవత్సరములో రామేశ్వరమునకు రైల్వేబ్రిడ్జికి సమాంతరముగా ఇందిరాగాంధీ పేరుతో రోడ్డుబ్రిడ్జిని నిర్మించి రాజీవ్గాంధీచే ప్రారంభించబడినది.. పంబన్ బ్రిడ్జి మండపం మరియు పంబన్ తీరములను కలుపుచూ నిర్మించారు. ఈ రైల్వే బ్రిడ్జిపై ప్రయాణము యాత్రికులకు ఆనందదాయకము.
రామేశ్వరజ్యోతిర్లింగం భారతదేశంలోకల 12 జ్యోతిర్లింగములలో రామేశ్వరంలో శ్రీరామ ప్రతిష్టితమై రామునిచే అర్చించబడిన ఏడవజ్యోతిర్లింగం. రామనాధస్వామి ఆలయం 12 వశతాబ్దములో విస్తరించబడినది. రామాయణమునందు రాముడు శివుని తన కష్టములనుండి విముక్తికోరుచూ అర్చించుటకుగాను పెద్దలింగము కావలెనని హిమాలయములనుండి తెచ్చుటకు హనుమంతునిఆదేశించగా హనుమంతుడు ఆలశ్యముచేసినాడు. అప్పుడు సీత సముద్రతీరములోకల ఇసుకతో ఒక చిన్న లింగముచేసినది. అదియే ప్రస్తుతము గర్భాలయమునందున్న శివలింగమని భావించ బడుచున్నది. ఈ ఆలయమునందు ఆది శంకరాచార్యులుచే స్థాపించబడిన స్పటిక లింగము కలదు. ప్రాతః కాలమున ప్రతి రోజు ఈ స్పటిక లింగమునకు ప్రధాన లింగమునకు అర్చన చేయుటకు ముందుగా అభిషేకము నిర్వహించేదరు. దక్షణ భారత దేశమునందు శివలింగములు తయారుచేయుటలో ఈ స్పటికమును వాడెదరువాdeడేదరు. ఇది వేడిని హరించును. అందువలనే శరీరములోని వేడిని తగ్గించుటకు ప్రజలు స్పటిక మాలను ధరింతురు. మేష రాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ రామనాధ జ్యోతిర్లింగముల దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది. మేష రాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ రామనాధ జ్యోతిర్లింగముల దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది శృంగేరిమఠమునుండి దీక్షతీసుకొనిన మరాటాబ్రాహ్మణులు ఇచట ఆలయపూజారులు.
మిగిలిన దేవాలయములవలెనే ఇచ్చట కూడా ఉచిత ఆన్నదానపధకము అమలు చేయబడు చున్నది. రామేశ్వరమునందు దేవస్థానమునకు సంబంధించి 10 అద్దె గదులు, శంకరమఠముయందు 8 నాన్ ఏ.సి. మరియు 2 ఏ.సి. గదులు లభ్యము. ఈ ఆలయం ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు తిరిగి 3-00 నుండి రాత్రి 9-00వరకు తెరచి ఉంటుంది.
రామేశ్వరఆలయమునందు మరియు ద్వీపము చుట్టూ 64 తీర్ధములు (నీటి నూతులు) కలవు. స్కంధ పురాణము ప్రకారము ఈ తీర్ధములలో 24 అత్యంత ప్రధానమైనవి. ఈ 24 తీర్ధములందు స్నానము చేసిన చేసిన పాపములనుండి విముక్తిపొండేదరని నానుడి. కావున యాత్రికులు ఈతీర్ధములలో స్నానము చేయుట ఒకనియమముగా తలచెదరు ఇందులో 22 తీర్ధములు ఆలయప్రాంగణములోనే ఉన్నవి. ఈతీర్ధములవద్ద నున్న బాణముగుర్తులు రాముడు వేసిన 22 బాణములుగా తలచెదరు. మొదటిది మరియు ముఖ్యమైన తీర్ధము అగ్ని తీర్ధము.
రామేశ్వరంకూడలినుండి 11 కి.మీ. దూరములో సముద్ర తీరమున ఈఆలయము ఉన్నది. ఈఆలయము కొన్నిసంవత్సరముల క్రిందటివరకు దక్షణప్రాంతపర్యటనలో ముఖ్యమైనది. కానీ ప్రకృతి వైపరీత్యములవలన ఇది పూర్తిగా కొట్టుకొనిపోయినది. ధనుష్కొడిబీచ్ కడు రమ్యముగాఉండను.
ఈపంచముఖహనుమాన్ ఆలయమువద్ద రామసేతు నిర్మాణమునకు శ్రీరాముడు మరియు వానరసేన ఉపయోగించినరాళ్ళు చూడవచ్చును. ఈరాయిని నీటిలో వేసినట్లయిన ఆరాయి 50 కేజీల బరువుకలదిఅయిననూ అది నీటిలోతేలుతుంది కానీ మునిగిపోధు.
ఇవి కాక కోదండరామస్వామి ఆలయం, లక్ష్మణతీర్ధం (ఉదయం 6-00 నుండి 12-00 వరకు సాయంత్రం 4-00 నుండి 8-00 వరకు తీసి ఉంటుంది), అగ్నితీర్ధం, సుగ్రీవుడు శ్రీరాముని కలుసుకొన్న గంధమాధవ పర్వతం, సుగ్రీవుని ఆలయం, భద్రకాళి ఆలయం, రామతీర్ధం ముఖ్యమైనవి.
శ్రీలంకకు వాయువ్యతీరమునందు కల మన్నార్ ద్వీపమునకు రామేశ్వరం పంబన్ ద్వీపమునకు మధ్యలో రామసేతు ఒక ఛైనుమాదిరిగా ఉండును. ఇచటపూర్వము భారతదేశము శ్రీలంకలమధ్య బ్రిడ్జి ఉండేదిది అనుటకు ఇది ఒకఆధారము. ఈ బ్రిడ్జి 48 కి.మీ. పొడవుకలిగి మధ్యలో అక్కడక్కడ సముద్రము 1 మీటరు (3 అడుగులు) లోతుకలిగి యుండును. ఇచటఇంకనూ సదరుబ్రిడ్జినిర్మాణమునకు ఉపయోగించిన సున్నపురాయి రాళ్ళుకలవు. యాత్రికులు వయోభేధము లేకుండా రామేశ్వరమునందు ఆనందము పొందవచ్చును.
IPLTOURS – Indian Pilgrim Tours